మాదిరి ప్రశ్నలు
1. 'ఆంధ్రావళిమోదము' కోసం రాస్తున్నానన్న కవి ఎవరు?
జ: తిక్కన
2. డుమువుల కవి ఎవరు?
జ: శ్రీనాథుడు
3. పోతన పలికింది ....
జ: సత్కవుల్ హాలికులైననేమి
4. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి నడిపిన పత్రిక?
జ: ప్రబుద్ధాంధ్ర
5. 'తెనుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది' అన్నది?
జ: తిరుపతి వేంకటకవులు
6. 'వొట్టిమాటలు కట్టిపెట్టోయ్...' అని సందేశమిచ్చిన కవి?
జ: గురజాడ
7. దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వంలోనిది -
జ: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు
8. 'నాలుగు పడగల హైందవ నాగరాజు' అనేది?
జ: గబ్బిలంలోనిది
9. 'కాదేదీ కవితకనర్హం' అని చాటిన అభ్యుదయ కవి?
జ: శ్రీశ్రీ
10. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని గర్జించింది?
జ: దాశరథి కృష్ణమాచార్య
11. 'నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రలతో పద్యాల నడుముల్ విరగదంతాను' - అన్నదెవరు?
జ: శిష్ట్లా ఉమామహేశ్వరరావు
12. 'చేయెత్తి జైకొట్టు తెలుగోడా...' ఏ కవి పలుకు?
జ: వేములపల్లి శ్రీకృష్ణ
13. ద్రౌపది తండ్రి ఎవరు?
జ: ద్రుపదుడు
14. కాశీఖండంలో ఉన్న పాత్ర?
1) గుణనిధి 2) వ్యాసుడు 3) అగస్త్యుడు 4) అందరూ
జ: 4
15. 'సీతారామారావు' ప్రధాన పాత్రగా ఉన్న నవల .....
జ: అసమర్థుని జీవయాత్ర
16. తెలంగాణ వైతాళికుడెవరు?
జ: సురవరం ప్రతాపరెడ్డి
17. గిడుగు రామమూర్తి బిరుదు?
జ: అభినవ వాగనుశాసనుడు
18. బుచ్చిబాబు అసలు పేరు ఏమిటి?
జ: శివరాజు వెంకట సుబ్బారావు
19. ఆంగ్ల ప్రభుత్వం నిషేధించిన నవల ఏది?
జ: మాలపల్లి