• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకు కొలువుకు సిద్ధమేనా?

‣ క్లర్కుల నియామకానికి ఐబీపీఎస్‌ ప్రకటన 

 

కొవిడ్‌ క్లిష్ట పరిస్థితుల్లోనూ రెండు వారాల ముందుగానే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 1557 క్లర్కుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర బ్యాంకుల నుంచి మరికొన్ని పోస్టులు కలిసే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్నవారు రాతపరీక్షలో మెరుగైన ప్రతిభ చూపాల్సివుంటుంది. వేగానికీ కచ్చితత్వానికీ ప్రాధాన్యం ఉన్న ఈ పరీక్షలో ఎలా ముందుకు సాగాలో నిపుణుల సూచనలు.. ఇవిగో!

 

గత ఏడాది పోస్టులతో పోలిస్తే ప్రస్తుత సంఖ్యలో భారీ వ్యత్యాసమున్నప్పటికీ ఈ ప్రక్రియ ద్వారా నియామకాలు జరిపే 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దవైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా, ఇండియన్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుల్లో ఖాళీల వివరాలను ఇంకా పేర్కొనలేదు. ఖాళీల సంఖ్యను ‘జీరో’గా, ‘నిల్‌’గా పేర్కొన్నవాటిల్లోనూ నియమకాలు జరిపే సమయానికి (ఏప్రిల్‌ 1, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు) కొన్ని పోస్టులు భర్తీ చేసే అవకాశముంది. అందువల్ల ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అందువల్ల ప్రస్తుత ఖాళీల సంఖ్యను చూసి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.

 

ముఖ్య  వివరాలు
‣ మొత్తం ఖాళీలు: 1557 (ఏపీ-10, తెలంగాణ-20)
‣ విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత (23.09.2020నాటికి);  కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
‣ వయసు: 20- 28 సంవత్సరాలు (1.09.2020 నాటికి)
‣ ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్ష ఆధారంగా.
‣ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
‣ దరఖాస్తు చివరితేదీ: 23.09.2020
‣ దరఖాస్తు ఫీజు: రూ.175 (ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌); ఇతరులకు రూ.850
‣ ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీలు: 5, 12, 13 డిసెంబరు 2020
‣ మెయిన్స్‌: 24.01.2021  
‣ వెబ్‌సైట్‌: 
www.ibps.in

 

మార్పేమీ లేదు
ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు గత ఏడాదిలో నిర్వహించిన మాదిరిగానే ఉన్నాయి. రాత పరీక్ష ముందు శిక్షణ (ప్రీ ఎగ్జామినేషన్‌ ట్రైనింగ్‌) అవకాశం ఉండకపోవచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ తదితరులకు పరీక్షకు ముందు ఐబీపీఎస్‌ నిర్వహించే ఉచిత శిక్షణ కార్యక్రమం కొవిడ్‌ కారణంగా ఉత్పన్నమైన భద్రతా కారణాల వల్ల ఈసారి నిర్వహించే అవకాశాలు తక్కువ.

 

 

పరీక్ష విధానం
ప్రిలిమ్స్‌
అంశం  ప్రశ్నలు  మార్కులు  వ్యవధి
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌  30 30 20 ని।।లు
న్యూమరికల్‌ ఎబిలిటీ 35 35 20 ని।।లు
రీజనింగ్‌ ఎబిలిటీ  35  35  20 ని।।లు
మొత్తం  100  100  గంట
మెయిన్స్‌
అంశం  ప్రశ్నలు  మార్కులు వ్యవధి
జనరల్‌/ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50  50 35 ని।।లు
జనరల్‌ ఇంగ్లిష్‌  40 40 35 ని।।లు
రీజనింగ్‌ ఎబిలిటీ,కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌  50 60 45 ని।।లు
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 50 50 45 ని।।లు
మొత్తం 190 200 160ని।।లు

 

Posted Date : 10-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌