• facebook
  • whatsapp
  • telegram

జీవ పరిణామం

‘భూమిపై జీవుల ఏర్పాటుకు దైవం అవసరం’! 


జీవులు స్థిరమైనవి కావు. కాలక్రమంలో మారుతుంటాయి. ఆ మార్పులు వ్యక్తిగతంగా జీవుల్లో లేదా జనాభా స్థాయిలో సంభవించవచ్చు. అవి సంతానానికి వారసత్వంగా లభించి, జనాభాలో వైవిధ్యాన్ని పెంచుతాయి. మనుగడకు అవసరమైన మరిన్ని లక్షణాలను సంతరించుకుంటాయి. తద్వారా కొత్త జాతుల పుట్టుకకు కారణమవుతాయి. పోటీ పరీక్షార్థులు వీటిని అధ్యయనం చేయడం ద్వారా జీవుల ఆవిర్భావాన్ని, జీవుల మధ్య పరస్పర సంబంధాలను అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ సమస్యల పరిష్కారానికి అవసరమైన వ్యూహాలు, వ్యాధుల వ్యాప్తి, రోగనిర్ధారణ, చికిత్సలపై అవగాహన పెంచుకోవచ్చు. ఈ క్రమంలో భూమిపై మొదట ఉద్భవించిన జీవులు, వాటి గురించి పలువురు శాస్త్రజ్ఞులు అందించిన సిద్ధాంతాలను తెలుసుకోవచ్చు. 


1.‘జీవ పరిణామం’ అనే పదాన్ని ప్రతిపాదించింది.....

1) హెర్బర్ట్‌ స్పెన్సర్‌   2) డీ కండోల్‌    

3) జీన్‌ లామార్క్‌  4) అరిస్టాటిల్


2. మానవుడి శరీరంలోని అవశేష అవయవాల సంఖ్య-

1) 140    2) 130    3) 150    4) 180


3. పక్షులు, సరీసృపాలకు మధ్య సంధాన సేతువు-

1) ఆర్కిటిక్‌   2) ఆర్కియోప్టెరిక్స్‌     

3) ఆస్ట్రిచ్‌  4) గాడ్విచ్‌


4. కిందివాటిలో జీవపరిణామం ఆధార పరంగా సత్య వాక్యాన్ని ఎన్నుకోండి.

ఎ) నిర్మాణ సామ్య, క్రియాసామ్య అవయవాలు

బి) పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు  సి) శిలాజాలు   

డి) అవశేష అవయవాల ఉపయోగ, నిరూపయోగం    

1) ఎ, బి   2) సి, డి  

3) ఎ, బి, సి  4) ఎ, బి, సి, డి 


5. ఈ భూమిపై మొదటిగా ఉద్భవించిన జీవి ఏది? 

1) ఆర్కి బ్యాక్టీరియా  2) సయనో బ్యాక్టీరియా         

3) యూ బ్యాక్టీరియా   4) 1, 2


6. వాదన (ఎ): భూమిపై మొదటగా ఏర్పడిన సయనో బ్యాక్టీరియా సముద్రంలో జనిస్తుంది.

ప్రతివాదన (బి): జీవి ఏర్పాటుకు కారణమైన సముద్ర జలాన్ని ప్రీ బయాటిక్‌ సూప్‌ అంటారు.

1) ఎ సరైంది, బి సరికాదు.

2) ఎ, బి లు సరైనవి కానీ, ఎకి బి సరైన వివరణ కాదు.

3) ఎ, బి లు సరైనవి. ఎకి, బి సరైన వివరణ.

4) ఎ, బి లు సరికావు.


7. సముద్ర జలంలో మొదటగా ఏర్పడిన కేంద్రకామ్లం-

1) అడినిన్‌   2) గ్వానిన్‌      

3) యురాసిల్‌   4) 1, 2


8. భూమిపై మొదట ఏర్పడిన జీవులకు శక్తిని   ప్రసాదించిన ప్రక్రియను ఏమంటారు?

1) కిరణజన్యసంయోగక్రియ   2) కిణ్వనం      

3) పరాన్న జీవనం  4) ప్లవక జీవనం


9. జతపరచండి.

    జాబితా - I      జాబితా - II
1) లామార్కిజమ్‌ ఎ)చార్లెస్‌ డార్విన్‌
2) డార్వినిజమ్‌ బి) హ్యూగో డీవ్రిస్
3) ఉత్పరివర్తన సిద్ధాంతం సి) వీస్‌మన్‌
4) బీజద్రవ్య సిద్ధాంతం డి) జీన్‌ లామార్క్‌

1) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి   2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి 

3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ   4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 


10. ‘యాన్‌ ఎస్సే ఆన్‌ ది ప్రిన్సిపల్‌ ఆఫ్‌ పాపులేషన్‌’ గ్రంథకర్త ఎవరు? 

1) డార్విన్‌   2) థామస్‌ మాల్తూస్‌     

3) చార్లెస్‌ లయల్‌   4) రస్సెల్‌


11. ప్రకృతిలో పరిణామం ఏ విధంగా సంభవించిందో తెలిపే సిద్ధాంతం?

1) ప్రకృతి వరణం   2) లామార్కిజమ్‌       

3) జీవ ప్రత్యేక సిద్ధాంతం  4) 1, 2


12. ‘భూమిపై ఉండే జీవుల ఏర్పాటుకు దైవం  అవసరం’ అని వివరించిన సిద్ధాంతం?

1) యాదృచ్ఛిక సృష్టి సిద్ధాంతం      

2) కాస్మోజాయిక్‌ సిద్ధాంతం

3) ప్రళయ తత్వ సిద్ధాంతం

4) ప్రత్యేక సృష్టి సిద్ధాంతం


13. ప్రాథమిక వాతావరణం ఏర్పడినప్పుడు అందులో లేని వాయువులు?

1) O2    2) O3    3) N2   4) 1, 2


14. ఏ సిద్ధాంతం ప్రకారం జీవుల సృష్టి నిర్జీవ, కుళ్లుతున్న పదార్థాల నుంచి జరిగింది?

1) బయోజెనిసిస్‌    2) ఎబయోజెనిసిస్‌     

3) పాన్‌ స్పెర్మియా  4) 1, 2 


15. కోసర్వేట్‌ సిద్ధాంత రూపకర్త ఎవరు?

1) ఎ.ఐ. ఒపారిన్‌   2) జె.బి.ఎస్‌. హాల్డేన్‌      

3) జార్జ్‌ కువియర్‌   4) థేల్స్‌


16. జతపరచండి.

   జాబితా - I      జాబితా - II  
1) బయోజెనిసిస్‌ ఎ)పాన్‌ స్పెర్మియా
2) ప్రళయతత్వ బి) లూయీపాశ్చర్‌ 
3) కాస్మోజాయిక్‌   సి) ఒపారిన్‌ 
4) రసాయన జీవోత్పత్తి డి) జార్జ్‌ కువియర్‌ 

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి   2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి 

3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ   4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి


17. ఎలుకల తోకల పై ప్రయోగం చేసిన వ్యక్తి ...... 

1) ఆగస్ట్‌ వీస్‌మన్‌  2) చార్లెస్‌ లయల్‌    

3) మాల్తూస్‌   4) డార్విన్‌ 


18. వాదన - ఎ: డార్విన్‌ ప్రకృతివరణ సిద్ధాంతం ‘పరిణామం’ అనే పదాన్ని వివరించలేకపోయింది. 

ప్రతివాదన - బి: ప్రకృతిలో పరిణామం ఏ విధంగా సంభవిస్తుందో వివరించలేకపోయింది.

1) ఎ, బి లు సరైనవి కానీ, ఎకి బి సరైన వివరణ కాదు.

2) ఎ సరైంది, బి సరికాదు. 

3) ఎ సరికాదు, బి సరైంది.

4) ఎ, బి లు సరికావు. 


19. జతపరచండి.  

    జాబితా - I       జాబితా - II 
1) సజీవులు, నిర్జీవులక ఎ)యూగ్లీనా వారధి
2) సరీసృపాలు, పక్షులకు బి) పెరిపేటస్‌ సంధాన సేతువు
3) అనిలెడా, ఆర్ధ్రోపొడా సి) ఆర్కియోప్టెరిస్‌ జంతువులకు సంధాన సేతువు
4) మొక్కలు, జంతువులకు డి)  వైరస్‌ సంధాన సేతువు

1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ   2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి 

3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ   4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి


20. ‘ఫాదర్‌ ఆఫ్‌ మ్యుటేషన్స్‌’ అని ఎవరికి పేరు?     

1) డార్విన్‌    2) చార్లెస్‌ లయల్‌    

3) హ్యూగోడీవ్రిస్‌    4) 1, 2  


21. భావన - ఎ: కొన్ని రకాల జీవుల్లో పూర్వాంగాల అంతర్నిర్మాణాలు, ఎముకల అమరిక ఒకే విధంగా ఉంటుంది. 

భావన - బి: ఈ రకమైన పరిణామాన్ని అపసారి పరిణామం అంటారు. 

1) ఎ సత్యం, బి అసత్యం    2) ఎ, బి లు అసత్యం    

3) ఎ, బి లు సత్యం    4) ఎ మాత్రమే సత్యం


22. కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి.  

ఎ)ఒపారిన్‌ రసాయన జీవోత్పత్తిని స్టాన్లీ మిల్లర్‌ వోరాల్డ్‌ యురే అనుక్రమణ ప్రయోగం ద్వారా వివరించారు. 

బి) భూమి ఏర్పడినప్పుడు, సముద్ర జలంలో సేంద్రియ పదార్థాలైన గ్లైసిన్, ఎలనిన్‌ లాంటి అమైనో ఆమ్లాలు ఏర్పడ్డాయి.

సి) పరిణామ క్రమంలో ప్రాథమిక ప్రోకారియోట్‌లు పిండిపదార్థాల సంశ్లేషణలో ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి.

డి) ఒక జీవ జనాభాలో జరిగే సంచిత మార్పులను జీవపరిణామం అనొచ్చు. 

1) ఎ, బి 2) ఎ, బి, సి 3) ఎ, బి, సి, డి 4) సి, డి 


23. మొదట ఏర్పడిన క్షీరదం? 

1) ఏనుగు 2) చుంచు 3) గుర్రం 4) పైవన్నీ  


24. సీలోకాంత్‌ అనే జీవి నుంచి ఏ జీవులు  ఉద్బవించాయి?

1) సరీసృపాలు  2) క్షీరదాలు    

3) పక్షులు   4) ఉభయచరాలు 


25. ప్రోటియస్‌ ఆంగ్వినస్‌ పై ప్రయోగాలు నిర్వహించిన వ్యక్తి- 

1) థామస్‌ మాల్తూస్‌  2) పాల్‌కామరల్‌    

3) డార్విన్‌   4) ఆస్‌లూర్న్‌


26. మనుగడ కోసం పోరాటం అనే పదాన్ని ఉపయోగించినవారు? 

1) డార్విన్‌   2) వీస్‌మన్‌    

3) జాన్‌ బాపిస్టా   4) విలియం హార్వే 


27. జిరాఫీ మెడ పొడవుగా పెరగడం అనేది-  

1) ఉపయుక్తం  2) నిరూపయుక్తం    

3) అనుక్రమనం   4) 1, 2 


28. ఏకస్థితిక మొక్కల ఏర్పాటులో ఉపయోగించే మొక్క

1) కాల్చిసిన్‌  2) డీడీటీ  

3) మీథేన్‌       4) డాప్సోమ్‌


29. కిందివాటిలో జీవుల దృశ్యరూప లక్షణాలను మార్చేవి? 

1) ప్రకృతి వరణం       2) ప్రత్యుత్పత్తి    

3) జన్యు ఉత్పరివర్తనం  4) 1, 2  


30. మానవ నాగరికత ప్రారంభమైన శకం-

1) హోలోసీన్‌  2) ఫ్లిస్టోసీన్‌    

3) మయోసీన్‌   4) ఇయోసీన్‌ 


31. సరీసృపాల స్వర్ణయుగం-  

1) పేలియోజాయిక్‌   2) మీసోజాయిక్‌    

3) సీనోజాయిక్‌   4) 1, 2 


32. భూకాలమానంలో 88% ఉన్న యుగం ఏది? 

1) సీనోజాయిక్‌   2) మీసోజాయిక్‌ 

3) పేలియోజాయిక్‌     4) ప్రీకేంబ్రియన్‌ 


33. జీవుల పిండాలను గురించి అధ్యయనం చేసింది? 

1) ఎర్నెస్ట్‌ హెకేల్‌    2) వాన్‌బేయర్‌    

3) డార్విన్‌   4) వీస్‌మన్‌ 


34. సీరలాజికల్‌ పరీక్షలను పరిచయం చేసిందెవరు?

1) వ్యాబేయర్‌   2) హెచ్‌.ఎఫ్‌.నట్టల్‌   

3) డార్విన్‌    4) వీస్‌మన్‌   


35. సికిల్‌సెల్‌ ఎనీమియా కారక జన్యువు ఉండటానికి ఏమని పేరు? 

1) విచ్ఛిత్తివరణం   2) జన్యుప్రవాహం   

3) జన్యుభారం   4) వరణం 


36. భూమి వయసు దాదాపుగా (బిలియన్‌ ఏళల్లో) 

1) 6      2) 7     3) 5      4) 7.5 


37. కిందివాటిలో సరికానిది? 

1) ప్రాథమిక వాతావరణం చల్లగా, అధికంగా   హైడ్రోజన్‌ను కలిగి ఉంటుంది.

2) ప్రాథమిక వాతావరణం వేడిగా, అధిక హైడ్రోజన్‌ను కలిగి ఉంటుంది.

3) అనుకరణ ప్రయోగం సృష్టికర్త ఎ.ఐ.ఒపారిన్‌.  

4) ఉష్ణజల పులుసు అనే పదాన్ని ఉపయోగించినవారు జె.బి.ఎస్‌.హాల్డేన్‌. 


38. కిందివారిలో నియో లామార్కిజమ్‌ను సవరించి ఆమోదయోగ్యంగా మలిచిన వ్యక్తుల్లో కానివారు?

1) పాకార్డ్‌      2) ఎ.ఆర్‌.వాలెస్‌   

3) ఆస్‌బార్న్‌  4) స్పెన్సర్‌


39. పారిశ్రామిక శ్యామలత్వం (ప్రకృతి వరణంలో)   ప్రదర్శించే జీవి?

1) బిస్టన్‌ బెట్యూలేరియా 

2) ఈనోథీరా లామార్కియానా

3) డ్రోసోఫిలా మెలినోగాస్టెర్‌  

4) లెవిఫోలియా ఈనోథీరా


40. ఒక తల్లి తన బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే ఆ శిశువు తోకను కలిగి ఉండటాన్ని గమనించింది. అయితే ఆ విధానానికి ఏమని పేరు?

1) అటావిజం  

2) అధిక అవయవోత్పత్తి  

3) పరిణామం  

4) 1, 2 


సమాధానాలు
 

1-1; 2-4; 3-2; 4-4; 5-2; 6-3; 7-1; 8-2; 9-1; 10-2; 11-1; 12-4; 13-1; 14-2; 15-1; 16-2; 17-1; 18-2; 19-1; 20-3; 21-3; 22-3; 23-2; 24-4; 25-2; 26-1; 27-1; 28-1; 29-3; 30-1; 31-2; 32-4; 33-2; 34-2; 35-3, 36-3; 37-1; 38-2; 39-1; 40-1.

 


రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 


 

Posted Date : 28-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌