మాదిరి ప్రశ్నలు
1. ఆధునిక కవిత్వం - సంప్రదాయాలు - ప్రయోగాలు అనే సిద్ధాంత గ్రంథం ఎవరిది?
జ: సి. నారాయణరెడ్డి
2. దిద్దుబాటు కథ రాసింది ఎప్పుడు?
జ: 1910
3. కోకిలస్వామి ఎవరు?
జ: రాయప్రోలు
4. రాజశేఖరచరిత్ర అనేది?
జ: నవల
5. జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన రచన ఏది?
జ: శ్రీ మద్రామాయణ కల్పవృక్షం
6. సినీకవిగా పేరు పొందిన భావకవి?
జ: దేవులపల్లి
7. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన జాషువా రచన ఏది?
జ: క్రీస్తు చరిత్ర
8. కృషీవలుడు కావ్యకర్త ఎవరు?
జ: దువ్వూరి రామిరెడ్డి
9. సరస్వతీపుత్ర బిరుదు పొందింది ఎవరు?
జ: పుట్టపర్తి నారాయణాచార్యులు
10. కిందివాటిలో 'తిలక్' చెప్పింది...
1) కాదేదీ కవితకనర్హం..
2) వీరగంధం తెచ్చినారము..
3) నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు
4) అనితర సాధ్యం నా మార్గం...
జ: నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు
11. నిజాంకి వ్యతిరేకంగా కవిత్వం రాసి, జైలుకు వెళ్లిన కవి ఎవరు?
జ: దాశరథి
12. కుందుర్తి స్వీయచరిత్ర ఏది?
జ: బతుకుమాట
13. సినారె వినూత్న సృష్టి ఉన్న గేయ కావ్యం?
జ: కర్పూర వసంతరాయలు
14. 'నాపేరు కవి - ఇంటి పేరు చైతన్యం' అన్నది?
జ: సినారె
15. 'కవిసేన మేనిఫెస్టో' ఎవరి రచన?
జ: శేషేంద్ర
16. అభినవ పోతన ఎవరు?
జ: వానమామలై వరదాచార్యులు
17. తెలుగులో మనస్తత్వశాస్త్రాల నేపథ్యంలో నవల రాసింది?
జ: గోపీచంద్
18. అంతర్జాతీయ బహుమతి పొందిన కథ ఏది?
జ: గాలివాన
19. హాస్యకథలు రాసింది ...
1) భానుమతి 2) ముళ్లపూడి 3) మునిమాణిక్యం 4) అందరూ
జ: అందరూ
20. సాక్షి వ్యాసాలు రాసింది ఎవరు?
జ: పానుగంటి