బ్యాంకు పరీక్షల్లో వేగం, కచ్చితత్వం, నిలకడతనం.. విజయానికి సోపానాలు. పరీక్షల్లో విజయం సాధించడానికి నిర్ణీత సమయంలో ఎక్కువ ప్రశ్నలు సాధించడం ముఖ్యం. కాబట్టి, ప్రశ్నలను వేగంగా సాధించేలా ఉండాలి. ఈ క్రమంలో తప్పులు చేసే అవకాశమెక్కువ. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. వేగంతోపాటు కచ్చితత్వానికీ ప్రాధాన్యమివ్వాలి. ఈ నిలకడతనాన్ని కొనసాగించాలి. పోటీపరీక్షల్లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలను సాధించాల్సి రావడం కనిపిస్తుంటుంది. వీటిల్లో సాధించకుండానే గుర్తించగల ప్రశ్నలుంటుంటాయి. బాగా సాధన చేయడం ద్వారానే ఈ నైపుణ్యం సాధ్యమవుతుంది. అలాగే వేగంగా ప్రశ్నలను సాధించే వివిధ పద్ధతులూ తెలుస్తాయి. ఇవన్నీ పరీక్షలో విజయం సాధించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఏమేరకు అలవరచుకున్నారో మోడల్ పేపర్స్ సాధనలో తెలుసుకోవచ్చు. వీలైనంతవరకూ మోడల్ పేపర్స్‌ను అసలు పరీక్ష మాదిరిగానే ఆన్‌లైన్‌లో ప్రయత్నించాలి. పరీక్ష సమయానికి నిర్ణీత సమయంలో 90% ప్రశ్నలను 95% కచ్చితత్వంతో సాధించగలిగేలా సాధన చేయాలి. ప్రిలిమ్స్ వరకూ దాని తరహాలోనే, ఆపై మెయిన్స్‌ను దాని తరహాలోనే మాదిరి పరీక్షలు రాయాలి. సమయాన్ని ప్రణాళికబద్ధంగా వినియోగించుకుని, నిబద్ధతతో సన్నద్ధమైతేనే విజయం సాధ్యమవుతుంది.
ఆ మూడే కీలకం
Posted Date : 10-02-2021
ప్రత్యేక కథనాలు
Previous Papers
విద్యా ఉద్యోగ సమాచారం
- Professors: మూడు రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా
- NEET: ‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం
- SSC: ఏప్రిల్ మూడు నుంచి పదోతరగతి పరీక్షలు
- Paper Leakage: భయపడి.. డిస్క్వాలిఫై చేసుకున్న ప్రవీణ్?
- TSPSC: ప్రశ్నపత్రాలు ఇంకెన్ని చేతులు మారాయి?
- Latest Govt Jobs: తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు
Model Papers
- SBI Junior Associates Prelims - 1
- SBI Junior Associates Prelims - 2
- SBI Clerks Prelims - 2 2018
- SBI Clerks Prelims - 4 2018
- SBI Clerks Mains - 3 2018