• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏ భావనలు ప్రధానం?

యూజీసీ-నెట్‌కు సన్నద్ధత

దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో సహాయ ఆచార్యుల, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) అర్హత కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే యూజీసీ- నెట్‌ ప్రకటన వెలువడింది. దీని రాతపరీక్షలో భాగంగా రెండు పేపర్లు (పేపర్‌-1, పేపర్‌-2) ఉంటాయి. ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. 300 గరిష్ఠ మార్కులకు మూడు గంటల వ్యవధితో జరిగే ఈ పరీక్ష సిలబస్‌లో ప్రధాన అంశాలు ఏమిటి? మెరుగైన సన్నద్ధత కోసం ఏ భావనలపై దృష్టి పెట్టాలి? 

పేపర్‌-1

1. యూనిట్‌-1: బోధన సామర్థ్యం (టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌)

బోధన భావన, లక్ష్యాలు, బోధనా పద్ధతులు, ఉపాధ్యాయ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ పద్ధతులు, స్వయం, స్వయం ప్రభ, మూక్స్‌ మొదలైనవి. మూల్యాంకన వ్యవస్థలు, చాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టమ్, కంప్యూటర్‌ బేస్‌డ్‌ టెస్ట్స్‌ మొదలైనవి.

2. పరిశోధన సామర్థ్యం (రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌)

ఇది చాలామందికి కొత్తగా అనిపించొచ్చు. ఇంతవరకూ పరిచయం లేనివారు కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది.పరిశోధన, పరిశోధన పద్ధతులు, పరిశోధనలో దశలు, థీసిస్, ఆర్టికల్‌ రైటింగ్, ఫార్మాట్, స్టైల్స్‌ ఆఫ్‌ రిఫరెన్సింగ్, పరిశోధనలో నైతికత ప్రధానమైనవి.

3. కాంప్రహెన్షన్‌

ఇచ్చిన ప్యాసేజీ/ పేరాగ్రాఫ్‌ నుంచి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 

4. కమ్యూనికేషన్‌

అర్థం, లక్షణాలు, సమర్థ భావ ప్రసారం, తరగతి గది భావ ప్రసారం, అవరోధాలు, మాస్‌మీడియా, సమాజం.. ముఖ్యమైనవి.

5. మ్యాథమేటికల్‌ రీజనింగ్‌ అండ్‌ ఆప్టిట్యూడ్‌

తార్కిక రకాలు, సంఖ్యా శ్రేణి, అక్షర శ్రేణి, భిన్నాలు, కాలం-దూరం, నిష్పత్తి- శాతాలు, లాభ నష్టాలు, వడ్డీ, సగటుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వీటి సాధనకు అంకగణితంలోని ప్రాథమిక భావనలు నేర్చుకుని, గత పరీక్షల ప్రశ్నపత్రాలను సమస్యలను సాధన చేయాలి.

6. లాజికల్‌ రీజనింగ్‌

సారూప్యతలు, వెన్‌ రేఖాచిత్రాలు, ఇండియన్‌ లాజిక్‌ అంశాల్లో ప్రమాణాలు, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్ధపట్టి, అనుపలబ్ధి, అనుమాన నిర్మితి, అనుమితి, వ్యాప్తి, హేత్వభాస మొదలైన భావనలపై సంపూర్ణ అవగాహన ఉండాలి.

7. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

పరిమాణాత్మక, గుణాత్మక దత్తాంశాలు, బార్‌గ్రాఫ్, పై గ్రాఫ్, టేబుల్‌ గ్రాఫ్, లైన్‌ గ్రాఫ్‌కు సంబంధించిన సమస్యలను సాధించాలి. వేగంగా సమాధానాలను గుర్తించేలా సాధన చేయాలి. ఈ అధ్యాయంలో మాదిరి సమస్యలపై అభ్యాసం/ సాధన చాలా అవసరం. ప్రత్యేకంగా కళాశాల స్థాయిలో గణితేతర కోర్సులు అధ్యయనం చేసినవారు దీనికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది.

8. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐటీసీ)

అన్ని కమ్యూనికేషన్‌ సాంకేతికతల గురించి సంగ్రహంగా నేర్చుకోవాలి. ఇంటర్నెట్, వైర్‌లెస్‌ నెట్‌వర్క్స్, ఈమెయిల్, కంప్యూటర్స్, సాఫ్ట్‌వేర్, వీడియో కాన్ఫెరెన్సింగ్, సోషల్‌ నెట్‌వర్కింగ్, ఐటీసీ గవర్నెన్స్‌ల్లో ప్రాథమిక భావనలను నేర్చుకుని గత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నల సరళిని పరిశీలించాలి. అభ్యసించాలి.

9. ప్రజలు, అభివృద్ధి, పర్యావరణం

అభివృద్ధి, పర్యావరణం, మానవ, పర్యావరణ పరస్పర చర్యలు, సమస్యలు, కాలుష్య కారకాలు, ప్రకృతి విపత్తులు, మానవ ఆరోగ్యంపై కాలుష్య కారకాల ప్రభావం, పర్యావరణ  పరిరక్షణ చట్టాలు, ఒప్పందాలు.. ఇవి ముఖ్యమైనవి.

10. ఉన్నత విద్యా వ్యవస్థ

ప్రాచీన భారతదేశంలో ఉన్నత విద్యాభ్యాసం, స్వాతంత్య్రానంతరం ఉన్నతవిద్య, పరిశోధన, వృత్తి, సాంకేతికత, నైపుణ్య ఆధారిత విద్య, విలువల విద్య, పర్యావరణ విద్య, విధానాలు, సుపరిపాలన, దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల సంఖ్య, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు మొదలైన ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయాలపై అవగాహన అవసరం. మాదిరి ప్రశ్నపత్రాల ద్వారా భావనలపై పట్టు సాధించవచ్చు.

ఎస్‌సీ, ఓబీసీ విద్యార్థులకు, నేషనల్‌ ఫెలోషిప్‌లు, మైనారిటీ విద్యార్థులకు మౌలానా అజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌లను కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఎంపిక చేస్తుంది. యూజీసీ నెట్‌ నిర్వహించే పరీక్ష ద్వారా అభ్యర్థులను వీటికి ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు https://ugcnet.nta.nic.in,
www.nta.ac.in
వెబ్‌సైట్‌లను చూడొచ్చు.

మాదిరి ప్రశ్నలు

ఉన్నత విద్యలో భారతదేశంలో ప్రస్తుత ఎన్‌రోల్‌మెంట్‌ నిష్పత్తి ఎంత?

1) 25 శాతం   2) 28 శాతం    3) 25.3 శాతం  4) 26.3 శాతం

జవాబు: 4

కిందివాటిలో గరిష్ఠ నిష్పాదన పరీక్ష (మాగ్జిమం పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌)కు సరైన ఉదాహరణ

1) అభిరుచి పరీక్షలు    

2) ప్రక్షేపక పరీక్షలు 

3) సహజ సామర్థ్య పరీక్షలు    

4) వైఖరి పరీక్షలు 

జవాబు:

9వ తరగతిలోని బాలురు, బాలికలు సమాన స్థాయి నిష్పాదనను గణిత పరీక్షలో చూపిస్తారు. ఈ పరికల్పన కింది వానిలో..

1) నిర్దేశిత పరికల్పన 

2) సాంఖ్యక పరికల్పన 

3) పరిశోధక పరికల్పన 

4) శూన్య పరికల్పన 

జవాబు: 4

నీటి కాలుష్యం వల్ల కింది వాటిలో ఏర్పడే వ్యాధులు

ఎ. గియార్డియా    బి. డెంగ్యూ 

సి. అమీబియాసిస్‌ డి. టైఫాయిడ్‌ 

1) ఎ, బి, డి      2) బి, సి, డి   3) ఎ, బి, సి, డి    4) ఎ, సి, డి   

జవాబు: 4

Posted Date : 18-02-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌