ఇకపై తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులు బ్యాంకు పరీక్షల్ని తెలుగులోనే రాసుకోవచ్చు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(ఆర్ఆర్బీ)కు సంబంధించి స్కేల్-1 అధికారులు, కార్యాలయ సహాయకుల పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు చేపట్టే పరీక్షలను ఇకపై ఆంగ్లం, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రాంతీయ భాషల్లో నైపుణ్యముండే వారు ఉద్యోగం సాధించే విషయంలో ఈ నిర్ణయం బాగా ఉపయోగపడుతుంది.
అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, ఉద్యోగ అవకాశాలను స్థానిక యువత వరకూ విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇప్పటివరకు ఈ పరీక్షల్ని కేవలం ఆంగ్లం, హిందీల్లో మాత్రమే నిర్వహిస్తుండడంతో స్థానిక భాషల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఇకపై.. తెలుగు, అస్సామీ, బంగ్లా, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూల్లో కూడా నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం సీఆర్పీ ఆర్ఆర్బీ - 8(2019) మెయిన్స్ పరీక్ష నుంచి అమలు చేస్తున్నారు . ప్రస్తుతం దేశంలో 45 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పని చేస్తుండగా, మొత్తంగా 90 వేల మంది సిబ్బంది ఉన్నారు.
తెలుగులోనూ గ్రామీణ బ్యాంకు పరీక్ష
Posted Date : 10-02-2021
ప్రత్యేక కథనాలు
- 8,612 ఉద్యోగాలకు ఐబీపీఎస్ నోటిఫికేషన్
- పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఈసారి కట్ఆఫ్ మార్కులెన్ని?
- ఎనభైకి ఎనభై తెచ్చుకోవడం ఎలా?
- దరఖాస్తు చేస్తున్నారా.. ఇవి పాటించండి!
- పదండి పోదాం... పల్లె బ్యాంకుల కొలువుకు!
పాత ప్రశ్నపత్రాలు
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2014
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2013
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2013
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2012
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2012
విద్యా ఉద్యోగ సమాచారం
- POSTAL JOBS: తపాలా శాఖలో భారీగా కొలువులు
- Pratibha Model Papers: ఏపీ ఇంటర్ ఫైనల్ పరీక్షల్లో ‘ఈనాడు-ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచి 78 శాతం ప్రశ్నలు!
- Latest Current Affairs: 17-04-2024 Current Affairs (English)
- Latest Current Affairs: 17-04-2024 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- Telangana DSC 2024: టీ-శాట్‌లో డీఎస్సీ ప్రత్యేక తరగతులు
- TS Inter Results: వచ్చే వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు?
నమూనా ప్రశ్నపత్రాలు
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ (స్కేల్-1) ప్రిలిమ్స్ -
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ -
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ -
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ ప్రిలిమ్స్ 2021
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రిలిమ్స్ 2021