• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వేస్తారా.. ఉద్యోగ ‘ముద్ర‌’!

‣ బ్యాంకు నోట్‌ప్రెస్‌లో 135 ఖాళీలు

‣ డిగ్రీ ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తుకు అర్హులు

మధ్యప్రదేశ్‌ దేవాస్‌లోని బ్యాంకు నోట్‌ ప్రెస్‌ వివిధ రకాల పోస్టుల భర్తీకి  దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నిరుద్యోగులైన డిప్లొమా, డిగ్రీ ఉన్నవారికి ఇదో మంచి అవకాశం. మొత్తం కొలువుల సంఖ్య 135. దాదాపుగా అన్ని రకాల డిగ్రీలవారికీ అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూసేవారు దీన్ని ప్రయత్నించవచ్చు.

మధ్యప్రదేశ్‌లోని బ్యాంకు నోట్‌ ప్రెస్‌.. సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఒక ఇండస్ట్రియల్‌ యూనిట్‌. ఆర్థిక మంత్రిత్వశాఖ, ఎకనామిక్‌ అఫైర్స్‌ విభాగాల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నాణ్యమైన బ్యాంకు నోట్లను ముద్రించడానికి దీనిని స్థాపించారు. తాజాగా వివిధ హోదాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 135 పోస్టుల్లో దేవాస్‌లోని బ్యాంకు నోట్‌ ప్రెస్‌లో 131 ఖాళీలుండగా 4 పోస్టులు నోయిడాలోని ఇండియా గవర్నమెంట్‌ మింట్‌కు సంబంధించినవి.

బ్యాంకు నోట్‌ ప్రెస్‌

జూనియర్‌ టెక్నీషియన్‌: 113

ఇంక్‌ ఫ్యాక్టరీ వారికి.. డైస్టఫ్‌ టెక్నాలజీ/ పెయింట్‌ టెక్నాలజీ/ సర్ఫేస్‌ కోటింగ్‌ టెక్నాలజీ ప్రింటింగ్‌ ఇంక్‌ టెక్నాలజీల్లో ఫుల్‌టైమ్‌ ఐటీఐ ఉండాలి. లేదా ప్రింటింగ్‌ టెక్నాలజీలో ఫుల్‌టైమ్‌ ఐటీఐతోపాటు ఎన్‌సీవీటీ నుంచి ఏడాది వ్యవధిగల ఎన్‌ఏసీ సర్టిఫికెట్‌ పొందివుండటం తప్పనిసరి.

ప్రింటింగ్‌ వారికి.. ప్రింటింగ్‌ ట్రేడ్‌- లితో ఆఫ్‌సెట్‌ మెషిన్‌ మైండర్, లెటర్‌ ప్రెస్‌ మెషిన్‌ మైండర్, ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్, ప్లేట్‌ మేకింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, హ్యాండ్‌ కంపోజింగ్, ప్లేట్‌ మేకర్‌ కమ్‌ ఇంపాజిటర్‌ల్లో ఐటీఐ ఫుల్‌టైమ్‌ సర్టిఫికెట్‌తోపాటు ఎన్‌సీవీటీ నుంచి ఏడాది వ్యవధిగల ఎన్‌ఏసీ సర్టిఫికెట్‌ పొందివుండాలి.

ఎలక్ట్రికల్‌/ ఐటీ వారికి.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ ఫుల్‌టైమ్‌ ఐటీఐ సర్టిపికెట్‌తోపాటు ఎన్‌సీవీటీ నుంచి ఏడాది వ్యవధిగల ఎన్‌ఏసీ సర్టిఫికెట్‌ ఉండాలి.

మెకానికల్‌/ఏసీ వారికి.. ఫిట్టర్, మెషినిస్ట్‌ టర్నర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌ల్లో ఫుల్‌టైమ్‌ ఐటీఐ సర్టిఫికెట్‌తోపాటు ఎన్‌సీవీటీ నుంచి ఏడాది వ్యవధిగల ఎన్‌ఏసీ సర్టిఫికెట్‌ ఉండాలి.

జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌: 15

ఏదైనా డిగ్రీని కనీసం 55% మార్కులతో పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానంతోపాటు ఇంగ్లిష్‌ పదాలు నిమిషానికి 40, హిందీ అయితే 30 పదాలు టైప్‌ చేయగల సామర్థ్యముండాలి.

వెల్ఫేర్‌ ఆఫీసర్‌: 01

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సోషల్‌ సైన్స్‌లో డిగ్రీ/ డిప్లొమా పూర్తిచేసుండాలి. హిందీ భాషపై పట్టుండాలి.

సూపర్‌ వైజర్‌: 02

ఇంక్‌ ఫ్యాక్టరీ వారికి.. డైస్టఫ్‌ టెక్నాలజీ/ పెయింట్‌ టెక్నాలజీ/ సర్ఫేస్‌ కోటింగ్‌ టెక్నాలజీ/ ప్రింటింగ్‌ ఇంక్‌ టెక్నాలజీ/ ప్రింటింగ్‌ టెక్నాలజీలో ఫుల్‌టైమ్‌ డిప్లొమా చదివుండాలి. ప్రథమశ్రేణి ఉత్తీర్ణత తప్పనిసరి. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్‌సీ చేసినవారికీ అవకాశముంటుంది. బీఎస్‌సీ కెమిస్ట్రీ వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వారికి.. ఐటీ/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసుండాలి. సంబంధిత విభాగాల్లో బీటెక్‌ఉ బీఈ/ బీఎస్‌సీ చేసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియా గవర్నమెంట్‌ మింట్‌

జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌: 03

ఏదేని డిగ్రీని కనీసం 55% మార్కులతో పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానంతోపాటు ఇంగ్లిష్‌ పదాలు నిమిషానికి 40, హిందీ అయితే 30 పదాలు టైప్‌ చేయగల సామర్థ్యముండాలి.

సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌: 01

ఏదైనా డిగ్రీని కనీసం 55% మార్కులతో పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం, టైపింగ్‌ సామర్థ్యముండాలి.

వయసు: జూనియర్‌ టెక్నీషియన్‌కు 25 ఏళ్లు, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్, సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌లకు 28 ఏళ్లు, వెల్ఫేర్‌ ఆఫీసర్, సూపర్‌వైజర్‌లకు 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: వెల్ఫేర్‌ ఆఫీసర్‌కు రూ.29,740 నుంచి రూ.1,03,000; సూపర్‌వైజర్‌కు రూ.రూ.27,600 నుంచి రూ.95,910; జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌కు రూ.21,540 నుంచి రూ.77,160; జూనియర్‌ టెక్నీషన్‌లకు రూ.18,780 నుంచి రూ.67,390; సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌కు రూ.23,910 నుంచి రూ.85,570; జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌కు రూ.21,540 నుంచి రూ.77,160.

ఎంపిక

ఆన్‌లైన్‌ పరీక్ష, స్టెనోగ్రఫీ, టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును వెల్లడించలేదు. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: జూన్‌ 11, 2021. రాతపరీక్ష జులై/  ఆగస్టులో ఉంటుంది. వివరాలకు వెబ్‌సైట్‌ https://
bnpdewas.spmcil.com/Interface/Home.aspx
 ను సందర్శించవచ్చు.


 

Posted Date : 13-05-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌