• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వైద్యవిద్యకు శిఖరం.. ఎయిమ్స్‌

దేశంలో వైద్యవిద్యలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థే అగ్రగామి. ఇక్కడ విద్య అభ్యసించిన వైద్యులకు విశేష ఆదరణ లభిస్తోంది. అందువల్ల టాప్‌ ర్యాంకర్లంతా ఎయిమ్స్, న్యూదిల్లీలో చేరడానికే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. తాజాగా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో మెడిసిన్‌లో ఈ సంస్థ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న కోర్సులు, జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ప్రముఖ సంస్థల వివరాలు, ప్రవేశమార్గాలు చూద్దాం...

2018 నుంచి మెడికల్‌ విభాగంలో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులను ప్రకటిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 2018, 2019, 2020, 2021ల్లో వరుసగా నాలుగేళ్లు ఎయిమ్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. బోధన అభ్యసన ప్రమాణాలు, వనరులు వృత్తి సాధన, కోర్సు పూర్తిచేసుకున్న గ్రాడ్యుయేట్లు, సంస్థ వ్యాప్తి, వివిధ అనుబంధ విభాగాలతో సమన్వయం, బయట వ్యక్తుల దృక్పథం..మొదలైన అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు.

ఇవీ కోర్సులు

ఎంబీబీఎస్‌: ఇంటర్‌ బైపీసీ విద్యార్థులు అర్హులు. నీట్‌తో ప్రవేశం లభిస్తుంది. పీజీలో ఎండీ, ఎంఎస్‌; సూపర్‌ స్పెషాలిటీలో డీఎం, ఎంసీహెచ్‌ కోర్సులను వివిధ స్పెషలైజేషన్లతో ఈ సంస్థ అందిస్తోంది. ఐఎన్‌ఐసెట్‌లో చూపిన ప్రతిభతో ఈ కోర్సుల్లో చేరవచ్చు.  ఇవే కాకుండా ఈ సంస్థ బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ మెడికల్‌ టెక్నాలజీ(రేడియోగ్రఫీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ, ఎమ్మెస్సీ నర్సింగ్, ఎండీఎస్, ఎమ్మెస్సీ కోర్సులను అందిస్తోంది. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశాలుంటాయి. 

ఈ సంస్థకు న్యూదిల్లీతోపాటు భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రుషికేశ్, రాయ్‌ బరేలీ, మంగళగిరి, నాగ్‌పుర్, గోరఖ్‌పూర్, భటిండా, బీబీనగర్, కల్యాణి, దియోఘర్‌ల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో పలు చోట్ల ఎంబీబీఎస్, పారా మెడికల్‌ కోర్సులు అందిస్తున్నారు. ఎంబీబీఎస్‌లో ప్రవేశం నీట్‌తో, పారా కోర్సుల్లో ఎయిమ్స్‌ న్యూదిల్లీ నిర్వహించే పరీక్షతో అవకాశం ఉంటుంది. 

టాప్‌ 10 సంస్థలు

1. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) న్యూదిల్లీ

2. పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ చండీగఢ్‌

3. క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ (సీఎంసీ) వెల్లూరు

4. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ (నిమ్‌హాన్స్‌) బెంగళూరు

5. సంజయ్‌గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లఖ్‌నవూ

6. అమృత విశ్వ విద్యాపీఠం కోయంబత్తూర్‌

7. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) వారణాశి

8. జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్మర్‌) పుదుచ్చెరి

9. కింగ్‌ జార్జ్స్‌ మెడికల్‌ యూనివర్సిటీ లఖ్‌నవూ

10. కస్తూర్బా మెడికల్‌ కాలేజ్‌ మణిపాల్‌. 

తెలుగు రాష్ట్రాల్లో: నారాయణ మెడికల్‌ కాలేజ్‌ నెల్లూరు 43వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 50 సంస్థలకే మెడికల్‌ ర్యాంకులు కేటాయించారు. ఉస్మానియా, ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌...తదితర సంస్థలు ఈ ప్రక్రియలో పాల్గొనలేదు. అందువల్ల వాటికి ర్యాంకులు కేటాయించలేదు.
 

Posted Date : 30-09-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌