• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అర్బన్ ఇన్ఫర్మేటిక్స్‌లో ఎంఏ‌ కోర్సు

హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ‌రోత్‌బర్గ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ప్రారంభం

ప్ర‌వేశాలకు ప్రకటన విడుదల

ఇజ్రాయిల్ రాజ‌ధాని జెరూసలెంలోని హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన రోత్‌బర్గ్ ఇంటర్నేషనల్ స్కూల్ తొలిసారిగా ఎంఏ ప్రోగ్రామ్‌లో స్మార్ట్ సిటీస్, అర్బన్ ఇన్ఫర్మేటిక్స్ కోర్సును ప్ర‌వేశ‌పెడుతోంది. భౌగోళిక విభాగం, సాంఘిక శాస్త్రాల అధ్యాపకులు బోధించే ఈ కోర్సు ద్వారా స్మార్ట్ సిటీ సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన టూల్‌బాక్స్‌తో కొత్తతరం పట్టణ ప్రణాళికలు, విశ్లేషకులు, విధాన రూపకర్తలను సన్నద్ధం చేయడానికి వీలు క‌లుగుతుంది.

కోర్సులో దృష్టిపెట్ట‌నున్న అంశాలు:

ఎ. స్మార్ట్ సిటీస్

బి. అర్బన్ ఇన్ఫర్మేటిక్స్

ప్రోగ్రామ్ వివ‌రాలు

కోర్సు కాల‌వ్య‌వ‌ధి ఏడాది. రెండు సెమిస్ట‌ర్ల‌లో క‌లిపి 32 క్రెడిట్స్ ‌ఉంటాయి. ఇంగ్లిష్ మాధ్య‌మంలో ఉంటుంది. స్వల్పకాలంలో విద్యార్థులు కీలకమైన విశ్లేషణాత్మక సామర్థ్యాలను పొందే విధంగా ఈ కోర్సును రూపొందించారు. జెరూసలేం నగరంలో అధ్యయనం చేయడానికి, అనుభవం పొంద‌డానికి ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌నుంది. క్రియాశీల సాంకేతిక పర్యావరణ వ్యవస్థతో ఈ ప్రోగ్రాం పూర్తి చేసుకునేందుకు అనువైన నేపథ్యాన్ని విద్యార్థుల‌కు జెరూస‌లేం న‌గ‌రం అందిస్తుంది.

ఈ ప్రోగ్రాం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాల‌నుకుంటున్న విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయం మార్చి 14, 2021న వర్చువల్ ఓపెన్ డేను నిర్వహించనుంది.

అర్హతలు

దేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందిన లేదా చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థులు అర్హులు. స‌గ‌టున 85 శాతం లేదా స‌మాన‌మైన గ్రేడ్ మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించాలి. త‌ప్ప‌నిస‌రిగా ఐఈఎల్‌టీఎస్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌‌లో 6 లేదా అంతకు మించి స్కోర్ చేయాలి. భౌగోళిక శాస్త్రం, పట్టణ అధ్యయనాలు, సామాజిక శాస్త్రం, గణాంకాలు, ఆర్థిక శాస్త్రం, పబ్లిక్ పాలసీ, పొలిటికల్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ వంటి సామాజిక లేదా పర్యావరణ శాస్త్రాల సంబంధిత సబ్జెక్టుల‌తో డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఎలా?

ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 29, 2021 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హ‌త క‌లిగిన విద్యార్థులకు 200 డాల‌ర్లు స్కాలర్‌షిప్ ఇస్తారు. మే 13, 2021 లోపు ట్యూషన్ ఫీజు పూర్తిగా చెల్లించాలి.

వెబ్‌సైట్‌: https://smartcities.huji.ac.il/

Posted Date : 26-02-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌