1. A : B = 2 : 3, B : C = 4 : 5 అయితే A : B : C =
జ: 8 : 12 : 15
2. A : B = 2 : 3, B : C = 2 : 5, C : D = 4 : 3 అయితే A : B : C : D =
జ: 16 : 24 : 60 : 45
3. 2 : 3, 4 : 5 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45 : x అయితే x కి సమానమైంది ఏది?
జ: 54
4. ఒక నిష్పత్తి 5 : 8 కి సమానం. దాని పూర్వపదం 40 అయితే పరపదం ఎంత?
జ: 64
5. x2 + 4y2 = 4xy అయితే x : y =
జ: 2 : 1
6. 3/7 A = 5/7 B అయితే A : B =
జ: 20: 21
7. x/5 = y/8 అయితే (x + 5) : (y + 8) =
జ: 5 : 8
8.
జ: 2
9. 0.08, 0.18 ల మధ్యమ అనుపాత సంఖ్య
జ: 0.12
10. 12, 30 ల తృతీయ అనుపాత సంఖ్యకు 9, 25 ల మధ్యమ అనుపాత సంఖ్యకు గల నిష్పత్తి
జ: 5 : 1
11. 0.75 : x = 5 : 8 అయితే x =
జ: 1.20
12. రూ.1400 లను సుమన్, మోహన్లు 3 : 4 నిష్పత్తిలో పంచుకుంటే మోహన్ వాటా సొమ్ము ఎంత?
జ: రూ.800
13. 15 మంది కూలీలు ఒక గోడను 48 గంటల్లో కట్టగలరు. అదే గోడను 30 గంటల్లో కట్టాలంటే ఎంత మంది కూలీలు కావాలి?
జ: 24
14. రూ.2400 కంటే రూ.2000 విలువ ఎంత శాతం తక్కువ?
జ: 16 2/3%
15. డాక్టర్లు, లాయర్ల సరాసరి వయసు 40. డాక్టర్ల సరాసరి వయసు 35, లాయర్ల సరాసరి వయసు 50 అయితే డాక్టర్లు, లాయర్ల సంఖ్యల నిష్పత్తి ఎంత?
జ: 2 : 1
16. A : B : C = 2 : 3 : 4 అయితే
జ: 8 : 9 : 24
17. ఒక వ్యక్తి 30 శాతం జీతాన్ని ఇంటి అద్దెకు, మిగిలిన జీతంలో 75 శాతం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తే పొదుపు శాతం ఎంత?
జ: 17.5
18. ఒక చతురస్ర భుజాన్ని 5 శాతం పెంచితే వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత?
జ: 10.25%
19. x : 8 :: 25 : 40 అయితే x =
జ: 5
20. కిందివాటిలో 3 : 8 నిష్పత్తికి సమానమైంది?
జ: 37.5%
21. 10 శాతం బారువడ్డీ చొప్పున రూ.6880 ఎంత కాలానికి రూ.7224 అవుతుంది?
జ: 6 నెలలు
22. ఒక వస్తువు ప్రతి సంవత్సరం 20% తగ్గుతుంది. 2 సంవత్సరాల తర్వాత దాని విలువ రూ. 19,200 అయితే అసలు విలువ ఎంత?
జ: రూ.30,000
23. గత సంవత్సరం చక్కెర ధర కిలో రూ.40. ఈ సంవత్సరం రూ.50. అయితే పెరుగుదల శాతం ఎంత?
జ: 25%
24. ఒక వ్యక్తి రెండు సైకిళ్లను ఒక్కొక్కటి రూ.3000కు అమ్మితే ఒకదానిపై 20% లాభం, మరొకదానిపై 20% నష్టం వచ్చింది. మొత్తంమీద అతడికి లాభమా లేదా నష్టమా?
జ: 4% నష్టం
25. ఒక నియోజకవర్గంలో 12,000 మంది ఓటర్లలో 60% మంది ఓటు వేశారు. అయితే ఓటు వేసిన వారి సంఖ్య ఎంత?
జ: 7,200
26. 300 యొక్క 50% లో 50% విలువ
జ: 75
27. 13, 52ల అనుపాత మధ్యమం
జ: 26
28. కిందివాటిలో అనుపాతంలో లేని క్రమం?
1) 3, 5, 6, 8 2) 4, 6, 8, 12 3) 2, 4, 6, 12 4) 3, 4, 9, 12
జ: 1 (3, 5, 6, 8)
29. ఒక జత బూట్ల ఖరీదు రూ.450. దానిపై 6% అమ్మకపు పన్ను వసూలు చేస్తే మొత్తం బిల్లు ఎంత?
జ: రూ.477
30. అసలు రూ.8250పై 3 సంవత్సరాల కాలానికి 8% వడ్డీ రేటు చొప్పున వడ్డీ ఎంత?
జ: రూ.1980