• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రాత ప‌రీక్ష‌ లేకుండానే.. ఎస్ఓ పోస్టులు!

గ్రూపు డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్య్వూ ద్వారా ఎంపిక‌లు

134 ఖాళీల భ‌ర్తీకి ఐడీబీఐ ప్రకటన విడుదల

బ్యాంకుల్లో వినియోగదారుడికి అందించే సేవలను సులభతరం చేయడంతోపాటు, లావాదేవీలను సౌకర్యవంతం చేయడం స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగుల విధి. మార్కెటింగ్‌, ఏటీఎం, ట్రేడ్ ఫైనాన్స్‌, ట్రెజ‌ర‌ర్, సెక్యూరిటీ, డేటా అన‌లిటిక్స్ త‌దిత‌ర విభాగాల కింద వీరు విధులు నిర్వ‌ర్తిస్తారు. ఈ మేర‌కు  ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాత ప‌రీక్ష లేకుండా కేవ‌లం గ్రూపు డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌లు చేయ‌నుంది. 

పోస్టులు-రిజర్వేషన్లు

మొత్తం పోస్టులు 134 కాగా ఇందులో..

డిప్యూటీ జనరల్ మేనేజర్(గ్రేడ్-డి) పోస్టులు 11 ఉన్నాయి. వీటిలో జనరల్(7), ఎస్సీ(1), ఓబీసీ(2), ఈడబ్ల్యూఎస్(1), పీడబ్ల్యూడీ(5)కి కేటాయించారు. 

 అసిస్టెంట్ జనరల్ మేనేజర్(గ్రేడ్-సి) ఖాళీలు 52 కాగా జనరల్(23), ఎస్సీ(8), ఎస్టీ(3), ఓబీసీ(13), ఈడబ్ల్యూఎస్(5)గా నిర్ణయించారు. 

మేనేజర్(గ్రేడ్-బి) పోస్టులు 62 ఉండగా జనరల్(27), ఎస్సీ(1), ఎస్టీ(4), ఓబీసీ(2)కి కేటాయించారు. 

అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్-ఎ) పోస్టులు 9 ఖాళీగా ఉండగా వాటిని జనరల్(6), ఎస్సీ(1), ఓబీసీ(2)గా విభజించారు. వీటన్నింటిలో కలిసి దివ్యాంగులకు 5 పోస్టులను కేటాయించారు. 

వివిధ పోస్టులను బట్టి కనిష్ఠ వయసు 21 గరిష్ఠ వయసు 45 ఏళ్లుగా నిర్ణయించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, డిపార్ట్‌మెంట‌ల్‌ వారికి ఐదేళ్లు, 1984 అల్లర్ల బాధితుల(Persons affected by 1984 riots)కు ఐదేళ్ల వయసు సడలింపు ఇచ్చారు. 

జీతభత్యాలు: 

డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగులకు రూ.50030 నుంచి రూ.59170 వరకు ఉంటుంది. అసిస్టెంట్ జనరల్ మేనేజ‌ర్‌కు రూ.42020 నుంచి రూ.51490 ఇస్తారు. మేనేజ‌ర్‌కు రూ.31705 నుంచి రూ.45950 చెల్లిస్తారు. అసిస్టెంట్ మేనేజ‌ర్‌కు రూ.23700 నుంచి రూ.42020 వరకు వేతనం చెల్లిస్తారు. 

అర్హత-అనుభవం

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మొబైల్ బ్యాంకింగ్, ఇన్నోవేషన్), అసిస్టెంట్ మేనేజర్(డిజిటల్ బ్యాంకింగ్) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు  బీఈ/ బీటెక్(ఎలక్ట్రానిక్స్&టెలీక‌మ్యూనికేష‌న్స్‌/క‌ంప్యూట‌ర్ సైన్స్‌/ఎలక్ట్రికల్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్&కమ్యునికేషన్) లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంసీఏ చేసి ఉండాలి. ఏజీఎం అభ్యర్థులకు కనీసం 7 ఏళ్ల అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల అభ్యర్థులకు అనుభవం అవసరం లేదు. కానీ సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.  

మేనేజర్(మొబైల్ బ్యాంకింగ్, ఇన్నోవేషన్, మొబైల్ బ్యాంకింగ్(ఎఫ్ఆర్ఎంజీ)), అసిస్టెంట్ మేనేజర్(మొబైల్ బ్యాంకింగ్(ఎఫ్ఆర్ఎంజీ)) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు  బీఈ\బీటెక్ (ఎలక్ట్రానిక్స్&టెలీకమ్యునికేషన్\కంప్యూటర్ సైన్స్\ఎలక్ట్రికల్\ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ\ ఎలక్ట్రానిక్స్&కమ్యునికేషన్) లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంసీఏ చేసి ఉండాలి. కనీసం 4 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. 

మేనేజర్(కార్డ్ ప్రొడక్ట్స్, ఏటీఎం, ట్రేడ్ ఫైనాన్స్, ట్రెజరర్(ఎఫ్ఆర్ఎంజీ)), అసిస్టెంట్ జనరల్ మేనేజర్(మర్చంట్ అక్వైరింగ్, కార్డ్ ప్రొడక్స్ట్, మార్కెటింగ్) విభాగాలకు దరఖాస్తు చేసేవారు బీఈ\బీటెక్ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఏజీఎం (మార్కెటింగ్)లో ఎంబీఏ\పీడీడీఎం\పీజీడీబీఏ(మార్కెటింగ్) చేసిన వారికి ప్రాధాన్యం. మేనేజర్ పోస్టుకు కనీసం 4 ఏళ్లు, ఏజీఎం పోస్టుకు 7 ఏళ్ల అనుభవం తప్పనిసరి. 

మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్(సెక్యూరిటీ) పోస్టులకు దరఖాస్తు చేసేవారు కనీసం 55శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (ఎస్సీ,ఎస్టీలకు 50శాతం ఉత్తీర్ణత ఉంటే చాలు). ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో కెప్టెన్\మేజర్ స్థాయిలో కనీసం 4 నుంచి 10 సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉండాలి. లేదా పారా మిలిటరీలో 4 నుంచి 10 ఏళ్లు పని చేసి ఉండాలి.

మేనేజర్ (డేటా అనలిటిక్స్(ఎఫ్ఆర్ఎంజీ)) పోస్టులకు దరఖాస్తు చేసేవారు బీఎస్సీ హాన‌ర్స్‌(మ్యాథ్స్\స్టాటిస్టిక్స్), బీటెక్\బీఈ(ఎలక్ట్రానిక్స్\కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డేటా అనలిటిక్స్\డేటా సైన్స్‌లో డిగ్రీ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. కనీసం 4 ఏళ్ల అనుభవం తప్పనిసరి. 

మేనేజర్(అనలిస్ట్(ఎఫ్ఆర్ఎంజీ)) పోస్టులకు దరఖాస్తు చేసేవారు బీకాం\బీఎస్సీ కంప్యూటర్ సైన్స్\బీబీఏ(బ్యాంకింగ్,ఫైనాన్స్) చేసి ఉండాలి. ఫ్రాడ్\ఫైనాన్సియల్ క్రైమ్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. కనీసం 4 ఏళ్ల అనభవం అవసరం.

అసిస్టెంట్ మేనేజర్(కార్డ్ బేస్డ్ బిజినెస్, యూపీఐ\ఏఈపీఎస్\క్యూఆర్ కోడ్స్(ఎఫ్ఆర్ ఎంజీ)) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. 

డీజీఎం, ఏజీఎం(కన్వేషనల్ మీడియా, సోషల్\డిజిటల్ మీడియా), డీజీఎం, ఏజీఎం, మేనేజర్ (ఎకానమిస్ట్)  ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు కమ్యూనికేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సీడీపీఏ చేసి ఉండాలి. డీజీఎం(ఎకానమిస్ట్)కు పీహెచ్.డి చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. పనికి సంబంధించి ఏజీఎంకు కనీసం 7 ఏళ్లు, డీజీఎంకు 10 ఏళ్ల అనుభవం ఉండాలి. మేనేజ‌ర్‌కు 4 ఏళ్ల అనుభవం తప్పనిసరి. 

మేనేజర్(ఎంట‌ర్‌ప్రైజెస్‌ డేటా వేర్‌హౌజ్‌, వెండర్ మేనేజ్‌మెంట్‌, డిమాండ్ మేనేజ్‌మెంట్‌), డీజీఎం(ఏటీఎం, ఇంటర్నల్ అప్లికేషన్స్, వెండర్ మేనేజ్‌మెంట్‌, కోర్ బ్యాంకింగ్, ఐటీ నెట్‌వ‌ర్క్‌, డిమాండ్ మేనేజ్‌మెంట్‌), ఏజీఎం(ఏటిఎం, పేమెంట్ సిస్టమ్, నెట్ బ్యాంకింగ్, ఇంటర్నల్ అప్లికేషన్స్, కోర్ బ్యాంకింగ్, డిమాండ్ మేనేజ్‌మెంట్‌, వెండర్ మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌, ఎంట‌ర్‌ప్రైజెస్‌ డేటా వేర్‌హౌజ్‌, ఎంట‌ర్‌ప్రైజెస్‌ డేటా ఆఫిసర్) ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌లో ఫుల్‌టైమ్‌ కోర్సు మాస్టర్స్\బాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. మేనేజర్ పోస్టులకు 4 ఏళ్లు, డీజీఎంలకు 10 ఏళ్లు, ఏజీఎంలకు 7 ఏళ్ల అనుభవం ఉండాలి. 

మేనేజర్-కాంప్లియెన్స్, లీగల్, ఏజీఎం-కాంప్లియెన్స్, లీగల్, అసిస్టెంట్ మేనేజర్-కాంప్లియెన్స్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే కామ‌ర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయెట్ కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. మేనేజర్ పోస్టులకు 4 ఏళ్లు, ఏజీఎంలకు 7 ఏళ్ల అనుభవం ఉండాలి.

మేనేజర్(లీగల్) పోస్టులకు దరఖాస్తు చేసే వారు 60శాతం మార్కులతో లా చేసి ఉండాలి. బార్ అసోసియేష‌న్‌లో సభ్యత్వంతోపాటు అడ్వకేట్‌గా 4 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. 

ఏజీఎం(ట్రెజరీ) పోస్టులకు సంబంధించి ఫుల్‌టైమ్ ఎంబీఏ(ఫైనాన్స్) ఉండాలి. ట్రెజరీగా 7 ఏళ్ల అనుభవం ఉండాలి. 

మేనేజర్(ట్రెజరీ) ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు బీఎస్సీ\బీఏ(మ్యాథ్స్, స్టాటస్టిక్స్), బీఈ\బీటెక్ లేదా ఎమ్మెస్సీ\ఎంఏ(మ్యాథ్స్, స్టాటస్టిక్స్), ఫుల్‌టైమ్‌ ఎంబీఏ(ఫైనాన్స్) ఉత్తీర్ణత ఉండాలి. కనీసం 4 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి.

ఎంపిక ఇలా.. 

ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఆన్‌లైన్‌లో పంపించిన దరఖాస్తుల్లోని విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్‌ చేసిన వారిని గ్రూప్ డిస్కషన్(జీడీ)/ పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దీన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో జనరల్ అభ్యర్థులకు 50, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/  పీడబ్ల్యూడీలకు 45 కనీస అర్హత మార్కులుగా కేటాయించారు. జీడీ/ పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు బ్యాంక్ నిబంధనల ప్రకారం మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర పద్ధతిలో దరఖాస్తులు అంగీకరించబడవు.

అందుబాటులో ఉండే ఫోన్ నంబరు, ఈ-మెయిల్ వివరాలనే పొందుపర్చాలి. దరఖాస్తు రుసుము ఇతరులకు రూ.700(అప్లికేషన్ ఫీజు+ఇంటిమేషన్ ఛార్జీలు వర్తిస్తాయి), ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.150(ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే).

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.12.2020.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 07.01.2021.

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/
 

Posted Date : 24-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌