• facebook
  • whatsapp
  • telegram

జీర్ణ వ్యవస్థ - పరిణామం - ప్రాధాన్యం

జీవిత కాలంలో నీరు తీసుకోని జీవి!

 


జీవించడానికి, పెరగడానికి, పునరుత్పత్తికి అవసరమైన పోషకాలను సమర్థంగా శోషించుకోవడానికి జీవుల్లో ఒక సంక్లిష్ట వ్యవస్థ ఉంది. అది విటమిన్లను, ఖనిజాలను గ్రహించడానికి సాయపడుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. అదే అతి ముఖ్యమైన జీర్ణ వ్యవస్థ. మనుగడకు అవసరమైన శారీరక విధులు నిర్వహించే ఆ వ్యవస్థ పరిణామం, ప్రాధాన్యాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వివిధ జీవుల్లో జీర్ణక్రియల తీరు, ఈ ప్రక్రియలో ముఖ్యమైన దంతాల నిర్మాణంపై అవగాహన పెంచుకోవాలి. 


1.  మానవుడిలో ఆకలిని పుట్టించే హర్మోన్‌?

1) గ్రీలిన్‌     2) లెప్టిన్‌   3) జైమోజిన్‌   4) గ్యాస్ట్రిన్‌ 


2.  కిందివాటిలో మిశ్రమ పోషణ జరిపే జీవి?

1) శిలీంధ్రం    2) సయానో బ్యాక్టీరియా  3) యూగ్లీనా   4) 1, 2


3.  జతపరచండి.

జాబితా - 1     జాబితా - 2

1) సహజీవనం    ఎ) శిలీంధ్రాలు

2) పరాన్నజీవనం    బి) మానవుడు, ఎశ్చరీషియా కొలై

3) జాంతవ భక్షణ     సి) ప్లాస్మోడియం

4) పూతికాహార భక్షణ      డి) అమీబా

1) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి      2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ  

3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ      4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి


4.  ఎ - వాదన: జలగ రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం  గడ్డకట్టదు.

బి - ప్రతివాదన: జలగ ‘హిరుడిన్‌’ అనే రక్త   ప్రతి స్కందకాన్ని విడుదల చేయడం వల్ల రక్తం గడ్డకట్టదు.

1) ఎ, సత్యం బి, అసత్యం  2) ఎ, అసత్యం బి, సత్యం  

3) ఎ, బి లు సత్యం     4) ఎ, బి లు అసత్యం 


5. కిందివాటిలో మలకబళనాన్ని ప్రదర్శించే జీవి?

1) వానపాము    2) చిలుక  3) తేలు   4) కుందేలు


6.  నోటి ద్వారా ఆహార సేకరణ జరపడాన్ని ఏమంటారు?

1) అంతర్‌ గ్రహణం   2) మింగడం  3) విసరణ   4) పైవన్నీ


7.  రాడ్యులా లాంటి పదునైన అవయవాన్ని కలిగి ఉండే జీవి ?

1) కుందేలు  2) చిలుక  3) జలగ  4) నత్త


8. పండ్లను ఆహారంగా తీసుకునే జీవులకు ఏమని పేరు?

1) కోఫ్రోఫాగీ   2) ప్రూగివోర్స్‌  3) పాలీఫాగీ    4) కానిబల్స్‌


9.  కిందివాటిలో ఫాగోసైటాసిస్‌ను ప్రదర్శించే జీవి....?

1) జలగ   2) అమీబా   3) కప్ప   4) తేలు


10. కిందివాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి.

1) జీర్ణనాళం అన్ని జీవుల్లో ఒకే పరిమాణంతో ఉంటుంది.

2) జీర్ణనాళం మాంసాహారుల్లో పొడవుగా ఉంటుంది.

3) జీర్ణనాళం శాకాహారుల్లో పొడవుగా ఉంటుంది.

4) మానవుడిలో లాలాజల గ్రంథుల సంఖ్య - 4 జతలు. 


11. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) ప్రౌఢ మానవుడిలో దంతాల సంఖ్య 32. 

2) మానవుడిలో దంతాలు గర్త దంతి రకానికి  చెందినవి.

3) పాల దంతాల సంఖ్య 20. ఇవి మొత్తం  ఊడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడతాయి.

4) మానవుడిలో చర్వణకాలు అధికం.


12. కిందివాటిలో తప్పుగా జతపరిచింది గుర్తించండి.

1) డెంటిన్‌ - ఒడెంటో బాస్టిక్‌ కణాలు   2) ఎనామిల్‌ - ఎమియో బ్లాస్ట్‌లు

3) డెంటిన్‌ - మధ్యత్వచం    4) ఎనామిల్‌ - అంతరత్వచం


13. జీర్ణాశయం ఆకారం?

1)  I    2)  J    3) T    4)  U


14. 20 ఏళ్ల వయసున్న వ్యక్తిలో దంతాల సంఖ్య?

1) 32    2) 28  3) 20    4) 28 లేదా 32


15. క్షీరదాల్లో అదనంగా ఉండే లాలాజల గ్రంథి?

1) పెరోటిడ్‌ గ్రంథి     2) నిమ్ననేత్రకోటర గ్రంథి

3) అథో జంభికా గ్రంథి   4) 1, 3


16. వాదన-ఎ: కొన్ని రకాల నిమ్నజాతి జీవులు శరీరం బయట ఆహార పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకుంటాయి.

వాదన-బి: ఈ రకమైన జీవన విధానాన్ని పూతికాహార భక్షణ అంటారు.

1) ఎ, సత్యం   2) బి, సత్యం  

3) ఎ, బి లు సత్యం   4) ఎ, బి లు అసత్యం 


17. జీవుల్లో జీర్ణక్రియ అనేది దేని మీద ఆధారపడి పని చేస్తుంది? 

1) జీవి శరీర నిర్మాణం   2) పనిచేసే విధానం 3) జీర్ణరసాలు    4) 1, 2 


18. కిందివాటిలో సత్యవాక్యాలను గుర్తించండి.

ఎ) అమీబా లాంటి కొన్ని ఏకకణ జీవులు శరీరం బయట ఆహార పదార్థాలను ఆహార రిక్తిక ద్వారా సేకరిస్తాయి.

బి) ఏకకణ జీవి అయిన పారామీషియంకు కణ ముఖం ద్వారా ఆహార పదార్థాలు లోపలకు వెళతాయి.

సి) పేను, జలగ, బద్దె పురుగు లాంటి జీవులు పరాన్నజీవనాన్ని గడుపుతాయి.

1) ఎ, బి లు సత్యం    2) ఎ, సి లు సత్యం   

3) ఎ సత్యం   4) పైవన్నీ


19. కిందివాటిలో అత్యధిక దంతాలున్న జీవి?

1) అపోసం    2) గుర్రం   3) పాంగోలిన్‌    4) తాబేలు


20. బహువార దంతి నిర్మాణాన్ని ప్రదర్శించే జీవి?

1) చేపలు   2) మానవుడు   3) పంది    4) డాల్ఫిన్‌


21. చిన్నపిల్లల్లో పాల దంతాలు ఎన్నేళ్లకు ఊడిపోతాయి?

1) 12    2) 8    3) 14    4) 15 


22. ఏనుగులోని దంతాలు వేటి రూపాంతరాలు?

1) రదనికలు     2) అగ్ర చర్వణకాలు     3) చర్వణకాలు     4) కుంతకాలు


23. కిందివాటిని జతపరచండి.

జాబితా - 1        జాబితా - 2

1) కుంతకాలు   ఎ) కోర పళ్లు  

2) రదనికలు  బి) కొరకు పళ్లు

3) అగ్ర చర్వణకాలు  సి) విసురు దంతాలు

4) చర్వణకాలు  డి) నమిలే దంతాలు

1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి     2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి    

3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ     4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి


24. కిందివాటిలో దంత వ్యాధి కానిది?

1) పైరియా   2) ఫ్లోరోసిస్‌    3) ఆస్టియో మలేసియా   4) జింజివైటిస్‌

25. పాములో ఏవి విష గ్రంథులుగా మార్పు చెందుతాయి?

1) పెరోటిడ్‌     2) అథో జిహ్వికా   3) అథో జంభికా   4) 1, 2


26. లాలాజల స్థితి ఎలా ఉంటుంది?

1) క్షారం  2) ఆమ్లం  3) బోలస్‌  4) కొద్దిగా క్షారం


27. లాలాజలంలోని ఎంజైమ్‌ ఉపయోగం?

1) పిండిపదార్థాల జీర్ణక్రియ     2) ప్రొటీన్ల జీర్ణక్రియ

3) బొరిలస్‌ ఏర్పాటులో పాల్గొనడం   4) 1, 3


28. కిందివాటిలో తన జీవిత కాలంలో నీటిని తీసుకోని జీవి?

1) లోకస్ట్‌  2) ఎఫిస్‌ డార్సెటా   3) లెపిస్మా  4) ఫైలా గ్లోబోస


29. తేనెటీగ లార్వాను ఏమంటారు?

1) నింఫ్‌    2) టంబ్లర్‌   3) రిగ్లర్‌  4) గబ్‌


30. చీమ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం?

1) ఫార్మిక్‌ ఆమ్లం    2) ఎసిటిక్‌ ఆమ్లం   3) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం   4) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం


31. కిందివాటిలో సముద్రం నుంచి లభించే ఆహార పదార్థాల రుచికి మోనో సోడియం కలపగా ఏర్పడేది?

1) మెటాలిక్‌ టేస్ట్‌   2) బైగామి   3) ఉమామి   4) 2, 3


32. నాలుకపై ఉండే ఫోలియేట్‌ పాపిల్లేలు దేన్ని గ్రహిస్తాయి?

1) చేదు   2) తీపి  3) వగరు  4) పులుపు


33. కిందివాటిలో నాలుక విధి?

1) ఆహారాన్ని నమలడంలో సహాయపడటం   2) మాట్లాడటంలో సహాయపడటం

3) గస్టేషన్‌లో సహాయపడటం    4) పైవన్నీ


34. మానవుడిలో వాయు, ఆహార మార్గాల ప్రధాన కూడలి?

1) ఆస్య కుహరం   2) గ్రసని   3) ఆహార వాహిక     4) వాయునాళం


35. మానవుడి శరీర అంతరాంగ అవయవాల అధ్యయనం?

1) గాస్ట్రో ఎంటరాలజీ   2) పెరిస్టాలజీ   3) హెపటాలజీ   4) స్ల్పాంక్నాలజీ


36. వాదన - ఎ: నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో గదుల సంఖ్య - 4

వాదన - బి: మానవుడి జీర్ణాశయంలో గదుల సంఖ్య - 4

1) ఎ, బి లు సత్యం    2) ఎ, బి లు అసత్యం   3) ఎ అసత్యం, బి సత్యం   4) ఎ సత్యం, బి అసత్యం


37. ఆహార నాళంలో ఆహారం అలల మాదిరి ప్రయాణించడాన్ని ఏమంటారు?

1) పెరిస్టాలిటిక్‌   2) బెరియాట్రిక్‌    3) యూస్టేషియన్‌    4) 1, 3


38. కిందివాటిలో సరైన వరుసను గుర్తించండి.

1) నోరు, ఆస్యకుహరం, గ్రసని, జీర్ణాశయం

2) ఆస్యకుహరం, నోరు, గ్రసని

3) ఆస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం

4) జీర్ణ నాళం, ఆస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక


39. జీర్ణాశయం అధ్యయనాన్ని ఏమంటారు?

1) ఎంటమాలజీ   2) గ్యాస్ట్రో ఎంటరాలజీ   3) అగ్రస్టాలజీ  4) ఓపియాలజీ


40. కిందివాటిలో దంతాలు లేని జీవి?

1) ఆర్మిడి   2) తాబేలు  3) ఆస్ట్రిచ్‌   4) పైవన్నీ


41. మొదటగా దవడలు ఏర్పడిన జీవులు?

1) చేపలు    2) ఉభయచరాలు   3) పక్షులు    4) క్షీరదాలు


సమాధానాలు

1-1; 2-3; 3-2; 4-3; 5-4; 6-1; 7-4; 8-2; 9-2; 10-3; 11-3; 12-4; 13-2; 14-4; 15-2; 16-3; 17-3; 18-4; 19-1; 201; 21-2; 22-4; 23-1; 24-3; 25-1; 26-3; 27-1; 28-3; 29-4; 30-1; 31-3; 32-4; 33-4; 34-2; 35-4; 36-4; 37-1; 38-3; 39-2; 40-4; 41-1.

 


రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 


 


 

Posted Date : 28-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌