• facebook
  • whatsapp
  • telegram

మొగల్ సామ్రాజ్యం 

భారత్‌లో మరఫిరంగులు బాబర్‌తో మొదలు!

సమర్థ పాలనకు, సంస్కరణలకు, సైనిక విజయాలకు ప్రఖ్యాతి చెందిన మొగల్‌ చక్రవర్తులు భారతదేశ చరిత్రపై చెరగని ముద్రలు వేసి చిరస్థాయిగా నిలిచిపోయారు.  కళలు, వాస్తుశిల్పం, వర్తక వాణిజ్యాలు, పాలనా విధానాలు, వంటకాలు, సాహిత్యం సహా ఎన్నో సామాజిక, సాంస్కృతిక అంశాలను వారు శాశ్వతంగా ప్రభావితం చేశారు. ఈ విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అక్బర్‌ కాలంలో మొగల్‌ సామ్రాజ్యం మరింత పటిష్ఠమైన తీరును, నాటి మత విధానాలను, ఔరంగజేబుపై స్థానికుల తిరుగుబాట్లపై అవగాహన పెంచుకోవాలి. 


1. మొగలులు మధ్య ఆసియాలోని ఏ ప్రాంతానికి     చెందినవారు?

1) ఇరాన్‌    2) ఇరాక్‌    

3) మంగోలియా    4) పైవన్నీ        


2. బాబర్‌ ‘కాబుల్‌’ను ఎప్పుడు అక్రమించాడు?

1) 1504  2) 1505   3) 1506   4) 1507


3.  1526లో బాబర్‌ ఆక్రమించిన ప్రాంతం?

1) దిల్లీ   2) ఆగ్రా    3) 1, 2   4) అజ్మీర్‌


4. 1526లో జరిగిన యుద్ధం?     

1) రెండో పానిపట్‌ యుద్ధం    

2) మొదటి పానిపట్‌ యుద్ధం

3) మూడో పానిపట్‌ యుద్ధం    

4) కాబుల్‌ యుద్ధం


5. మొదటి పానిపట్‌ యుద్ధంలో ఇబ్రహీంలోడీని ఎవరు ఓడించారు?

1) అక్బర్‌         2) బాబర్‌    

3) హుమాయున్‌       4) జహంగీర్‌


6. భారత యుద్ధ రంగంలో మర ఫిరంగులను ప్రవేశపెట్టినవారు?

1) అక్బర్‌        2) బాబర్‌    

3) షాజహాన్‌          4) రెండో దేవరాయలు


7. బాబర్‌ పాలనా కాలం?

1) 1526 - 1529        2) 1526 - 1556    

3) 1526 - 1530       4) 1526 - 1540


8.  హుమాయున్‌ను ఓడించి ఇరాన్‌కు తరిమిన రాజు?

1) శివాజీ        2) పృథ్వీరాజ్‌ చౌహాన్‌  

3) షేర్‌ఖాన్‌      4) ఇబ్రహీంలోడి


9. ఇరాన్‌లో హుమాయున్‌కు సహాయపడింది ఎవరు?

1) సలీమ్‌          2) ఫరీట్‌      

3) సఫావిద్‌ షా        4) బీర్బల్‌


10.  1556లో ప్రమాదవశాత్తు మరణించిన మొగల్‌  చక్రవర్తి?

1) బాబర్‌        2) హుమాయున్‌    

3) జహంగీర్‌         4) షాజహాన్‌


11. అక్బర్‌ పరిపాలనా కాలం?

1) 1526 - 1556       2) 1556 - 1605   

3) 1508 - 1556       4) 1605 - 1627


12. అక్బర్‌ 1556లో చక్రవర్తి అయ్యే నాటికి ఆయన వయసు?

1) 12 ఏళ్లు 2) 13 ఏళ్లు 3) 14 ఏళ్లు 4) 15 ఏళ్లు


13. అక్బర్‌ మొదటగా ఆక్రమించిన ప్రాంతం/ప్రాంతాలు

1) బెంగాల్‌         2) మధ్య భారత్‌    

3) రాజస్థాన్‌       4) పైవన్నీ


14. కిందివారిలో అక్బర్‌ కుమారుడు ఎవరు?

1) హుమాయున్‌         2) షాజహాన్‌     

3) జహంగీర్‌        4) ఔరంగజేబు


15. జహంగీర్‌ పాలనా కాలం?

1) 1605 - 1627        2) 1605 - 1629   

3) 1600 - 1627        4) 1600 - 1628


16. దక్కన్‌ ప్రాంతంలో రాజ్య విస్తరణ కొనసాగించినవారు?

1) జహంగీర్‌ 2) బాబర్‌ 3) షాజహాన్‌  4) అక్బర్‌


17. ఏ చక్రవర్తి మరణం తర్వాత ఆయన ముగ్గురి కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది?

1) జహంగీర్‌ 2) బాబర్‌ 3) ఔరంగజేబు 4) అక్బర్‌


18. స్థానిక రాజుల తిరుగుబాట్లను ఎదుర్కొన్న మొగల్‌ చక్రవర్తి?

1) జహంగీర్‌         2) ఔరంగజేబు   

3) బాబర్‌        4) అక్బర్‌


19. ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన సిక్కు మత గురువు/గురువులు?

1) గురుతేజ్‌ బహదూర్‌     2) గోవింద్‌సింగ్‌   

3) 1, 2        4) అర్జున్‌సింగ్‌


20. ఔరంగజేబు కాలంలో మరాఠీ రాష్ట్ర స్థాపకుడు?

1) శివాజీ          2) రెండో బాజీరావు    

3) మహదాజీ షిండే       4) నానాసాహెబ్‌


21. ఔరంగజేబు అక్రమించిన ప్రముఖ దక్కను ప్రాంతం/ప్రాంతాలు?

1) బీజాపూర్‌ 2) గోల్కొండ 3) 1, 2  4) బీరల్‌


22. మొగలులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న స్థానిక రాజులు?

1) చాళుక్యులు  2) విజయనగర రాజులు  

3) రాజపుత్రులు 4) చోళులు


23. మొగలుల అధికారాన్ని గుర్తించని రాజపుత్రులు?

1) చిత్తోఢ్‌ 2) సిసోడియా  3) అంబర్‌ 4) 1, 2


24. జహంగీర్‌ తల్లి ఏ ప్రాంతపు రాజకుమార్తె?

1) అంబర్‌  2) జోధ్‌పూర్‌  3) ఢిల్లీ  4) చిత్తోఢ్‌


25. కిందివారిలో మన్సబ్‌దారు ఎవరు?

1) రాజ్‌ ప్రముఖ్‌      2) సామంతరాజు 

3) సైనిక హోదాలో ఉన్నవారు 4) పరిపాలనా హోదాలో ఉన్నవారు


26. కిందివాటిలో సరికానిది?

1) మన్సబ్‌దారు గుర్రపు రైతులను పోషించాలి.

2) మన్సబ్‌దారు రాజు, రాజ భవనాన్ని కాపాడాలి.

3) మన్సబ్‌దారు గుర్రాలకు ముద్ర వేయించనవసరం లేదు.

4) మన్సబ్‌దారు పదవి వంశపారంపర్యంగా రాదు.


27. మన్సబ్‌దారు మరణం తర్వాత అతడి ‘ఆస్తి’ని ఎవరు జప్తు చేసేవారు?

1) అతడి కుమారుడు  2) అతడి భార్య   

3) చక్రవర్తి  4) అతడి తర్వాత పదవిలోకి వచ్చిన మన్సబ్‌దారు


28. కిందివాటిలో సరైన వాక్యం?

ఎ) అక్బర్‌ ఆర్థిక మంత్రి రాజాతోడర్‌మల్‌.

బి) రాజాతోడర్‌మల్‌ భూమిని సర్వే చేయించి పన్ను వసూలు చేశాడు.

సి) ఇతడు నగదు రూపంలో పన్ను వసూలు చేశాడు.

డి) ఈ రకం పన్ను విధానాన్ని జబ్త్‌ విధానం అంటారు.

1) ఎ, బి  2) బి, సి, డి  3) సి, డి  4) ఎ, బి, సి, డి


29. ప్రతిపాదన (A): మన్సబ్‌దార్లు జాగీర్లను పాలించేవారు కాదు.

కారణం (R): జాగీర్లను చక్రవర్తి ప్రత్యక్షంగా పరిపాలిస్తున్నందు వల్ల

1) A కు R సరైన ప్రతిపాదన కాదు

2) A, R రెండూ సరికావు

3) A సరికాదు R సరైంది

4) A సరైంది R సరికాదు


30. కిందివారిలో రైతులకు అధిక పన్ను చెల్లించనవసరం లేదు అని హామీ ఇచ్చినవారు?

1) రాజు 2) చక్రవర్తి   

3) చక్రవర్తిచే నియమితులైన అధికారులు

4) మన్సబ్‌దార్లు


31. జాగీరుదారులను చక్రవర్తి ఎన్ని సంవత్సరాలకు మార్చేవారు?

1) ఒకటి లేదా రెండేళ్లు     2) రెండు లేదా మూడేళ్లు   

3) మూడు లేదా నాలుగేళ్లు   4) నాలుగు లేదా అయిదేళ్లు


32. మన్సబ్‌దార్లకు జాగీర్లను సక్రమంగా కేటాయించిన రాజు?

1) జహంగీర్‌  2) అక్బర్‌   

3) బాబర్‌  4) షాజహాన్‌


33. మన్సబ్‌దార్ల సంఖ్యను పెంచిన మొగల్‌ చక్రవర్తి?

1) జహంగీర్‌     2) అక్బర్‌     

3) ఔరంగజేబు  4) షాజహాన్‌


34. జబ్ అనే రెవెన్యూ విధానాన్ని ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు?

1) జహంగీర్‌     2) అక్బర్‌     

3) ఔరంగజేబు  4) షాజహాన్‌


35. జమీందారు విధానానికి సంబంధించి సరైంది?

ఎ) వీరు చక్రవర్తి ద్వారా నియమితులు కారు.

బి) అధికారం వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది.

సి) శిస్తు వసూలు చేసినందుకు జమీందార్లకు వాటా వస్తుంది.

డి) జమీందారులు సొంత సైన్యాన్ని పోషించేవారు.

1) ఎ, బి  2) బి, సి, డి  3) సి, డి 4) ఎ, బి, సి, డి


36. అక్బర్‌ ఆస్థానంలో రెవెన్యూ మంత్రి ఎవరు?    

1) బీర్బల్‌  2) రాజా తోడర్‌మల్‌  

3) అబుల్‌ ఫజల్‌  4) తాన్‌సేన్‌


37. అక్బర్‌ పరిపాలనా విధానాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే గ్రంథం?

1) అక్బర్‌నామా    2) అక్బర్‌ చరిత్ర      

3) అక్బర్‌ పరిపాలననామా    4) పైవన్నీ


38. అక్బర్‌ నామా గ్రంథ రచయిత?

1) అక్బర్‌   2) అబుల్‌ ఫజల్‌      

3) అల్‌బెరూని  4) బీర్బల్‌


39. మత సంబంధ చర్చలు జరపడానికి అక్బర్‌ ఏ మత పండితులను దర్బారుకు ఆహ్వానించేవారు?

1) ముస్లిం పండితులు  2) బ్రాహ్మణులు    

3) జోరాష్ట్రియన్లు        4) పై అందరూ


40. అక్బర్‌ విధానాల్లో ఒకటైన సుల్హ్‌-ఇ-కుల్‌ అంటే?

1) దేశ శాంతి   2) ప్రపంచ శాంతి      

3) రాష్ట్ర  శాంతి  4) పైవన్నీ


41. సుల్హ్‌-ఇ-కుల్‌ విధానం అమలుపరచడంలో అక్బర్‌కి సహాయపడినవారు?

1) రాజా తోడర్‌మల్‌   2) అబుల్‌ ఫజల్‌    

3) బీర్బల్‌   4) జహంగీర్‌


42. ‘సున్నీ’ మత విధానాలు అవలంబించిన మొగల్‌ చక్రవర్తి?

1) జహంగీర్‌   2) షాజహాన్‌    

3) ఔరంగజేబు  4) హుమాయున్‌


43. మొగల్‌ సామ్రాజ్యంలో షాజహాన్‌ కాలంలో మన్సబ్‌దారుల సంఖ్య?

1) 8000  2) 7000  3) 6000  4) 5000


44. మొగల్‌ సామ్రాజ్యం ఏ శతాబ్దంలో పతనమైంది?

1) 17    2) 18   3) 19   4) 16


45. కిందివాటిలో సరికానిది?

1) జహంగీర్‌    - 1605-1627

2) బాబర్‌ - 1526-1530

3) ఔరంగజేబు - 1657-1707

4) అక్బర్‌ - 1556-1605


46. అక్బర్‌ కాలంలో సర్వసాధారణ నాణెం?

1) రూపాయి (వెండి నాణెం) 2) దామ్‌ (వెండి నాణెం)    

3) దామ్‌ (రాగి నాణెం)      4) రూపాయి (రాగి నాణెం


47. కిందివాటిని జతపరచండి.

1) ముతావాసిద్‌    ఎ) ముస్లిమేతరులపై పన్ను

2) జిజియా పన్ను   బి) మత సంబంధ నైతికతను పరిశీలించడం

3) జబ్త్‌    సి) ప్రపంచశాంతి

4) దీన్‌-ఇ-ఇల్లాహి    డి) పన్ను విధానం

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి     2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ  4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి


48. అక్బర్‌ను వ్యతిరేకించిన రాజులు?

ఎ) మేవాడ్‌ పాలకుడు - రాణా ప్రతాప్‌

బి) అహ్మద్‌నగర్‌ పాలకురాలు - చాంద్‌ బీబీ

1) ఎ మాత్రమే సరైంది  2) బి మాత్రమే సరైంది

3) ఎ, బి రెండూ సరైనవి  4) ఎ, బి రెండూ సరికావు


49. కిందివాటిలో సరికానిది?

1) పరిపాలనపై దృష్టి కేంద్రీకరించని మొగల్‌ చక్రవర్తులు బాబర్, జహంగీర్‌

2) అక్బర్‌ రాజ్యాన్ని సుభాలుగా విభజించారు.

3) అక్బర్‌ సర్కారులను ‘పరగణాలుగా’ విభజించారు.

4) అక్బర్‌ పరిపాలనలో బాబర్‌ ముద్ర కనిపిస్తుంది.

1) 1, 2 సరైనవి 2) 3, 4 సరికావు

3) 1 మాత్రమే సరికాదు 4) 1, 4 సరికాదు


50. కిందివాటిలో భిన్నమైంది?

1) ఆగ్రా  2) చిత్తోఢ్‌  3) మధురై   4) కశ్మీర్‌


సమాధానాలు

1-3; 2-1; 3-3; 4-2; 5-2; 6-2; 7-3; 8-3; 9-3; 10-2; 11-2; 12-2; 13-4; 14-3; 15-1; 16-3; 17-3; 18-2; 19-3; 20-1; 21-3 22-3; 23-4; 24-1; 25-3; 26-3; 27-3; 28-4; 29-3; 30-3; 31-2; 32-2; 33-3; 34-2; 35-4; 36-2; 37-1; 38-2; 39-4; 40-2; 41-2; 42-3; 431; 442; 45-3; 46-3; 47-2; 48-3; 49-4; 50-3.

 
 

రచయిత: గద్దె నరసింహారావు 
 

Posted Date : 14-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌