• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బ్యాంకు కొలువు సాధనకు మూడు సూత్రాలు

‣ ప్ర‌ణాళిక అమ‌లుతో ల‌క్ష్యం చేరండి!

బ్యాంకు ఉద్యోగం సాధించడం చాలా క‌ష్టం అనుకుంటే పొర‌పాటే. క‌ష్టం ఉన్న‌ప్ప‌టికీ ఇష్టంతోపాటు కొలువు కొట్టాల‌నే త‌ప‌న, ప్ర‌ణాళిక‌, అమలు కూడా కీల‌కం అవుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని స‌న్న‌ద్ధమైతే మీరూ ఉద్యోగుల‌వుతారు.

ల‌క్ష్య నిర్దేశం

ల‌క్ష్యం అంటే.. బ్యాంకు ఉద్యోగాల్లో అర్హ‌త‌కు త‌గ్గ‌ట్లు ఏ జాబ్ చేయాల‌నుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి. మీ అర్హ‌త‌తో వివిధ పోస్టులు ఉన్న‌ప్ప‌టికీ దేన్ని ఎంచుకోవాల‌నేది ముఖ్యం. అందులో సందేహాలకు తావివ్వొద్దు. ల‌క్ష్యం నిర్ణ‌యించుకోవ‌డం వ‌ల్ల దానిపైనే దృష్టిపెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. బ్యాంకు ఉద్యోగాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌ల కాగానే జాబ్ కొట్టాల‌నే ఆశ క‌ల‌గ‌డం స‌హజం. కానీ దాన్ని చివ‌రివ‌ర‌కు కొన‌సాగించాలి. ల‌క్ష్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి. 

ప్ర‌ణాళిక‌ రచన

పెట్టుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే ప్ర‌ణాళిక అవ‌సరం. నోటిఫికేష‌న్ వెలువ‌డిన నాటి నుంచి ప‌రీక్ష వ‌ర‌కు ఉన్న స‌మ‌యాన్ని పూర్తిగా స‌ద్వినియోగం ప‌రుచుకోవాలి. అందుకు ప్ర‌ణాళిక‌ను త‌యారు సిద్ధం చేసుకోవాలి. నోటిఫికేష‌న్ వ‌చ్చిన నాటి నుంచి ప‌రీక్ష‌కు ఎన్నిరోజులు ఉంది? ఏ రోజు ఏం స‌బ్జెక్టులు చ‌ద‌వాలి? ఎలా చ‌ద‌వాలి? దేనికి ఎంత సమ‌యం కేటాయించాలి? అనే విష‌యాల‌తో ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకుంటే స‌న్న‌ద్ధ‌త‌పై ఒక అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది. 

అమలుకు తగిన కష్టం

ల‌క్ష్యం నిర్దేశించుకుని, ప్ర‌ణాళిక ర‌చించుకోగానే స‌రిపోదు. గ‌మ్యం చేరాలంటే ప్ర‌యాణం మొద‌లుపెట్టాలి. దానికోసం క‌ష్ట‌ప‌డాలి. మొద‌టి రోజు ఉన్న ఆతృత‌, ప‌ట్టుద‌ల రోజురోజుకీ త‌గ్గిపోకుండా చూసుకోవాలి. చివ‌రిరోజు వ‌ర‌కు దాన్ని కొనసాగించాలి. ఏ ఒక్క‌రోజు వృథా చేసుకున్నా ప్ర‌ణాళిక మొత్తం  చిన్నాభిన్నం అవుతుంద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. మొద‌టి రోజు స‌న్న‌ద్ధ‌త ఎలా సాగుతుందో.. చివ‌రి రోజు కూడా అదే కొన‌సాగింపు కావాలి.  

నోటిఫికేష‌న్ రాగానే అంద‌రూ ల‌క్ష్యం నిర్దేశించుకుంటారు. కానీ ప్ర‌ణాళిక వేసుకోవ‌డంలో చాలామంది విఫ‌లం అవుతారు. ప్ర‌ణాళిక వేసుకున్న వారిలో అతికొద్ది మంది మాత్ర‌మే అమలు చేస్తారు. ల‌క్ష్యాన్ని అందుకుంటారు. బ్యాంకు ఉద్యోగాల్లో ప్రిలిమ్స్‌, మెయిన్స్ నిర్వ‌హిస్తుంటారు. ప్రిలిమ్స్‌కు తీవ్రపోటీ ఉంటుంది. క‌ష్ట‌ప‌డి స‌న్న‌ద్ధం అయ్యేవారు మాత్ర‌మే మెయిన్స్‌కు ఎంపిక‌వుతారు. ద‌ర‌ఖాస్తు చేసుక‌న్న వారిలో సుమారు 50శాతం మందే స‌న్న‌ద్ధం అవుతారు. కొంద‌రు మ‌ధ్య‌మ‌ధ్య‌లో చ‌దువుతుంటారు. ఇలాంటి వారు గ‌మ్యం చేర‌డం అసంభ‌వం. ప్ర‌ణాళిక‌, అమలుతోనే అది సాధ్యం.

డా. జీఎస్ గిరిధ‌ర్‌

Posted Date : 02-07-2021 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం