• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నియామకాల్లో ఏమేం చూస్తారు? 

మేటి సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం అభ్యర్థులకు ఎంత అవసరమో, తమ సంస్థను విజయవంతంగా నడిపించగల సమర్థులను ఎంపిక చేసుకోవడం యాజమాన్యాలకు అంతే అవసరం. అందుకే రాత పరీక్షలు, బృంద చర్చలు, మౌఖిక పరీక్షల్లో పాల్గొన్నవారిలో తమ సంస్థకు సరిపడేవారిని నియామక సంస్థలు వివిధ దృక్కోణాల్లో పరిశీలిస్తాయి. కొన్ని సాధారణ నైపుణ్యాలను అభ్యర్థుల నుంచి ఆశిస్తాయి. అవేమిటో పరిశీలిద్దాం!

యువత సహజంగా ప్రతి విషయంలోనూ చురుకుగా, చలాకీగా ఉంటుంది. ఇందుకు అదనంగా గత అనుభవాల నుంచి నేర్చుకుని, ఆ సారాన్ని భవిష్యత్‌ పరిస్థితులకు అన్వయించుకుని కార్యక్రమాలు నిర్వహించడంలో, తగిన నిర్ణయం తీసుకునే సామర్థ్యంలో చురుకుదనాన్ని అలవరుచుకోవాలి. ఇతరుల అనుభవాల నుంచీ నేర్చుకోగల సామర్థ్యాన్ని అలవరుచుకోవాలి.

వ్యవహార జ్ఞానం 

వ్యవహారపరంగా ఇతరులతో ప్రవర్తించే క్రమంలో, సంభాషణల్లో, వ్యవహారాలు నడిపే క్రమంలో పరిపక్వత కœలిగిన ప్రవర్తన కనిపించాలి. ప్రతి సంఘటననూ అర్థం చేసుకుని, నేర్చుకుని తదుపరి కార్యాచరణ చేయగలిగిన సామర్థ్యం అవసరమవుతుంది.

ఉన్నత స్థితికి ఎదగాలనే తపన

ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన ప్రతి అభ్యర్థికీ ఆ సంస్థలో పెద్ద స్థాయికి ఎదిగే అవకాశాలుంటాయి. అయితే మార్పులను అర్థం చేసుకుంటూ తన నైపుణ్యాలను అప్‌డేట్‌ చేసుకునేవారికే ఈ అవకాశాలెక్కువ. ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించాలనుకున్న విద్యార్థుల్లో చాలామంది దృష్టి ఆ సంస్థలో ఉద్యోగిగా ఎంపికవడం వరకే పరిమితమవుతుంది. అందుకు అవసరమైన శిక్షణ తీసుకుని, తమ లక్ష్యాలను సాధిస్తారు. ఇది స్వల్పకాలిక లక్ష్యం మాత్రమే అభ్యర్థిలోని ఈ వైఖరి ఉన్నత స్థాయికి చేరడానికి సహకరించదు.

వ్యక్తిగత దార్శనికత

ఉద్యోగంలో చేరాక ఇతరులకంటే భిన్నమైన నైపుణ్యాలు, మనో వైఖరి ఉన్నవారు ‘ఫాస్ట్‌ట్రాక్‌ కేటగిరీ’లో ఉంటూ సంస్థలో ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. పని సంస్కృతిని గ్రహించి వృత్తిని ప్రేమించే వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. ఇలాంటి అభివృద్ది వ్యక్తిగత సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. వృత్తికీ, సంస్థకూ అంకిత భావంలో పనిచేసే వ్యక్తి నియామక సంస్థలకు అవసరం. పై అధికారులనూ సంతృప్తిపరచగలిగే వ్యక్తికి అదనపు ప్రతిఫలం లభిస్తుంది.

నిరంతర అధ్యయనం

నిరంతరం నూతన నైపుణ్యాలను నేర్చుకుంటూ, ప్రతి పనినీ అందరికంటే భిన్నంగా నిర్వహించే ఉద్యోగులకు యాజమాన్యాలు ప్రాధాన్యం ఇస్తాయి. నేర్చుకోవడం మానిన వెంటనే అభివృద్ధి కూడా ఆగిపోతుంది. నిరంతరం నేర్చుకునే తత్వమున్న విద్యార్థులు ఉద్యోగంలో చేరాక కొత్త విషయాలు నేర్చుకోవటం కొనసాగిస్తారు. ఇలాంటివారికే నియామకాల్లో మొగ్గు ఉంటుంది.

 

 


‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌