• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పురాణాల‌పై బాలలకు కొత్త పుస్త‌కం

 8 నుంచి 12 సంవత్సరాల పిల్లలే లక్ష్యం
ఇటలీకి చెందిన రచయిత అల్ఫ్రెడో కొవెలి భార‌తీయ బాలల ‌కోసం ర‌చించిన “వాహన‌మాస్ట‌ర్‌క్లాస్” పుస్తకం దేశీయ‌మార్కెట్లోకి విడుద‌లైంది. ముఖ్యంగా ఎనిమిది నుంచి 12 సంవత్సరాల లోపు వారే ల‌క్ష్యంగా రాసిన ఈ పుస్తకాన్ని స్కాలస్టిక్ ఇండియా ప్రచురించింది. భారతీయ పురాణాలు, సంస్కృతి ఇతర దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. భార‌తీయులు దేవ‌త‌ల‌ను కొలిచే విధానాన్ని విదేశీయులు ప్రశంసిస్తుంటారు. మన సంస్కృతి, పురాణాల‌ను చూసి ఇష్టపడుతుంటారు. భార‌తదేశ సంస్కృతిలోని గొప్పదనం మన దేశ రచయితలనే కాకుండా ఇతర దేశాల వారినీ అన్వేషించడానికి ప్రేరేపిస్తుంది. ఆల్ఫ్రెడోకు  మనదేశ సంస్కృతి, పురాణాలపై ఎంతో ఆసక్తి ఉంది. దీంతో ఆయ‌న పిల్లల కోసం వినాయ‌కుడిపై ఒక కథ రాయడానికి స్ఫూర్తి పొందారు. వినాయ‌కుడు త‌న కొత్త వాహ‌నం కోసం విశ్వం మొత్తం వెతికిన‌కథను ఈ పుస్తకం వివరిస్తుంది.
కొవెలి త‌న పుస్తకం గురించి మాట్లాడుతూ.. “నా మొదటి పుస్తకాన్ని భారతదేశంలో విడుద‌ల చేయ‌డానికి సంతోషిస్తున్నాను. ఇక్క‌డి సంస్కృతి, హిందూ మతం పట్ల నాకు ఎంతో ఆసక్తి ఉంది. అదే నాకు ఈ పుస్తకం రాయడానికి స్ఫూర్తినిచ్చింది. ఇంగ్లిష్‌లో ఇది నా మొదటి పుస్తకం. పిల్ల‌ల కోసం రాయడం కూడా ఇదే తొలిసారి. ఈ పుస్త‌కం నాలుగు ఎలుకల పురాణ సాహ‌సం గురించి వివరిస్తుంది. అవి తర్వాత వినాయ‌కుడి వాహ‌నంగా ఎలా మారాయ‌నే విష‌యాలు ఇందులో ఉంటాయి” అని తెలిపారు.

Posted Date : 09-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌