• facebook
  • whatsapp
  • telegram

సిలబ‌స్ విశ్లేష‌ణ‌

స్టాఫ్ సెల‌క్ష‌న్‌కు సంబంధించిన అన్ని ప‌రీక్ష‌ల్లో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లిషు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్ నాలుగు విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. సిల‌బ‌స్ వివ‌రాలు...

జనరల్‌ ఇంటెలిజెన్స్‌: నంబర్లు, లెటర్లు, బొమ్మల మీద ప్రశ్నలు వస్తాయి. బొమ్మలమీద వచ్చే ప్రశ్నలలో ఒక చిన్న లాజిక్‌ ఆధారంగా ప్రశ్నకు సమాధానం సులువుగా రాబట్టవచ్చు. బొమ్మ పూర్తిచేసినప్పుడు దానిలో వృత్తం కానీ, చతురస్రం (లేదా) దీర్ఘచతురస్రం వంటి ఏదైనా ఒకటి కనపడే అవకాశాలు ఉంటాయి. వాటి ఆధారంగా సమాధానాలు గుర్తించవచ్చు.
నంబర్‌ సిరీస్‌, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్‌ అంశాలలో ప్రశ్నలో ఉన్న నంబర్‌ను చూసే పద్ధతిని బట్టి సమాధానం గుర్తించవచ్చు. ఒక లాజిక్‌ ఆధారంగా సమాధానం రాకపోతే, సమయం వృథా చేయకుండా లాజిక్‌ మార్చి.. వేరేవిధంగా ప్రయత్నించాలి.అడ్రస్‌ మ్యాచింగ్‌ ప్రశ్నల్లో నంబర్‌ ‘0’కు లెటర్‌కు తేడా గుర్తించాలి. హైలెవల్‌ రీజనింగ్‌తో సిల్లాజిజమ్స్‌ ప్రశ్నలు వెన్‌-డయాగ్రామ్‌ ఆధారంగా నేర్చుకోవాలి. ఇంగ్లిష్‌పై పట్టుంటే హైలెవెల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు సులువుగా చేయవచ్చు.

 

జనరల్‌ అవేర్‌నెస్‌: నోటిఫికేషన్‌ సమయం దగ్గర నుంచి టైర్‌-1 పరీక్ష మధ్య ప్రతిరోజూ ఆంగ్ల దినపత్రిక చదవాలి. దానిలో కరంట్‌ అఫైర్స్‌ అంశాల్లోని ముఖ్యమైనవాటిపై నోట్స్‌ తయారుచేసుకోవాలి. ఆయా అంశాల నుంచి ఏ విధంగా ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుందో ఆలోచిస్తూ సొంతంగా ప్రశ్నలు తయారుచేసుకోవడం అలవాటు చేసుకోవాలి. 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాల్లోని జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జువాలజీ అంశాలు చదువుకోవాలి. నోట్స్‌ రాసుకోవాలి.
 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: అభ్యర్థులు మొదటిగా షార్ట్‌కట్‌ విధానంలో గుణకారం, భాగహారం, కూడిక, తీసివేతలు చేయడం నేర్చుకోవాలి. సాంప్రదాయిక పద్ధతి నుంచి బయటకు వచ్చి, పెన్‌ ఉపయోగించకుండా సింప్లిఫికేషన్‌ చేయటం అలవాటు చేసుకోవాలి. అభ్యర్థుల దృష్టి సమాధానం మీద కాకుండా ఏ విధానంలో చేస్తే తక్కువ సమయం పడుతుందో తెలుసుకోవడంపై ఉండాలి. చాప్టర్‌ వేరైనప్పటికీ లాజిక్‌ ఒకటే ఉంటుంది. అలా చాప్టర్ల మధ్య పోలికలు, తేడాలు గుర్తిస్తూ సిద్ధమవ్వాలి.
అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలను రోజువారీ దినచర్యలో భాగంగా ఉండే అంశాలతో ముడిపెడుతూ ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఫార్ములాల అవసరం లేకుండా సమాధానాలు గుర్తించవచ్చు. అన్ని అంశాలకు సంబంధించిన ఫార్ములాల పట్టిక తయారు చేసుకోవాలి.

 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, కాంప్రహెన్షన్‌: గ్రామర్‌ కోసం రేమండ్‌ మర్ఫీ రచించిన కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ పుస్తకాలు ఉపయోగపడతాయి. పదాలకు అర్థాలు తెలుసుకోవాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, క్లోజ్‌ టెస్ట్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే ప్రశ్నల్లో ఇచ్చిన పూర్తి సమాచారం తక్కువ సమయంలో చదివి అర్థం చేసుకోవాలి. అంటే చదివే నైపుణ్యం పెంపొందించుకోవాలి.

ఈ జాగ్రత్తలు అవసరం
‣ 200కి 200 ప్రశ్నలను (లేదా) 100కి 100 ప్రశ్నలను సమాధానాలు గుర్తించలేం. అందుకే ఏ ప్రశ్నలను ముందు వరుసలో సమాధానాలు గుర్తించగలమో వాటినే ఎంచుకోవాలి.
‣ ప్రశ్నకి సమాధానం గుర్తించలేకపోయినా, వచ్చిన ఆన్సర్‌ ఆప్షన్లలో లేకపోయినా, ప్రశ్న చదివినప్పుడు అర్థం కాకపోయినా, ఆయా ప్రశ్నలను విడిచి వేరే ప్రశ్నను ఎంచుకోవాలి.
‣ ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం వృథా చేయకూడదు.
‣ అభ్యర్థికి పట్టున్న అంశాల సంబంధిత ప్రశ్నలను ముందు ఎంచుకోవాలి.
‣ ఏ అంశాల్లో మార్కులు రావడం లేదో గమనించి, ఆ చాప్టర్లలోని ప్రశ్నలు ఎక్కువ సాధన చేయటం మేలు.
‣ అంశాల వారీగా షార్ట్‌కట్స్‌, ఫార్ములాల్లో ముఖ్యమైనవాటిపై పాయింట్ల రూపంలో నోట్స్‌ రాసుకోవాలి.
‣ ప్రతిరోజూ ఒక మాదిరి ప్రశ్నపత్రం చేయడం అలవాటు చేసుకోవాలి.
‣ తప్పులు పోయిన ప్రశ్నలపై ప్రత్యేక శ్రద్ధ చూపి, మరలా ఆ తప్పులు చేయకుండా ఉండాలి.
‣ పరీక్షలో వస్తున్న మార్కులను అంశాల వారీగా విభజించి పట్టిక రూపంలో రాసుకుంటూ, పురోగతి చూసుకోవాలి.
‣ అభ్యర్థులు తాము బలహీనంగా ఉన్న అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తూ మెరుగుపర్చుకోవాలి.

Posted Date : 04-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌