• facebook
  • whatsapp
  • telegram

టైగా మండలం  

అతి పెద్ద శృంగాకార అరణ్య మేఖలాల్లో ఉపఆర్కిటిక్ అని పిలిచే టైగా భూములు ఉంటాయి.
* అనంతంగా కన్పించే సతతహరితారణ్యాల్లో అసంఖ్యాకమైన నీటిగుంటలు, చిత్తడి నేలలు, వాగులు, నదులు ఉన్నాయి.

 

ఉనికి
* టైగా మండలాలు భూభాగంలో 55o, 70o అక్షాంశాల మధ్య ప్రకృతిసిద్ధ మండలాల్లో విస్తరించి ఉన్నాయి.

 

ఉత్తర అమెరికా ప్రాంతం
* ఇది పసిఫిక్ మహాసముద్ర తీరంలో ప్రారంభమై అలాస్కా, కెనడా ఉత్తర ప్రాంతాల మీదుగా ఆగ్నేయంగా అట్లాంటిక్ మహాసముద్ర తీరంలోని న్యూపాండ్ లాండ్ వరకూ విస్తరించి ఉంది.

 

యూరేషియా ప్రాంతం
* యూరేషియా ప్రాంతం స్కాండినేవియా మెట్ట ప్రాంతాల నుంచి స్వీడన్, ఫిన్‌లాండ్, రష్యాల మీదుగా తూర్పున పసిఫిక్ మహాసముద్రం వరకూ విస్తరించి ఉంది.
* ఉత్తర అమెరికా ప్రాంతం లాగానే యూరేషియా కూడా ఆగ్నేయంగా సైబీరియాలోని చాలా ప్రాంతాల్లో విస్తరించి ఉంది.
* ఈ ప్రకృతిసిద్ధ మండలంలో 'భైకాల్ సరస్సు' ప్రపంచంలోనే లోతైన మంచినీటి సరస్సుగా ప్రసిద్ధి చెందింది. ఇది సైబీరియా ప్రాంతంలో ఉంది.

శీతోష్ణస్థితి
* ప్రపంచంలో కెల్లా అత్యధిక సాంద్రత శీతోష్ణస్థితిని కలిగి ఉండటమే ఈ ప్రకృతి సిద్ధమండల విశిష్ట లక్షణం.
* సంవత్సర కాలంలో చలికాలమే ఎక్కువ ఉండి చలి చాలా తీవ్రంగా ఉంటుంది.
* ఉష్ణోగ్రత ఘనీభవన స్థానం 0oC కంటే తక్కువగా ఉంటుంది.
* ఆసియాలోని లోతట్టు ప్రాంతాల్లో, ఖండాంతర్గత శీతోష్ణస్థితి బలంగా ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తారతమ్యాలు అధికంగా ఉంటాయి.
* జనవరిలో -32oC, జులైలో 33oC సరాసరి ఉష్ణోగ్రతలను నమోదు చేసే సైబీరియాలో వెర్ఖోయనస్క్ ప్రాంతం సరాసరి 65C ఉష్ణోగ్రత తారతమ్యాన్ని కలిగి ప్రపంచంలో అత్యధిక సాంవత్సరిక ఉష్ణోగ్రత తారతమ్యాలను నమోదు చేసే ప్రాంతంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
* 1892, ఫిబ్రవరి 5, 7వ తేదీల్లో ఈ ప్రాంతంలో -68oC ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
* ఇది ఉత్తరార్ధగోళానికి సంబంధించిన అధీకృత, అత్యల్ప ఉష్ణోగ్రత.
* అంటార్కిటికా ఖండాన్ని మినహాయించినట్లు అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలను నమోదు చేసే ఈ సైబీరియా ప్రాంతాన్ని శీతల ధృవం అని వ్యవహరిస్తారు.
* పగటి పరిమాణం వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది.
* 60o ఉత్తర అక్షాంశం వద్ద జూన్ 21న ఒక రోజు 18
 గంటలు పగలు ఉంటుంది.
* దానికి వ్యతిరేకంగా డిసెంబర్ 22వ తేదీన పగలు అయిదు లేదా ఆరు గంటలు మాత్రమే ఉంటుంది.
* ఈ ప్రకృతి సిద్ధ మండాలాల్లో సరస్సులు, నదులు లాంటి జలప్రాంతాలు ఘనీభవించి ఉంటాయి.
* సంవత్సరంలో యాక్సుట్ వద్ద ఉన్న లీనానది 210 రోజులపాటు ఘనీభవించి ఉంటుంది.
* వేసవికాలంలో చక్రవాత వర్షపాతం సంభవిస్తుంది.
* సంవత్సరానికి 25 నుంచి 51 సెం.మీ. వర్షపాతం సంభవిస్తుంది.
* పొడిగా, రేణువుల రూపంలో ఉండే హిమపాతం ఈ ప్రాంతాల్లో సంభవిస్తుంది.
* 5 - 7 నెలల పాటు భూమి మంచుతో కప్పి ఉంటుంది.

సహజ వృక్ష సంపద
* ఖండాల ఉత్తర ప్రాంతంలో, మహాసముద్రతీర ప్రాంతాల్లో మధ్యలో ఉప ఆర్కిటిక్ ప్రాంతమంతా సహజ వృక్ష సంపద విస్తరించి ఉంది.
* ప్రపంచంలో అతిపెద్ద అరణ్యమేఖలలో ప్రసిద్ధిచెందిన సతతహరిత శృంగాకారపు అరణ్యాలు ఈ ప్రకృతిసిద్ధ మండలంలో విస్తరించి ఉన్నాయి.
* ఈ అడవుల్లో స్ప్రూస్, లార్చ్, ఫర్, పైన్ ప్రధాన వృక్ష జాతులు.
* బిర్చ్, యాస్పెన్, ఆల్టర్, విల్లోస్ ఇతర వృక్షాలు ఇక్కడి ప్రహరీల గట్లపై పెరుగుతాయి.

స్థానిక జంతు సంపద
* ప్రపంచంలో ఉపఆర్కిటిక్ ప్రాంతాలు 'ఫర్‌'ను ఉత్పత్తి చేసే ప్రధాన ప్రాంతాలు.
* ఇక్కడ కారిజీ లేదా రెయిన్ డీర్, మూస్, ఎల్క్, బీవర్, ఫిషర్, గుంటనక్కలు, మార్టిన్, ఓటర్, వీజెల్, తోడేళ్లు, లింక్స్, ఉడుతలు, కుందేళ్లు లాంటి జంతువులు ముఖ్యమైనవి.
* ఈ ప్రకృతి సిద్ధ మండలంలో ధృవపు ఎలుగుబంట్లు నివసిస్తాయి. ఇవి భూ ఉపరితలంపై నివసించే మాంసాహార భక్షణ చేసే జంతువుల్లో కెల్లా అతి క్రూరమైనవి.
* గ్రవుస్, వడ్రంగి పిట్ట, గ్రాస్‌బిక్ ఈ ప్రాంతంలో ప్రధాన పక్షులు.
* ప్రవాహాల్లో, జలాశయల్లో చేపలు సమృద్ధిగా ఉంటాయి.
* వేసవికాలంలో వేల కిలోమీటర్ల ప్రాంతాల్లో మంచు కురవడం వల్ల ఈ ప్రాంతాల్లో చిత్తడి నేలలు ఏర్పడతాయి. ఇవి ప్రపంచంలో కెల్లా అతి విశాలమైన చిత్తడి నేలలు.
* ఇక్కడ కీటకాలు అధిక సంఖ్యలో నివసిస్తాయి.
* ఈ మేఖలలో నివసించే మనుషులు, ఇతర జంతువుల జీవనాన్ని దోమలు, రక్తాన్ని పీల్చే ఇతర కీటకాలు దుర్భరం చేస్తాయి.
* వేసవి, చలికాలంలో జీవకోటికి సంబంధించిన వలసలు ఈ ప్రకృతి సిద్ధ మండలంలో నిర్దిష్టంగా సంభవిస్తాయి.

నేలలు
* అధిక ప్రాంతాల్లో నేలలు నిరంతరం ఘనీభవించి ఉండటం వల్ల పెద్ద వృక్షాలు ఈ ప్రకృతి సిద్ధమండలంలో పెరగవు.
* ఈ నేలలు ఘనీభవించడం వల్ల టెలిఫోన్ స్తంభాలు భూఉపరితలం మీదకు తోసివేయడం జరుగుతుంది.
* భవనాల గోడలకు, రహదారులకు బీటలు ఏర్పడటం లాంటి అనేక దుష్ఫలితాలు సంభవిస్తాయి.

 

ప్రజలు
* ఈ ప్రకృతి సిద్ధ ప్రాంతాలు ప్రపంచంలోని అత్యల్ప జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో కొన్ని. ఇక్కడ ప్రజలు జీవనాధారం కోసం వేట, చేపలు పట్టడం, ఫర్ వాణిజ్యాన్ని చేస్తున్నారు.
* దక్షిణపు అంచుల్లో ముఖ్యంగా స్వీడన్, ఫిన్‌లాండ్, ఆగ్నేయ కెనడా, ఐరోపా, రష్యా ప్రాంతాల్లో జనాభా కొంచెం మెరుగ్గా ఉంటుంది.

 

ఆర్థిక ప్రగతి, వ్యవసాయం
* వేసవి కాలంలో పగటి పరిమాణం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో బంగాళదుంపలు, ముల్లంగి, బఠానీ, లెట్యూస్, క్యాబేజీ లాంటి కొన్ని రకాల కూరగాయలు, ధాన్యాలు, పళ్లు పెరిగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

 

అటవీ సంపద
* ప్రపంచానికి కలప, కొయ్య గుజ్జులను ఈ ప్రకృతి సిద్ధ శృంగాకార అరణ్యాల ద్వారానే సరఫరా అవుతుంది.
* రష్యా దేశంలోనే సూమారు 726 మిలియన్ హెక్టార్ల టైగా ప్రాంతం విస్తరించి ఉంది.
* ప్రపంచంలో న్యూస్ ప్రింట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసేది కెనడా.
* ఈ అరణ్యాల్లోని వృక్షాలను చలికాలంలో నరికి దుంగలను ఘనీభవించిన ప్రవాహమార్గాల వెంబడి నిలువ చేస్తారు.
* వేసవి కాలంలో నదులు కరిగినప్పుడు నదీ తీరాల్లో నెలకొల్పిన అతిపెద్ద కర్మాగారాలకు వాటిని చేరవేస్తారు.

'ఫర్' వాణిజ్యం
* ప్రకృతిసిద్ధ మండలాల్లో 'ఫర్' వాణిజ్యం ప్రధానమైన, అత్యంత ఆకర్షణీయమైన వాణిజ్య కార్యకలాపం.
* 'ఫర్' క్షేత్రాల్లో గుంటనక్కలు, మింక్ మృగాలను పెంచుతున్నారు.

 

ఖనిజ సంపద
* ఈ ప్రాంతాలకు సంబంధించిన ఖనిజ నిక్షేపాల గురించి పూర్తి వివరాలు నేటికీ తెలియరాలేదు.
* ఇనుము, యురేనియం, నిఖెల్, రాగి, కోబాల్ట్, బంగారం, వెండి నిక్షేపాలను కొన్నింటిని కనుక్కున్నారు.
* ప్రపంచంలో కెల్లా అతి విశిష్టమైన ఇనుప ఖనిజాల నిక్షేపాలను స్వీడన్‌లో వెలికి తీశారు.
* ఈ దేశం తన జాతీయ ఉత్పత్తిలో అధిక భాగాన్ని ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంది.

 

పరిశ్రమలు
* పారిశ్రామిక రంగం ఇక్కడ సమృద్ధిగా లభించే జల విద్యుచ్ఛక్తి, కలప, కొయ్యగుజ్జు తయారీకి ఉపయోగించే మెత్తని కలపపై ఆధారపడి ఉంది.
* ప్రపంచంలో కొయ్యగుజ్జు తయారీలో కెనడా ప్రథమ స్థానంలో ఉంది.
* ప్రపంచంలోని అతిపెద్ద అల్యూమినియం కర్మాగారాన్ని కెనడాలోని క్యూబెక్ ప్రాంతంలో ఉన్న అర్విడా వద్ద నెలకొల్పారు.
* బయటి ప్రాంతాలకు ఈ కర్మాగారం నుంచి ముడి సరకును దిగుమతి చేసుకుంటూ స్థానికంగా చౌకగా లభించే జల విద్యుచ్ఛక్తిపై ఆధారపడి నిర్మించారు.

నగరాలు
* ఈ ప్రాంతంలో మహానగరాల అభివృద్ధిని దుర్భర శీతోష్ణస్థితి, నేలలు నిరోధిస్తున్నాయి.
* ఈ మండలంలోని నగరాల్లో ఉత్తర ధృవానికి దగ్గరగా ఉన్న నగరంగా ముర్మాన్‌స్క్ నగరాన్ని పేర్కొనవచ్చు.
* ఆర్ఖేంజల్ ప్రకృతిసిద్ధ మండలంలో కెల్లా అతిపెద్ద నగరం.
* ఇర్‌కుట్‌స్క్ నగరం సైబీరియాలోని ప్రధాన నగరం.
* ఈ ప్రకృతిసిద్ధ మండలానికి చెందిన ఉత్తర అమెరికా ఖండంలోని ప్రాంతం అంతటిలోను అలస్కాలోని 'ఫెయిర్‌బాంక్స్' అతిపెద్ద నగరం.

 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌