• facebook
  • whatsapp
  • telegram

పెరుగుదల - వికాసం

1. కిందివాటిలో చాలక వికాసానికి ఉదాహరణ కానిది?
(1) ఒకే పాదం మీద స్కిప్పింగ్‌ చేయడం  (2) వస్తువులను విసరడం
(3) ఎత్తు పెరగడం               (4) ఆటసామగ్రిని ఉపాయంగా వినియోగించడం
జ: 3 (ఎత్తు పెరగడం)

2. కిందివాటిలో సరికానిది?
(1) కాళ్లు, చేతులు, గుండె ఎదగడం అనేది పెరుగుదల
(2) పాకడం, నడవడం, పరిగెత్తడం అనేది వికాసం
(3) చదవడం, రాయడం, ఈదడం, ఆడటం అనేవి పరిపక్వత 
(4) పాకడం, నడవడం, పరిగెత్తడం అనేది వికాసం, చదవడం, రాయడం, ఈదడం, ఆడటం అనేవి పరిపక్వత
జ: 4 (పాకడం, నడవడం, పరిగెత్తడం అనేది వికాసం, చదవడం, రాయడం, ఈదడం, ఆడటం అనేవి పరిపక్వత)

 

3. కిందివాటిలో సంకుచిత భావనను కలిగింది?
(1) వికాసం     (2) పెరుగుదల     (3) పరిపక్వత      (4) వికాసం, పరిపక్వత
జ: 2 (పెరుగుదల)

 

4. భాషా సముపార్జనకు కారణమైన సహజ భాష సముపార్జన సాధనం ప్రతి శిశువులోనూ పుట్టుకతోనే ఉంటుందని ప్రతిపాదించింది?
జ: నేటివిస్ట్‌ దృక్పథం

 

5. గీత తన చెల్లెలైన ఉష హోంవర్క్‌ చేయడంలో సహకరిస్తుంది. అయితే ఉషను ఏ దశకు చెందినదిగా చెప్పవచ్చు?
జ: ఉత్తర బాల్యదశ

 

6. ఒక బాలుడు తన స్నేహితుడు చూడని సమయంలో అతడి బ్యాగ్‌లో నుంచి పెన్‌ను దొంగిలించాడు. అయితే కోల్‌బర్గ్‌ ప్రకారం ఆ బాలుడు ఏ దశకు చెందినవాడు?
జ: పూర్వ సంప్రదాయ

 

7. ‘సత్యమునే పలుకుము’ లేదా ‘సత్యమేవ జయతే’ అనే సూక్తులు ఏ వికాస అంశానికి చెందినవి?
జ: నైతిక వికాసం

 

8. కిందివాటిలో సరైన వాక్యం?
(1) జీవిలో పరిమాణాత్మక మార్పులు జరిగిన తర్వాత గుణాత్మక మార్పులు జరుగుతాయి. 
(2) జీవిలో గుణాత్మక మార్పులు ఏర్పడగానే పరిమాణాత్మక మార్పులు ఏర్పడతాయి. 
(3) జీవి పరిమాణాత్మక, గుణాత్మక మార్పులకు సంబంధం లేదు.
(4) ఏదీకాదు
జ: 2 (జీవిలో గుణాత్మక మార్పులు ఏర్పడగానే పరిమాణాత్మక మార్పులు ఏర్పడతాయి.)

 

9. కూడికలు నేర్పించిన తర్వాత, తీసివేతలు నేర్పించడమనేది ఏ వికాస నియమం?
జ: వికాసం క్రమానుగతమైంది

 

10. రాణి అనే విద్యార్థికి అక్షరాలు దిద్దడానికి తప్పకుండా కావాల్సింది?
జ: పరిపక్వత

 

11. ఒక బాలుడు ఇంటికి వెళ్లడం చూపిస్తాడు కానీ ఎలా వెళ్లాలో చెప్పలేడు. అయితే ఆ బాలుడు పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు?
జ: మూర్త ప్రచాలక దశ

 

12. ఒక బాలుడు అన్యాయాలను, అక్రమాలను సహించలేకపోవడం; త్యాగనిరతితో ఇతరులకు సహాయపడటం ఏ దశలో ఎక్కువగా కనిపిస్తుంది?
జ: కౌమారం

 

13. రాజు అనే బాలుడు మొదట బొమ్మను రెండుచేతులతో పట్టుకున్నాడు. తర్వాత వేళ్లతో కూడా పట్టుకోగలగడం అనేది?
జ: సాధారణం నుంచి నిర్దిష్టం

 

14. అనుపమ అనే బాలిక తినడం, స్నానం చేయడం, వస్త్రధారణ లాంటి కృత్యాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునే దశ?
జ: ఉత్తర బాల్యదశ

 

15. పండితులకు పామరులు జన్మించడం అనేది?
జ: ప్రతిగమన నియమం

 

16. వికాసంలో వైయక్తిక భేదాలను అనుసరించేది?
1) విద్యార్థులందరికీ ఒకే రకమైన ఇంటిపని ఇవ్వడం.
2) విద్యార్థులకు వారి వారి సామర్థ్యాల ఆధారంగా ఇంటిపని ఇవ్వడం.
3) 2వ తరగతి విద్యార్థులందరికీ ఒకే విధంగా ఇంటిపని ఇవ్వడం.
4) ఏదీకాదు
జ: 2 (విద్యార్థులకు వారి వారి సామర్థ్యాల ఆధారంగా ఇంటిపని ఇవ్వడం)

 

17. రాము అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థులందరి ముందూ మందలించాడు. ఆ బాధను మర్చిపోవడానికి రాము క్రీడల్లో నిమగ్నమయ్యాడు. ఈ లక్షణాన్ని ఏమని పిలుస్తారు?
జ: ఉద్వేగ కేథార్సిస్‌

 

18. అమ్మా అని పలికిన శిశువు దాని ఆధారంగా అక్క, అత్త, ఆవు అని పలికితే అది ఏ వికాస నియమం?
జ: వికాసం సంచితప్రక్రియ

 

19. ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రతిసారీ మొదటి ర్యాంకు సాధిస్తున్న లత అనే విద్యార్థినికి సహజ సామర్థ్య పరీక్షను నిర్వహించి భవిష్యత్‌లో నీవు మంచి ఇంటలిజెంట్‌ కాగలవని ఆ బాలిక వృత్తిని ఎంపిక చేయడమనేది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది?
జ: వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు.

 

20. ఏ దశలోని పిల్లలకు నమూనాలు, చార్టుల ద్వారా పాఠ్యాంశాలను బోధించాలి?
జ: మూర్త ప్రచాలక దశ

 

21. కిందివాటిని జతపరచండి. 

జ: i-D, ii-C, iii-A, iv-

 

22. కిందివాటిలో పరిణతికి సంబంధించి వాస్తవం కానిది?
1) శిక్షణ అవసరం లేదు.           2) పరిణతి ఉంటేనే సంసిద్ధత వస్తుంది.
3) పరిణతి గుణాత్మకమైంది.       4) పరిణతిని మాపనం చేయవచ్చు.
జ: 4 (పరిణతిని మాపనం చేయవచ్చు)

23. కిందివాటిలో సరికానిది. 
1) నైతిక విలువలు అభివృద్ధి చెందే దశ - ఉత్తర బాల్యదశ    
2) ఉద్వేగ కేథార్సిస్‌ ఉండే దశ - పూర్వ బాల్యదశ
3) గోనడో ట్రోఫిక్‌ హార్మోన్లు విడుదలయ్యే దశ - యవ్వనారంభ దశ    
4) ఉద్వేగ అనియంత్రిత గల దశ - కౌమార దశ
జ: 2 (ఉద్వేగ కేథార్సిస్‌ ఉండే దశ - పూర్వ బాల్యదశ)

24. రాణి, గీత తల్లి కోపగించుకుంటుదనే కారణంతో ఇంట్లో ఏ వస్తువును తీసుకోరు, తినరు. అయితే వీరిని కోల్‌బర్గ్‌ సూచించిన ఏ స్థాయికి చెందినవారిగా పరిగణించాలి?
జ: పూర్వ సంప్రదాయ స్థాయి

 

25. శిశువు మొదట పెన్సిల్‌తో రాయడం నేర్చుకొని ఆ తర్వాత పెన్‌తో రాసినట్లయితే ఆ బాలుడు ఏ నియమాన్ని పాటించాడు?
జ: వికాసం సులభం నుంచి జటిలంకు సాగుతుంది.

 

26. కిందివాటిలో ఫ్రాన్సిస్‌ గాల్టన్‌ రచించిన గ్రంథాలు?
1) హెరిడిటరీ జీనియస్‌      
2) యాన్‌ ఎంక్వైరీ ఇన్‌ టూ హ్యూమన్‌ ఫ్యాకల్టీ అండ్‌ ఇట్స్‌ డెవలప్‌మెంట్‌ 
3) హెరిడిటరీ జీనియస్‌, యాన్‌ ఎంక్వైరీ ఇన్‌ టూ హ్యూమన్‌ ఫ్యాకల్టీ అండ్‌ ఇట్స్‌ డెవలప్‌మెంట్‌ 
4) హెరిడిటరీ జీనియస్‌ మాత్రమే
జ: 3 (హెరిడిటరీ జీనియస్‌, యాన్‌ ఎంక్వైరీ ఇన్‌ టూ హ్యూమన్‌ ఫ్యాకల్టీ అండ్‌ ఇట్స్‌ డెవలప్‌మెంట్‌)

 

27. వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగం ఒక సహజాతాన్ని అనుసరించి ఉంటుందని అన్నవారు?
జ: మెక్‌ డోగల్‌

 

28. ఎమోషన్‌ అనే ఆంగ్ల పదానికి మూలమైన లాటిన్‌ పదం?
జ: ఎమోవీర్‌

 

29. కిందివాటిని జతపరచండి.

జ: i-C, ii-B, iii-D, iv-A

 

30. అనువంశికత + పరిసరం = ?
జ: వ్యక్తి మూర్తిమత్వం

 

31. కిందివాటిలో అనువంశికతకు సంబంధించిన కారకం?
1. సమవయస్కుల సమూహంపై గల వైఖరి     2. ఆలోచనా తీరు
3. కండ్ల రంగు                        4. సమాజ కార్యక్రమాల్లో పాల్గొనడం
జ: 3 (కండ్ల రంగు)

 

32. కోల్‌బర్గ్‌ నైతిక వికాస సిద్ధాంత లక్షణం?
1. అన్ని సంస్కృతుల్లో సాధారణంగా ఉండే సార్వత్రిక దశ
2. వరుస క్రమ నమూనాను అనుసరించే దశలు లేవు
3. ముందుకు సాగే క్రమంలో ఏకరూపత లోపించిన దశలు
4. వరుస ఆకృతులు లేకుండా ప్రతి దశ వేర్వేరు ప్రతిక్రియలతో కూడి ఉంటుంది
జ: 1 (అన్ని సంస్కృతుల్లో సాధారణంగా ఉండే సార్వత్రిక దశ)

 

33. కిందివాటిని జతపరచండి.

జ: i-C, ii-D, iii-A, iv-B

 

34. కిందివాటిలో సరికానిది.
1. తెలివి గల తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలందరూ తెలివిగలవారు కావడం - సారూప్య నియమం
2. తెలివి గల తల్లిదండ్రులకు, తెలివి తక్కువవారు జన్మించడం - వైవిధ్య సూత్రం
3. తెలివి గల తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలందరిలో కొంతమంది తెలివైనవారు, కొంతమంది తెలివి తక్కువవారు కావడం - ప్రతిగమన సూత్రం
4. తెలివి గల తల్లిదండ్రులకు, తెలివి తక్కువవారు జన్మించడం - వైవిధ్య సూత్రం, తెలివి గల తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలందరిలో కొంతమంది తెలివైనవారు, కొంతమంది తెలివి తక్కువవారు కావడం - ప్రతిగమన సూత్రం
జ: 4 (తెలివి గల తల్లిదండ్రులకు, తెలివి తక్కువవారు జన్మించడం - వైవిధ్య సూత్రం, తెలివి గల తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలందరిలో కొంతమంది తెలివైనవారు, కొంతమంది తెలివి తక్కువవారు కావడం - ప్రతిగమన సూత్రం)

 

35. ‘దొంగ కడుపున దొర పుడతాడా?’ అనే సామెతకు సరైన నియమం?
జ: సామ్య/పోలిక నియమం

 

36. రఘు, కళ దంపతులు అందంగా ఉంటారు, అధిక ప్రజ్ఞావంతులైనప్పటికీ వారికి జన్మించే శిశువు అందవిహీనంగా, మందబుద్ధుడు అయినట్లయితే దీన్ని సమర్థించే మెండల్‌ నియమం?
జ: ప్రతిగమన నియమం

 

37. సీత, గీత అనే బాలికలు హోంవర్క్‌ ఇచ్చే ఉపాధ్యాయుడిని మంచివాడు కాదని, ఇవ్వని ఉపాధ్యాయుడు చాలా మంచివాడని నిరంతరం ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. అయితే కోల్‌బర్గ్‌ ప్రకారం వీరు ఏ స్థాయికి చెందినవారు?
జ: పూర్వ సంప్రదాయ స్థాయి

 

38. కిందివాటిలో అభివృద్ధి సూత్రం కానిది?
1) వికాసం ప్రాగుక్తీకరించబడుతుంది    2) నిరంతర ప్రక్రియ
3) గతిశీలక ప్రక్రియ                 4) విపర్యయ ప్రక్రియ
జ: 4 (విపర్యయ ప్రక్రియ)

 

39. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థి అయిన రాజుకు ఎన్ని పద్ధతుల్లో బోధించినా బరువు, కాలం లాంటి అమూర్త అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి ఏ అంశానికి సంబంధించిన ‘మనో వైజ్ఞానిక జ్ఞానం’ అవసరం?
జ: 2 (వికాస దశలు)

 

40. ఒక బాలుడి వికాస దశకు సంబంధించి సరికాని వాక్యం? 
(1) యవ్వనారంభ దశ - అలైంగిక జీవి లైంగికంగా మారడం  
(2) పూర్వ బాల్యదశ - ఆత్మభావన ఏర్పడే దశ
(3) కౌమార దశ - భిన్న లైంగిక ఆసక్తి                    
(4) ఉత్తర బాల్యదశ - సాంఘిక వికాసానికి తొలిమెట్టు
జ: 4 (ఉత్తర బాల్యదశ - సాంఘిక వికాసానికి తొలిమెట్టు)


41. శిశువు తనను తాను ప్రేమించుకునే గుణమైన నార్సిజంను ప్రదర్శించే దశ?
జ: శైశవ దశ

 

42. సాధారణంగా విద్యార్థులు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేని మానసిక ఆటంకంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇలాంటివారు ఏ దశలో ఉన్నట్లు?
జ: కౌమార దశ

 

43. సందీప్‌ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి ‘ముఠా’గా ఏర్పడి సాంఘిక కృత్యాల్లో పాల్గొంటుంటే ఆ విద్యార్థి ఏ దశకు చెందినవాడై ఉంటాడు?
జ: ఉత్తర బాల్యదశ

 

44. రాజేశ్‌ అనే విద్యార్థి తన ఉపాధ్యాయుడి దగ్గర గుర్తింపు కోసం నిరంతరం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఒత్తిడిలో ఉన్నట్లయితే ఆ పరిస్థితిని ఏ దశ లక్షణంగా చెప్పవచ్చు?
జ: కౌమార దశ

 

45. కోల్‌బర్గ్‌ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు?
జ: అధ్యహం

 

46. వికాసానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?
(1) వికాసం క్రమానుగత, సంచితత్వ గుణాలను కలిగి పురోగమనంగా నిరంతరం సంభవించే ప్రక్రియ.
(2) ప్రతి అంశంలోనూ వ్యక్తికీ, వ్యక్తికీ మధ్య వికాస సంబంధమైన వైయక్తిక భేదాలుంటాయి.
(3) వికాస ప్రక్రియ దాదాపు ప్రతి వ్యక్తిలోనూ కౌమార దశలో ఆగిపోతుంది.
(4) ప్రతివ్యక్తిలోనూ వికాసం అనేది సంపూర్ణంగా, ఏకీకృత మొత్తంగా జరుగుతుంది.
జ: 3 (వికాస ప్రక్రియ దాదాపు ప్రతి వ్యక్తిలోనూ కౌమార దశలో ఆగిపోతుంది.)

 

47. ఒక విద్యార్థిలో సక్రమమైన అభ్యసనం జరగడానికి కింద పేర్కొన్న అంశాల్లో అవసరంలేనిది?
1) ఎక్కువ ఉద్వేగాలు కలిగి ఉండటం.     2) అధిక అభిరుచి కలిగి ఉండటం. 
3) అధిక ప్రేరణ కలిగి ఉండటం.          4) తక్కువ ఉద్వేగాలు కలిగి ఉండటం.
జ: 1 (ఎక్కువ ఉద్వేగాలు కలిగి ఉండటం)

 

48. కిందివాటిలో సరికాని వాక్యం?
(1) శిశువు ప్రాణంలేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించి తద్వారా ఆటలాడి ఆనందపడే భావనే సర్వాత్మక వాదం.
(2) పూర్వ భావనాత్మక దశలోని శిశువు ఒక వస్తువు నిజమైంది కానప్పటికీ నిజమైన వస్తువులా భావించడమనే భావనే ప్రతిభావాత్మక ఆలోచన.
(3) ఒక వస్తువు ఆకారాన్ని, స్థితిని మారిస్తే దాని గుణం మారుతుంది. దీన్నే ‘కన్జర్వేషన్‌’ అంటారు.
(4) ప్రతి తార్కిక ప్రచలనాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడమే అవిపర్యయాత్మక భావనాలోపం.
జ: 3 (ఒక వస్తువు ఆకారాన్ని, స్థితిని మారిస్తే దాని గుణం మారుతుంది. దీన్నే ‘కన్జర్వేషన్‌’ అంటారు)

 

49. చోమ్‌స్కీ ప్రకారం పిల్లల భాషా వికాసం దశల సరైన క్రమం.
జ: పూర్వభాషా దశ, ముద్దుపలుకు దశ, శబ్ద అనుకరణ దశ, శబ్దగ్రాహ్యక దశ

 

50. పెద్దలను విపరీతమైన ప్రశ్నలతో విసిగించే దశ?
జ: యవ్వనారంభ దశ

51. ప్రవీణ్‌ అనే విద్యార్థి కర్రముక్కను తుపాకీగా, అగ్గిపెట్టెను బస్సుగా భావించి ఆడుకుంటున్నాడు. అయితే అతడు ఏ దశకు చెందినవాడు?
జ: పూర్వ బాల్యదశ

52. పాఠ్య ప్రణాళికలో పొందుపరిచిన హక్కులు, విధులు అనే పాఠ్యాంశం ద్వారా విద్యావేత్తలు విద్యార్థుల నుంచి ఆశించే వికాసం?

జ: సాంఘిక వికాసం

53. కుక్క అనేది జంతువు అని తెలుసుకున్న బాలుడు నక్కను కూడా కుక్కగా భావించి కొంతకాలం తర్వాత దాని అరుపు, ఆకారంలో మార్పులను గ్రహించి అది వేరే జంతువుగా భావించడం?

జ: అనుగుణ్యత

54. కిందివాటిలో నైతిక వికాసాన్ని అధికంగా ప్రభావితం చేసేది?
     1) సంజ్ఞానాత్మక వికాసం      2) భాషా వికాసం     

     3) ఉద్వేగ వికాసం      4) సామాజిక వికాసం
జ: 1 (సంజ్ఞానాత్మక వికాసం)

 

55. రామ్, శ్యామ్‌ భోజనం చేసే పళ్లెంను బస్సు స్టీరింగ్‌గా భావించి గిరగిరా తిప్పుతూ బస్సులా శబ్దం చేస్తూ ఆడుకుంటున్నారు. అయితే వారు పియాజె ప్రకారం ఏ దశకు చెందినవారిగా చెప్పవచ్చు?
జ: పూర్వ ప్రచాలక దశ

56. వికాస కృత్యాలు అనే పదాన్ని ప్రతిపాదించిన వారు?
జ: హవిగ్‌ హార్‌స్ట్‌

 

57. తులనాత్మకంగా ఉద్వేగాలు ఏ దశలో సులభంగా మార్పు చెందుతాయి?
జ: శైశవ దశ

 

58. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వల్ల ప్రస్తుత జ్ఞాన నిర్మాణాల్లో జరిగే పరివర్తన?
జ: అనుగుణ్యం

 

59. ఒకటో తరగతిలోని బాలు శిక్షను తప్పించుకోవడానికి పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. అయితే ఈ శిశువు నైతిక వికాసంలో ఏ దశలో ఉన్నాడు?
జ: పూర్వనైతిక సంప్రదాయ స్థాయిలోని 1వ దశ

 

60. పియాజె ప్రకారం ‘వస్తు స్థిరత్వం’ కింది ఏ దశలో జరుగుతుంది?
     1. అమూర్త ప్రచాలక దశ      2. ఇంద్రియ చాలక దశ     3. పూర్వ ప్రచాలక దశ        4. మూర్త ప్రచాలక దశ
జ: 2 (ఇంద్రియ చాలక దశ)

 

61. కౌమారుల సాంఘిక వికాసానికి చెందిన ముఖ్యమైన లక్షణం?
జ: గుర్తింపు

 

62. క్రోమోజోమ్స్‌ ఏ ఆకారంలో ఉంటాయి?
జ: V

63. భయం అనే ఉద్వేగానికి కారణమైన సహజాతం?
జ: తప్పించుకోవడం

 

64. పియాజె ప్రకారం అంతర్బుద్ధి దశ వయసు?
జ: 4 - 7 సంవత్సరాలు

65. సమరూప కవలలు?
జ: ఒక అండం ఒక శుక్రకణంతో ఫలదీకరణం చెంది రెండు పిండాలుగా పెరుగుతాయి.

 

66. శిరోపాదాభిముఖ వికాస సూత్రం
జ: వికాసం తల నుంచి ప్రారంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది.

 

67. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని అన్నవారు?
జ: స్టాన్లీహాల్‌

 

68. అనుకరణ బహిర్గతంగా వేటిలో ప్రస్ఫుటమవుతుంది?
జ: చేతనం

 

69. విలువలు - ఆదర్శాల గురించి బోధిస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఏ వికాస వృద్ధిని కాంక్షిస్తాడు?
జ: నైతిక వికాసం

70. మదర్‌ థెరిసా పాఠం ద్వారా ఆమె ఇతరులకు నిస్వార్థంగా అందించిన సేవల గురించి విద్యార్థులకు తెలియజేసిన ఉపాధ్యాయుడు ఆశించే వికాసం?
జ: సాంఘిక వికాసం

 

71. పియాజె ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం దాదాపుగా పూర్తయ్యే వయసు?
జ: 16 సంవత్సరాలు

 

72. సాధారణంగా సినీతారలను, ఇష్టమైన క్రీడాకారులను ఆరాధించే తత్వాన్ని ‘వ్యక్తిపూజ’ దశగా భావిస్తే ఇది ఏ దశలో అధికంగా ఉంటుంది?
జ: కౌమార దశ

 

73. వికాసానికి సంబంధించి ప్రతికూలమైన అంశం
జ: వికాసం ఒక దశలో ఆగిపోతుంది కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అభివృద్ధిని చూపుతుంది.

 

74. అభ్యాస చలన కౌశల వికాసానికి సంబంధించి సరికానిది.
జ: వయసుతోపాటు ఎత్తు పెరగడం

 

75. కిందివాటిలో సరైన జత. 
     1. శాశ్వత దంతాలు - పూర్వబాల్యం     2. నార్సిజం - శైశవం     

     3. ఉద్వేగ అస్థిరత - కౌమారం     4. అన్నీ
జ: 4 (అన్నీ)

76. కిందివాటిలో సరికాని వాక్యం. 
     1. పరిపక్వతకు వైయక్తిక భేదాలుంటాయి.                2. పరిపక్వత ఆర్జితమైంది.
     3. పరిపక్వత జైవిక స్వభావాన్ని చూపుతుంది. 
     4. జన్మతహా శిశువులోని సహజ సామర్థ్యాలు వయసుతోపాటు అభివృద్ధి చెందడమే పరిపక్వత.
జ: 2 (పరిపక్వత ఆర్జితమైంది)

 

77. విభిన్న కవలలకు సంబంధించి సరైంది. 
     (1) వేర్వేరు సంయుక్త భేదాలు                                          (2) వైయక్తిక భేదాలు ఉంటాయి
     (3) లైంగిక భేదం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు           (4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

78. నాలుగేళ్ల బాలుడు తాను ఎక్కడికి వెళ్లినా సూర్యుడు తనను వెంబడించి ప్రతిచోటుకు వస్తున్నాడని భావించడంలో గల భావనను పియాజె ఏవిధంగా పేర్కొన్నాడు?
జ: అహం కేంద్రవాదం

 

79. సునీత అనే విద్యార్థి ప్రతిరోజు పాఠశాలలో ప్రార్థనకు క్రమం తప్పకుండా హాజరవుతుంది. అయితే కోల్‌బర్గ్‌ ప్రకారం ఈ బాలిక ఏ దశకు చెందింది?
జ: అధికారం, సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి

80. ‘పండిత పుత్ర పరమశుంఠ’ అనే సామెత ఏ వికాస నియమానికి సంబంధించింది?
జ: తిరోగమన నియమం

 

81. కిందివాటిలో వికాసానికి సంబంధించి సరికానిది?
     (1) వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ.                                          (2) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. 
     (3) అన్ని వికాస దశల్లో పెరుగుదల ఒకేవిధంగా ఉండదు.     (4) వికాసం బహిర్గతంగా కనిపిస్తుంది.
జ: 4 (వికాసం బహిర్గతంగా కనిపిస్తుంది)

 

82. భాష నేర్చుకోవడానికి ఎక్కువ ప్రేరణ ఉండే దశ?
జ: శైశవ దశ

 

83. సాంఘికీకరణకు పునాది ఏర్పడే దశ?
జ: పూర్వ బాల్యదశ

 

84. కిందివాటిలో అసాంఘిక ప్రవర్తన నమూనా కానిది?
     (1) ప్రతికూల అభిప్రాయం      (2) అధికారతత్వం         

     (3) స్వార్థం            (4) సాంఘిక ఆమోదం
జ: 4 (సాంఘిక ఆమోదం)

 

85. ధనవంతుల పిల్లలు వారి గొప్పదనాన్ని ప్రదర్శించే వస్తువులను ఇతర పిల్లల ముందు చూపడం వల్ల పాఠశాల విద్యార్థుల్లో కలిగే ప్రేరణ?
జ: ప్రతికూల ఉద్వేగం

86. హరిత అనే బాలిక ఇంటిపనుల్లో తన కుటుంబ సభ్యులకు సహాయం చేయడమనేది ఏ నైపుణ్యం?
జ: సాంఘికమైంది

 

87. శిశువు సంతోషం అనే ఉద్వేగ లక్షణం కానిది?
జ: నాలుక బయటపెట్టి చూడటం

 

88. పియాజె 'Make believe play' ఏ దశను సూచిస్తుంది?
జ: పూర్వ ప్రచాలక దశ

 

89. శిశువు శైశవ దశలో ఆడుకునే క్రీడ?
జ: ఏకాంతర క్రీడ

 

90. ప్రీస్కూల్, ఎలిమెంటరీ స్థాయిలో విద్యాబోధనపై ప్రభావం చూపిన పియాజె సూత్రం?
     (1) ఆవిష్కరణల అభ్యసనం   (2) అభ్యసన పట్ల పిల్లల సంసిద్ధత  
      (3) వైయక్తిక భేదాలను గుర్తించడం   (4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

91. ప్రకల్పనా నిగమనాత్మక - వివేచనం ఏ దశలో జరుగుతుంది?
జ: అమూర్త ప్రచాలక దశ

 

92. రమేష్, వినోద్‌ అనే పిల్లలు ఆడుకునేటప్పుడు తమ ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోరు కానీ ఒకరి ఆటను మరొకరు అనుకరిస్తే ఆ క్రీడను ఏమని పేర్కొనవచ్చు?
జ: సంసర్గ క్రీడ

93. వివిధ వికాస దశలకు సంబంధించి సరైన భావన?
జ: నవజాత శిశువు - అనేక సర్దుబాట్లను చూపే దశ.

 

94. కిరణ్‌ అనే బాలుడు తన తల్లి, తమ్ముడిపైన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ అనేవి అతడిలో ఏ ఉద్వేగాన్ని బహిర్గతం చేస్తున్నాయి?
జ: అసూయ

 

95. ఫ్రాయిడ్‌ ప్రకారం నైతిక వికాసంలో ప్రధాన పాత్ర నిర్వహించేది?
జ: అధ్యహం

 

96. రాము చిలిపిచేష్టలు చేయడం, వస్తువులను పాడుచేయడం, బొమ్మరిల్లు కట్టడం లాంటి పనులు చేసే దశ?
జ: పూర్వ బాల్యదశ

 

97. ఒక విద్యార్థి పెరుగుదల వేగం శైశవ దశలో ఎక్కువగా, బాల్యదశలో నెమ్మదిగా, కౌమార దశలో ఉద్ధృతంగా ఉంటుంది. ఇది ఏ నియమాన్ని సూచిస్తుంది?
జ: లయ వికాస నియమం

 

98. సాహితికి పాలదంతాలన్నీ ఊడిపోయి శాశ్వత దంతాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే సాహితి ఏ దశకు చెందినదిగా గుర్తించవచ్చు?
జ: పూర్వ బాల్యదశ

99. పూర్వ వికాసంపై అనంతర వికాసం ఆధారపడటాన్ని సమర్థించే వికాస నియమం?
జ: క్రమ బద్ధమైంది

 

100. ఒక వ్యక్తి చిన్నతనంలో పెన్సిళ్లు, పెన్నులు దొంగిలించేవాడు. కాలం గడిచేకొద్దీ దొంగతనం చేయకూడదని మానేశాడు. అయితే ఆ వ్యక్తిలో జరిగిన మార్పు?
జ: అభ్యసనా మార్పు

 

101. సంఘపరంగా నైతికతను పాటించే దశ?
జ: సంప్రదాయ

 

102. బాలు అనే 5వ తరగతి విద్యార్థి తన డ్రాయింగ్‌ బుక్‌లో పెయింటింగ్‌ వేయడం అనేది ఏ నైపుణ్యం?
జ: పాఠశాల

 

103. సంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు?
జ: నోమ్‌ చోమ్‌స్కీ

 

104. నాకొక శిశువును ఇస్తే అతడిని డాక్టర్‌గా, రౌడీగా లేదా మంచివ్యక్తిగా తీర్చిదిద్దగలను అన్నవారు?
జ: వాట్సన్‌

 

105. తక్కువగా మాట్లాడటం అంటే?
జ: అవసరానికి తగినట్లుగా మాట్లాడటం.

106. శైశవ దశలోని శిశువుకు నైతికత తెలియదు. దీనికి కారణం?
జ: అంతరాత్మ ఉండదు, ప్రజ్ఞా వికాసం తక్కువ

 

107. కిందివాటిలో స్వయం సహాయక నైపుణ్యం?
        1) విద్యార్థి తల దువ్వుకోవడం         2) విద్యార్థి బొమ్మలు గీయడం 
        3) విద్యార్థి సైకిల్‌ తొక్కడం               4) తరగతి గదిని శుభ్రం చేయడం
జ: 1 (విద్యార్థి తల దువ్వుకోవడం)

 

108. శిశు వికాసానికి సంబంధించి ప్రభావితం చూపే అంశాన్ని పరిశీలించండి. 
        A) తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండానికి లభించిన పోషకాహారం తల్లి శరీర ధర్మం. 
        B) తల్లి మానసిక స్థితి
జ: A, B సరైనవి

 

109. ‘సెంట్రేషన్‌ ఆఫ్‌ థాట్‌’ అనేది ఏ పరిమితి కిందకు వచ్చే దోషంగా గుర్తించవచ్చు?
జ: కన్జర్వేషన్‌

 

110. "Father of Modern Linguistics" అని ఎవరిని పిలుస్తారు?
జ: నోమ్‌ చోమ్‌స్కీ

111. కిందివాటిలో సరికాని జత?
       1) శైశవ దశ - అన్వేషణా దశ                         2) పూర్వ బాల్యదశ - ఆత్మభావనా దశ 
        3) ఉత్తర బాల్యదశ - కౌశలాలు, నైపుణ్యాలు పెంపొందే దశ     
        4) కౌమార దశ - నిరంతరం గుర్తింపుకోసం శోధించే దశ
జ: 1 (శైశవ దశ - అన్వేషణా దశ)

 

112. కిందివాటిలో సరైన వికాస నియమం?
        A) వికాసం విచ్ఛిన్నంగా జరిగే భావన         B) వికాసాన్ని ప్రాగుక్తీకరించలేం 
        C) వికాసం తిరోగమనమైంది                       D) వికాసం వైయక్తిక భేదాలను చూపుతుంది 
        E) వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు
జ: D, E సరైనవి.

 

113. అహం కేంద్రవాదానికి సంబంధించి సరికానిది?
        1) పిల్లలు ప్రపంచాన్ని తమ దృష్టితో చూస్తారు.         2) పెద్దవారిలో ఉండే స్వార్థం లాంటిది. 
        3) ఏ అంశాన్నైనా ఏకమితిగా ఆలోచిస్తారు.              4) అన్నీ
జ: 2 (పెద్దవారిలో ఉండే స్వార్థం లాంటిది. )

 

114. పిల్లల్లో బరువు, కాలం, డబ్బులకు సంబంధించిన భావనలు పియాజె ప్రకారం ఏ దశలో ఏర్పడతాయి?
జ: మూర్త ప్రచాలక దశ

115. వ్యక్తి వికాసంలో అనువంశికతను అధిక ప్రాధాన్యం ఇచ్చినవారు?
జ: కెల్లాగ్, ఫ్రీమన్‌

 

116. ‘వాక్యక్రమ నిర్మాణాలు’ గ్రంథ రచయిత?
జ: చోమ్‌స్కీ

 

117. పియాజె ప్రకారం శిశువు ఏదైనా కొత్త అనుభవాన్ని పొందినప్పుడు అతడు అంతకుముందు పొందిన అనుభవాలతో పోల్చి తనకు అనుకూలంగా మార్చుకోవడం అనే భావనను ఏమంటారు?
జ: సాంశీకరణం

 

118. రాము పాఠశాలకు రోజూ ఒక దారిలో వెళ్తాడు. కానీ తండ్రి ఒకరోజు దగ్గరి దారిలో తీసుకెళ్లాడు. అయితే రాము వచ్చేటప్పుడు మళ్లీ పాత దారినే అనుసరించాడు. ఎందుకంటే ఆ బాలుడు దారిని ఒకేవిధంగా మాత్రమే గుర్తుకు పెట్టుకున్నాడు. ఇది ఏ భావన?
జ: ఏకమితి భావన ఆలోచన

 

119. కౌమార దశను ఆంగ్లంలో Adolescence అని పిలిస్తే అదే కౌమార దశలో ఉన్న వ్యక్తిని Adolescent అంటారు. అయితే యవ్వనంలో విద్యార్థిని ఏ దశలో ఉన్నాడని పిలుస్తారు?
జ: ప్యూబర్టీ

 

120. నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన?
జ: దృష్టి


121. మల్లీశ్వరికి ఎన్ని పద్ధతుల్లో చెప్పినా దగ్గర, దూరం లాంటి స్థాన సంబంధమైన అంశాలను నేర్చుకోలేకపోతుంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి దేనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్రం ఎక్కువగా తోడ్పడుతుంది?
జ: వికాస దశలు

 

122. ఏ సూత్రం ప్రకారం వికాసం సంపూర్ణం నుంచి విడిభాగాల వైపు, విడి భాగాల నుంచి సంపూర్ణం వైపు సాగుతుంది?
జ: వికాస నిర్దేశక సూత్రం

 

123. 'సత్యమునే పలుకుము' లేదా 'సత్యమేవ జయతే' అనే సూక్తులు ఏ వికాస అంశానికి చెందినవి?
జ: నైతిక వికాసం

 

124. కిల్‌పాట్రిక్ ప్రతిపాదించిన ప్రకల్పన పద్ధతిలో విద్యార్థుల వైయక్తిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు బోధించాలి అని చెప్పే నియమం ఏది?
జ: వైయక్తిక భేదాలు

 

125. ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ ఉన్న అమ్మాయి అని అనిపించుకోవడానికి అంజలి ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. అయితే అంజలి కోల్‌బర్గ్ నైతిక వికాసంలోని ఏ సంప్రదాయ స్థితికి చెందుతుంది?
జ: సంప్రదాయ స్థితి

126. కవలలు గురించి కింద ఇచ్చిన వివరణల్లో ఏది సరైంది?

ఎ) కవలలు ఫలదీకరణ చెందిన అండం నుంచి జన్మిస్తారు.
బి) వేర్వేరుగా ఫలదీకరణ చెందిన రెండు అండాల నుంచి జన్మిస్తారు.
సి) ఒకే అండం నుంచి జన్మించవచ్చు లేదా వేర్వేరు అండాల నుంచి జన్మించవచ్చు.
డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

 

127. శ్రీనివాస్ అనే విద్యార్థికి 'అక్షరాలు' దిద్దడానికి తప్పకుండా కావాల్సింది.
జ: పరిపక్వత

 

128. రాజు తన తాతపేరు చెప్పగలడు కానీ తన తాతకు గల మనవడి పేరు చెప్పలేడు. పియాజే ప్రకారం అతడు ఏ దశలో ఉన్నాడు?
జ: ఏకమితి భావన - పూర్వ ప్రచాలక దశ

 

129. కోల్‌బర్గ్ ప్రకారం శిశువు ఏది మంచి, ఏది చెడు అనేది వాటి పరిమాణాలను బట్టి ఆలోచించే దశ
జ: పూర్వ సంప్రదాయ స్థాయి

 

130. ఒక కిలో దూది బరువా? ఇనుము బరువా అంటే దూది బరువు ఎక్కువ అనే దశ
జ: పూర్వ ప్రచాలక దశ

131. కోల్‌బర్గ్ నైతిక వికాసంలో 3వ సంప్రదాయ స్థితిని, ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మూర్తిమత్వ నిర్మాణంలోని దేంతో పోల్చవచ్చు?
జ: అధ్యహం

 

132. నవజాత శిశువు సాధారణ ఉత్తేజం నుంచి ఆర్తి, ఆహ్లాదం, ప్రతిస్పందనగా విడిపోవడాన్ని ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు?
జ: వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు సాగుతుంది

 

133. రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు తర్వాత వేళ్లతో బొమ్మను పట్టుకోవడం
జ: సాధారణం నుంచి నిర్దిష్టం

 

134. రెండు సంవత్సరాల వయసు ఉన్న అజయ్ అనే శిశువు ప్రస్తుత ఎత్తును ఆధారంగా చేసుకుని 20 సంవత్సరాల తర్వాత అతడు ఉండబోయే ఎత్తును అంచనా వేయవచ్చు అని తెలిపే వికాస నియమం?
జ: వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు

 

135. తండ్రి కోప్పడతాడని తనకు ఇష్టం లేకపోయినా ఉదయం పూట లేచి చదువుకోవడం ఏ దశలో ఉన్న విద్యార్థి ప్రవర్తిస్తాడు?
జ: పూర్వ సంప్రదాయ స్థాయి

136. ఉపాధ్యాయుడు మందలించిన అనిల్ అనే విద్యార్థి ఆ బాధను మర్చిపోవడానికి క్రీడలో నిమగ్నమయ్యాడు. ఈ లక్షణాన్ని ఏ పేరుతో పిలుస్తారు?

జ: ఉద్వేగ కెథార్సిస్
 

137. పండితులకు పామరులు జన్మించడం
జ: ప్రతిగమన నియమం

 

138. విద్యార్థులకు ఉపాధ్యాయుడు ముందుగా గుణకారం, భాగాహారం నేర్పించిన తర్వాతనే తీసివేత, కూడిక అనే భావనను నేర్పించాడు. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు పాటించని నియమం?
జ: వికాసం క్రమానుగత నియమం

 

139. కిందివాటిలో పరిణతికి సంబంధించి వాస్తవం కానిది?
       ఎ) దీనికి శిక్షణ అవసరం లేదు         బి) ఇది ఉంటేనే సంసిద్ధత వస్తుంది
       సి) ఇది గుణాత్మకమైంది                 డి) దీన్ని మాపనం చేయవచ్చు
జ: డి (దీన్ని మాపనం చేయవచ్చు)

 

140. 'హుద్ హుద్' తుపాను బాధితులకు సహాయం చేయడం అనేది ఒక పౌరుడిగా తన బాధ్యత అని గుర్తించిన సుమంత్ అనే ఉపాధ్యాయుడు తన సహాయ సహాకారాలను అందిస్తే కోల్‌బర్గ్ నియమం ప్రకారం ఏ దశకు చెందుతాడు?
జ: అధికారం, సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి

141. లాస్య, జైదీప్ అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. వీరిని ఏ వికాస దశకు చెందినవారుగా చెప్పవచ్చు?
జ: తొలి బాల్యదశ

 

142. మోహిత్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి 'ముఠా'గా ఏర్పడి సాంఘిక కృత్యాల్లో పాల్గొంటుంటే ఈ విద్యార్థి ఏ దశకు చెందిన వాడై ఉంటాడు?
జ: ఉత్తర బాల్యదశ

 

143. ఒక విద్యార్థి 'గుర్తింపు' కోసం నిరంతరం శోధిస్తూ అధిక ఒత్తిడిలో ఉన్నట్లయితే ఈ పరిస్థితిని ఏ దశ లక్షణంగా చెప్పవచ్చు?
జ: కౌమార దశ

 

144. కిందివాటిలో ఒక బాలుడి వికాస దశకు సంబంధించి సరికాని వాక్యమేది?
      ఎ) పూర్వ బాల్యదశ - ఆత్మభావన ఏర్పడే దశ   బి) ఉత్తర బాల్యదశ - సాంఘిక వికాసానికి తొలిమెట్టు
      సి) కౌమార దశ - భిన్న లైంగిక ఆసక్తి              డి) యవ్వనారంభ దశ - అలైంగిక జీవి లైంగికంగా మారడం
జ: బి (ఉత్తర బాల్యదశ - సాంఘిక వికాసానికి తొలిమెట్టు)

 

145. శిశువు తనలోని ఉద్వేగ పరిస్థితులను అనుసరించి తనను తాను ప్రేమించుకునే గుణమైన నార్సిజంను ప్రదర్శించే దశ
జ: శైశవ దశ

146. ప్రతిరోజు గుడికి వెళితే దేవుడు డీఎస్సీలో పాస్ చేస్తాడని 'సోము' అనే విద్యార్థి అంతర్గతంగా ప్రేరేపితమయ్యాడు. కోల్‌బర్గ్ ప్రకారం ఈ విద్యార్థి ఏ స్థాయికి చెందుతాడు?
జ: పూర్వ సంప్రదాయ స్థాయి

 

147. కోల్‌బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ది చెందితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు?
జ: అధ్యహం

 

148. కిందివాటిలో సరికాని జత ఏది?
       ఎ) పియాజే - సర్వాత్మవాదం                 బి) కార్ల్ రోజర్స్ - ఆత్మభావన
       సి) కోల్‌బర్గ్ - అవిపర్యాత్మక భావన        డి) నోమ్ ఛోమ్‌స్కీ - అనుకరణ
జ: సి (కోల్‌బర్గ్ - అవిపర్యాత్మక భావన)

 

149. భారతదేశానికి రాజధాని న్యూదిల్లీ అని చెప్పిన తర్వాత న్యూదిల్లీ ఏ దేశ రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేని మోహిత్ ఏ దశలో ఉన్న విద్యార్థి?
జ: పూర్వ ప్రచాలక దశ

 

150. పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు 4 నెలల వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతున్నాడు. అయితే ఆ శిశువు 4 నెలల్లో తల నిలపడం అనేది దేన్ని తెలియజేస్తుంది?
జ: పరిపక్వత

151. అశ్విని తన చెల్లెలు స్నేహిత హోమ్‌వర్క్ చేయడంలో సహకరిస్తుంది. అయితే అశ్విని ఏ దశకు చెందిందిగా చెప్పవచ్చు?
జ: ఉత్తర బాల్యదశ

 

152. ప్రేమ్ అనే విద్యార్థి తెలుగులోని భూత, భవిష్యత్, వర్తమాన కాలాల మధ్య వ్యత్యాసాలను గుర్తించగలుగుతున్నాడు. అయితే అతడు ఏ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చు?
జ: ఉత్తర బాల్యదశ

 

153. వర్షిత్ అనే విద్యార్థి తరచుగా తనకంటే పెద్దవారితో వాదిస్తుంటాడు. తను అనుకున్నది, చేసింది మాత్రమే సరైందని నిరూపించాలనుకుంటాడు. అయితే అతడు వికాస పరిణామంలో ఏ దశలో ఉన్నట్లు?
జ: కౌమార దశ

 

154. ఒక ఉపాధ్యాయుడు పూర్వ బాల్యదశలో ఉన్న విద్యార్థులకు బోధనోపకరణాలు ఉపయోగిస్తూ బోధిస్తున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడికి వేటి పట్ల అవగాహన ఉన్నట్లుగా చెప్పవచ్చు?
జ: వికాస దశలు

 

155. పాఠ్యప్రణాళికలో పొందుపరిచిన 'హక్కులు - విధులు' అనే పాఠ్యాంశం ద్వారా విద్యావేత్తలు విద్యార్థుల నుంచి ఆశించే వికాసం
జ: సాంఘిక వికాసం

156. ఒకటో తరగతి చదువుతున్న జ్యోత్న్స ఒకే పరిమాణంలో ఉన్న ద్రాక్ష పళ్లలో గుత్తిగా ఉన్న ద్రాక్ష పళ్లకంటే విడివిడిగా ఉన్న ద్రాక్ష పళ్లు ఎక్కువగా ఉన్నాయని చెబితే పియాజే ప్రకారం ఆ అమ్మాయి ఏ దశకు చెందిందిగా చెప్పవచ్చు?

జ: పూర్వ ప్రచాలక దశ
 

157. స్నేహితుడు చూడని సమయంలో తన బ్యాగ్‌లోని కలాన్ని దొంగిలించిన విద్యార్థి కోల్‌బర్గ్ ప్రకారం ఏ దశకు చెందినవాడిగా చెప్పవచ్చు?
జ: పూర్వ సంప్రదాయ

 

158. టండ్రా ప్రాంతాల్లో నివసించే లాపులు, ఎస్కిమోలకు జన్మించే సంతానం కూడా వారి మాదిరి పొట్టిగా ఉండటం ఏ సూత్రానికి సంబంధించినది?
జ: సారూప్య సూత్రం

 

159. వ్యక్తి తన కుటుంబంతోనూ, సమాజంతోనూ సర్దుబాటు చేసుకోగలుగుతున్నాడు. ఈ రకమైన పరిణతిని ఏ వికాసంగా చెప్పవచ్చు?
జ: సాంఘిక వికాసం

 

160. అభ్యాస, చలన కౌశలా వికాసానికి సంబంధించి తప్పుగా పేర్కొన్న వాక్యమేది?
       ఎ) ప్రయోగ పరికరాలు అమర్చడం        బి) వయసుతోపాటు ఎత్తు పెరగడం
       సి) సైకిల్ తొక్కడం                               డి) ఈత కొట్టడం
జ: బి (వయసుతోపాటు ఎత్తు పెరగడం)

161. ఒక బంకమట్టి ముద్దను సాగదీస్తే మునుపటి స్థితి కంటే సాగదీసిన మట్టిముద్ద పెద్దదని గ్రహించిన శిశువు ఏ భావనను అర్థం చేసుకోలేదు?
జ: కన్జర్వేషన్

 

162. కిందివాటిలో సరైన జత ఏది?
      ఎ) శాశ్వత దంతాలు - పూర్వబాల్యం       బి) నార్సిజం - శైశవం
      సి) ఉద్వేగ అస్థిరత - కౌమారం                డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

163. కుటుంబంలోని పిల్లవాడు పెద్దతరహాగా ప్రవర్తించలేక, చిన్న పిల్లవాడిలా ఉండలేక సందిగ్ధాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇది ఏ దశ లక్షణం?
జ: కౌమార దశ

 

164. ఒక బాలుడు తాను ఆడుకున్న ఒక ఆట వస్తువును చివరగా దాచిపెట్టి ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాడు. అయితే పియాజే ప్రకారం ఈ భావనను ఎలా తెలియజేయవచ్చు?
జ: వస్తు స్థిరత్వ భావన

 

165. కిందివాటిలో విభిన్న కవలల గురించి అసత్యం కాని అంశం
       ఎ) వేర్వేరు సంయుక్త భేదాలు                         బి) వైయక్తిక భేదాలుంటాయి
      సి) లైంగిక భేదం ఉండొచ్చు, ఉండకపోవచ్చు     డి) అన్నీ
జ: డి (అన్నీ)

166. ఒక విద్యార్థి సినిమాను చూసి సంతృప్తిని చెంది ఇంటికి వచ్చి తన చేతిని తుపాకీగా భావించి అందరినీ భయపెడుతున్నట్లుగా ఆడుకుంటుంటే పియాజే ప్రకారం అది ఏ రకమైన భావన?
జ: ప్రతిభావాత్మక ఆలోచన

 

167. 'Developmental Psychology' గ్రంథ రచయిత ఎవరు?
జ: ఎలిజబెత్ హర్లాక్

 

168. 5వ తరగతికి చెందిన రాము ఒక ఉపాధ్యాయుడికి అత్యంత ప్రీతి పాత్రుడు. ఈ ఉపాధ్యాయుడు రాములోని ఏ భావనను కొలవగలడు?
జ: పెరుగుదల

 

169. 'Growth of Logical Thinking' గ్రంథం మానవుడిలో మానసిక వికాసం ఎలా అభివృద్ధి చెందుతుంది, దాని క్రమాన్ని గురించి వివరిస్తుంది. ఈ గ్రంథ రచయిత ఎవరు?
జ: జీన్ పియాజే

 

170. నైతిక వికాసాన్ని ప్రభావితం చేసే వికాసాలేవి?
       ఎ) సామాజిక, సాంస్కృతిక వికాసం         బి) ఉద్వేగ వికాసం
       సి) సంజ్ఞానాత్మక వికాసం                      డి) అన్నీ
జ: డి (అన్నీ)

171. శిశువు పుట్టుకతోనే స్వతఃసిద్ధంగా వచ్చే భాషా సామర్థ్యంలో వాక్య నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే సూత్రాలుంటాయి. వాటి ద్వారానే శిశువు భాష నేర్చుకుంటాడు. అయితే దాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
జ: గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం

 

172. కౌమార దశను ఆంగ్లంలో Adolescence అని పిలిస్తే అదే కౌమార దశలో ఉన్న వ్యక్తిని Adolescente అని అంటారు. అయితే యవ్వనంలో విద్యార్థిని ఏ దశలో ఉన్నాడు అని పిలుస్తారు?
జ: ప్యూబర్టీ

 

173. రాజు, రాములలో రాము చిన్నవాడు. ఇంట్లో ఏ వస్తువును తెచ్చినా రాము తనకే ముందు ఇవ్వాలంటాడు. ఎవరికీ ఇవ్వనివ్వడు. ఇలాంటి భావన చిన్నపిల్లల్లో కల్పిస్తే వారికి ఏ స్వభావం ఉందంటారు?
జ: అహం కేంద్రీకృతం

 

174. ఒక ఉపాధ్యాయుడు బోధనలో గ్రేడెడ్ అసైన్‌మెంట్స్ ఇస్తున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరిస్తున్న వికాస నియమం ఏది?
జ: వైయక్తిక భేదాలు ఉంటాయి

 

175. ఒక ప్రధానోపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థులకు కేవలం విషయాంశాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. SUPW పీరియడ్ వేయలేదు. ఆ ప్రధానోపాధ్యాయుడికి తెలియని వికాస నియమం
జ: వికాసం సమన్వయంతో కూడింది

176. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని పరికల్పన చేసిన మనోవైజ్ఞానికవేత్త ఎవరు?
జ: నోమ్ ఛామ్‌స్కీ

 

177. కిందివాటిలో అన్నింటికంటే ముఖ్యమైన దశ ఏది?
     ఎ) కౌమార దశ     బి) పూర్వ బాల్యదశ       

     సి) శైశవ దశ       డి) ఉత్తర బాల్యదశ
జ: ఎ (కౌమార దశ)

 

178. కిందివాటిలో శాస్త్రీయ చింతనకు సంబంధించిన దశ ఏది?
      ఎ) ఇంద్రియ ప్రచాలక దశ        బి) పూర్వ ప్రచాలక దశ
      సి) మూర్త ప్రచాలక దశ           డి) అమూర్త ప్రచాలక దశ
జ: డి (అమూర్త ప్రచాలక దశ)

 

179. కిందిటివాటిలో కౌమార దశ ఆగమనంపై ప్రభావం చూపని కారకం ఏది?
      ఎ) ఆరోగ్యం          బి) వయసు       సి) జీవనప్రమాణం        డి) సంస్కృతి
జ: డి (సంస్కృతి)

 

180. జ్ఞాపక శక్తి మందగించే స్థితిని ఏమంటారు?
జ: సెనైలిటీ

 

181. ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం ఏ దశలో ప్రారంభమవుతుంది?
జ: మధ్యవయసు

182. ఫ్యూబర్టీ అనే పదం ప్యూబరిటాస్ అనే పదం నుంచి వచ్చింది. ప్యూబరిటాస్ ఏ భాషా పదం?
జ: లాటిన్

 

183. గౌణ లైంగిక లక్షణాలు వికాసం చెందే దశ ఏది?
జ: జననాంగదశ

 

184. పియాజే ప్రకారం వస్తుస్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది?
జ: సంవేదనా చాలక దశ

 

185. చిన్న పిల్లలు కట్టుకునే 'బొమ్మరిల్లు' ఏ వికాస అంశానికి చెందింది?
జ: సాంఘిక వికాసం

186. వ్యక్తిలో జీవిత పర్యంతం కొనసాగేది?
జ: వికాసం

 

187. జీవి శరీరంలో నిర్మాణాలను, ప్రాకార్యాలను సమైక్యం చేసే ప్రక్రియ?
జ: వికాసం

 

188. కిందివాటిలో వికాసం లక్షణం కానిది?
       ఎ) దిశాత్మకం       బి) సమన్వయం        

       సి) సమగ్రత       డి) పరిమిత చర్య
జ: డి (పరిమిత చర్య)

189. శిశువు ప్రారంభం దేంతో మొదలవుతుంది?
జ: జైగోట్

 

190. 'భాష అన్ని ఉన్నత సంజ్ఞానాత్మక ప్రక్రియలకు మూలం' అని పేర్కొన్నదెవరు?
జ: వైగోట్‌స్కీ

 

191. Developmental Psychology గ్రంథకర్త ఎవరు?
జ: ఎలిజబెత్ హర్లాక్

 

192. శిశువు మొదట ఏ వికాసాన్ని ప్రదర్శిస్తాడు?
జ: ఉద్వేగ వికాసం

 

193. వాక్యక్రమ నిర్మాణాలు, లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్ లాంటి భాషాపరమైన గ్రంథాలు రాసి పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు?
జ: నోమ్ ఛోమ్‌స్కీ

 

194. కౌమారదశ అన్ని దశల్లోకెల్లా ముఖ్యమైంది. ఈ దశను ''ఒత్తిడి, కలత, ప్రయాస, జగడాలతో కూడుకున్నది" అని వివరించినదెవరు?
జ: స్టాన్లీ హాల్

 

195. సమీప - దూరస్థ దశ అంటే?
జ: శరీర మధ్యస్థ భాగంలో వికాసం జరిగి తర్వాత దూర అవయవాల్లో జరగడం

196. వ్యక్తి వికాసంలో అనువంశికత పాత్ర గురించి చెప్పని శాస్త్రవేత్త ఎవరు?
జ: న్యూమన్

 

197. మేనరిక వివాహాల్లో ప్రజ్ఞలాంటి మానసిక శక్తులు తరగడానికి వర్తించే సూత్రం
జ: తిరోగమన సూత్రం

 

198. 'ఎడ్యుకేషనల్ డిటర్మినిజం' గ్రంథ రచయిత?
జ: డబ్ల్యూసీ.బాగ్లే

 

199. సాంఘికీకరణకు పునాది ఏర్పడే దశ?
జ: పూర్వ బాల్యదశ

 

200. ఉద్వేగ కేథార్సిస్ సంభవించే దశ?
జ: ఉత్తర బాల్యదశ

 

201. సాంఖ్యక నైపుణ్యాల్లో రాణించడం అనేది?
జ: సాంఘిక వికాసం

 

202. ఉద్వేగ కేథార్సిస్‌లో ఇమిడి ఉండే ప్రక్రియ
జ: అంతర్ దృష్టి

203. భవిష్యత్తులో ఏ వృత్తిలో స్థిరపడాలి అనే విషయంపై నిర్ణయం తీసుకునే దశ?

జ: కౌమార దశ

204. శిశువు వస్తువును వర్గీకరించడం, పోల్చడం లాంటి మెరుగైన మానసిక చర్యలు చేపట్టగలిగే వయసు ఎన్నేళ్లు?
జ: 7 - 11

 

205. ప్రీ స్కూల్, ఎలిమెంటరీ స్థాయుల్లో విధ్యాబోధనపై ప్రభావం చూపిన పియాజే సూత్రం?
      ఎ) ఆవిష్కరణ అభ్యసనం                   బి) అభ్యసనం పట్ల పిల్లల సంసిద్ధత
      సి) వైయక్తిక భేదాలు గుర్తించడం        డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

206. 'వికాస కృత్యాల' భావనను మొదట ఎవరు ప్రవేశపెట్టారు?
జ: రాబర్ట్ హావింగ్ హర్‌స్ట్

 

207. 'వాక్యక్రమ నిర్మాణాలు' గ్రంథ రచయిత ఎవరు?
జ: నోమ్ ఛోమ్‌స్కీ

 

208. పిల్లలు శాస్త్రవేత్తల్లా పరికల్పనలు సూచించే దశ
జ: అమూర్త ప్రచాలక దశ

 

209. వరద బాధితులకు సహాయం చేయడం అనేది ఒక పౌరుడిగా తన బాధ్యతగా గుర్తించిన మోహన్ అనే విద్యార్థి వారికి వీలైనంత ఎక్కువ సహకారం అందిస్తున్నాడు. ఈ విద్యార్థి కోల్‌బర్గ్ పేర్కొన్న ఏ స్థాయిలో ఉన్నాడు?
జ: 2వ

210. బన్నీ, బుజ్జి అనే పిల్లలు తమ ఇంట్లోని సైకిల్‌ను స్కూటర్‌గా భావించి వేగంగా నడుపుతున్నట్లు ఆటాడుతుంటే పియాజే ప్రకారం వారు ఏ దశలో ఉన్నారు?

జ: పూర్వ ప్రచాలక దశ
 

211. వినీత్ రోజూ అధికభాగం అద్దం ముందు గడుపుతున్నాడు. అయితే ఈ విద్యార్థి ఏ దశకు చెందినవాడు?
జ: కౌమార దశ

 

212. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
         ఎ) జీన్ పియాజే - ఎనిమిజం           బి) కార్ల్ రోజర్స్ - ఆత్మభావన
         సి) కోల్‌బర్గ్ - కన్సర్వేషన్                డి) నోమ్ ఛోమ్‌స్కీ - అనుకరణ
జ: సి (కోల్‌బర్గ్ - కన్సర్వేషన్)

 

213. పునీత్ అనే విద్యార్థి ఉత్తర బాల్యదశకు చెందినవాడైతే ఇతడిలోని లక్షణాల్లో ఏ లక్షణం సరైంది కాదు?
జ: ఉద్వేగ కేథార్సిస్ ఏర్పడదు

 

214. మనస్విని అనే అమ్మాయి తన తండ్రిలాంటి శరీరాకృతిని, మంచి ప్రజ్ఞాసామర్థ్యం కలిగి ఉన్నట్లయితే మెండల్ ఏ నియమాన్ని ఇది సమర్థిస్తుంది?

జ: సారూప్యత నియమం

215. నైతిక వికాసం అనేది పెంపకం, అభ్యసన అనుభవాలతోపాటు ఏ వికాసంపై కూడా ఆధారపడుతుందని కోల్‌బర్గ్ పేర్కొన్నారు?
జ: సంజ్ఞానాత్మక వికాసం

 

216. వ్యక్తుల వికాసానికి, పాఠశాల వసతులకు సంబంధం ఉంటుందని తెలిపినవారు?
జ: డబ్ల్యు.సి.బాగ్లే

 

217. ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇచ్చే అభ్యసన కృత్యాలు విజయవంతం కావడానికి అతడికి తెలియాల్సిన మనోవైజ్ఞానిక అంశం
జ: వికాస దశలు - సూత్రాలు

 

218. ఫ్రాయిడ్ ప్రకారం నైతిక వికాసంలో ప్రధాన పాత్ర నిర్వహించేది?
జ: అధ్యహం

 

219. గార్డినర్ పేర్కొన్న ఏడు రకాలైన ప్రజ్ఞాపట్టికలో లేనిది
జ: ఉద్వేగ ప్రజ్ఞ

 

220. జ్ఞానేంద్రియ వికాసం వేగంగా జరిగే దశ?
జ: శైశవ దశ

 

221. శిశువు ప్రవర్తన ఎలాంటి నైతిక ప్రమాణాలపై ఆధారపడని దశ
జ: శైశవ దశ

221. ప్రముఖులు, పండిత కుటుంబాలకు చెందిన 997 కుటుంబాల మీద పరిశోధనలు చేసి వికాసంపై అనువంశికతను నిర్థారించినవారు
జ: ఫ్రాన్సిస్ గాల్టన్

 

223. సర్వశక్తుల సమ్మేళనం అనేది
జ: వికాసం

 

224. ఒక శిశువు సైకిల్ తొక్కడానికి అవసరమైంది
జ: పరిపక్వత, అభ్యసనం
225. కిందివాటిలో పెరుగుదలకు చెందిన అంశం?
        ఎ) రెండు సంవత్సరాల నాటికి మెదడు రెట్టింపు బరువుకు చేరడం
        బి) కన్ను ఒక అంశంపై దృష్టి నిలపడం
        సి) మూడు చక్రల సైకిల్ నడపడం
        డి) భాషను ఉపయోగించడం
జ: ఎ (రెండు సంవత్సరాల నాటికి మెదడు రెట్టింపు బరువుకు చేరడం)

 

226. కిందివాటిలో వికాస దశ గురించి సరైంది?
        ఎ) క్రమబద్ధంగా వస్తుంది                           బి) ప్రతి దశ కొన్ని సమస్యలు, సర్దుబాటును కలిగి ఉంటుంది
        సి) ఏకత్వ, సమైక్య లక్షణాలు కలిగి ఉంటుంది        డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

227. ''పండిత పుత్ర పరమశుంఠ" అనే సామెత మెండల్ అనువంశిక నియమాల్లో ఏ నియమాన్ని సమర్థిస్తుంది?
జ: ప్రతిగమన నియమం

 

228. నేను చదివే పాఠశాల గొప్పదనీ, తన తల్లిదండ్రులు అడిగినవన్ని కొనిస్తారనీ తనకు చాలా డ్రస్సులున్నాయని బడాయిలు చెప్పుకునే శిశువు ఆలోచన
జ: స్వీయ కేంద్రీకృతం

 

229. పియాజే సంజ్ఞాత్మక వికాసంలో జ్ఞానేంద్రియ చాలక దశకు సంబంధించి సరికానిది?
         ఎ) 0 - 4 నెలల వయసులో శిశువు తనకు తృప్తినిచ్చిన పనిని మళ్లీ మళ్లీ చేయడం
         బి) 4 - 8 నెలల వయసులో తనకు ఇతర వస్తువులకు మధ్య తేడాను గుర్తించడం
         సి) 18 - 24 నెలల వయసులో అంతరదృష్టిని ఉపయోగించడం
         డి) 12 - 24 నెలల వయసులో శిశువు పాకడం నేర్చుకుంటాడు
జ: డి (12 - 24 నెలల వయసులో శిశువు పాకడం నేర్చుకుంటాడు)

 

230. వర్ధిమర్ గెస్టాల్ట్ వాదానికి చెందిన సమగ్ర ఆకృతిని తెలియజేసే వికాస నియమం ఏది?
జ: వికాసం పరస్పర శక్తులతో కూడిన సమ్మేళనం.

 

231. తండ్రి జేబులోంచి డబ్బులు తీయడం వల్ల శిక్ష లభిస్తుందని గ్రహించిన నిత్య అనే విద్యార్థిని కోల్‌బర్గ్ ప్రకారం ఏ దశకు చెందింది?
జ: పూర్వ సంప్రదాయ

 

232. శిశువు ఇంద్రియాలకు, చలన ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపే దశ ఏది?
జ: ఇంద్రియ చాలక దశ

233. కోల్‌బర్గ్ ప్రకారం బాధ్యత నిర్వహించడం, అధికారాన్ని గౌరవించడం లాంటి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే దశ
జ: సంప్రదాయ స్థాయి

 

234. బడి నియమాల అనుసారంగా విద్యార్థులు నడుచుకోవాలి అని ప్రవర్తించే పిల్లవాడు ఏ దశకు చెందినవాడు?
జ: సంప్రదాయ స్థాయి

 

235. ఏ దశలోని శిశువు తనకు, ఇతర వస్తువులకు మధ్య తారతమ్యాలను గుర్తిస్తాడు?
జ: సంవేదనా చాలక దశ

 

236. కాళ్లు, చేతులు బాగా ఊపడం ఏ ఉద్వేగ లక్షణం?
జ: ప్రేమ

 

237. అధికంగా ప్రశ్నించే దశ/ కుతూహల దశ/ అన్వేషణ దశ
జ: పూర్వ బాల్యదశ

 

238. కిందివాటిలో భిన్నమైంది?
        ఎ) వ్యతిరేక వాదం         బి) అధికారతత్వం     

        సి) సాంఘిక ఆమోదం      డి) దౌర్జన్యం
జ: సి (సాంఘిక ఆమోదం)

 

239. ఉత్తర బాల్యదశలోని పిల్లల సంభాషణ ముఖ్యంగా దేనిపై ఆధారపడి ఉంటుంది?
జ: సాంఘిక అనుభవాలు

240. పిల్లలు వీడియోగేమ్స్ ఆడటం?
జ: సంసర్గ క్రీడ

 

241. పాఠశాలలో దండనకు గురైన విద్యార్థి, ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లి దగ్గర భోరున ఏడ్వడం?
జ: ఎమోషనల్ కేథార్సిస్

 

242. భౌతిక వికాసానికి సంబంధించి లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కనిపించే దశ?
జ: ఉత్తర బాల్యదశ

 

243. వాగుడుకాయ దశ?
జ: పూర్వబాల్యదశ

 

244. భాషా వికాసానికి సంబంధించి ఉచ్ఛారణలో ఇమిడి ఉండే ప్రక్రియ?
జ: సంజ్ఞానాత్మకత

 

245. సాంఖ్యక నైపుణ్యాల్లో రాణించడం అనేది?
జ: సాంఘిక వికాసం

 

246. పాఠశాల విద్యార్థులు రాత నైపుణ్యాన్ని పెంచుకునే దశ?
జ: 2 - 3 తరగతులు

 

247. సమయం, దూరం లాంటి అమూర్త భావనలను అర్థం చేసుకోవడమనేది?
జ: మానసిక వికాసం

248. కిందివాటిలో అసాంఘిక ప్రవర్తన నమూనా కానిది?
        ఎ) ప్రతికూల అభిప్రాయం       బి) అధికారతత్వం      

        సి) స్వార్థం        డి) సాంఘిక ఆమోదం
జ: డి (సాంఘిక ఆమోదం)

 

249. సాంఘికీకరణకు పునాది ఏర్పడే దశ
జ: పూర్వ బాల్యదశ

 

250. యవ్వనారంభ దశ?
జ: శారీరక పరిణతి

 

251. ఫలదీకరణం చెందిన అండంలో ఎన్ని జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి?
జ: 23

 

252. 'ఎడ్యుకేషనల్ డిటర్మినిజం' గ్రంథ రచయిత ఎవరు?
జ: డబ్ల్యు.సి.బాగ్లే

 

253. అమెరికాలో కల్లికాక్ కుటుంబం లక్షణాల మీద పరిశోధనలు చేసినవారెవరు?
జ: గోడార్డ్

 

254. బ్రీచ్ పుట్టుక అంటే?
జ: కాళ్లు ముందు, తల వెనుకతో జన్మించడం

255. వ్యక్తి వికాసంలో అనువంశికత పాత్ర గురించి చెప్పని శాస్త్రవేత్త ఎవరు?
         ఎ) గొడార్డ్          బి) కెల్లాగ్

         సి) గాల్టన్          డి) న్యూమన్
జ: డి (న్యూమన్)

 

256. విద్యార్థికి సంకలనం, వ్యవకలనం నేర్పేటప్పుడు ముందు అంకెల భావన నేర్పడమనేది?
జ: వికాసం క్రమానుగతమైంది

 

257. శిశువు శారీరక పెరుగుదల మొదట ఏ సూత్రాన్ని అనుసరించి జరుగుతుంది?
జ: శిరఃపాదాభిముఖం

 

258. సమీప - దూరస్థ దశ అంటే ఏమిటి?
జ: శరీర మధ్యస్థ భాగంలో వికాసం జరిగి తర్వాత దూర అవయవాల్లో జరగడం


259. కిందివాటిలో వికాసం అనే ప్రక్రియకు సంబంధించింది?
     ఎ) వికాసం = f (పరిపక్వత × అభ్యసనం)       బి) వికాసం = f (పరిపక్వత × ప్రేరణ)
     సి) వికాసం = f (పరిపక్వత × పెరుగుదల)      డి) వికాసం = f (అభ్యసనం × ప్రేరణ)
జ: ఎ (వికాసం = f (పరిపక్వత × అభ్యసనం))
260. వికాసం అంటే ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని నిర్వచించినదెవరు?
జ: అండర్‌సన్

 

261. మానవుడి అన్ని వికాస దశలను పరిశీలించినప్పుడు అత్యధిక నిష్పత్తిలో శారీరక పెరుగుదల ఏ దశలో కలుగుతుంది?
జ: శైశవ దశ

 

262. శిశువులో ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది?
జ: పూర్వ బాల్యదశ

 

263. ''బిహేవియర్: యాన్ ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ సైకాలజీ" అనే గ్రంథాన్ని ఎవరు ప్రచురించారు?
జ: జేబీ వాట్సన్

 

264. వైగోట్‌స్కీ ప్రకారం జ్ఞానానికి సంబంధించి సరికానిది
  ఎ) అందించబడేది           బి) సృష్టించబడేది
  సి) మానసిక ప్రక్రియలు జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తాయి      
  డి) సాంఘిక ప్రతిచర్య మేధస్సును వికసించేలా చేస్తుంది
జ: ఎ (అందించబడేది)

 

265. పర్యాలోచక ఆలోచన?
జ: తార్కిక రీతిన విషయాలు ఉంచి సమస్యా పరిష్కారం చేయడం

 

266. కిందివాటిలో సరైన వికాస క్రమం
     ఎ) భౌతిక - చాలక - భాషా - సంజ్ఞాన      బి) చాలక - భౌతిక - సంజ్ఞాన - భాషా
    సి) భాషా - సంజ్ఞాన - చాలక - భౌతిక       డి) భౌతిక - చాలక - సంజ్ఞాన - భాషా
జ: ఎ (భౌతిక - చాలక - భాషా - సంజ్ఞాన)

267. సంఘం ఆశించిన విధంగా శిశు వికాసం జరుగుతుంది అనడానికి ఒక ఉదాహరణ
జ: పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించడం

 

268. వికాసం లక్షణం కానిది
     ఎ) దిశాత్మకం     బి) సమన్వయం      సి) సమగ్రత      డి) పరిమిత చర్య
జ: డి (పరిమిత చర్య)

 

269. కిందివాటిలో సరికానిది?
        ఎ) గుణాత్మక మార్పు పరిమాణాత్మక మార్పునకు దారితీస్తుంది
        బి) పరిమాణాత్మక మార్పు, గుణాత్మక మార్పుకు దారితీస్తుంది
        సి) పరిణతి పరిమాణాత్మక, గుణాత్మక మార్పు
        డి) వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పు
జ: ఎ (గుణాత్మక మార్పు పరిమాణాత్మక మార్పునకు దారితీస్తుంది)

 

270. కిందివాటిలో సరికానిది ఏది?
     ఎ) ఎడ్యుకేషనల్ డిటర్మినిజం - బాగ్లే      బి) ద జూక్స్ - గొడ్డార్డ్
     సి) హెరిడిటరీ జీనియస్ - గాల్టన్         డి) డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ - దవే
జ: బి (ద జూక్స్ - గొడ్డార్డ్).


రచయిత: కోటపాటి హరిబాబు


 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌