• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌లపై తాజా స‌మాచారం

1. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఫిబ్రవరి 11

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్‌ ప్రకటించారు. జ‌న‌వ‌రి 30 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 22 వరకు గడువు ఇవ్వగా.. రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 2 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

2. మే 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు

తెలంగాణలో  ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షలు మే 1 నుంచి ప్రారంభంకానున్నాయి. పదో తరగతి పరీక్షల ప్రణాళిక, రంజాన్‌ దృష్ట్యా ప్రభుత్వం గతానికి భిన్నంగా ఈసారి ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే నెల 1 నుంచి ప్రథమ సంవత్సరం, 2(ఆదివారం) నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

3. స‌ప్లిమెంట‌రీ ఉండదు

రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం(2019-20) ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో తప్పిన వారు, పాసైనా మార్కులు పెంచుకోవాలనుకున్న(ఇంప్రువ్‌మెంట్‌) వారు మే 1 నుంచి జరిగే వార్షిక పరీక్షలతోపాటు సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసుకోవాల్సిందే. వార్షిక పరీక్షల కంటే ముందుగా విడిగా పరీక్షలు నిర్వహించేది లేదని స్పష్టమైంది. ఇంటర్‌ పరీక్షల ఫీజుకు సంబంధించి ఇంటర్‌బోర్డు జ‌న‌వ‌రి 30న‌ కాలపట్టిక జారీ చేసింది. తప్పినవారు, బెటర్‌మెంట్‌ వారు కూడా పరీక్షల ఫీజు చెల్లించాలని అందులో పేర్కొంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

Posted Date : 03-02-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.