• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆథర్‌కేఫ్‌తో ‘ఎస్‌ఆర్‌ఎమ్‌’ ఎంవోయూ

కట్టంకులతూర్‌లోని ఎస్‌ఆర్‌ఎమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఎస్‌ఆర్‌ఎమ్‌ఐఎస్‌టీ), పరిశోధనా అంశాల కోసం ఆథర్‌కేఫ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నివేదికల తయారీ, పరిశోధనా రచనలు, సమీక్ష, పరిపాలన తదితర అంశాల్లో సహకారం లభించనుంది. ఆథర్‌కేఫ్‌తో ఒప్పందం ద్వారా ఎస్‌ఆర్‌ఎమ్‌ఐఎస్‌టీకి ఎంతో ప్రయోజనం చేకూరనుందని ఇన్‌స్టిట్యూట్‌ జాయింట్‌ డైరెక్టర్‌(రీసెర్చ్‌) డా.ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రబహరన్‌ తెలిపారు. పరిశోధనా రచనలు, థీసీస్‌ కంటెంట్‌ను శోధించడం, కనుగొనడం లాంటివి ఇన్‌స్టిట్యూట్‌ జర్నల్‌లో అందుబాటులో పెడతామన్నారు. ఆథర్‌కేఫ్‌ ప్రెసిడెంట్‌ డా.శాంతి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌ఎమ్‌ఐఎస్‌టీ తన అకడమిక్ ప్రోగ్రాం‌ నిర్వహణకు తమను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే ఎస్‌ఆర్‌ఎమ్‌ ఎన్నో రంగాల్లో మార్గదర్శిగా నిలిచింద‌న్నారు. భారతీయ పరిశోధనలను ప్రపంచ స్థాయి వేదికపై మరింత ప్రభావ‌వంతంగా చేయడానికి వారు ఒక మార్గాన్ని చూపించారని ఆమె పేర్కొన్నారు. ఇది క్లౌడ్‌ ఆధారిత పరిశోధనా రచన వేదిక అని, ఇంటర్‌నెట్‌ ద్వారా ఎక్కడి నుంచైనా పొందవచ్చని ఆథర్‌కేఫ్‌ కన్సల్‌ల్టెంట్‌ సేల్స్, స్ట్రాటజీ పునిత్‌ దందానియా పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఎమ్‌ఐఎస్‌టీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డా.సి.ముథమిజ్‌ చెల్వన్‌ మాట్లాడుతూ.. దీర్ఘకాలంలో పరిశోధనా సాధనాల విషయంలో ఈ ప్రాజెక్టు విశ్వవిద్యాలయానికి ఎంతో దోహ‌ద‌ప‌డుతుందన్నారు. 

Posted Date : 12-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌