• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచ ప్రధాన ప్రకృతిసిద్ధ మండలాలు  

   భూ ఉపరితలాన్ని ఉష్ణోగ్రతల ఆధారంగా 3 ఉష్ణోగ్రత మండలాలుగా విభజించారు అవి...
      1) అత్యుష్ణ మండలం
      2) సమశీతోష్ణ మండలం
      3) అతిశీతల ధృవ మండలం.
* ఒక ప్రదేశపు సహజ వృక్ష సంపద విస్తరణను ఆ ప్రాంత ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు నిర్దేశిస్తాయి.
* ఉష్ణోగ్రతను మాత్రమే ఆధారంగా చేసుకుని వర్గీకరణను మెరుగుపరచి భూ ఉపరితలాన్ని కొత్తగా నాలుగు శీతోష్ణస్థితి మండలాలుగా విభజించారు.
    1) అత్యుష్ణ మండలం
    2) వెచ్చని సమశీతోష్ణ మండలం
    3) చల్లని సమశీతోష్ణ మండలం
 
    4) అతిశీతల ధృవ మండలం
* భూ ఉపరితలంపై సుమారు 71% ప్రాంతాన్ని మహాసముద్రాలు, ఇతర సముద్రాలు ఆక్రమిస్తున్నాయి.
* అందుకే శీతోష్ణస్థితిపై సముద్ర సామీప్యం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.
* సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న శీతోష్ణస్థితిని సముద్ర సామీప్య శీతోష్ణస్థితిగానూ, దూరంగా ఉంటే ఖండాంతర్గత శీతోష్ణస్థితిగానూ వర్ణిస్తారు.

* అక్షాంశం, సముద్ర సామీప్యాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రపంచాన్ని దాదాపు ఒకే రకంగా ఉండే అనేక శీతోష్ణస్థితి మండలాలుగా విభజించారు.
* వీటిని ప్రపంచ ప్రధాన ప్రకృతిసిద్ధ మండలాలు అంటారు.
* భూ ఉపరితలంపై శీతోష్ణస్థితి, నైసర్గిక స్థితి, సహజ వృక్ష సంపద, మానవ జీవన విధానంలో పోలిక ఉండే ప్రాంతాన్ని 'ప్రకృతిసిద్ధ మండలం' గా నిర్వచిస్తారు.
     1) భూమధ్యరేఖా మండలం
     2) ఆయనరేఖా మండల ఎడారులు (లేదా) ఉష్ణమండల ఎడారులు
     3) ఉష్ణమండల పచ్చికబయళ్లు (సవన్నాలు)
     4) రుతుపవన మండలం
     5) మధ్యదరా రీతి ప్రకృతిసిద్ధ మండలం
 
     6) సమశీతోష్ణ మండల ఎడారులు
     7) చైనా రీతి ప్రకృతిసిద్ధ మండలం
     8) సముద్ర ప్రభావిత పశ్చిమ తీర ప్రాంతం
     9) సమశీతోష్ణ మండల పచ్చికబయళ్లు (స్టెప్పీలు)
     10) లారెన్షియా రీతి ప్రకృతిసిద్ధ మండలం
     11) ఉపధృవ లేదా టైగా మండలం
     12) టండ్రా మండలం
     13) ధృవ హిమాచ్ఛాదిత మండలం

 

ఒక ప్రదేశ శీతోష్ణస్థితిని స్థానికంగా ప్రభావితం చేసే అంశాలు:
* ప్రదేశం ఎత్తు, ఉపరితల నిమ్నోన్నతాలు, గాలి వీచే దిశ.
* భూమధ్యరేఖ నుంచి ధృవాల వరకు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ మానవుడు జీవిస్తున్నాడు.
* ఈ రెండు మండలాలకు మధ్య ఉన్న సమశీతోష్ణ మండలంలో మానవుడు సాంస్కృతిక, ఆర్థిక, ఇతర రంగాల్లో ప్రగతి సాధించాడు.
* తీవ్ర వర్షాభావం ఉన్న ప్రాంతాలు, రహదారి సౌకర్యాలకు నోచుకోని సుదూర ప్రాంతాలు, అతి శీతల ప్రాంతాలు నేటికీ అవరోధాలుగానే ఉన్నాయి.


 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌