• facebook
  • whatsapp
  • telegram

తెలుగులోనూ గ్రామీణ బ్యాంకు పరీక్ష

ఇకపై తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులు బ్యాంకు పరీక్షల్ని తెలుగులోనే రాసుకోవచ్చు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(ఆర్‌ఆర్‌బీ)కు సంబంధించి స్కేల్‌-1 అధికారులు, కార్యాలయ సహాయకుల పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు చేపట్టే పరీక్షలను ఇకపై ఆంగ్లం, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రాంతీయ భాషల్లో నైపుణ్యముండే వారు ఉద్యోగం సాధించే విషయంలో ఈ నిర్ణయం బాగా ఉపయోగపడుతుంది.
అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, ఉద్యోగ అవకాశాలను స్థానిక యువత వరకూ విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇప్పటివరకు ఈ పరీక్షల్ని కేవలం ఆంగ్లం, హిందీల్లో మాత్రమే నిర్వహిస్తుండడంతో స్థానిక భాషల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఇకపై.. తెలుగు, అస్సామీ, బంగ్లా, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూల్లో కూడా నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ - 8(2019) మెయిన్స్‌ పరీక్ష నుంచి అమలు చేస్తున్నారు . ప్రస్తుతం దేశంలో 45 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పని చేస్తుండగా, మొత్తంగా 90 వేల మంది సిబ్బంది ఉన్నారు.

Posted Date : 10-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌