బ్యాంకింగ్ పరీక్షలో భాగంగా కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ టర్మినాలజీ, స్టాండర్డ్ జీకేల నుంచి ప్రశ్నలుంటాయి. బ్యాంకింగ్, ఆర్థిక సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలుంటాయి. గత 5, 6 నెలలకు సంబంధించిన తాజా పరిణామాలు బాగా చూసుకోవాలి. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మొదలైనవి. అంతర్జాతీయ సంస్థలు, నీతి ఆయోగ్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, కేంద్రప్రభుత్వ పథకాలు, స్టాక్ మార్కెట్, జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలను తెలుసుకోవాలి. కేవలం ప్రశ్నకు జవాబు అనే రీతిలో కాకుండా, విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వాటిని తమ అభిప్రాయాలతో విశ్లేషణాత్మకంగా తెలుసుకుంటే ఇంటర్వ్యూ సమయంలోనూ ఉపయోగం.
ప్రిలిమినరీకి దాదాపుగా రెండున్నర నెలల సమయం ఉంది. ఆలోగా మెయిన్స్‌లోని విభాగాలకూ సన్నద్ధత పూర్తయ్యేలా చూడాలి. తొలిసారిగా బ్యాంకు పరీక్షలు రాసేవారు టాపిక్స్ నేర్చుకోవడంతోపాటు వాటిలో వివిధ స్థాయుల ప్రశ్నలు సాధన చేయాలి. పరీక్ష తరహాలో పూర్తిస్థాయి మోడల్ ప్రశ్నపత్రాలను సమయాన్ని నిర్దేశించుకుని రాయాలి. దీనిద్వారా నిర్దేశించిన సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో అవగతమవుతుంది. తగినట్లుగా సన్నద్ధతలో మార్పులు చేసుకోవచ్చు. గత ప్రశ్నపత్రాలను గమనిస్తే ప్రశ్నలు ఏ విధంగా, ఏ స్థాయిలో వుంటున్నాయో తెలుస్తుంది. రోజులో ఎన్ని గంటలు కేటాయిస్తున్నామని కాకుండా ఎంత నిబద్ధతతో ప్రిపేర్ అవుతున్నారనేది ముఖ్యం.
బ్యాంకింగ్ అంశాలపై అవగాహన
Posted Date : 08-02-2021
ప్రత్యేక కథనాలు
- రీజనింగ్‌లో మెరవాలి
- ఉమ్మడిగా సన్నద్ధమవ్వాలి
- కనీస మార్కులు తప్పనిసరి
- ఆంగ్లంపై పట్టు ముఖ్యం
- బ్యాంకు ఉద్యోగాల్లో పీవో క్రేజ్
Previous Papers
విద్యా ఉద్యోగ సమాచారం
- UPSC Exam Calendar: వచ్చే ఏడాది మే 25న సివిల్స్ ప్రిలిమ్స్
- TSE CET: మే చివరి వారానికి టీఎస్ఈ సెట్‌ను వాయిదా వేయాలి
- Training: టెక్ మహీంద్ర ఉచిత ఉపాధి శిక్షణ
- Education: ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్ష ఫీజు గడువు 26
- Results: బీఈడీ పరీక్ష ఫలితాలు విడుదల
- Admissions: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ ప్రవేశాలకు ప్రకటన
Model Papers
- IBPS POs Prelims - 1 2022
- IBPS POs Prelims - 10 2021
- IBPS POs Prelims - 11 2021
- IBPS PO's (prelims) - 1 2019
- IBPS PO's (prelims) - 6 2019