• facebook
  • whatsapp
  • telegram

అభ్యసనం

1. కిందివాటిలో అభ్యసనానికి సంబంధించి సరైంది ఏది? 
1) ప్రవర్తనలో కలిగే ఏదైనా మార్పు 
2) పరిపక్వత వల్ల ప్రవర్తనలో కలిగే మార్పు 
3) శిక్షణ ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు    
4) జబ్బుల వల్ల వచ్చే తాత్కాలిక మార్పు
జ: 3 (శిక్షణ ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు)

 

2. కిందివాటిలో అభ్యసన లక్షణం కానిది?
1) అభ్యసనం సార్వత్రికమైంది.        2) అభ్యసనం ప్రక్రియ కాదు ఫలితం.
3) అభ్యసనం గమ్య నిర్దేశకమైంది.    4) అభ్యసనం పరిపక్వతపై ఆధారపడుతుంది.
జ: 2 (అభ్యసనం ప్రక్రియ కాదు ఫలితం.)

 

3. కిందివాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే మానసిక సంబంధ కారకం కానిది?
1) అవధానం     2) అలసట     3) స్మృతి     4) అభిరుచి
జ: 2 (అలసట)

4. ఉదయ్‌ అనే విద్యార్థి తల్లిదండ్రులకు చదువుపట్ల సరైన వైఖరి లేకపోవడం వల్ల అభ్యసనంలో వెనుకబడిన ఆ విద్యార్థి అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకం
జ: కుటుంబ కారకం

 

5. ఉపాధ్యాయ - విద్యార్థి నిష్పత్తి సరిగా లేకపోవడం వల్ల కిరణ్‌ అనే విద్యార్థి అభ్యసనంలో వెనుకబడి ఉన్నట్లయితే ఆ విద్యార్థి అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకం
జ: పాఠశాల కారకం

 

6. అభ్యసనంలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశం
జ: అనుభవం

 

7. అభ్యసనం =
జ: అంత్య ప్రవర్తన - ప్రవేశ ప్రవర్తన

 

8. అభ్యసన సోపానాల వరుస క్రమంలో రెండోది
జ: లక్ష్యాలను ఏర్పరచుకోవడం

 

9. అభ్యసనానికి సంబంధించి సరికానిది 
1) అభ్యసనం అనేది ప్రక్రియ          2) అభ్యసనం ఫలితం మాత్రమే
3) అభ్యసనం జీవితాంతం జరుగుతుంది   4) అభ్యసనం గమ్య నిర్దేశకం
జ: 2 (అభ్యసనం ఫలితం మాత్రమే)

10. ‘జబ్బు, అలసట, మత్తు పదార్థాలను సేవించడం వల్ల తాత్కాలికంగా శరీరంలో జరిగే మార్పులే అభ్యసనం’ అని తెలిపినవారు
జ: హెర్జన్‌హాన్‌

 

11. విద్యార్థి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం
జ: విద్యార్థి ఆత్మవిశ్వాసం

 

12. సంప్రదాయక నిబంధనంలో నిబంధిత ప్రతిస్పందన విరమణ చెందడానికి కారణం
జ: నిర్నిబంధిత ఉద్దీపన లేకపోవడం.

 

13. పాఠశాలలో అల్లరి చేస్తున్న విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడి రాకను గమనించి నిశ్శబ్దంగా ఉండటం అనేది ఏ అభ్యసనా సిద్ధాంతాన్ని సూచిస్తుంది?
జ: S - Type నిబంధనం

 

14. కిందివాటిలో సంప్రదాయక నిబంధనం కానిది?
1) ట్రాఫిక్‌ సిగ్నల్స్‌కు అనుగుణంగా వాహనాలు నడపడం. 
2) వ్యాయామ ఉపాధ్యాయుడి విజిల్‌ శబ్దానికి అనుగుణంగా డ్రిల్‌ చేయడం. 
3) జాతీయ గీతం వినబడగానే లేచి నిలబడటం. 
4) విద్యార్థులు ఉపాధ్యాయుడిని అనుకరించడం.
జ: 4 (విద్యార్థులు ఉపాధ్యాయుడిని అనుకరించడం.)

 

15. కిందివాటిలో సరికానిది. 
1) ప్రవర్తనావాద ఉపగమాలు - పావ్‌లోవ్, థార్న్‌డైక్, స్కిన్నర్‌ అభ్యసనా సిద్ధాంతాలు
2) గెస్టాల్ట్‌వాద ఉపగమాలు - కొహ్లెర్, కోఫ్‌కా అభ్యసనా సిద్ధాంతాలు
3) పరిశీలనాత్మక ఉపగమాలు - బండూరా, వైగోట్‌స్కీ అభ్యసనా సిద్ధాంతాలు
4) నిర్మాణాత్మక ఉపగమాలు - పియాజె సంజ్ఞానాత్మక అభ్యసనా సిద్ధాంతాలు
జ: 3 (పరిశీలనాత్మక ఉపగమాలు - బండూరా, వైగోట్‌స్కీ అభ్యసనా సిద్ధాంతాలు)

 

16. ప్రశాంత్‌ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు సమయానికి వచ్చిన విద్యార్థులకు మాత్రమే ప్రతిరోజూ పెన్సిల్‌ను బహుమతిగా ఇస్తున్నాడు. కొద్ది రోజులకు విద్యార్థులందరూ సమయానికి పాఠశాలకు హాజరుకావడం అనేది పావ్‌లోవ్‌ ఏ నియమాన్ని తెలియజేస్తుంది?
జ: పునర్బలనం

 

17. కిందివాటిలో కార్యక్రమయుత అభ్యసనానికి చెందనిది?
(i) భాగస్వామ్యయుత బోధన  (ii) వైయక్తిక అభ్యసనం  (iii) స్వీయ అభ్యసనం    
(iv) స్వీయ బోధన           (v) స్వీయ పునర్బలనం
జ: i

18. చిన్న పిల్లల్లో ఉండే వేళ్లను చీకడం, పక్క తడపడం లాంటి అలవాట్లను తొలగించడానికి తోడ్పడే పావ్‌లోవ్‌ నియమం
జ: విరమణ

 

19. ప్రతిరోజూ నల్లబల్లపై తేదీని రాసే భార్గవి 7.09.2018 కి బదులుగా 07.08.2018 అని రాస్తే ఇది పావ్‌లోవ్‌ ఏ నియమాన్ని సమర్థిస్తుంది?
జ: అయత్నసిద్ధస్వాస్థ్యం

 

20. పోలీస్‌ పట్ల భయాన్ని ఏర్పరచుకున్న బాబ్జీ పోలీస్‌స్టేషన్‌ను చూసి కూడా భయాన్ని వ్యక్తపరచడం అనేది పావ్‌లోవ్‌ ఏ నియమాన్ని సూచిస్తుంది?
జ: ఉన్నతక్రమ నిబంధనం

 

21. గణితశాస్త్ర ఉపాధ్యాయుడి పట్ల గల భయాన్ని అమృత సామాన్యశాస్త్ర ఉపాధ్యాయుడి పట్ల కూడా వ్యక్తపరచడమనేది పావ్‌లోవ్‌ ఏ నియమాన్ని సూచిస్తుంది?
జ: సామాన్యీకరణం

 

22. నిబంధిత ప్రతిస్పందన దాదాపు శాశ్వతమైంది అనడాన్ని సమర్థించే పావ్‌లోవ్‌ నియమం
జ: అయత్నసిద్ధస్వాస్థ్యం

 

23. శాస్త్రీయ నిబంధనానికి సంబంధించి సరికానిది. 
1) S - Type నిబంధనం            2) ఈ ప్రయోగంలో జీవి క్రియాత్మకం
3) ఉద్దీపనకు అధిక ప్రాధాన్యం ఉంటుంది   4) రాబట్టిన ప్రతిస్పందనలు ఉంటాయి
జ: 2 (ఈ ప్రయోగంలో జీవి క్రియాత్మకం)

 

24. గణిత ఉపాధ్యాయుడి పట్ల భయాన్ని ఏర్పరచుకున్న గీత గణితం సబ్జెక్టుపై కూడా భయాన్ని వ్యక్తపరచడం అనేది పావ్‌లోవ్‌ ఏ నియమాన్ని సూచిస్తుంది?
జ: ఉన్నతక్రమ నిబంధన

 

25. బడిగంట శబ్దాన్ని పోలిన గుడి గంట శబ్దాన్ని కూడా బడి గంటగా భావించి శిరీష బడివైపు పరుగుతీసింది. అయితే ఇది పావ్‌లోవ్‌ ఏ నియమాన్ని తెలియజేస్తుంది?
జ: సామాన్యీకరణం

 

26. కార్యసాధక నిబంధనానికి సంబంధించి సరికానిది?
1) ఇది ప్రతిస్పందన ప్రాధాన్యతా సిద్ధాంతం.     2) ఇందులో జీవి నిష్క్రియాత్మకంగా ఉంటుంది.
3) ఇందులో ప్రతిస్పందనలు వెలువడతాయి.   4) దీన్ని R - Type సిద్ధాంతం అని కూడా అంటారు.
జ: 2 (ఇందులో జీవి నిష్క్రియాత్మకంగా ఉంటుంది.)

 

27. కిందివాటిలో సరికానిది?
(i) రాబట్టిన ప్రతిస్పందనలు - ఉద్గమాలు      (ii) వెలువడిన ప్రతిస్పందనలు - నిర్గమాలు
(iii) S-Type నిబంధనం - శాస్త్రీయ నిబంధనం  (iv) R-Type నిబంధనం - కార్యసాధక నిబంధనం
జ: i, ii

 

28. కార్యసాధక నిబంధనానికి సంబంధించి సరికానిది?
(i) మీట నొక్కడం - నిబంధిత ప్రతిస్పందన    

(ii) ఆహారం తినడం - సహజ ప్రతిస్పందన
(iii) మీట - నిబంధిత ప్రతిస్పందన
జ: iii

 

29. నిరుద్దీపనా ప్రతిచర్యల్లో కచ్చితమైన ప్రతిచర్యను పునర్బలనంతో నిబంధనం చేసి కార్యసాధనకు పురికొల్పేలా చేయడం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం
జ: కార్యసాధక నిబంధనం

 

30. ప్రవీణ అనే ఉపాధ్యాయురాలు తన విద్యార్థులతో ప్రాజెక్టు పని చేయిస్తూ ప్రతి రెండు నిమిషాలకు పునర్బలనాన్ని ఇస్తుంటే స్కిన్నర్‌ ప్రకారం ఇది ఏ రకమైన పునర్బలనంగా చెప్పవచ్చు?
జ: స్థిర కాలవ్యవధి పునర్బలనం

31. అలీ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్నాడు. విద్యార్థులు సరైన ప్రతిస్పందనను చూపిన ప్రతిసారీ బహుమతి ఇస్తున్నాడు. స్కిన్నర్‌ ప్రకారం ఇది ఏ రకమైన పునర్బలన నియమం?
జ: నిరంతర పునర్బలనం

 

32. రాము అనే ఉపాధ్యాయుడు విద్యార్థికి అస్థిర కాల వ్యవధుల్లోనూ అస్థిర ప్రతిస్పందనలకు పునర్బలనం ఇస్తున్నాడు. స్కిన్నర్‌ ప్రకారం ఇది ఏ రకమైన పునర్బలనం?
జ: చరశీల పునర్బలనం

 

33. కార్యక్రమయుత అభ్యసనానికి సంబంధించి సరికానిది ఏది?
    1) అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు.    2) తక్షణ పరిపుష్టి ఉండదు.
    3) స్వీయ అభ్యసనం జరుగుతుంది.            4) స్వీయ మూల్యాంకనం జరుగుతుంది.
జ: 2 (తక్షణ పరిపుష్టి ఉండదు.)

 

34. బోధనా యంత్రాలను మొదట కనుక్కున్నవారు
జ: ప్రెస్సీ

 

35. లత ఒక ప్రశ్నావళికి ప్రతిస్పందనలను ఇస్తుండగా వినోద్‌ అనే ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి మూడు ప్రతిస్పందనలకు పునర్బలనం కలిగిస్తున్నాడు. స్కిన్నర్‌ ప్రకారం ఇది ఏ రకమైన పునర్బలనం?
జ: స్థిర నిష్పత్తి పునర్బలనం

36. అంధుడిని రోడ్డు దాటించిన శిరీషను గమనించిన ఉపాధ్యాయుడు మరుసటి రోజు ప్రార్థన సమయంలో ఆమెను అభినందించాడు. ఈ ప్రోత్సాహంతో శిరీష వృద్ధులకు సహాయం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవడం అనేది
జ: కార్యసాధక నిబంధనం

 

37. నిబంధిత ప్రతిస్పందనకు, ప్రతిఫలానికి మధ్య సంసర్గం ద్వారా ఏర్పడే నిబంధనం
జ: కార్యసాధక నిబంధనం

 

38. ఒక విద్యార్థి A for Apple, B for Ball, C for Cat అని చెబుతుంటే... మనోవిజ్ఞానశాస్త్రం పట్ల అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా దీన్ని ఏ అభ్యసనంగా గుర్తిస్తావు?
జ: నిబంధన అభ్యసనం

 

39. కళ్యాణ్‌ అనే విద్యార్థి గేమ్‌ ఆడేటప్పుడు... ప్రతి లెవెల్‌ పూర్తి చేసినప్పుడల్లా కొన్ని అవార్డులు పొందుతూ ఇంకా బాగా ఆడే ప్రవర్తనను అలవరచుకున్నాడు. ఈ ప్రవర్తనను వివరించే అభ్యసన సిద్ధాంతం
జ: కార్యసాధక నిబంధన

 

40. 5వ తరగతి చదువుతున్న మోహన్‌ బహుమతిని పొందడం కోసం మాత్రమే చదివేందుకు అలవాటుపడ్డాడు. ఇది ఏ అభ్యసనా సిద్ధాంతాన్ని తెలుపుతుంది?
జ: కార్యసాధక నిబంధన సిద్ధాంతం

41. కిందివాటిలో థారన్‌డైక్‌ రచించని గ్రంథం
    1) యానిమల్‌ ఇంటెలిజెన్స్‌          2) మెజర్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌
    3) ది సైకాలజీ ఆఫ్‌ లెర్నింగ్‌         4) ది వర్క్‌ ఆఫ్‌ డైజెస్టివ్‌ గ్లాండ్స్‌
జ: 4 (ది వర్క్‌ ఆఫ్‌ డైజెస్టివ్‌ గ్లాండ్స్‌)

 

42. ఏదైనా కృత్య అభ్యసనం ఒక ప్రయత్నంలో సాధ్యపడదు. అనేక ప్రయత్నాలు చేయడం వల్ల దోషాలు తగ్గి చివరకు కచ్చితమైన సంధానాన్ని గ్రహించడం ద్వారా ఒక ప్రయత్నంలోనే ఆ కృత్యాన్ని సాధించవచ్చు. ఈ సిద్ధాంతాన్ని తెలియజేసినవారు
జ: ఇ.ఎల్‌.థారన్‌డైక్‌

 

43. కిందివాటిలో యత్నదోష అభ్యసనం కానిది?
    1) ఉక్తలేఖనం ద్వారా రాత దోషాలు లేకుండా రాయడం నేర్చుకోవడం.    2) టైపు చేయడం నేర్చుకోవడం.
    3) కాపీలు రాయడం ద్వారా చేతిరాత మెరుగుపరచుకోవడం.
    4) నూతన ఆవిష్కరణలకు మూలమైన అభ్యసనం.
జ: 4 (నూతన ఆవిష్కరణలకు మూలమైన అభ్యసనం.)

44. రమేష్‌ అనే తెలుగు ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులకు ఛందస్సు బోధించాలనుకున్నాడు. ఆ ఉపాధ్యాయుడికి థారన్‌డైక్‌ ఏ నియమంపై అవగాహన లేదని చెప్పవచ్చు?
జ: సంసిద్ధతా నియమం

 

45. హరి అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వచ్చి నేరుగా పాఠ్యాంశాన్ని బోధించడం మొదలుపెడతాడు. ఆ ఉపాధ్యాయుడికి థారన్‌డైక్‌ ఏ నియమంపై అవగాహన లేదని చెప్పవచ్చు?
జ: సంసిద్ధతా నియమం

 

46. ప్రకాశ్‌ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రజ్ఞా స్థాయికి మించిన విషయాలను బోధిస్తున్నట్లయితే ఆ ఉపాధ్యాయుడు థారన్‌డైక్‌ ఏ నియమాన్ని పరిగణనలోనికి తీసుకోలేదు?
జ: సంసిద్ధతా నియమం

 

47. కార్యసాధక నిబంధనం, థారన్‌డైక్‌ ప్రతిపాదించిన ఏ నియమంపై ఆధారపడుతుంది?
జ: ఫలిత నియమం

 

48. ‘అభ్యాసం కూసు విద్య’ అనేది థారన్‌డైక్‌ ఏ నియమాన్ని సూచిస్తుంది?
జ: అభ్యాస నియమం

49. కంప్యూటర్‌ ఆధారిత బోధన, ఈ-లెర్నింగ్, మొబైల్‌ ఫోన్‌లోని ఆటలు ఆడటం ఏ అభ్యసనా సిద్ధాంతాన్ని సమర్థిస్తాయి?
జ: కార్యక్రమయుత అభ్యసనం

 

50. నూతన పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశం చివర ఉన్న ‘మనం ఏం నేర్చుకున్నాం’ లోని ముఖ్య భావనలు ఏ నియమాన్ని సూచిస్తాయి?
జ: అభ్యాస నియమం

 

51. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య బంధం ఏర్పడినప్పుడు సంతృప్తికరమైన ఫలితాలు కలిగితే ఆ చర్యను తిరిగి పునరావృతం చేస్తాం. అసంతృప్తి ఏర్పడితే ఆ చర్య నుంచి వైదొలుగుతాం అనేది థారన్‌డైక్‌ ఏ నియమాన్ని సూచిస్తుంది?
జ: ఫలిత నియమం

 

52. కిరణ్‌ అనే గణిత ఉపాధ్యాయుడు తరగతిలో చెప్పిన లెక్కకు మాదిరి లెక్కలు అనేకం చేయమని విద్యార్థులకు హోంవర్కు ఇచ్చాడు. ఆ ఉపాధ్యాయుడు థారన్‌డైక్‌ ఏ నియమాన్ని పాటించాడు?
జ: అభ్యాస నియమం

 

53. హరి అనే ఉపాధ్యాయుడు పరీక్ష నిర్వహించిన తర్వాత ఎప్పుడూ ఫలితాలను ప్రకటించడు. అందువల్ల ఆ మాస్టారు బోధించే సబ్జెక్టు పట్ల విద్యార్థులు విముఖత చూపుతున్నారు. ఇది థారన్‌డైక్‌ ఏ నియమాన్ని సూచిస్తుంది?
జ: ఫలిత నియమం

54. ప్రశాంత్‌ అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు అన్ని విషయాలను వివరంగా బోధించినప్పటికీ విద్యార్థులు కొన్ని విషయాలకు మాత్రమే స్పందిస్తున్నారు. దీన్ని తెలిపే థారన్‌డైక్‌ నియమం ఏది?
జ: పాక్షిక చర్యా నియమం

 

55. విద్యార్థులకు ఓర్పుతో నిశిత పరిశీలనను అలవరిచే సమస్యా పరిష్కార పద్ధతి, అన్వేషణా పద్ధతి, ప్రాజెక్టు పద్ధతుల అనుసరణీయ క్రమంలో ఉపయోగపడే అభ్యసనం
జ: అంతర్‌దృష్టి అభ్యసనం

 

56. అంతర్‌దృష్టి అభ్యసనానికి సంబంధించి సరికానిది?
    1) అన్ని అభ్యసనాల కంటే ఇది క్లిష్టమైన అభ్యసనం.
    2) సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది.
    3) ఒక పనిని మళ్లీ మళ్లీ నిరంతర సంధానంగా చేయడంలో అభ్యసనం అంతర్‌దృష్టితో ఏర్పడుతుంది.
    4) ‘టెనరిఫ్‌’ దీవుల్లో ఈ అభ్యసనానికి సంబంధించిన ప్రయోగాలు జరిగాయి.
జ: 3 (ఒక పనిని మళ్లీ మళ్లీ నిరంతర సంధానంగా చేయడంలో అభ్యసనం అంతర్‌దృష్టితో ఏర్పడుతుంది.)

 

57. గెస్టాల్ట్‌వాద పితామహుడు
జ: వర్థిమర్‌

58. కిందివాటిలో అంతర్‌దృష్టి అభ్యసనం కానిది?
    1) మేధస్సుకు పని చెప్పే అభ్యసనం.            
    2) క్లిష్టమైన సమస్య సాధనకు ఉపయోగపడే అభ్యసనం.
    3) ఈ అభ్యసనంలో ప్రత్యక్ష వ్యవస్థీకరణం జరుగుతుంది.
    4) గుడ్డిగా బట్టీ పట్టే విధానాన్ని ప్రోత్సహించే అభ్యసనం.
జ: 4 (గుడ్డిగా బట్టీ పట్టే విధానాన్ని ప్రోత్సహించే అభ్యసనం.)

 

59. సంగీత పరికరాలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం వాయిస్తుంటే కలిగే ఆనందం ఒక్కో వాయిద్యం వాయిస్తున్నప్పుడు కలగదు. దీన్ని సమర్థించే అభ్యసన సిద్ధాంతం
జ: అంతర్‌దృష్టి అభ్యసనం

 

60. గెస్టాల్ట్‌వాదుల నమ్మకం
జ: సంశ్లేషణ ద్వారా అభ్యసనం జరుగుతుంది.

 

61. నైపుణ్య వికాసానికి అవసరమయ్యే థారన్‌డైక్‌ నియమం
జ: అభ్యాస నియమం

 

62. సమ్మెటివ్‌ − I లో A గ్రేడ్‌ సాధించిన విద్యార్థి సమ్మెటివ్‌ − II లో కూడా A గ్రేడ్‌ సాధించడానికి ప్రయత్నించడం థారన్‌డైక్‌ ఏ నియమాన్ని సూచిస్తుంది?
జ: ఫలిత నియమం

63. 1వ తరగతి చదువుతున్న రష్మిత పాఠశాల ముగిసిన తర్వాత ఇతర బస్సుల వద్దకు వెళ్లకుండా తన ఇంటివైపు వెళ్లే బస్సు వద్దకు వెళ్లడం పావ్‌లోవ్‌ ఏ నియమాన్ని సూచిస్తుంది?
జ: విచక్షణ

 

64. హెర్బార్ట్‌ పాఠ్యప్రణాళిక సోపానాల్లోని మొదటి సోపానం థారన్‌డైక్‌ ఏ నియమాన్ని సూచిస్తుంది?
జ: సంసిద్ధతా నియమం

 

65. అభ్యసనం స్తంభించి ఎలాంటి పురోగమనం లేదని భ్రమించే దశ
జ: పీఠభూమి దశ

 

66. సమస్యాపరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్‌ పద్ధతి, అన్వేషణా పద్ధతులతో ముడిపడి ఉన్న అభ్యసన సిద్ధాంతం
జ: అంతర్‌దృష్టి అభ్యసనం

 

67. వైగోట్‌స్కీ ప్రకారం స్వగత భాషణం దేనికోసం ఉద్దేశించింది?
జ: పిల్లల స్వీయ మార్గదర్శకం

 

68. ప్రత్యక్షాత్మకత సంపూర్ణంగా జరిగే అభ్యసనం
జ: అంతర్‌దృష్టి అభ్యసనం

69. రాహుల్‌ అనే విద్యార్థికి మ్యాగజైన్‌లోని పదవినోదాన్ని విజయవంతంగా పూర్తిచేయడానికి ఉపయోగపడే అభ్యసనం?
జ: అంతర్‌దృష్టి అభ్యసనం

 

70. అంతర్బుద్ధి చింతన, అన్వేషణా అభ్యసనం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపే అభ్యసన సిద్ధాంతం?
జ: అంతర్‌దృష్టి అభ్యసనం

 

71. నిర్మాణాత్మక ఉపగమం ప్రకారం అభ్యసనం అంటే?
జ: జ్ఞాన నిర్మాణం

 

72. బొమ్మలు గీయడానికి తోడ్పడే అభ్యసన సిద్ధాంతం
జ: యత్నదోష సిద్ధాంతం

 

73. అభ్యసన లక్షణం
జ: అభ్యసనం సంచితమైంది.

 

74. స్వప్న అనే ఉపాధ్యాయురాలు ఆటపాటలతో బోధిస్తుంది. దీనివల్ల పిల్లల్లో దోహదం చేసే అభ్యసనాలు వరుసగా
జ: చలన, శాబ్దిక

 

75. ‘స్కఫోల్డింగ్‌’ను మొదటిసారి పేర్కొన్న సిద్ధాంతం?
జ: నిర్మాణాత్మక సిద్ధాంతం

76. ‘సైకలాజికల్‌ మోడలింగ్‌’ గ్రంథ రచయిత
జ: ఆల్బర్ట్‌ బండూరా

77. సంధాన సిద్ధాంతం అని దేన్ని అంటారు?
జ: యత్నదోష సిద్ధాంతం

 

78. చలన కౌశలాలు నేర్చుకోవడానికి అనువైన సిద్ధాంతం
జ: సంధాన సిద్ధాంతం

 

79. హెర్బార్ట్‌ పాఠ్యప్రణాళిక సోపానాల్లోని మొదటి సోపానం ఏ నియమాన్ని సమర్థిస్తుంది?
జ: సంసిద్ధతా నియమం

 

80. ప్రత్యక్ష వ్యవస్థాపనం అనేది ఏ వాదానికి చెందింది?
జ: గెస్టాల్ట్‌వాదం

 

81. ఉన్నతక్రమ నిబంధనలో గంట శబ్దానికి లాలాజలం
జ: సహజ ప్రతిస్పందన

 

82. కిందివాటిలో బ్రూనర్‌ సిద్ధాంతంలో తెలపని అంశం?
    1) ప్రేరణ     2) విశ్లేషణ     

   3) బోధనాక్రమం     4) అంతర్బుద్ధి చింతన
జ: 2 (విశ్లేషణ)

83. వైగోట్‌స్కీ తన సిద్ధాంతంలో వికాసానికి సంబంధించి ఏ అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు?
జ: జీవ సంబంధమైన

 

84. ఇంటిపనిని ప్రోత్సహించే నియమం
జ: అభ్యాస నియమం

 

85. మోహన్‌ తాను ఆంగ్లం మాట్లాడితే గ్రామంలో గుర్తింపు లభిస్తుందని ఆ భాషను నేర్చుకొని గుర్తింపు పొందాడు. అయితే ఇక్కడ తీరిన అవసరం
జ: గౌణ అవసరం

 

86. పావ్‌లోవ్‌ ప్రయోగంలో గంట శబ్దంతోపాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. దీన్ని సూచించే సమీకరణం
జ: CS + UCS  UCR

 

87. ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం జరుగుతుందని తెలియజేసినవారు
జ: థారన్‌డైక్‌

 

88. ఇతరుల నుంచి ఏం ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించిన పునర్బలన రకం
జ: స్వీయ పునర్బలనం

89. తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు రాగానే విద్యార్థులు లేచి నిలబడి నమస్కారం చేయడమనేది ఏ అభ్యసన సిద్ధాంతాన్ని సూచిస్తుంది?
జ: S − R నిబంధన

 

90. గణిత సమస్యల పట్ల భయాన్ని ఏర్పరచుకున్న కార్తీక్‌ భౌతికశాస్త్ర సమస్యల పరిష్కారానికి కూడా భయాన్ని ఏర్పరచుకోవడం అనేది
జ: సామాన్యీకరణ

 

91. ‘మన విశ్వం’ అనే పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు ఉపన్యాస పద్ధతిలో బోధించాడు. అయితే బ్రూనర్‌ ప్రకారం అతడు ఏ పద్ధతిని పాటించాడు?
జ: ప్రతీకాత్మక పద్ధతి

 

92. ఆకృతీకరణ అనే భావన దేనికి చెందింది?
జ: కార్యసాధక నిబంధన

 

93. వృక్షశాస్త్రంలోని పటాలను సులభంగా గీయగల శ్రీహరి జంతుశాస్త్రంలోని పటాలను కూడా గీయగలగడం అనేది ఏ బదలాయింపు సిద్ధాంతాన్ని సూచిస్తుంది?
జ: సమరూప మూలకాలు

94. ఏ విషయ మూలాలైనా, ఎవరికైనా, ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చని తెలిపినవారు?
జ: బ్రూనర్‌

 

95. ZPD యొక్క సంక్షిప్త నామం
జ: Zone of Proximal Development

 

96. శాస్త్రవేత్తలు వివిధ నూతన ఆవిష్కరణలు చేయడంలో వారికి ప్రముఖంగా తోడ్పడే అభ్యసన సిద్ధాంతం
జ: అంతర్‌దృష్టి అభ్యసనం

 

97. బహుమతులు, పునర్బలనాల వల్ల అభ్యసనం జరుగుతుందని తెలియజేసింది?
జ: ప్రవర్తనా వాదం

 

98. కిందివారిలో ప్రవర్తనావాదులు కానివారు.
    1) బి.ఎఫ్‌. స్కిన్నర్‌     2) ఇవాన్‌ పావ్‌లోవ్‌     

   3) ఇ.సి. థారన్‌డైక్‌     4) జీన్‌ పియాజె
జ: 4 (జీన్‌ పియాజె)

 

99. కిందివాటిని జతపరచండి.
i) ఎబ్బింగ్‌ హాస్‌

a) యానిమల్‌ సైకాలజీ

ii) థారన్‌డైక్‌

b) మెంటాలిటీ ఆఫ్‌ ఏప్స్‌

iii) కొహ్లెర్‌

c) థాట్‌ అండ్‌ లాంగ్వేజ్‌

iv) వైగోట్‌స్కీ

d) ఆన్‌ మెమొరి

జ: i−d, ii−a, iii−b, iv−c

100. కిందివాటిని జతపరచండి.
i) కథనాలు

a) కొండగుర్తులు

ii) నెమెనిక్స్‌

b) మిథ్యాపరిచయ భావన

iii) డెజావు

c) అర్థవంత, అర్థరహిత పదాలను చూపించడం

iv) ద్వంద్వ సంసర్గాలు

d) ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కథ చెప్పుకుంటూ వెళ్లడం

జ: i−d, ii−a, iii−b, iv−c
 

101. కిందివాటిని జతపరచండి.
i) సమరూప మూలకాల సిద్ధాంతం

a) చార్లెస్‌ జడ్‌

ii) సాధారణీకరణ సిద్ధాంతం

b) డబ్ల్యు.సి. బాగ్లే

iii) సమగ్రాకృతి సిద్ధాంతం

c) థారన్‌డైక్‌

iv) ఆదర్శాల సిద్ధాంతం

d) వర్థిమర్‌

జ: i−c, ii−a, iii−d, iv−b

102. కిందివాటిలో థారన్‌డైక్‌ గౌణనియమం కానిది.
    1) బహుళ ప్రతిస్పందన నియమం      2) సంబంధిత నియమం 
    3) సామీప్య వికాస మండలి               4) ప్రేరణాకారక నియమం
జ: 3 (సామీప్య వికాస మండలి)

 

103. ఒక విద్యార్థిని మంచిపని చేసినప్పుడల్లా అభినందించడం వల్ల అతడు అలాంటి మంచిపనులను తరచుగా చేసే ప్రవర్తనను అలవరచుకుంటాడు అని వివరించే అభ్యసనా సిద్ధాంతం
జ: కార్యసాధక నిబంధన

 

104. కిందివాటిలో కోఫ్‌కా రచించిన ప్రసిద్ధ గ్రంథం
    1) ది మెంటాలిటీ ఆఫ్‌ ఏప్స్‌                 2) గ్రోత్‌ ఆఫ్‌ ది మైండ్‌     
    3) ది వర్క్‌ ఆఫ్‌ డైజెస్టివ్‌ గ్లాండ్స్‌         4) ది కండిషన్డ్‌ రిఫ్లెక్సెస్‌
జ: 2 (గ్రోత్‌ ఆఫ్‌ ది మైండ్‌)

 

105. 10వ తరగతిలో స్కూల్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన మోహన్‌ను ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు ఆహ్వానించి తన అనుభవాలను పిల్లలకు తెలియజేయమన్నాడు. దీని వల్ల ఉపాధ్యాయుడు ఏ రకమైన అభ్యసనం జరుగుతుందని ఆశించాడు?
జ: పరిశీలన

106. ఆవు చేను మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అనేది ఏ అభ్యసనా సిద్ధాంతాన్ని సూచిస్తుంది?
జ: సాంఘికీకరణం

 

107. ఆకృతీకరణ అనే భావన ఏ అభ్యసనా సిద్ధాంతానికి చెందింది?
జ: కార్యసాధక నిబంధనం

 

108. పరిశీలన అభ్యసనం ఏవిధంగా జరుగుతుంది?
జ: చేతనం, అచేతనం

 

109. వైగోట్‌స్కీ ప్రతిపాదించిన సామాజిక స్కఫోల్డింగ్‌ను బ్రూనర్‌ ఏ పేరుతో సూచించాడు?
జ: ఇన్‌స్ట్రక్షనల్‌ స్కఫోల్డింగ్‌

 

110. నమూనా అభ్యసన ఏ మానసిక ప్రక్రియల వల్ల జరుగుతుందని బండూరా తెలిపారు?
జ: తదాత్మీకరణం, అంతర్లీకరణం

 

111. వైగోట్‌స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ
జ: వివేచన

 

112. కిందివాటిలో బండూరా పునర్బలనం కానిది?
    1) ప్రత్యక్ష పునర్బలనం     2) పరోక్ష పునర్బలనం     

    3) స్వీయ పునర్బలనం     4) నిరంతర పునర్బలనం
జ: 4 (నిరంతర పునర్బలనం)

113. బ్రూనర్‌ ప్రకారం కిందివాటిలో సరైన బోధనాక్రమం
    1) కృత్యాధార పద్ధతి, సమస్యా పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి
    2) ప్రతీకాత్మక పద్ధతి, క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి
    3) కృత్యాధార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, సమస్యా పరిష్కార పద్ధతి
    4) క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి
జ: 4 (క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి)

 

114. బ్రూనర్‌ ప్రకారం అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించే క్రమశ్రేణి పద్ధతులకు చెందనిది
జ: అంతర్‌దృష్టి పద్ధతి

 

115. రాజేష్‌ ఒక పద్యాన్ని మొదటిసారి 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. అదే పద్యాన్ని 20 రోజుల తర్వాత నేర్చుకోవడానికి మళ్లీ 20 ప్రయత్నాలు తీసుకుంటే రాజేష్‌ పొదుపు గణన
జ: 0%

 

116. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు చెందనిది?
జ: నిబంధన

117. కిందివాటిలో సరికానిది. 
        1) అభ్యసనాంశం మొదట క్లిష్టంగా లేనప్పుడు అవరోహణ రేఖ ఏర్పడుతుంది.
        2) అభ్యసనాంశం సులభంగా ఉన్నప్పుడు ఆరోహణ రేఖ ఏర్పడుతుంది.
        3) ఆరోహణ రేఖలో కాలం గడిచేకొద్దీ దక్షతా వేగం తగ్గుతుంది. 
        4) అన్నీ
జ: 3 (ఆరోహణ రేఖలో కాలం గడిచేకొద్దీ దక్షతా వేగం తగ్గుతుంది.)

 

118. 10వ తరగతిలో హిందీని బాగా చదవగలిగిన కళ్యాణ్‌ తర్వాత తరగతుల్లో సంస్కృతాన్ని సులభంగా చదవగలగడం
జ: అనుకూల బదలాయింపు

 

119. Houseకి బహువచనం Houses అని అభ్యసించిన సీత Mouse కి బహువచనం Mice అని కాకుండా Mouses అని చెబితే అక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు
జ: ప్రతికూల బదలాయింపు

 

120. కంప్యూటర్‌లో ఎంతో పరిజ్ఞానం కలిగిన వెంకట్‌ సైకిల్‌ను కూడా అంతే బాగా నేర్చుకున్నట్లయితే అతడిలో జరిగిన అభ్యసన బదలాయింపు ఏ రకమైంది?
జ: శూన్య బదలాయింపు

121. కుడిచేతితో బాగా బ్యాటింగ్‌ చేయగల ప్రశాంత్‌ ఎడమచేతితో కూడా అంతే నైపుణ్యంతో బ్యాటింగ్‌ చేయగలిగితే ఇది ఏ రకమైన అభ్యసన బదలాయింపు?
జ: ద్విపార్శ్వ

 

122. అనుకూల బదలాయింపు వల్ల
జ: పునరభ్యసనాన్ని పోలి ఉంటుంది.

 

123. వక్రీభన సూత్రాన్ని నేర్చుకున్న సర్వేష్‌ నీటిలోని గమ్యాన్ని సరిగ్గా గురిచూసి కొట్టాడు. ఈ అభ్యసనా బదలాయింపును వివరించే సిద్ధాంతం?
జ: సాధారణీకరణ సిద్ధాంతం

 

124. జ్యామెట్రీలో అనేక సిద్ధాంతాలు నేర్చుకున్న శిరీష వాటితో సంబంధం గల రైడర్స్‌ను సులువుగా సాధించగలిగింది. దీన్ని వివరించే బదలాయింపు సిద్ధాంతం
జ: గెస్టాల్ట్‌ సిద్ధాంతం

 

125. కుటుంబ సభ్యులతో నిజాయతీగా ఉండే వ్యక్తి తాను చేసే ఉద్యోగంలో కూడా నిజాయతీగా ఉండటాన్ని సూచించే బదలాయింపు సిద్ధాంతం
జ: ఆదర్శాల సిద్ధాంతం

126. టైప్‌మిషన్‌ వచ్చిన వ్యక్తి కంప్యూటర్‌ కీబోర్డును సులభంగా ఆపరేట్‌ చేయగలుగుతాడు. దీన్ని వివరించే అభ్యసన బదలాయింపు సిద్ధాంతం
జ: సమరూప మూలకాల సిద్ధాంతం

 

127. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరచుకునేందుకు ప్రయత్నించే అవసరం
జ: రక్షణ అవసరం

 

128. మెకైవర్‌ ప్రకారం ‘ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం నిన్ననే రేపు ఏ స్థాయిలో ఉండాలో ఆలోచించుకోవడం’ అనడంలో గల ప్రేరణ
జ: సాధనా ప్రేరణ

 

129. అభ్యసనం స్తంభించి ఎలాంటి పురోగమనం లేకుండా నిలిచిపోయే దశ
జ: పీఠభూమి దశ

 

130. వ్యక్తి ప్రేరణ దేంతో ముడిపడి ఉంటుంది?
జ: అవసరాలు

131. రాహుల్‌ తన తండ్రి వేసే శిక్షను తప్పించుకోవడానికి చదువుతున్నాడు. మౌనిక తన ఆనందం కోసం ఆటలు ఆడుతుంది. అయితే మౌనిక, రాహుల్‌లోని ప్రేరణలు వరుసగా
జ: అంతర్గత, బహిర్గత

 

132. PWD చట్టం − 1995 ప్రకారం వినికిడి వైకల్యతకు దారితీసే శబ్ద ప్రమాణం?
జ: 60 dBHL కంటే ఎక్కువ

 

133. కిందివాటిలో శిక్షణ పొందగలిగే బుద్ధిమాంద్యుల ప్రజ్ఞాలబ్ధి 
    1) 20 కంటే తక్కువ     2) 20 − 39     

   3) 30 − 50     4) 50 − 70
జ: 3 (30 − 50)

 

134. డిస్‌గ్రాఫియా అంటే?
జ: రాతపరమైన వైకల్యం

 

135. కండరాలు బిగుసుకుపోవడం వల్ల అవయవాలను కదిలించలేని వైకల్యస్థితి
జ: అనమ్యత

 

136. PWD చట్టం − 1995లో PWD అంటే?
జ: Person With Disability

137. ప్రేరణ సిద్ధాంతం ప్రకారం ఏ అంశం ద్వారా విద్యార్థి మొదటి అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు?
జ: విద్యార్థుల నుంచి వాస్తవిక సాధనలు ఆశించడం

 

138. ఎబ్బింగ్‌ హాస్‌ ప్రకారం వ్యక్తి తాను నేర్చుకున్న విషయంలో 6వ రోజు జరిగే విస్మృతి శాతం
జ: 75%

 

139. ‘సైకలాజికల్‌ మోడలింగ్‌’ గ్రంథకర్త
జ: బండూరా

 

140. కళ్యాణ్‌ అనే విద్యార్థి తన తండ్రితో పాటు వ్యవసాయ పనుల్లో పాల్గొంటూ పంటలు పండించే విధానం గురించి తెలుసుకున్నట్లయితే అది ఏ రకమైన స్మృతిని తెలియజేస్తుంది?
జ: క్రియాత్మక స్మృతి

 

141. a, b, c, d లను నేర్చుకున్న కిరణ్‌ b ని d లా రాయడం ఏ రకమైన అవరోధంగా చెప్పవచ్చు?
జ: తిరోగమన అవరోధం

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌