బ్యాంకుల్లో పీవోలుగా ఎన్నికైన అభ్యర్థులు రెండు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ తరువాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వారు స్కేల్-1 ఆఫీసరుగా నియమితులవుతారు. అయితే ఈ పరీక్షలో అత్యున్నత ప్రతిభ చూపిన అభ్యర్థులు నేరుగా స్కేల్-2 ఆఫీసర్లుగా నియమితులయ్యే అవకాశం ఎస్బీఐ కల్పిస్తోంది. బ్యాంకు ఉద్యోగాల్లో పదోన్నతుల క్రమం ఇలా ఉంది.ఎస్బీఐలో పదోన్నతుల క్రమం
* ప్రొబేషనరీ ఆఫీసర్/అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1 - జేఎమ్జీఎస్)
* డిప్యూటీ మేనేజర్ (స్కేల్-2 - ఎమ్ఎమ్జీఎస్)
* మేనేజర్ (స్కేల్-3 - ఎమ్ఎమ్జీఎస్)
* చీఫ్ మేనేజర్ (స్కేల్-4 - ఎస్ఎమ్జీఎస్)
* అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (స్కేల్-5 - ఎస్ఎమ్జీఎస్)
* డిప్యూటీ జనరల్ మేనేజర్ (స్కేల్-6 - ఎస్ఎమ్జీఎస్)
* జనరల్ మేనేజర్ (స్కేల్-7 - టీఈజీఎస్)
* చీఫ్ జనరల్ మేనేజర్
* డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్
* మేనేజింగ్ డైరెక్టర్
* ఛైర్మన్