మాదిరి ప్రశ్నలు
1. కావ్యాలంకార సంగ్రహ కర్త -
జ: రామరాజభూషణుడు
2. వృత్యనుప్రాస అంటే...?
జ: ఒకే హల్లు అనేకసార్లు రావడం
3. 'కందర్ప దర్ప' అనేది -
జ: ఛేకానుప్రాస
4. అర్థభేదం లేకుండా తాత్పర్యభేదం ఉండేది -
జ: లాటానుప్రాస
5. 'లేమా, దనుజుల గెలువగలేమా... ' ఇది దేనికి ఉదాహరణ?
జ: యమకం
6. ఒక పాదం చివరి పదం పట్టుకుని మళ్లీ ప్రారంభిస్తే అది-
జ: ముక్తపదగ్రస్తం
7. 'ఆపటేరాచల పశ్చిమాచల హిమాచల పూర్వదిశా చలంబుగన్...' అనేది
జ: అంత్యానుప్రాస
8. లుప్తోపమ అంటే...
జ: ఉపమేయ, ఉపమాన, సమాన ధర్మ ఉపమావాచకాల్లో ఒకటి లేకపోవడం
9. 'నరసరాజు కీర్తి పాలసముద్రం' - ఏ అలంకారం?
జ: రూపకం
10. ఆ రాజు కువలయానందకరుడు - ఇది ఏ అలంకారం?
జ: శ్లేషాలంకారం
11. గోరంతలు కొండంతలుగా చెప్పడం -
జ: అతిశయోక్తి
12. దృష్టాంతాలంకారంలో
జ: బింబప్రతిబంబం ఉంటుంది
13. 'ఓ గంగా! పాపాత్ములను కూడా స్వర్గానికి చేర్చు నీకు వివేకం ఎక్కడిది?' - ఏ అలంకారం?
జ: వ్యాజస్తుతి
14. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపిస్తే అది -
జ: రూపకం
15. 'ఈ మదించిన తుమ్మెద ఆమె ముఖాన్ని పద్మం అనుకుంటోంది' - అనేది
జ: భ్రాంతిమదలంకారం