• facebook
  • twitter
  • whatsapp
  • telegram

UGC NET: బోధన... పరిశోధనల్లో రాణించాలంటే?

యూజీసీ నెట్  ప్రకటన విడుదల

డిసెంబర్-2020,  జూన్-2021 సెషన్లకు సంయుక్తంగా పరీక్షల నిర్వహణ

పరిశోధనలపై, టీచింగ్పై మక్కువ ఉండి.. విద్యాసంస్థల్లో ప్రొఫెసర్లుగా రాణించాలనుకునేవారికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తరఫున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నెట్) చక్కటి మార్గం. ఇందులో అర్హత సాధిస్తే దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు పోటీ పడవచ్చు. ఇదే పరీక్ష ద్వారా జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) పొంది, ప్రఖ్యాత సంస్థల్లో పరిశోధన (పీహెచ్డీ) చేయవచ్చు. మొత్తం 81 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తారు. యూజీసీ నెట్-2021 జూన్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. గతేడాది జరగాల్సిన డిసెంబర్-2020 సెషన్ కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. దీంతో జూన్-2021, డిసెంబర్-2020 రెండు సెషన్లను కలిపి యూజీసీ ఇప్పుడు నిర్వహిస్తోంది.   

ఇదీ అర్హత

సంబంధిత సబ్జెక్టులో కనీసం 55శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగులు 50 శాతం మార్కులు సాధిస్తే చాలు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువున్న విద్యార్థులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్ఎఫ్ దరఖాస్తుదారుల వయసు అక్టోబర్ 1, 2021 నాటికి 31 ఏళ్లు మించకూడదు. ఓబీసీ (నాన్ క్రిమీలేయర్)/ ఎస్సీ/ ఎస్టీ/   పీడబ్ల్యూడీ/ ట్రాన్స్ జండర్లు/ మహిళా అభ్యర్థులకు వయసు నిబంధనలో గరిష్ఠంగా ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ దరఖాస్తుదారులకు వయసు పరిమితి నిబంధన లేదు. 

దరఖాస్తు ఇలా..

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు సెప్టెంబర్ 5, 2021 తుది గడువు. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులు రూ.1000, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ట్రాన్స్ జండర్లు రూ.250 చెల్లించాలి. ఫీజు చెల్లించడానికి సెప్టెంబర్ 6, 2021 వరకు అవకాశం కల్పించారు. 

పరీక్షా కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం. 

తెలంగాణ:  హైదరాబాద్/ సికింద్రాబాద్/ రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్.

పరీక్ష విధానం

ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో రెండు పేపర్లుంటాయి. పేపర్-1, 2 మధ్య విరామం ఉండదు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో వస్తాయి.  పేపర్ అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో 50 ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులిస్తారు. పేపర్లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. 100 ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం  200 మార్కులిస్తారు. పరీక్షా సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఇస్తారు. పరీక్షలో రుణాత్మక మార్కులుండవు.  

సిలబస్.. ప్రిపరేషన్

పేపర్ -1: ఇందులో 10 విభాగాలుంటాయి. అభ్యర్థిలోని టీచింగ్, రిసెర్చ్ సామర్థ్యాలను పరీక్షిస్తారు. రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్, జనరల్ అవేర్నెస్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆయా అంశాలకు చెందిన ప్రామాణిక పుస్తకాలను చదివితే  సరిపోతుంది. అలాగే పాత ప్రశ్నపత్రాలను అధ్యయం చేస్తే ప్రశ్నల తీరుపై అవగాహన ఏర్పడుతుంది.  

పేపర్-2: ఇందులో అభ్యర్థి ఎంచుకునే సబ్జెక్టు నుంచే ప్రశ్నలు వస్తాయి. వాటిలోని ప్రాథమికాంశాలు, అనువర్తనం, విశ్లేషణ, అవగాహన, జ్ఞానం పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను క్షుణ్ణంగా అధ్యయం చేయాలి. 

ఉద్యోగావకాశాలు

నెట్లో ప్రతిభ చాటిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ స్కోరుతో మేనేజ్మెంట్ ట్రెయినీ హోదాతో లీగల్, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలు సైతం ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. జేఆర్ఎఫ్ అర్హులు పీహెచ్డీ చేస్తూనే మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000, తర్వాత సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (ఎస్ఆర్ఎఫ్) అర్హత పొందితే రూ.35,000 చొప్పున స్టైపెండ్ అందుకోవచ్చు. సంబంధిత సంస్థ వసతి కల్పించకపోతే స్టైపెండ్లో 30 శాతం వరకు హెచ్ఆర్ఏ రూపంలో చెల్లిస్తారు. 

పరీక్ష తేదీ: 2021 అక్టోబర్ 6 నుంచి 11 వరకు

వెబ్సైట్: https://ugcnet.nta.nic.in/

Posted Date : 13-08-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌