• facebook
  • whatsapp
  • telegram

వన్యప్రాణుల సంరక్షణ

   ఏనుగుల సాంద్రత అనైముడిలో అధికం!

భారతదేశం అద్భుత జీవవైవిధ్యానికి నిలయం. వేల రకాల వృక్షాలు, జంతువులు, పక్షులు ఇక్కడ ఉన్నాయి. ఆ జాతులన్నీ పర్యావరణ ఆరోగ్యానికి అత్యంత ప్రధానమైనవి. ఒకదానితో మరొకటి సంక్లిష్టంగా ముడిపడి పోయాయి. అందుకే వన్యప్రాణులను పరిరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుంటూ, భద్రమైన భవిష్యత్తును రాబోయే తరాలకు అందించవచ్చు. వాతావరణ మార్పులను ఎదుర్కోవచ్చు. అంతరించిపోతున్న జాతుల విలుప్తతను నిరోధించవచ్చు. సుస్థిర ప్రగతికి బాటలు వేసే ఈ వన్యప్రాణుల సంరక్షణ గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అందులో భాగంగా దేశంలోని రక్షితప్రాంతాలు, ఎకలాజికల్‌ హాట్‌స్పాట్‌లు, రిజర్వు అడవులపై అవగాహన పెంచుకోవాలి.  


1. కిందివాటిలో భారతదేశంలో అతి ఎత్తయిన  బయోస్ఫియర్‌ రిజర్వ్‌ను గుర్తించండి.

1) రాణా ఆఫ్‌ కచ్‌     2)కాంచనజంగ     3) నందాదేవి   4) నీలగిరి



2. భారతదేశంలోని అతి చిన్న బయోస్ఫియర్‌ రిజర్వ్‌ ఏది?

1) సిమ్లీపాల్‌    2)డిబ్రు సైఖోవా    3) నోక్రేక్‌    4) మనాస్‌



3.  కిందివాటిలో 1988లో ఏర్పాటు చేసిన బయోస్ఫియర్‌ రిజర్వ్‌లను గుర్తించండి.

ఎ) నీలగిరి    బి) నందాదేవి    సి) నోక్రేక్‌   డి) సిమ్లీపాల్‌

 1) ఎ, బి    2)బి, సి   3) సి, డి   4) డి, ఎ



4. కింది ఏ బయోస్ఫియర్‌ రిజర్వ్‌లో 150కి పైగా హిమనీనదాలున్నాయి?

1) కాంచనజంగ    2)నందాదేవి   3) కోల్డ్‌ డెజర్ట్‌   4) దిహంగ్‌ - దిబాంగ్‌



5. యూనెస్కో ప్రకారం 2023, ఫిబ్రవరి నాటికి  ప్రపంచంలో 134 దేశాల్లో ఎన్ని బయోస్ఫియర్‌  రిజర్వ్‌లున్నాయి?

1) 848    2)948    3) 738    4) 543



6. ప్రపంచ బయోస్ఫియర్‌ రిజర్వ్‌ల మొత్తంలో భారతదేశంలోని బయోస్ఫియర్‌ల వాటా ఎంత శాతం?

1) 1.4%    2)2.4%   3) 3.4%    4) 4.4%



7. భారతదేశంలో మొత్తం జాతీయ పార్కులు (106) భౌగోళికంగా ఎంత విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి?

1) 44.440 చ.కి.మీ.    2)44.403 చ.కి.మీ.

3) 44,550 చ.కి.మీ.    4) 44,640 చ.కి.మీ.



8. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో జాతీయ పార్కుల వాటా ఎంత శాతం?    

1) 2.4%   2)1.35%    3) 1.69%    4) 2.7%



9. భారతదేశంలో 2023, జులై 1 నాటికి మొత్తం ఎన్ని రక్షిత ప్రాంతాలున్నాయి?

1) 1,102    2)1,029   3) 1,022     4) 1,107



10. భారతదేశంలో 2023, జులై 1 నాటికి ఎన్ని  కన్జర్వేషన్‌ రిజర్వ్‌లున్నాయి?

1) 220    2)123    3) 223   4) 173



11. భారతదేశంలో మొత్తం రక్షిత ప్రాంతాలు    సుమారుగా ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి?

1) 1,78,641 చ.కి.మీ.      2)1,53,540 చ.కి.మీ.

3) 1,28,641 చ.కి.మీ.      4) 1,43,540 చ.కి.మీ.



12. ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ఫ్రాన్స్‌    2)స్విట్జర్లాండ్‌  3) కెన్యా   4) అమెరికా



13. ‘కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌   ఎండేజర్డ్‌ స్పీసిస్‌ (సీఐటీఈఎస్‌)’ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1943   2)1953    3) 1963   4) 1973



14. కిందివాటిలో సిటీస్‌ (సీఐటీఈఎస్‌) సచివాలయాన్ని ఏది నిర్వహిస్తుంది?

1) యూఎన్‌డీపీ    2) యూఎన్‌ఈపీ     3) యునెస్కో   4) యూఎన్‌హెచ్‌సీఆర్‌



15. ప్రస్తుతం సిటీ(సీఐటీఈఎస్‌)లో ఎన్ని దేశాలు భాగస్వామిగా ఉన్నాయి?

1) 160    2)164    3) 190    4) 184



16. ‘నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ’ ఏర్పాటు చేసిన చివరి పులుల సంరక్షణ కేంద్రం ఏది?

1) వీరంగ దుర్గావతి    2)దోల్పూర్‌ - కరౌలి    3) రాణీపుర్‌   4) రాంఘర్హ్‌ విష్‌దరి



17. ప్రపంచంలోని పులుల జనాభాలో భారతదేశం దాదాపుగా ఎంత శాతం కలిగి ఉంది?

1) 45%     2)56%   3) 70%    4) 75% 



18. భారత దేశంలో ‘సహ్యాద్రి పులుల సంరక్షణా కేంద్రం’ ఏ రాష్ట్రంలో ఉంది?

1) మధ్యప్రదేశ్‌    2)కర్ణాటక    3) మహారాష్ట్ర    4) తెలంగాణ



19. ఇటీవల మహారాష్ట్రలోని ‘తడోబా అంధారి పులుల సంరక్షణా కేంద్రం’ నుంచి పులులను ఎక్కడికి  తరలించడానికి నిర్ణయించారు?

1) సహ్యాద్రి   2)మేల్ఘాట్‌    3) నవెగావ్‌ నగ్‌జిర    4) పెంచ్‌



20. ‘సహ్యాద్రి పులుల సంరక్షణా కేంద్రాన్ని’ ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1979    2)1989    3) 1999    4) 2008



21. కిందివాటిని జతపరచండి.

జాతీయ పార్కు       రాష్ట్రం

ఎ) నందన్‌కానన్‌        1) మహారాష్ట్ర

బి) కాజీరంగా              2)మధ్యప్రదేశ్‌

సి) భందవ్‌ఘర్హ్‌          3) ఒడిశా

డి) మేల్ఘాట్‌                4) అసోం

1) ఎ-4, బి-3, సి-2, డి-1    2)ఎ-3, బి-2, సి-1, డి-4

3) ఎ-3, బి-1, సి-2, డి-4    4) ఎ-3, బి-4, సి-2, డి-1



22. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఎన్ని ఎకలాజికల్‌ హాట్‌స్పాట్స్‌ ఉన్నాయి?

1) 26   2)46   3) 36  4) 56



23. కిందివాటిలో భారతదేశంలోని ఎకలాజికల్‌   హాట్‌స్పాట్స్‌ కానిది?

1) పశ్చిమ కనుమలు         2)హిమాలయాలు

3) ఇండో-బర్మా ప్రాంతం   4) తూర్పు కనుమలు



24. ‘హాట్‌స్పాట్స్‌’ అనే భావనను మొదటిసారిగా అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్త?

1) నార్మన్‌ మేయర్స్‌   2)జి.రోషన్‌   3) విట్టేకేర్‌   4) లోజాయ్‌



25. జీవ వైవిధ్యం అనే పదం మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు?

1) విట్టేకర్‌   2)జి.రోషన్‌   3) లోజాయ్‌   4) విల్సన్‌



26. ప్రపంచంలో అతిపెద్ద చిత్తడి ప్రాంతాన్ని(వెట్‌ల్యాండ్‌) గుర్తించండి.

1) ఎవర్లాండ్స్‌ (అమెరికా)    2)ఒకవాంగో (బోట్సువానా)

3) పాంటనోల్‌ (దక్షిణ అమెరికా)   4) కామర్ల్యు (ఫ్రాన్స్) 



27. కిందివాటిలో ఆవాసాంతర సంరక్షణ (ఇన్‌-సిటు) కానిది ఏది?

1) జాతీయ పార్కుల ఏర్పాటు 

2)బయోస్ఫియర్‌ రిజర్వ్‌ల ఏర్పాటు

3) రిజర్వుడ్‌ అడవుల ఏర్పాటు 

4) విత్తన బ్యాంకుల ఏర్పాటు 



28. కిందివాటిలో ‘రెడ్‌ డేటా బుక్‌’ను నిర్వహించే సంస్థ-

1) IUCN: ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ద   కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌

 2)CITES:కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎండేజర్డ్‌ స్పీసిస్‌

3) WWF:వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌

4) IBWL:ఇండియన్‌ బోర్డ్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌



29. కిందివాటిలో ఆవాసేతర సంరక్షణ (ఎక్స్‌ - సిటు) కానిది ఏది?

1) జంతు ప్రదర్శనశాలల ఏర్పాటు      

2)ఉద్యానవనాల ఏర్పాటు

3) అక్వేరియాల ఏర్పాటు           

4) జాతీయ పార్కుల ఏర్పాటు



30. ISFR 2021 ప్రకారం భారతదేశంలోని ఏ టైగర్‌ రిజర్వు 97% పైన అటవీ విస్తీర్ణంతో ఉంది?

1) భుక్సా   2)పక్కే   3) ఇంద్రావతి  4) పెంచ్‌



31. జతపరచండి.

జంతుజాతులు                   బయోస్ఫియర్‌ రిజర్వ్‌

ఎ) మంచు చిరుత               1) రాణా ఆఫ్‌ కచ్‌

బి) కంచర గాడిద                 2)గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌

సి) సముద్రపు ఆవు              3) సుందర్‌బన్స్‌

డి) రాయల్‌ బెంగాల్‌ టైగర్‌  4) శీతల ఎడారి

1) ఎ-4, బి-1, సి-2, డి-3     

2)ఎ-2, బి-4, సి-1, డి-3

3) ఎ-2, బి-1, సి-3, డి-4   

4) ఎ-3, బి-4, సి-1, డి-2



32. కాప్‌- 27 సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది?

1) 2008   2)2019   3) 2022   4) 2010



33. ‘వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ ఎక్కడ ఉంది?

1) న్యూదిల్లీ      2)దెెహ్రాదూన్‌  3) కోల్‌కతా      4) ముంబయి



34. ఇంటర్‌గవర్నమెంట్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (IPCC) కి ఏ సంవత్సరంలో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది?

1) 2009   2)2012   3) 2007  4) 2011



35. కిందివాటిలో అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరం-

1) 2010   2)2011   3) 2009  4) 2014



36. 1991లో సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు వ్యతిరేక నిరాహార దీక్షలో మేధాపాట్కర్‌తోపాటు ఎవరు పాల్గొన్నారు?

1) సుందర్‌లాల్‌ బహుగుణ   2)అరుంధతి రాయ్‌  

3) బాబా ఆమ్టే       4) అమర్‌ ఖాన్‌



37. కిందివారిలో ఎవరు బిష్ణోయ్‌ ఉద్యమాన్ని   ప్రారంభించారు?

1) బిర్సా ముండా   2)అరుంధతి రాయ్‌  3) అమృతాదేవి   4) జంబేశ్వర్‌


 

38. జతపరచండి. 

పరిశోధనా సంస్థ                       కేంద్ర కార్యాలయం

ఎ) టెంపరేట్‌ ఫారెస్ట్‌                1) సిమ్లా రిసెర్చ్‌ సెంటర్‌

బి) ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌    2)జబల్‌పుర్‌ జెనిటెక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ 

సి) ట్రాపికల్‌ ఫారెస్ట్‌                  3) దెహ్రాదూన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌                     

డి) అటవీ పరిశోధనా సంస్థ      4) కోయంబత్తూర్‌

1) ఎ-1, బి-4, సి-2, డి-3      2)ఎ-1, బి-2, సి-3, డి-4

3) ఎ-4, బి-3, సి-2, డి-1      4) ఎ-1, బి-4, సి-3, డి-2



39. బిష్ణోయ్‌ ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?

1) కర్ణాటక      2)మహారాష్ట్ర   3) గుజరాత్‌  4) రాజస్థాన్‌



40. యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌(UNFCC) ను ఏ సంవత్సరంలో ఆమోదించారు? 

1) 1998   2)1955    3) 2000    4) 1992



41. జతపరచండి.

 రాష్ట్రం                జాతీయ పార్కు

ఎ) కర్ణాటక             1) నమేరి

బి) అసోం              2)జిమ్‌ కార్బెట్‌

సి) మహారాష్ట్ర        3) అన్షి

డి) ఉత్తరాఖండ్‌     4) చందోలి

1) ఎ-1, బి-3, సి-2, డి-4     2)ఎ-1, బి-2, సి-3, డి-4

3) ఎ-3, బి-1, సి-4, డి-2    4) ఎ-4, బి-3, సి-2, డి-1



42. ఏ ఏనుగుల సంరక్షణా కేంద్రంలో వాటి సాంద్రత అధికంగా ఉంది?

1) అనైముడి  2)అగస్త్యమలై   3) పెరియార్‌  4) టెరాయి 

సమాధానాలు

1-2; 2-2; 3-2; 4-1; 5-3; 6-2; 7-2; 8-2; 9-3;10-2; 11-1; 12-2; 13-4; 14-2; 15-4; 16-2;17-3; 18-3; 19-1; 20-4; 21-4; 22-3; 23-4;24-1; 25-2; 26-3; 27-4; 28-1; 29-4; 30-2;31-1; 32-3; 33-2; 34-3; 35-1; 36-3; 37-4;38-1; 39-4; 40-4; 41-3; 42-1.

రచయిత 

బండ్ల శ్రీధర్ 

Posted Date : 15-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌