• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకు కొలువుల పల్లెబాట!

గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ల, ఆఫీస్‌ అసిస్టెంట్ల నియామకానికి డిగ్రీ అర్హతతో పోటీ పడవచ్చు. రోజుకు 10 గంటలకు పైగా సమయాన్ని కేటాయిస్తూ ప్రణాళిక ప్రకారం సిద్ధమయితే బ్యాంకు ఉద్యోగం సంపాదించవచ్చు.

ఆఫీస్‌ అసిస్టెంట్లను రెండంచెల ద్వారా నిర్వహించే ఆన్‌లైన్‌ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. స్కేల్‌-1 ఆఫీసర్లకు రెండంచెల ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూలు, స్కేల్‌-2, 3 ఆఫీసర్లకు ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలుంటాయి.
స్కేల్‌-1 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్ల రాత పరీక్షలు ఒకే విధం. స్కేల్‌-1 ఆఫీసర్ల పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం స్థానంలో ఆఫీస్‌ అసిస్టెంట్ల పరీక్షలో న్యూమరికల్‌ ఎబిలిటీ ఉంటుంది. ఇది మినహా ఇతర విభాగాలూ, పరీక్ష విధానం ఒకే రకం. ప్రిలిమినరీ పరీక్షలలో రెండు విభాగాల్లోని మొత్తం 80 ప్రశ్నలకు 45 ని. సమయం ఉంటుంది. మెయిన్‌ పరీక్షలో 5 విభాగాల్లోని 200 ప్రశ్నలకు 2 గంటల సమయం ఉంటుంది.

స్కేల్‌-1, స్కేల్‌-3 రాత పరీక్షలు స్కేల్‌- 1 మెయిన్స్‌ పరీక్ష మాదిరిగా ఉంటాయి. అయితే జనరల్‌ అవేర్‌నెస్‌ స్థానంలో ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ విభాగం వుంటుంది. స్కేల్‌-2 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల పరీక్షలో వీటికి అదనంగా ప్రొఫెషనల్‌ నాలెడ్జి విభాగం ఉంటుంది.ఆఫీస్‌ అసిస్టెంటు, ఆఫీసర్ల (1 2 3) పరీక్షలన్నింటిలనూ అన్ని విభాగాలలో కనీస మార్కులతో విడివిడిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో 4వ వంతు తగ్గిస్తారు.

Posted Date : 10-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌