1. కిందివాటిలో విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశం కానిది?
ఎ) సాధారణీకరణాలను అభివృద్ధి చేయడం.
బి) శాస్త్రపద్ధతులను వినియోగించకుండా ఉండటం.
సి) శాస్త్రవేత్తల కృషిని విద్యార్థులు అభినందించడం.
డి) సాంకేతికశాస్త్ర అభివృద్ధిలో భాగస్వామ్యం వహించే సామర్థ్యాన్ని వృద్ధి చేయడం.
జ: బి (శాస్త్రపద్ధతులను వినియోగించకుండా ఉండటం)
2. శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ఎక్కువగా పెంపొందే విలువ ఏది?
జ: క్రమశిక్షణ విలువ
3. 'మనవిశ్వం' అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించడం ద్వారా వారిలో ఎక్కువగా అభివృద్ధి చెందే విలువ ఏది?
జ: సౌందర్యాత్మక విలువ
4. ఒక విద్యార్థి ఇంటర్మీడియట్లో బై.పి.సి గ్రూపు తీసుకోవడంలో విజ్ఞానశాస్త్రపరంగా అతడికి ఉన్న విలువ?
జ: వృత్తిపరమైన విలువ
5. 'విలువలు' ఏ రంగానికి చెందినవి?
జ: భావావేశ
6. కిందివాటిలో శాస్త్రీయ వైఖరికి చెందని లక్షణం ?
ఎ) నిష్పాక్షిక దృష్టితో ఉండటం
బి) ఇతరుల భావాలను గుర్తించడం
సి) తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం
డి) సమస్య పరిష్కారంలో ప్రణాళికాబద్ధమైన విధానాన్ని పాటించడం
జ: సి (తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం)
7. ఒక దేశం జీవన విధానాన్ని తెలిపే విలువ ఏది?
జ: సాంస్కృతిక విలువ
8. విద్యార్థి సమస్యను గుర్తించడం, విశ్లేషించడం, తగిన సమాధానాన్ని అన్వేషించడం అనేవి ఏ బోధనా ఉద్దేశంలోని అంశాలు?
జ: శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ
9. విద్యార్థుల్లో అవగాహన, బుద్ధికుశలత, సత్యాన్వేషణ లాంటి అంశాలు అభివృద్ధి చెందడంలో గల విలువ ఏది?
జ: బౌద్ధిక విలువ
10. 'శాస్త్ర అభ్యసనం ద్వారా తమ ప్రవర్తనలో, శీలంలో, మూర్తిమత్వంలో అభివృద్ధిని అలవర్చుకున్నారు' దీన్ని తెలియచేసే విలువ
జ: నైతిక విలువ