1. జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థపదార్థాలను తిరిగి ఉపయోగించుకునే శక్తి వేటికుంటుంది?
జ: మొక్కలు
2. మొక్కలకు లేని లక్షణమేమిటి?
జ: చలనం
3. జీవులు ఏ జీవ లక్షణం ద్వారా తమ సంతతిని వృద్ధి చేసుకుని, వాటి మనుగడను నిరంతరం కొనసాగిస్తాయి?
జ: ప్రత్యుత్పత్తి
4. సీటే (శూకా)ల ద్వారా చలించగలిగే జీవి ఏది?
జ: వానపాము
5. ఒక జీవలక్షణాన్ని మొక్కలు జీవితాంతం చూపగలవు కానీ, జంతువులు చూపలేవు. ఏమిటా లక్షణం?
జ: పెరుగుదల
6. రాత్రిపూట ఉన్న చల్లటి చంద్ర కాంతికి, 'కలువలు వికసించడం' అనేది ఎలాంటి జీవ లక్షణం?
జ: ప్రతిస్పందన
7. జీవరాశుల్లో శక్తి విడుదలయ్యే జీవక్రియ ఏమిటి?
జ: శ్వాసక్రియ
8. వృక్ష వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు?
జ: లిన్నెయస్
9. వర్గీకరణకు మూల ప్రమాణం ఏది?
జ: జాతి
10. భారతదేశంలో అనుసరిస్తున్న మొక్కల వర్గీకరణ విధానం -
జ: బెంథామ్, హుకర్ విధానం
11. 'స్పీషిస్ ప్లాంటారమ్' గ్రంథకర్త ఎవరు?
జ: కెరోలస్ లిన్నెయస్
12. వర్గీకరణ విధానంలో 'పై నుంచి కిందకు వచ్చే కొద్దీ' జీవుల మధ్య పోలికలు ఎలా ఉంటాయి?
జ: పెరుగుతాయి
13. హోమోసెపియన్స్ అనే పేరు ఎవరికి వర్తిస్తుంది?
జ: మానవుడు