1. ‘విజ్ఞానశాస్త్రం ఒక పరిశోధనా విధానం’ అన్నవారు?
జ: ఎ.డబ్ల్యు. గ్రీన్
2. ‘పీడనం పెరిగితే ఘనపరిమాణం పెరుగుతుంది’ అనేది ఏ ప్రకల్పన?
జ: ప్రకటనాత్మక
3. కిందివాటిలో ద్రవ్యాత్మక నిర్మాణం కానిది?
1) యథార్థాలు 2) సిద్ధాంతాలు 3) భవనాలు 4) అన్వేషణ
జ: 4 (అన్వేషణ)
4. సత్యాల మధ్య పరస్పర సంబంధాన్ని ఏర్పరిచి నియమబద్ధం చేస్తే అది
జ: సాధారణీకరణ
5. విజ్ఞానశాస్త్రం సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహమని చెప్పినవారు
జ: ఫ్రెడరిక్ సిడ్జ్ ప్రోటిక్
6. ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి అనేది ఒక
జ: యథార్థం
7. ఏ వస్తువు కంపించినా ధ్వని పుడుతుంది అనేది ఒక
జ: సాధారణీకరణ
8. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చినవారు
జ: హెన్రీ పాయింకర్
9. సోపానాలను వైజ్ఞానిక పద్ధతిలో తెలిపినవారు
జ: కార్ల్ పియర్సన్
విజ్ఞానశాస్త్రం - ఉద్దేశాలు, విలువలు
10. ‘ముందే ఒదిగి ఉన్న సమన్వయమే ఈ సృష్టి’ అని పేర్కొన్నవారు?
జ: ఐన్‌స్టీన్
11. కొత్తకోణంలో ఆలోచించి, ఉన్న విషయానికి కొత్త భాష్యం చెప్పగల రవి అనే విద్యార్థిలో నెరవేరిన విలువ?
జ: సృజనాత్మక విలువ
12. ‘ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి’ అని సూత్రీకరించిన విద్యార్థిలో నెరవేరిన బోధనా లక్ష్యం
జ: వినియోగం
13. పొడవు, ద్రవ్యరాశి, కాలం, వేగంలలో వేగాన్ని వేరుపరిచిన విద్యార్థిలో నెరవేరిన స్పష్టీకరణ?
జ: విచక్షణ చేయడం
14. ‘ఆహారం వృథాను అరికట్టడానికి ఒక పాంప్లెట్ తయారు చేయండి’ అనే ప్రశ్న ఏ విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది?
జ: ప్రశంస - విలువలు
15. నందిని అనే 4వ తరగతి విద్యార్థిని వివిధ పక్షుల గూళ్లను సేకరించి ఒక ఆల్బమ్ తయారుచేసింది. తనలో నెరవేరిన విద్యా ప్రమాణం
జ: సమాచార నైపుణ్యాలు
16. డాక్టర్లు జంక్‌ఫుడ్ తినవద్దనడానికి కారణాలు తెలిపిన రజిని అనే విద్యార్థినిలో నెరవేరిన విద్యా ప్రమాణం
జ: విషయావగాహన
17. భావావేశరంగంలోని కింది ఏ లక్షణంలో వైఖరులు ఏర్పడతాయి?
1) గ్రహించడం 2) ప్రతిస్పందించడం 3) విలువకట్టడం 4) వ్యవస్థాపనం
జ: 3 (విలువకట్టడం)
18. విద్యార్థి కొత్త పరిష్కారాన్ని కనుక్కోగల స్థాయి
జ: సంశ్లేషణ
19. అంతరించిపోతున్న జంతువుల గురించి పాఠం విన్న 4వ తరగతి విద్యార్థి రాక్షసబల్లి పటాన్ని గీశాడు. అయితే అతడిలో నెరవేరిన నైపుణ్యం
జ: చిత్రలేఖన నైపుణ్యం
విజ్ఞాన శాస్త్రం - బోధనా పద్ధతులు
20. కిందివాటిలో క్షేత్ర పర్యటనల్లో సోపానం కానిది?
1) ప్రణాళిక 2) సిద్ధపరచడం 3) నిర్వహణ 4) నివేదిక
జ: 4 (నివేదిక)
21. ప్రయోగశాల పద్ధతిలో ఉపయోగించే వివిధ ఉప పద్ధతుల్లో పొదుపైంది?
జ: భ్రమణ పద్ధతి
22. కింది ఏ విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతిలో సూచనపత్రాలు ఇవ్వనవసరం లేదు?
1) అన్వేషణ పద్ధతి 2) ప్రయోగశాల పద్ధతి 3) నియోజన పద్ధతి 4) ప్రాజెక్టు పద్ధతి
జ: 4 (ప్రాజెక్టు పద్ధతి)
23. పాఠ్యపుస్తకాన్ని మూసి అందులో ఏముందో కనుక్కోమనే బోధనా పద్ధతిగా విమర్శించేది?
జ: అన్వేషణ పద్ధతి
24. మధ్యతరగతి కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబంధాలను బోధించడానికి ఉపాధ్యాయుడిగా నీవు ఏ పద్ధతిని ఎన్నుకుంటావు?
జ: ప్రాజెక్టు పద్ధతి
25. జీవించడం కోసం నేర్చుకోక జీవిస్తూ నేర్చుకునే బోధనా పద్ధతి
జ: ప్రాజెక్టు పద్ధతి
26. అన్వేషణ పద్ధతిని కనుక్కున్న ప్రొఫెసర్ హెచ్.ఇ.ఆర్మ్‌స్ట్రాంగ్ ఏ దేశానికి చెందినవారు?
జ: ఇంగ్లండ్
27. ‘సమాజానికి సంబంధించిన సమస్యలను ప్రజలు శాస్త్రీయ పద్ధతి ద్వారా విశ్లేషించి ఒక క్రమపద్ధతిలో విషయ సేకరణ చేయడమే సర్వే’ అని పేర్కొన్నవారు?
జ: మోర్స్
28. ప్రయోగశాల పద్ధతిలో ఇచ్చే సూచనపత్రంలో ఉండని అంశం?
జ: ప్రయోగం చేసే వ్యక్తిపేరు
29. రాత్రి వికసించే పూలు సువాసననిస్తాయి. ఇది తెలుసుకున్న విద్యార్థి ఆ విషయాన్ని సన్నజాజి, విరజాజి లాంటి పూలకు అన్వయించి సరిచూసుకోవడం
జ: నిగమన పద్ధతి
విజ్ఞానశాస్త్రం - బోధనోపకరణ సామగ్రి
30. ఎల్.ఎల్. బెర్నార్డ్ ప్రకారం కిందివాటిలో సాంఘిక సాంస్కృతిక వనరు కానిది?
1) సమాజం 2) ఆర్థికం 3) భూ ఆవరణం 4) రాజకీయ పరిస్థితులు
జ: 3 (భూ ఆవరణం)
31. కిందివాటిలో భౌతిక వనరు కానిది?
1) నదులు 2) రైల్వేస్టేషన్ 3) చారిత్రక ప్రదేశం 4) తోట
జ: 4 (తోట)
32. డాక్టర్ ఆర్.హెచ్. వైట్‌హౌస్ ఇచ్చిన ఉపన్యాస గది ప్రయోగశాల నమూనా ప్రకారం గది కొలతలు, ప్రయోగం నిర్వహించ గల విద్యార్థుల సంఖ్య వరుసగా
జ: 45' × 25', 40
33. మొదటి అంతర్జాతీయ సైన్సు ప్రదర్శనలో ప్రథమ బహుమతి పొందిన దేశం
జ: భారత్
34. భూచరాలు, ఉభయచరాల జీవన విధానాన్ని పరిశీలించడానికి ఉపయోగపడే కృత్యోపకరణం
జ: టెర్రేరియం
35. జాతీయ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలను ఎన్ని రోజులు నిర్వహిస్తారు?
జ: 7
36. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండే సరిహద్దులను తెలియజేసే పటాలు
జ: రాజకీయ
37. సెక్టార్ల రూపంలో విషయాన్ని వివరించే గ్రాఫ్
జ: వృత్త గ్రాఫ్
38. పల్లపు ప్రాంతాన్ని, నిస్సారమైన భూములను సూచించే రంగులు వరుసగా
జ: ఆకుపచ్చ, పసుపు
విజ్ఞానశాస్త్రం - విద్యాప్రణాళిక
39. కింది ఏ పథకరచన బోధనాభ్యసన సామగ్రి లభించే కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలను ఎన్నుకోవడానికి ఉపయోగపడుతుంది?
1) వార్షిక పథకం 2) యూనిట్ పథకం 3) పీరియడ్ పథకం 4) సంస్థాగత పథకం
జ: 1 (వార్షిక పథకం)
40. హెర్బార్షియన్ సోపానాల్లో సాధారణీకరణ ముందు ఉండే సోపానం
జ: పోలిక
41. హెర్బార్షియన్ సోపానాల్లో నిగమన ప్రక్రియలో ఇమిడి ఉన్న దశ
జ: వినియోగం
42. ప్రస్తుతం 3, 4, 5వ తరగతుల పాఠ్యపుస్తకాల తయారీలో ఇమిడి ఉన్న మొత్తం ఇతివృత్తాలు ఎన్ని?
జ: 13
43. విద్యా బోధనలో పునాదిరాయి
జ: పాఠ్యపుస్తకం
44. ఆధునిక పరిస్థితుల్లో ఉన్న సమాజ ఆదర్శాలు, విలువల ఆధారంగా పాఠ్యపుస్తకాలు తయారవుతున్నాయని అన్నవారు
జ: బ్రిగ్స్
45. ప్రస్తుత పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకంలోని కృత్యాల్లో చివరి కృత్యం
జ: నేనివి చేయగలనా
46. ప్రస్తుతం 6 నుంచి 8వ తరగతుల భౌతికశాస్త్ర పాఠ్యాంశాలకు సంబంధించని ఇతివృత్తం
1) పదార్థాలు 2) సహజవనరులు 3) సజీవప్రపంచం 4) కదిలే వస్తువులు - ప్రజల ఆలోచనలు
జ: 4 (కదిలే వస్తువులు - ప్రజల ఆలోచనలు)
47. కిందివాటిలో విద్యాప్రణాళికకు సంబంధించని అంశం
1) సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తుంది.
2) సిద్ధాంత పరమైంది.
3) బాలుడి యావత్తు శిక్షణపై దృష్టి పెడుతుంది.
4) స్వేచ్ఛాయుతమైంది.
జ: 4 (స్వేచ్ఛాయుతమైంది.)
48. కిందివాటిలో బడిలో దైనందిన ఆచరణకు దర్శిని
1) విద్యా ప్రణాళిక 2) విషయ ప్రణాళిక 3) పాఠ్య ప్రణాళిక 4) యూనిట్ ప్రణాళిక
జ: 2 (విషయ ప్రణాళిక)
విజ్ఞానశాస్త్రం - మూల్యాంకనం
49. నీరు : ద్రవం : : ఆహారం : ....... అనేది ఏ ప్రశ్న?
జ: సాదృశ్య ప్రశ్న
50. కిందివాటిలో అధిక హెచ్చు విద్యుత్‌చాలక బలం గల ఘటం?
ఎ) వోల్టా ఘటం బి) లెక్లాంచి ఘటం సి) నిర్జల ఘటం డి) బైక్రోమేట్ ఘటం
పై ప్రశ్న ఏ రకమైన బహుళైచ్ఛిక ప్రశ్న?
జ: కచ్చిత సమాధాన రకం
51. విద్యార్థిలోని సృజనాత్మకత, భావవ్యక్తీకరణ సామర్థ్యాలను మదింపు చేసే ప్రశ్నలు
జ: వ్యాసరూప ప్రశ్నలు
52. ఆత్మాశ్రయత అతి ఎక్కువగా ఉండే ప్రశ్నలు
జ: మౌఖిక ప్రశ్నలు
53. రూబ్రిక్స్ వేటిని పోలి ఉంటాయి?
జ: రేటింగ్ స్కేలు
54. విడి దస్త్రాలను వృద్ధి చేసేది
జ: విద్యార్థులు
55. శక్తినిత్యత్వ నియమాన్ని చిత్రాల ద్వారా వివరించే చార్టు
జ: దృష్టాంతాల చార్టు
56. ఎస్ఎ - 2 పరీక్షలో నిహాల్ అనే విద్యార్థికి పరిసరాల విజ్ఞానంలో 40 మార్కులు వచ్చాయి. అతడి వివరణాత్మక సూచి?
జ: చాలా బాగుంది
57. కిందివాటిలో బ్లూప్రింట్ చూపించని భారత్వ పట్టిక
1) విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక 2) ప్రశ్నరూప భారత్వ పట్టిక
3) కాఠిన్యతా స్థాయి భారత్వ పట్టిక 4) విషయరూప భారత్వ పట్టిక
జ: 3 (కాఠిన్యతా స్థాయి భారత్వ పట్టిక)
58. పరిసరాల విజ్ఞానంలో సంగ్రహణాత్మక మదింపులో ‘ప్రశంస - విలువలు’ అనే సామర్థ్యానికి ఎన్ని మార్కులు కేటాయించాలి?
జ: 5