• facebook
  • whatsapp
  • telegram

పవనాలు - రకాలు

గాలి శబ్దం చేస్తుంది, స్థలాన్ని ఆక్రమిస్తుంది.

* గాలికి శక్తి ఉంది. అది వస్తువులను కదిలిస్తుంది. ఈ శక్తిని ఆధారంగా చేసుకుని పెద్దపెద్ద చక్రాలను తిప్పడం ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును 'పవన విద్యుత్తు' అంటారు.
* అన్ని జీవ జాతులకు గాలి అవసరం. గాలి లేకపోతే మొక్కలు, జంతువులు మనుగడ సాగించలేవు. గాలిలో ఉన్న ఆక్సిజన్ జీవులు బతికేందుకు సహాయపడుతుంది.

 

a) పవనాలు
* భూమికి క్షితిజ సమాంతరంగా చెలించే గాలిని పవనం అంటారు.
                                (లేదా)
* అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వీచే గాలిని పవనం అంటారు.
ఉదా: ప్రపంచ పవనాలు, రుతుపవనాలు, స్థానిక పవనాలు.
* పవన దిశను తెలిపే పరికరం 'పవనసూచి'.

 

b) ప్రవాహం
* భూమికి లంబంగా పైకి కిందికి చెలించే గాలిని ప్రవాహం అంటారు.
ఉదా: సుడిగాలి (టోర్నడో)
* గాలి వేగాన్ని కొలిచే పరికరం - అనిమోమీటర్, పవనవేగమాపకం
* గాలి వేగాన్ని కొలిచే ప్రమాణం - కిలోమీటర్ / గంట.

 

c) కొరియాలసిస్ ఎఫెక్ట్
     భూభ్రమణం వల్ల ఉత్పత్తయ్యే శక్తిని కొరియాలసిస్ శక్తి అంటారు. దీని ఫలితంగా ఉత్తరార్ధగోళంలో వీచే పవనాలు కుడివైపుకు, దక్షిణార్ధ గోళంలో వీచే పవనాలు ఎడమవైపుకు వీస్తాయి.

 

d) పవనాలు - రకాలు
* వేగం, వీచే దిశ, ఎందుకు వీస్తాయి లాంటి అంశాల ఆధారంగా పవనాలను మూడు రకాలుగా విభజించారు.

   
  


1) ప్రపంచ పవనాలు
ఇవి సంవత్సరం పొడవున వీస్తాయి. ఇవి మూడు రకాలు
i) వ్యాపార లేదా వాణిజ్య పవనాలు
ii) పశ్చిమ పవనాలు
iii) ధృవ పవనాలు

 

i. వ్యాపార పవనాలు లేదా వాణిజ్య పవనాలు
* వాణిజ్య పవనాలు ఉష్ణమండలాల్లో వీస్తాయి.
* వాణిజ్య పవనాలు, తూర్పుపవనాలు అంటే ఇవి తూర్పు నుంచి పడమర వైపుకు వీస్తాయి.
* ఉత్తరార్ధ గోళంలో వీటిని ఈశాన్య వాణిజ్య పవనాలు అని, దక్షినార్ధ గోళంలో ఆగ్నేయ వాణిజ్య పవనాలు అని పిలుస్తారు.
* ఇవి ఉత్తర, దక్షిణాయన రేఖ, అధిక పీడన మేఖల నుంచి భూమధ్య రేఖ అల్పపీడన మేఖల వైపుకి వీస్తాయి.

 

ii) పశ్చిమ పవనాలు
* భూమధ్య రేఖ, అల్పపీడన మేఖల వైపుకి వీస్తాయి.
* పశ్చిమ పవనాలు సమశీతోష్ణ మండలాల్లో వీస్తాయి.
* ఇవి పడమర నుంచి తూర్పు వైపుకి వీస్తాయి. అందుకే వాటికి పశ్చిమ పవనాలు అని పేరు వచ్చింది.

* ఉత్తరార్ధ గోళంలో ఇవి నైరుతి దిశలోనూ, దక్షినార్ధ గోళంలో వాయువ్య దిశలోనూ వీస్తాయి.
* ఉపాయనరేఖ అధిక పీడన ప్రాంతం నుంచి ఉపధృవ అల్ప పీడన ప్రాంతం వైపుకు వీస్తాయి.

 

iii) ధృవ పవనాలు
* ధృవ పవనాలు ధృవ పట్టీల్లో వీస్తాయి.
* వీటికే తూర్పు పవనాలు అని పేరు.
* ఉత్తర, దక్షిణ ధృవ అధిక పీడన ప్రాంతాల నుంచి ఉపధృవ అల్పపీడన మేఖల వైపుకు వీస్తాయి.

 

ప్రపంచ పవనాల ప్రభావం
* ప్రపంచ వ్యాప్తంగా వేడిని, తేమను రవాణా చేయడంలో ఈ పవనాలు కీలకపాత్ర పోషిస్తాయి.
¤* అందువల్లే ప్రపంచంలో ఏ భాగం కూడా ప్రాణులు మనలేనంతగా వెడెక్కదు లేదా చల్లబడదు.
* వాతావరణం లేకపోతే పగటిపూట (చంద్రుడిలాగా) లేదా ఉష్ణమండలాల్లో భరించలేనంత వేడిగా ఉండేది. రాత్రిళ్లు లేదా ధృవ ప్రాంతాల్లో భరించలేనంత చల్లగా ఉంటుంది.
* అయితే వేడిని, తేమను ఈ పవనాలు ప్రపంచమంతటా సమానంగా పంచడం లేదు. అందుకే ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు వేడిగా, కొన్ని ప్రాంతాలు చల్లగా, మరికొన్ని ప్రాంతాలు అధిక వర్షపాతంతో, కొన్ని ప్రాంతాలు ఎడారులుగా ఉన్నాయి.


 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌