1. మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సూచించిన కమిటీ ఏది?
జ: బల్వంత్రాయ్మెహతా
2. గ్రామ ఓటర్లు గ్రామ సర్పంచ్‌ను ఎన్నుకొనే పద్ధతి-
జ: రహస్య ఓటింగ్ పద్ధతి
3. మనదేశంలో 'మూడంచెల పంచాయతీరాజ్' వ్యవస్థను మొదట ఏర్పాటు చేసిన రాష్ట్రమేది?
జ: రాజస్థాన్
4. గ్రామ పంచాయతీ ఆవశ్యకతను తెలిపే ఆదేశ సూత్రాల్లోని అధికరణ-
జ: 40
5. గ్రామీణ స్వపరిపాలనా సంస్థల్లో దేన్ని ప్రాథమిక స్వపరిపాలనా సంస్థ అని పిలుస్తారు?
జ: గ్రామ పంచాయతీ
6. ఒక గ్రామంలోని మొత్తం వయోజనులు 500 మంది. ఈ గ్రామానికి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తో కలిపి ఎంతమంది సభ్యులను ఎన్నుకోవాలి?
జ: 7
7. 2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ప్రస్తుతమున్న మండల పరిషత్‌ల సంఖ్య-
జ: 1125
8. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎలా ఎన్నుకుంటారు?
జ: మండల పరిషత్ సభ్యులు
9. మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉండి, ఓటుహక్కులేనివారు ఎవరు?
జ: మండలానికి చెందిన గ్రామ సర్పంచ్‌లు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి
10. ఏ చట్టం ద్వారా మండల పరిషత్ ఏర్పడింది?
జ: 1986 చట్టం
11. మండలంలోని ప్రభుత్వ సిబ్బంది మొత్తం ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తారు?
జ: మండల పరిషత్ అభివృద్ధి అధికారి
12. మండల స్థాయిలో పాఠశాల మధ్యాహ్న ఉచిత భోజనం ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది?
జ: తహశీల్దారు
13. గ్రామసభ సంవత్సరంలో ఎన్నిసార్లు సమావేశం కావాలి?
జ: రెండు
14. రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించారు?
జ: 73