• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీడ్యాక్‌లో ఉద్యోగ ప్రాజెక్ట్‌!

44 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

​​​​​మ‌నిషి మెద‌డు నుంచి పుట్టుకొచ్చే ఆలోచ‌న‌ల‌కు అంతే ఉండ‌దు.. వాటికి ప్ర‌తిరూప‌మే కొత్త‌ ఆవిష్క‌ర‌ణ‌లు. ప్ర‌పంచంలో టెక్నాల‌జీ నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. మ‌న దేశంలోనూ ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ సంబంధిత‌ అంశాల్లో ఎన్నో ప‌రిశోధ‌నలు జ‌రుగుతున్నాయి. అందుకు హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌) వేదిక‌గా మారింది. ఇది భార‌త ప్ర‌భుత్వానికి చెందిన ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వశాఖ ఆధ్వ‌ర్యంలో ప‌ని చేస్తుంది. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌) తాజాగా మూడు రకాల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ప్రాజెక్ట్‌ మేనేజర్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ హోదాలకు మొత్తం 44 ఖాళీలున్నాయి. టెక్నికల్‌ అంశాల్లో గ్రాడ్యుయేషన్, పీజీ చేసినవారు అర్హులు. పోస్టులను బట్టి కొంత అనుభవమూ తప్పనిసరి. 

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 39 పోస్టులున్నాయి. ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికేషన్స్‌/ సీఎస్‌ఈ/ ఐటీ అంశాల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్‌ పూర్తిచేసినవారు అర్హులు. ఎంసీఏతోపాటు ఈ అంశాల్లో డిగ్రీ పూర్తిచేసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 0-4 ఏళ్ల అనుభవమున్నవారు ప్రయత్నించవచ్చు. వయసు మే 20, 2021 నాటికి 37 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్‌ మేనేజర్‌: మొత్తం 3 పోస్టులు. కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అంశాల్లో బీఈ/బీటెక్‌ చేసినవారు అర్హులు. వీరికి 11-15 ఏళ్ల అనుభవముండాలి. లేదా ఇదే అంశాల్లో ఎంఈ/ ఎంటెక్‌ చేసినవారు, ఎంసీఏవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి  7-11 ఏళ్ల అనుభవం తప్పనిసరి. వయసు మే 20, 2021 నాటికి 50 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌: 2 పోస్టులు. రెండేళ్ల రెగ్యులర్‌ ఎంబీఏ లేదా సంబంధిత విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసినవారు అర్హులు. సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం తప్పనిసరి. వయసు మే 20, 2021 నాటికి 37 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: ప్రాజెక్ట్‌ మేనేజర్‌కు నెలకు రూ.64,000 నుంచి రూ.89,600 వరకు; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు నెలకు రూ.31,000 నుంచి రూ.70,000 వరకు; ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌కు నెలకు రూ.31,000 నుంచి రూ.35,000 వరకు ఉంటాయి.

ఎంపిక: విద్యార్హత, వయఃపరిమితి, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆపై వారికి రాతపరీక్ష/ వ్యక్తిగత మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. దీనిలోనూ ఎంపికైనవారికి తుది ఎంపికలో భాగంగా మల్టీ లెవల్‌ ఇంటర్వ్యూలుంటాయి. అర్హత సాధించినవారికి ఉద్యోగావకాశం కల్పిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి వివరాలు, అనుభవం మొదలైన అంశాలతోపాటు అవసరమైన ధ్రువపత్రాలనూ సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం తెలియజేస్తారు.

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మే 20, 2021

పూర్తి వివరాలకు https://cdac.in/ ను సందర్శించవచ్చు.

Posted Date : 11-05-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌