• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆ అయిదు కోర్సులకు డిమాండ్ ఎక్కువ

రాబోయే అవకాశాలను అందుకోవాలంటే నేర్చుకోవాల్సిందే!

నైపుణ్యాభివృద్ధి అనేది స్థిరమైన ప్రక్రియ కాదు, దాన్ని అన్ని స్థాయుల్లో కొనసాగించాల్సిందే. నేటి డిజిటల్ సాంకేతిక యుగంలో నిరంతరం నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం, వృద్ధి చెందడం, లక్ష్యాలను సాధించడం చాలా ముఖ్యం. లేకపోతే ఉద్యోగ జీవితంలో రాణించడం కష్టమవుతుంది. ఇప్పుడు అనేక సంస్థల మనుగడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడుతోంది. రోజురోజుకు అందులో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటికి తగినట్లుగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటేనే ఉద్యోగ భద్రత ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధునికీకరించిన శ్రామికశక్తి ద్వారా మాత్రమే రాణింపు సాధ్యమవుతుంది. కొత్త అవకాశాలు పుట్టుకొస్తుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్‌కి  అవసరమైన స్కిల్స్ పెంచుకోవాలి. అందుకు దోహదపడే అయిదు రకాల కోర్సులపై అభ్యర్థులు అవగాహన ఏర్పరచుకుంటే ప్రయోజనాలు పొందవచ్చు.

ఇంటెలిపాట్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్

భారతదేశంలోని ప్రముఖ ఎడ్-టెక్ సంస్థ ఇంటెలిపాట్ ఈ ప్రత్యేక కోర్సును అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు క్లౌడ్, డెవ ఆప్‌ల‌పై  ప్రావీణ్యం పొందవచ్చు. ప్రోగ్రామ్‌లో భాగంగా ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, డెవ్ యాప్స్, పైథాన్, జావా, లినక్స్, స్ల్పంక్ వంటి మరెన్నో రియల్ టైమ్ ప్రాజెక్టుల్లో పని చేస్తారు. ఈ కార్యక్రమంలో 11 కోర్సులు, 26 పరిశ్రమ ఆధారిత ప్రాజెక్టులు, క్యాప్ స్టోన్ ప్రాజెక్ట్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ సహా ఇంటిగ్రేటింగ్ ఆన్-ప్రెమిసెస్ ఐడెంటిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అజ్యూర్ డెవలప్ మెంట్‌లో సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్‌కి సంబంధించిన కోర్సు మెటీరియల్‌ను అందజేస్తారు. 

వెబ్‌సైట్‌: https://intellipaat.com/cloud-devops-architect-masters-p\rogram-training/

ఐబీఎం సహకారంతో సింప్లిలీలెర్న్‌ డేటా సైంటిస్ట్ మాస్టర్స్ ప్రోగ్రామ్

ఐబీఎం సహకారంతో సింప్లీలెర్న్ అందించే ఈ డేటా సైంటిస్ట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ కోర్సు విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ బ్లెండెడ్ లెర్నింగ్‌ను పరిచయం చేస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్ రెండింటిలోనూ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. డేటా సైన్స్‌లోని ఈ అధునాతన కోర్సు చేస్తే విద్యార్థులు త్వరగా ఉద్యోగం పొందడానికి వీలుంటుంది. 

వెబ్‌సైట్‌: https://www.simplilearn.com/big-data-and-analytics/senior-data-scientist-masters-program-training

హెన్రీ హార్విన్ కంటెంట్ రైటింగ్ కోర్సు

ప్రతి ఒక్కరినీ ఆకర్షించే పదాలతో ఆలోచనలను అనువదించడం, సంభావ్యత కలిగిన కంటెంట్ సృష్టికర్తగా మారడం ఎలా అనే విషయాలను ఈ కోర్సు నేర్పుతుంది. ఇది అభ్యర్థుల ఉద్యోగ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆలోచనలను నిర్మాణాత్మక పదాలుగా అనువదించడానికి, కార్యాలయంలో సాధ్యమైనంత ఉత్తమంగా వ్యక్తీకరించడానికి, కొత్త మార్గాలను అన్వేషించడానికి దోహదపడుతుంది. ఏదైనా అంశంపై లోతుగా దర్యాప్తు, కంటెంట్‌ను సృష్టించడం, మూల్యాంకనం చేయడం, పునర్వ్యవస్థీకరించడం, రీప్యాకేజింగ్, వ్యూహరచన, ప్రదర్శించడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా నిపుణుడిగా మారవచ్చు. ఏదైనా విషయంలో ఇతరులను ఒప్పించే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. ముఖ్యంగా అమ్మకాలు, మార్కెటింగ్, ప్రకటనలు, సమాచార మార్పిడిలో నిపుణులకు ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా, సెర్చ్ ఇంజన్లు, ఈ-కామర్స్, బ్లాగ్ & ల్యాండింగ్ పేజీల్లో సంభాషణలు, చర్యలను నడిపించే ఏ ఫోరమ్‌లోనైనా ఏదైనా అంశంపై రాయగల డైనమిక్ రచయితగా ఈ కోర్సు అభ్యర్థులను తయారుచేస్తుంది. 

వెబ్‌సైట్‌: https://www.henryharvin.com/

అప్‌గ్రాడ్‌ పీజీ డిప్లొమా ఇన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ (బిగ్ డేటా)

అప్‌గ్రాడ్ అందించే ఈ సమగ్ర డిప్లొమా ప్రోగ్రామ్ ను బిగ్ డేటా, దాని ముఖ్య ప్రక్రియలు, పారిశ్రామిక అనువర్తనాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనుకునే వారి కోసం రూపొందించారు. డేటా వేర్‌హౌసింగ్, రియల్ టైమ్ ప్రాసెసింగ్, డేటా ప్రాసెసింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి బిగ్ డేటాకు సంబంధించిన అంశాల గురించి ఈ కోర్సులో లోతైన విషయాలను బోధిస్తారు. విద్యార్థులు జావా, పైథాన్, స్పార్క్, కాఫ్కా, హైవ్ వంటి సాధనాలతో కూడా పని చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో ఏడు సందర్భ పరిశీలనలతో పాటు ప్రాజెక్టులూ ఉన్నాయి. ఇవి వాస్తవ ప్రపంచ నైపుణ్యాలను పదును పెట్టడంలో సహాయపడతాయి.

వెబ్‌సైట్: https://www.upgrad.com/data-science-course-hyderabad/

ప్రొఫెషనల్ టీచింగ్‌లో సురాసా కోర్సులు

సురాసా ఒక ప్రముఖ ఉపాధ్యాయ-వృద్ధి-కేంద్రీకృత ఎడ్టెక్, జాబ్టెక్ ప్లాట్‌ఫామ్‌‌. ఇది భారతదేశంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యుకె లెవల్-6 టీచింగ్ అర్హతలను అందిస్తోంది. దీన్ని అనుభవజ్ఞులైన విద్యావేత్తలు, కాగ్నిటివ్ సైంటిస్టులు, డేటా శాస్త్రవేత్తల బృందం, వేలాది మంది ఉపాధ్యాయులు, పరిశ్రమ నిపుణులతో సంప్రదించి రూపొందించారు. ఇందులో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ టీచింగ్ & లెర్నింగ్ (పీజీసీటీఎల్), డిప్లొమా ఇన్ టీచింగ్ కోర్సులు ఉన్నాయి. ఇవి ఉపాధ్యాయులు వారి వృత్తిపరమైన వృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో అధిక ప్రభావ అభ్యాస వాతావరణాన్ని విజయవంతంగా సృష్టించడాన్ని ఈ కోర్సులో నేర్పిస్తారు. 21వ శతాబ్దపు బోధనా నైపుణ్యంతో ఉపాధ్యాయులను శక్తిమంతం చేస్తారు. కొత్త తరం ‘జెన్ జెడ్’, ‘జెన్ ఆల్ఫా’ విద్యార్థులను చదువులో నిమగ్నం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తారు.

వెబ్‌సైట్: https://www.suraasa.com/

Posted Date : 01-03-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌