• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎల్ఐసీ హౌసింగ్‌లో మేనేజర్లు

ఐటీ ప్రొఫెష‌న‌ల్స్‌కు మంచి అవకాశం  

టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూలతో ఎంపిక

ఇంటి రుణం అనగానే వెంటనే గుర్తొచ్చే సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్‌). దేశంలోని అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ‌ల్లో ఒకటి. జీవిత బీమా సంస్థ - ఎల్ఐసీ(లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా)కి అనుబంధ సంస్థ‌ ఇది. ముంబ‌యి కేంద్రంగా దేశ‌వ్యాప్తంగా కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తోంది. నివాస ప్ర‌యోజ‌నం కోసం ఇల్లు నిర్మాణం లేదా కొనుగోలు చేసే వ్య‌క్తుల‌కు దీర్ఘ‌కాలిక రుణాలు అందించ‌డం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. గృహాల మ‌ర‌మ్మ‌తు, పున‌రుద్ధ‌ర‌ణ‌కూ ఫైనాన్సింగ్ చేస్తుంది. 

ఈ అతిపెద్ద సంస్థ ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్‌ ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. అందులో మేనేజ్‌మెంట్ ట్రెయినీ- 09, అసిస్టెంట్ మేనేజ‌ర్-11 (ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ ఇంజినీర్‌-01, వెబ్‌,డేటాబేస్ డెవ‌ల‌ప‌ర్-06, డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్-01‌, మొబైల్ యాప్ డెవ‌ల‌ప‌ర్-02, వెబ్ కంటెంట్‌/ గ్రాఫిక్స్ డిజైన‌ర్-01).

వెబ్‌డెవ‌ల‌ప‌ర్ పోస్టు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌కు కోర్ జావా ప్రాథ‌మిక అంశాల‌తో పాటు ఈజేబీ వంటి ఎంట‌ర్‌ప్రైజ్ జావా ఫ్రేమ్‌వ‌ర్క్స్‌పై మంచి ప‌ట్టు ఉండాలి. వెబ్ టెక్నాల‌జీ/ వెబ్ స‌ర్వీసెస్(స‌ర్వ్‌లెట్స్/ జేఎస్‌పీ, సాప్‌/ రెస్ట్‌, స్ప్రింగ్‌, స్ట్ర‌ట్స్ 2.0, హైబ‌ర్‌నెట్‌, జేఎస్‌పీ, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్, జేక్వేరీ, అజాక్స్‌, జావా ఈఈ, టాగ్ లైబ్ర‌రీస్‌) అర్థం చేసుకోగ‌ల సామ‌ర్థ్యం ఉండాలి. ఎక్లిప్స్ వంటి ఐడీఈపై చాలా అనుభ‌వం అవ‌స‌రం. మైఎస్‌క్యూఎల్ ఒరాకిల్‌, ఎస్‌క్యూఎల్‌, ఆర్కిటెక్చ‌ర్‌, డిజైన్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల‌గాలి.

వెబ్‌కంటెంట్‌/ గ‌్రాఫిక్స్ డిజైన‌ర్ల‌యితే అన్ని విజువ‌ల్ డిజైన్ స్టేజ‌స్‌ని ప‌రిష్క‌రించ‌గ‌లిగేలా ఉండాలి. వైర్‌ఫ్రేమ్స్‌, యూజ‌ర్ ఫ్లోస్‌, ప్రాసెస్ ఫ్లోస్ రూపొందించ‌గ‌ల‌గాలి. హెచ్‌టీఎంఎల్‌/ హెచ్‌టీఎంఎల్ 5, సీఎస్ఎస్ 3, జావా స్క్రిప్ట్, జేక్వేరీ, బూట్‌స్ట్రాప్‌, అజాక్స్‌, క్రాస్ బ్రౌజ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్‌పై మంచి ప‌ట్టు ఉన్న వారికి ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయి.. ఫొటోషాప్‌, హిల్లుస్ట్రేట‌ర్, ఇత‌ర విజువ‌ల్ డిజైన్లు, వైర్ ఫ్రేమింగ్ టూల్స్‌లో నిష్ణాతులై ఉండాలి.  అజిలే, స్క్ర‌మ్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాసెస్‌లో అనుభ‌వం అవ‌స‌రం. ‌

డేటాబేస్ డెవ‌ల‌ప‌ర్లలో ఒరాకిల్(12సి లేదా అంత‌కు మించి),పీఎల్/ ఎస్‌క్యూఎల్‌ పై అనుభ‌వం ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. డీబ‌గ్గింగ్‌, టెస్టింగ్ స్కిల్స్‌లో మంచి అనుభ‌వం ఉన్న వారు చ‌క్క‌టి అవ‌కాశంగా మ‌లుచుకోవ‌చ్చు.

డాటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌ల‌కు దాదాపుగా ఒరాకిల్‌పై పూర్తి ప‌ట్టు ఉండాలి. ఎప్ప‌టిక‌ప్పుడు ఇత‌ర కొత్త టెక్నాల‌జీస్‌, నైపుణ్యాలు నేర్చుకోగ‌ల‌గాలి. ఎక్సాడాటాతో స‌హా బ‌హుళ‌ స‌ర్వ‌ర్లలో వివిధ డాటాబేస్‌ల‌ను నిర్వ‌హించ‌డం వీరి ప‌ని. డాటాబేస్ సెక్క్యూరిటీ, ప‌నితీరు, స‌మ‌గ్ర‌త చూసుకోవాలి. 

ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ ఇంజినీర్ల‌కు అడ్వాన్స్‌డ్ లెవ‌ల్‌ నెట్‌వ‌ర్కింగ్‌ను అర్థం చేసుకోగ‌లిగే నాలెడ్జ్ ఉండాలి. ఇన్‌స్ట్రుష‌న్ డిటెక్ష‌న్‌, ఫైర్‌వాల్స్‌, కంటెంట్ ఫిల్ట‌రింగ్‌లో నేరుగా అనుభ‌వం సంపాదించి ఉండాలి. కంప్యూట‌ర్‌పై పూర్తి ప‌ట్టు సాధించి ఉంటేనే ఇందులో రాణించ‌గ‌లుగుతారు. సీఐఎస్ఎస్‌పీ, సీఐఎస్ఎం ప్ర‌శంసాప‌త్రాలు ఉన్న‌వారికి ప్రాధాన్యం ఇస్తారు. నెట్‌వ‌ర్కింగ్ స‌మ‌స్య‌లు, భ‌ద్ర‌తా ముప్పు లేకుండా చూడ‌టం వీరి బాధ్య‌త‌.

మొబైల్‌ ఆప్ డెవ‌ల‌ప‌ర్‌కి ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ల‌పై, ఫ్రేమ్‌వ‌ర్క్స్‌ల‌పై చాలా అనుభ‌వం ఉండాలి. సీ, సీ++, హెచ్‌టీఎంఎల్ 5, జావాస్క్రిప్ట్, యూఐ/ యూఎక్స్‌ వంటివి వ‌చ్చిన వారికి అధిక ప్ర‌యోజ‌నం ఉంటుంది. 

మేనేజ్‌మెంట్ ట్రైనీలుగా చేరాల‌నుకునే అభ్య‌ర్థులు ఒరాకిల్‌, మైఎస్‌క్యూఎల్‌, ఎంఎస్ ఎస్‌క్యూఎల్‌ల‌ను సాధ‌న చేసి ఉండాలి. అన‌లైటిక‌ల్‌, టెస్టింగ్ స్కిల్స్‌లో ప్రావీణ్యం పొంది ఉంటే మంచి అవ‌కాశం ఉంటుంది. వీరికి ప్రాంతీయ కార్యాల‌యాల్లో పోస్టింగ్ ఇస్తారు. వీరే ఆ కార్యాల‌యంలో తుది వినియోగ‌దారుల‌కు మొద‌టి సాంకేతిక ప‌రిచ‌య‌స్తులు. ఐటీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్ బాధ్య‌త‌లు చూసుకోవ‌డంలో వీరిదే ప్ర‌ధాన పాత్ర‌.  

జీత‌భ‌త్యాలు: ఎంపికైన అభ్య‌ర్థుల్లో అసిస్టెంట్ మేనేజ‌ర్లు ముంబ‌యి, మేనేజ్‌మెంట్ ట్రైనీలు బెంగ‌ళూరు, భోపాల్‌, చెన్నై, దిల్లీ, హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, ముంబ‌యి, ల‌ఖ్‌న‌వూ, ప‌ట్నాలో ప‌ని చేయాల్సి ఉంటుంది. మేనేజ్‌మెంట్ ట్రెయినీకి నెల‌కు రూ.25,000, అసిస్టెంట్ మేనేజ‌ర్ల‌కు ఏడాదికి రూ.10 నుంచి 14 ల‌క్ష‌లు చెల్లిస్తారు.

అర్హ‌త‌లు

అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి క‌నీసం 60% మార్కుల‌తో కంప్యూట‌ర్ సైన్స్‌/ ఐటీ సబ్జెక్టుల‌తో ఫుల్ టైం ఎంసీఏ, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీలో ఉత్తీర్ణ‌త సాధించాలి. దూర విద్యా, పార్ట్ టైం డిగ్రీలు, క‌ర‌స్పాండెన్స్ డిగ్రీలు కలిగి ఉన్న అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అర్హత లేదు. 

* మేనేజ్‌మెంట్ ట్రైనీల‌కు ఏడాది, అసిస్టెంట్ మేనేజ‌ర్‌ల‌కు మూడేళ్ల పని అనుభవం ఉండాలి. డిసెంబ‌ర్ 01, 2020 నాటికి మేనేజ్‌మెంట్ ట్రైనీల‌కు 24-30 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజ‌ర్‌ల‌కు 25-30 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉండాలి. అభ్య‌ర్థులు ఏదైనా ఒక పోస్టుకు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఒక‌టి కంటే ఎక్కువ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నా మొద‌టి అప్లికేష‌న్‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

ఎంపిక ఎలా?

ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబ‌రు 31, 2020 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అందులో అర్హులైన అభ్య‌ర్థులను షార్ట్‌లిస్టింగ్ చేసి ఆన్‌లైన్ టెక్నిక‌ల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష 50 మార్కుల‌కు ఉంటుంది. మెరిట్ మార్కులు సాధించిన వారిని ముంబైలో ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. ఆన్‌లైన్ టెక్నిక‌ల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూలో సాధించిన మార్కుల ‌ప్రాతిప‌దికన ‌తుది ఎంపిక జ‌రుగుతుంది.

వెబ్‌సైట్‌: www.lichousing.com
 

Posted Date : 21-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌