• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బిట్స్‌లో పీజీ చేసేద్దామా?

 ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఫిల్లో ప్రవేశాలు

‣ అర్హత; డిగ్రీ ఉత్తీర్ణత

బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్).. నాణ్యమైన విద్యకు, అనువైన సౌకర్యాలకు పెట్టింది పేరు. దీనికి దేశవ్యాప్తంగా పిలానీ, హైదరాబాద్, గోవాలో విశాలమైన క్యాంప‌స్‌లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 17వేల మందికి పైగా విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారు. దేశంలో ఎన్ ఆర్ఐఎఫ్- ఏటా ప్రకటించే ర్యాంకింగ్స్‌లో బిట్స్ మంచి స్థానాల్లో నిలుస్తుంది. 2020లో విశ్వవిద్యాలయం కేటగిరీలో 15వ స్థానంలో నిలవడం విశేషం. అలాగే ఓవరాల్ కేటగిరీలో 23, ఫార్మసీ విద్యలో 6వ స్థానంలో నిలిచింది. 2021-22 విద్యాసంవత్సరానికి హయ్యర్ డిగ్రీ(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి బిట్స్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఫిల్లో ప్రవేశాలు కల్పించనుంది. 

కోర్సుల స్వరూపం

మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్

ఈ కోర్సులో బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎంబడెడ్ సిస్టమ్స్, డిజైన్ ఇంజినీరింగ్, మ్యానుఫాక్చరింగ్ సిస్టమ్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మైక్రోఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్, శానిటేషన్ సైన్స్- టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ విభాగాలు ఉంటాయి. కోర్సు వ్యవధి నాలుగు సెమిస్టర్లు ఉంటుంది.

మాస్టర్ ఆఫ్ ఫార్మసీ

ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ విభాగాల్లో ఎంఫార్మసీ కోర్సు అందిస్తారు. నాలుగు సెమిస్టర్లలో కోర్సు ముగుస్తుంది. 

మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ

ఇందులో లిబరల్ స్టడీస్ విభాగం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి మూడు సెమిస్టర్లు ఉంటుంది. 

ఇదీ అర్హత  

ఎంఈ / ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కనీసం 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణ సాధించి ఉండాలి. ఎంఫిల్ కోర్సులో చేరాలటే 55% మార్కులతో డిగ్రీ పాసైతే చాలు. 

ఎంపిక విధానం ఇలా..

ఎంఈ / ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం బిట్స్ హయ్యర్ డిగ్రీ(బిట్స్-హెచ్‌డీ) అడ్మిషన్ టెస్ట్ రాయాలి. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. లేదా గేట్/ జీప్యాట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంఈ-సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్లో ప్రవేశాల కోసం బిట్స్ హయ్యర్ డిగ్రీ అడ్మిషన్ టెస్ట్ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఎంఫిల్ ప్రోగ్రాములో చేరాలంటే షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులను టెస్ట్, ఇంటర్వ్యూకి పిలుస్తారు. 

బిట్స్ - హెచ్‌డీ పరీక్ష విధానం

ఇది కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌. జూన్ 26, 27 తేదీల్లో నిర్వహిస్తారు. ఇందులో టెస్ట్-1, 2 ఉంటాయి. టెస్ట్-1లో మొత్తం 30 ప్రశ్నలకు 30 మార్కులుంటాయి. కోర్ మ్యాథమెటిక్స్ 15, ఇంగ్లిష్ ల్వాంగ్వేజ్ స్కిల్స్ & లాజికల్ రీజనింగ్ నుంచి 15 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష 45 నిమిషాలు ఉంటుంది. ఇది కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అందరు అభ్యర్థులకు ఉమ్మడిగా నిర్వహిస్తారు. ఇక టెస్ట్-2 పరీక్షలో 70 ప్రశ్నలుంటాయి. సమయం 105 నిమిషాలు కేటాయించారు. ఈ పరీక్షలో అభ్యర్థి అర్హత డిగ్రీలోని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

‣ ఎంఈ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ విభాగంలో చేరాలనుకునే అభ్యర్థులకు ప్రత్యేకంగా టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో 50 ప్రశ్నలు ఇస్తారు. సమయం గంట ఉంటుంది. 

‣ ఎంఈ శానిటేషన్ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ విభాగానికి దరఖాస్తు చేసుకున్న వారికి మరో పరీక్ష నిర్వహిస్తారు. ఇది 50 ప్రశ్నలకు ఉంటుంది. సమయం గంట ఇస్తారు. 

‣ అన్ని పరీక్షల ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. ప్రతి సరైన సమాధానికి మూడు మార్కులు ఇస్తారు. రుణాత్మక మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానికి ఒక మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్లో వస్తుంది. 

​​

​​​​​

దరఖాస్తు ఎలా? 

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్కాపీలను పంపాల్సిన అవసరం లేదు. గేట్/జీప్యాట్ స్కోరు కలిగిన వారు రూ.1000 దరఖాస్తు రుసుము చెల్లించాలి. మిగతావాళ్లకు రూ.3,300. దరఖాస్తుకు మే 29, 2021 తుది గడువు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

దేశవ్యాప్తంగా మొత్తం 38 కేంద్రాల్లో బిట్స్-హెచ్డీ పరీక్షను నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ బిట్స్ క్యాంపస్, హైదరాబాద్ సిటీ, విజయవాడ, విశాఖపట్నంలో కేంద్రాలుంటాయి. అభ్యర్థులు ప్రాధాన్యాన్ని బట్టి మూడు కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. 

సిలబస్.. ప్రిపరేషన్

టెస్ట్అందరికీ ఉమ్మడిగా, టెస్ట్అర్హత డిగ్రీలోని సబ్జెక్టుల ఆధారంగా ఉంటుంది. కాబట్టి టెస్ట్లోని సిలబస్పై దృష్టి సారించాలి. ఇందులో మూడు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక టెస్ట్కు అభ్యర్థులు తమ డిగ్రీలోని పాఠ్యాంశాలను సాధన చేస్తే సరిపోతుంది. 

కోర్ మ్యాథమెటిక్స్

ఈ విభాగంలో గణితానికి సంబంధించిన ప్రశ్నలే వస్తాయి. ఇందులో కాల్క్యులస్, లైనియర్ ఆల్జీబ్రా, కాంప్లెక్స్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటస్టిక్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, న్యూమెరికల్ మెథడ్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటిపై దృష్టి సారిస్తే పరీక్షలో సమాధానాలను సులభంగా గుర్తించవచ్చు. గణితానికి ఎక్కువ సమయం అవసరం పడుతుంది. కాబట్టి వీలైనంత షార్ట్కట్స్ ఉపయోగించి సమస్యలను పరిష్కరించేలా సాధన చేయాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు. మొత్తం 45 నిమిషాల్లో ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్ త్వరగా పూర్తి చేసుకుని మ్యాథ్స్కు ఎక్కవ సమయం కేటాయించండి.

ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్ & లాజికల్ రీజనింగ్

అభ్యర్థికి ఆంగ్లంపై ఎంత పట్టు ఉందో తెలుసుకోడానికి ఇంగ్లిష్ ప్రశ్నలు అడుగుతారు. గ్రామర్ నియమాలు తెలిస్తే సరిపోతుంది. అలాగే ఒకాబులరీపై కూడా దృష్టి పెట్టాలి. కాంప్రహెన్షన్ ప్యాసేజ్లను త్వరగా చదివి ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. రీజనింగ్లో లాజిక్గా ఆలోచించి సమాధానాలు గుర్తించాలి. లాజికల్, వర్బల్ రీజ‌నింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. లాజికల్ రీజనింగ్లో రిలేషన్స్, మిస్సింగ్ నంబ‌ర్స్‌ తదితర అంశాలు ఉంటాయి. వర్బల్ రీజనింగ్లో అనాలజీ, క్లాసిఫికేషన్, సరీస్ కంప్లేషన్, లాజికల్ డిడక్షన్, రీడింగ్ ప్యాసేజ్, చార్ట్ లాజిక్ ఇతర అంశాలకు చెందిన ప్రశ్నలు ఇస్తారు. 

వెబ్‌సైట్‌: https://www.bits-pilani.ac.in/

Posted Date : 12-05-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌