• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మోడల్‌ టెస్ట్‌లు రాయండి!

ప్రవేశ పరీక్షల్లో, ఉద్యోగ నియామక పోటీ పరీక్షల్లో అభ్యర్థులు తమ సన్నద్ధత స్థాయిని అంచనా వేసుకోవడానికి మాక్‌టెస్టులు (నమూనా పరీక్షలు) ఎంతో ఉపయోగపడతాయి. ఇవి రాయటం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందామా... 

మాక్‌ టెస్ట్‌ రాసే సమయంలో రకరకాల వ్యూహాలను ఆచరించవచ్చు. అందులో నుంచి మీకు అనువైనదాన్ని ఎంచుకుని అసలు పరీక్ష సమయంలో అమలు చేయొచ్చు. 

నిర్ణీత సమయంలో పరీక్ష పూర్తిచేయగలుగుతున్నారో లేదో అర్థమవుతుంది. దానికి అనుగుణంగా సమయాన్ని సర్దుబాటు చేసుకుంటే అసలు పరీక్షను నిర్ణీత సమయంలోనే ముగించగలుగుతారు. 

ప్రశ్నల తీరు, వాటి స్థాయి ఎలా ఉందనే విషయంలో స్పష్టత వస్తుంది. సన్నద్ధత స్థాయిని విశ్లేషించుకునే అవకాశమూ కలుగుతుంది. 

కొన్ని సెక్షన్లు రాయడానికి ఎక్కువ, మరికొన్నింటికి తక్కువ సమయం పట్టొచ్చు. దానికి అనుగుణమైన ప్రణాళికకు వీలవుతుంది.  

ఏ సెక్షన్లు క్లిష్టంగా, ఏవి సులువుగా ఉంటున్నాయో స్పష్టత వస్తుంది. దీంతో కష్టంగా ఉండే వాటి మీద ఎక్కువ సమయాన్ని కేటాయించగలుగుతారు. 

ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు.. ఎన్ని మార్కులు తెచ్చుకోగలుగుతున్నారు.. లాంటివన్నీ ముందుగానే తెలియడం వల్ల మరింత సమర్థంగా ప్రణాళిక వేసుకుని పరీక్షకు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. 

పరీక్షలంటే సాధారణంగా ఏ అభ్యర్థికైనా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. మాక్‌ టెస్టులు రాసిన అనుభవంతో అసలు పరీక్ష సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఉండగలుగుతారు. దీంతో పూర్తిసామర్థ్యంతో పరీక్ష రాయటం సాధ్యమవుతుంది!

Posted Date : 21-06-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌