• facebook
  • whatsapp
  • telegram

రవాణా వ్యవస్థ

దేశంలో లక్షన్నరకు పైగా రైల్వే వంతెనలు!

ఒక దేశం అభివృద్ధి చెందడానికి అవసరమైన మౌలిక వసతుల్లో రవాణా కీలకం. నాణ్యమైన రవాణా వ్యవస్థ ఉన్నప్పుడే అన్నిరంగాల్లో ప్రగతి పరుగులు తీస్తుంది. సువిశాల భూభాగం ఉన్న భారతదేశ ఆర్థిక, సామాజిక ప్రగతిలో భాగమైన రోడ్డు, రైలు, జల, వాయు రవాణా వ్యవస్థల సమగ్ర స్వరూపంపై పోటీ పరీక్షార్థులకు గణాంకసహితంగా అవగాహన ఉండాలి. జాతీయ స్థాయితో పాటు రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా రోడ్డు, రైలు నెట్‌వర్క్‌ తీరుతెన్నులు, వాటి నియంత్రణ, అభివృద్ధి సంస్థలు, ఇటీవలి కాలంలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులు, పనులు, సంబంధిత పథకాల గురించి పరిజ్ఞానం పెంచుకోవాలి.

1.    మన దేశంలో జాతీయ రహదారుల చట్టం (నేషనల్‌ హైవేస్‌ యాక్ట్‌) ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

1) 1951   2) 1958   3) 1956   4) 1959


2.     బేసిక్‌ రోడ్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫ్‌ ఇండియాలో 2018 - 2019 ప్రకారం 2019, మార్చి 31 నాటికి భారత   దేశంలో రోడ్‌ నెట్‌వర్క్‌ ఎన్ని కిలోమీటర్లు?

1) 63,31,757      2) 64,41,757     3) 61,01,757      4) 60,07,757


3. ప్రపంచ రోడ్‌ నెట్‌వర్క్‌తో పోల్చినప్పుడు భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?

1) 1వ     2) 4వ     3) 7వ     4) 2వ


4.  భారతదేశంలోని రోడ్‌ నెట్‌వర్క్‌లో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలోని రాష్ట్రం ఏది?

1) కర్ణాటక     2) ఉత్తర్‌ప్రదేశ్‌    3) మధ్యప్రదేశ్‌     4) రాజస్థాన్‌

5.  మనదేశంలో రోడ్డు మార్గాల్లో మహారాష్ట్రలో అధికంగా ఎంతశాతం రోడ్డు మార్గం ఉంది? (బేసిక్‌ రోడ్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫ్‌ ఇండియా 2018-19 ప్రకారం)

 1) 11.72%    2) 7.37%   3) 8.1%   4) 14.31%

6.  2019 నాటికి దేశంలోని జాతీయ రహదారుల పొడవు ఎన్నికిలోమీటర్లు? (2019, మార్చి31 నాటికి)

1) 1,42,499    2) 1,32,499    3) 1,79,535      4) 1,43,499


7.  జాతీయ రహదారుల అథారిటీ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1) 2001   2) 1958  3) 1999   4) 1988

8. మనదేశంలో 2019 నాటికి జిల్లా రహదారుల మొత్తం పొడవు ఎన్ని కిలోమీటర్లు?

1) 6,12,778    2) 6,11,268    3) 6,79,487   4) 1,32,499 

9. మనదేశంలో 2019 నాటికి జాతీయ రహదారులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి?

1) 2.9   2) 2.09   3) 2.01   4) 3.09

10. బేసిక్‌ రోడ్స్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫ్‌ ఇండియా 2018 - 19 ప్రకారం 2018 - 2019 మధ్య జాతీయ రహదారులు ఎంత శాతం పెరిగాయి?

1) 2.09   2) 4.86   3) 5.01   4) 6.1
 

11. జాతీయ రహదారుల్లో మహారాష్ట్ర అత్యధికంగా ఎన్ని కిలోమీటర్ల మేర ఉంది? (బేసిక్‌ రోడ్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫ్‌ ఇండియా 2018 - 19 ప్రకారం)    

1) 17,757      2) 14,435    3) 8,772      4) 13,350


12. బేసిక్‌ రోడ్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫ్‌ ఇండియా 2018 - 19 ప్రకారం రాష్ట్ర రహదారుల పొడవు 2019, మార్చి 31 నాటికి ఎన్ని కిలోమీటర్లు?

1) 1,49,590     2) 1,79,535   3) 1,48,490  4) 1,99,535 


13. రాష్ట్ర రహదారులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రెండు, మూడు స్థానాల్లోని రాష్ట్రాలను గుర్తించండి. (బేసిక్‌ రోడ్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫ్‌ ఇండియా 2018 - 19 ప్రకారం)

ఎ) మహారాష్ట్ర     బి) కర్ణాటక     సి) గుజరాత్‌     డి) రాజస్థాన్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ

14. రాష్ట్రరహదారుల పొడవు అధికంగా ఉన్నమహారాష్ట్రలో ఎన్నికిలోమీటర్ల మేర రహదారులున్నాయి?

1) 34,400      2) 31,005     3) 32,005       4) 29,400 


15. రాష్ట్ర రహదారుల్లో ఆంధ్రప్రదేశ్‌ మొత్తం ఎన్ని  కిలోమీటర్ల పొడవుతో 5వ స్థానంలో ఉంది?

1) 13,500      2) 14,400     3) 15,600       4) 11,500 


16. రాష్ట్ర రహదారుల్లో ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాల్లో ఎంత శాతం రహదారులు ఉన్నాయి?

1) 11.2   2) 14.3   3) 10.1   4) 12.1


17. రాష్ట్ర రహదారుల్లో ఈశాన్య రాష్ట్రాలలో ఎన్ని కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉన్నాయి?

1) 22,119       2) 21,119    3) 20,119       4) 21,120 

18. మన దేశంలోని మొత్తం జిల్లా రహదారులు 2019, మార్చి 31 నాటికి ఎన్ని కి.మీ. పొడవు ఉన్నాయి?

1) 6,53,540      2) 6,12,778     3) 6,43,340      4) 6,11,778


19. జిల్లా రహదారుల పొడవులో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండగా, రెండు, మూడు స్థానాల్లోని రాష్ట్రాలను గుర్తించండి.    

ఎ) ఉత్తర్‌ప్రదేశ్‌     బి) మధ్యప్రదేశ్‌    సి) కర్ణాటక     డి) గుజరాత్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి  4) డి, ఎ

20. జిల్లా రహదారులు మహారాష్ట్రలో అధికంగా ఎన్ని కి.మీ. పొడవున్నాయి? (2019, మార్చి 31 నాటికి)

1) 1,10,420   2) 1,08,419    3) 1,20,340    4) 1,70,780 


21. జిల్లా రహదారుల పరంగా మహారాష్ట్రలో ఎంత శాతం రహదారులున్నాయి?

1) 17.7   2) 13.4   3) 16.7   4) 15.3

22. గ్రామీణ రహదారుల పొడవు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రెండు, మూడో స్థానాల్లోని రాష్ట్రాలను గుర్తించండి.

ఎ) గుజరాత్‌    బి) అస్సాం     సి) బిహార్‌   డి) ఉత్తర్‌ప్రదేశ్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


23. పట్టణ రహదారులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రెండు, మూడు స్థానాల్లోని రాష్ట్రాలను గుర్తించండి.

ఎ) ఉత్తర్‌ప్రదేశ్‌     బి) కర్ణాటక   సి)  మహారాష్ట్ర    డి) బిహార్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


24. బేసిక్‌ రోడ్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫ్‌ ఇండియా 2018-19 ప్రకారం 2019, మార్చి 31 నాటికి ప్రాజెక్టు   రహదారులు ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉన్నాయి?

1) 3,43,163       2) 3,63,339    3) 4,63,630      4) 3,93,349 

25. మనదేశంలో 2022, మార్చి 31 నాటికి రైల్‌ నెట్‌వర్క్‌ ఎన్ని కి.మీ. ఉంది? (రూట్‌ కి.మీ.లలో)

1) 64,043    2) 68,043   3) 69,053   4) 70,043


26. ప్రస్తుతం మన దేశంలో 2022, మార్చి 31 నాటికి బ్రాడ్‌గేజ్‌ ఎన్ని రూట్‌ కి.మీ. ఉంది?

1) 65,093    2) 64,093    3) 63,093    4) 61,093 

27. భారతదేశంలో 2022, మార్చి 31 నాటికి బ్రాడ్‌గేజ్‌ మొత్తం ఎంత శాతం విస్తరించి ఉంది?

1) 94.3     2) 95.67     3) 97.1      4) 96.4

28. భారతదేశంలో 2022, మార్చి 31 నాటికి మీటర్‌ గేజ్‌ ఎన్ని రూట్‌ కి.మీ. ఉంది?

1) 1556          2) 1446      3) 1656              4) 1756 

29. మనదేశంలో 2022, మార్చి 31 నాటికి నారోగేజ్‌ ఎన్ని రూట్‌ కి.మీ.లు ఉంది?

1) 1354            2) 1294     3) 1656             4) 1390 


30. ప్రస్తుతం దేశంలో 2022, మార్చి 31 నాటికి మీటర్‌ గేజ్‌ ఎంత శాతం ఉంది?

1) 3.43   2) 1.43   3) 2.43   4) 4.43


31. మనదేశంలో 2022, మార్చి 31 నాటికి నారోగేజ్‌ ఎంత శాతం ఉంది?

1) 1.70   2) 1.90   3) 1.60   4) 1.40 


32. భారతదేశంలో ప్రధానమంత్రిగా గ్రామీణ సడక్‌ యోజన(PMGSY) ను ఎప్పుడు ప్రారంభించారు?

1) 2002   2) 2004   3) 2000   4) 2009

33. సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థ (బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌) ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ దంతక్‌ కింది ఏ దేశ సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణం చేస్తుంది?

1) భూటాన్‌     2) మయన్మార్‌      3) పాకిస్థాన్‌       4) చైనా


34. కింది ఏ ప్రాంతంలో రైల్వే టెస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఉంది?

1) ముంబయి     2) చెన్నై      3) లఖ్‌నవూ     4) కోల్‌కతా


35. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేస్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) వడోదర     2) చెన్నై     3) ముంబయి     4) దిల్లీ

36. ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ (IMU)  ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ముంబయి   2) చెన్నై   3) న్యూదిల్లీ   4) విశాఖపట్నం

37. కిందివాటిలో జాతీయ జలమార్గం - 48 ఏ రాష్ట్రాలకు సంబంధించింది?

ఎ) రాజస్థాన్‌     బి) మధ్యప్రదేశ్‌      సి) మహారాష్ట్ర     డి) గుజరాత్‌

 1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ

38. జాతీయ జలమార్గం - 5 ఏ రాష్ట్రాలకు  సంబంధించింది?

ఎ) పశ్చిమ బెంగాల్‌    బి) ఆంధ్రప్రదేశ్‌    సి) కేరళ   డి) ఒడిశా

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


39. కిందివాటిలో దీజుది కాలువ అంటే?

1) జాతీయ జలమార్గం - 30   2) జాతీయ జలమార్గం - 44

3) జాతీయ జలమార్గం - 34   4) జాతీయ జలమార్గం - 45


40. 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను మీటర్‌ గేజ్, నారో గేజ్‌ నుంచి బ్రాడ్‌ గేజ్‌కు మార్చారు?

1) 739.5     2) 473.5    3) 635.9   4) 535.4 


41. 2022, ఏప్రిల్‌ 1 నాటికి మనదేశంలో రైల్వేలో మొత్తం ఎన్ని వంతెనలున్నాయి? 

1) 1,56,417    2) 1,76,001    3) 1,46,714   4) 1,42,312 

42. 2021 - 2022లో ఎన్ని రైల్వే వంతెనలు   నిర్మించారు?

1) 1451    2) 1541   3) 1351   4) 1341

43. 2022 నాటికి మన దేశంలో మొత్తం ఎన్ని రూట్‌ కిలోమీటర్లల రైల్వే నెట్‌వర్క్‌ను  విద్యుదీకరించారు?

1) 50,394    2) 44,802   3) 49,310    4) 50,493 


44. రైల్వేబడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలపడం కోసం బిబేక్‌ దేబ్రాయ్‌ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 2018   2) 2016   3) 2017  4) 2015


45. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

1) పశ్చిమ బెంగాల్‌ - కోల్‌కతా  2) ఉత్తర్‌ప్రదేశ్‌ - అయోధ్య

3) గుజరాత్‌ - అహ్మదాబాద్‌     4) తమిళనాడు - మదురై


46. సావిత్రిబాయి ఫులే అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది?

1) నాగ్‌పుర్‌    2) పుణె    3) ఇందౌర్‌    4) రాంచి


47. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?

1) కోల్‌కతా    2) న్యూదిల్లీ    3) నోయిడా    4) అహ్మదాబాద్‌


48. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ను కంటైనర్‌ రవాణా కోసం ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1977     2) 1987    3) 1997     4) 1988


సమాధానాలు

1-3; 2-1; 3-4; 4-2; 5-1; 6-2; 7-4; 8-1; 9-2; 10-2; 11-1; 12-2; 13-2; 14-3; 15-1; 16-1; 17-3; 18-2; 19-1; 20-2; 21-1; 22-2; 23-1; 24-1; 25-2; 26-1; 27-2;  28-3; 29-2; 30-3; 31-2; 32-3; 33-1; 34-3; 35-1; 36-2; 37-4; 38-4; 39-3; 40-3; 41-1; 42-2; 43-1; 44-3; 45-2; 46-2; 47-2; 48-4.

రచయిత: బండ్ల శ్రీధర్‌ 

Posted Date : 19-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌