• facebook
  • whatsapp
  • telegram

దత్తాంశ అనువర్తనాలు


1. ‘నార్మ్‌’ అని దేన్ని అంటారు?
జ: బాహుళకం

 

2. 6, 5 + x, 28, 18, 11 అంశాల సగటు 14 అయితే x = ?
జ: 35

 

3. కిందివాటిలో వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతాలకు సూత్రం

 
 

4. బాహుళకం = 29, సగటు = 32 అయితే మధ్యగతం
జ: 31

5. ఆరోహణ, అవరోహణ ఓజివ్‌ వక్రాల ఖండన బిందువు యొక్క .......... దత్తాంశం మధ్యగతం అవుతుంది.
జ: x - నిరూపకం

 

6. మొదటి 'n' సహజ సంఖ్యల బాహుళకం
జ: నిర్ధారించలేం

 

7. ఒక తరగతి యొక్క తరగతి మార్కు
జ:  1/2 
 (దిగువ అవధి + ఎగువ అవధి)
 

8. మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు
జ: 12.9

 

9. కమ్మీరేఖా చిత్రంలో దీర్ఘచతురస్రాల వెడల్పు దేన్ని సూచిస్తుంది?
జ: తరగతి అంతరం

 

10. ఒక వృత్తరేఖా చిత్రంలో సెక్టారు 3/8 వ భాగం కలిగి ఉంటే దాని కోణం
జ: 135o

 

11. సగటు = 2p + q, బాహుళకం 4p - q అయితే మధ్యగతం
జ: p + 2q

12. 1 - 10, 11 - 20, 21 - 30....లో 11 - 20 తరగతి యథార్థ ఎగువ హద్దు
జ: 20.5

 

13. 10 అంశాల సగటు 20, 30 అంశాల సగటు 60. అయితే మొత్తం దత్తాంశం సగటు ఎంత?
జ: 50

 

14. x, 1/x ల సగటు p అయితే x3 +   సగటు
జ: p(4p2 - 3)

 

15. కిందివారిలో సాంఖ్యక శాస్త్ర పితామహుడు?
1) పి.సి. మహలనోబిస్‌      2) అరిస్టాటిల్‌     3) సర్‌ రోనాల్డ్‌ ఎ. ఫిషర్‌     4) శ్రీనివాస రామానుజన్‌
జ: 3 (సర్‌ రోనాల్డ్‌ ఎ. ఫిషర్‌)

 

16. 11 రాశుల సగటు 6.5, అందులో ఒక రాశి 7.5ను తొలగించగా మిగిలిన రాశుల సగటు?
జ: 6.4

 

17. 10 - 25 తరగతి మార్క్‌ విలువ
జ: 17.5

 

18. x/5, x, x/4, x/2, x/3 ల మధ్యగతం 8 అయితే x = ?
జ: 24

19. 12, 0, 5, 36, 18, 48, 5ల వ్యాప్తి ఎంత?
జ: 48

 

20. 3, 18, 6, 16, 12, 10ల మధ్యగతం ఎంత?
జ: 11

 

21. 47, 48, 49, 47, 49, 47, 0 ల బాహుళకం ఎంత?
జ: 47

 

22. వృత్తరేఖా చిత్రాలు కలిగి ఉండేవి
జ: సెక్టార్‌లు

 

23. ఒక వ్యక్తి సంపాదనలో 30% పొదుపు చేస్తాడు. అయితే వృత్త రేఖా చిత్రంలో సెక్టారు కోణం ఎంత?
జ: 108o

 

24. మొదటి 5 బేసి సహజ సంఖ్యల సరాసరి
జ: 5

 

25. కమ్మీ చిత్రాల్లో అన్ని దిమ్మెలకు ....... సమానం.
జ: వెడల్పులు

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌