• facebook
  • whatsapp
  • telegram

భూచలనాలు  

* భూమి రెండు రకాల చలనాలను కలిగి ఉంటుంది. అవి:
   1) భూభ్రమణం
   2) భూపరిభ్రమణం
భూభ్రమణం

అక్షం
* భూమి ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ భూనాభి ద్వారా గీసిన ఊహరేఖను 'అక్షం' అంటారు.
* భూమి తన అక్షం చుట్టూ ఒకసారి తిరిగి రావడాన్ని 'భూభ్రమణం' అంటారు.
* భూమి పడమర నుంచి తూర్పుకు 1610 కి.మీ. వేగంతో తిరుగుతుంది. కాబట్టి తూర్పున సూర్యోదయం, పడమరన సూర్యాస్తమయం అవుతుంది.
* భూభ్రమణ కాలంలో పగలు, రాత్రి ఏర్పడతాయి. పగలు, రాత్రిని కలిపి ఒకరోజు అంటారు.

భూమి - అక్షం
* భూమి అక్షం నిట్టనిలువుగా కాకుండా తూర్పుకు 23
 o  కోణంలో వంగి ఉంటుంది.
* భూమి అక్షం వంగి ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా పగలు, రాత్రి వేళల్లో భేదాలు ఏర్పడతాయి.
* సౌరకుటుంబంలో అత్యధిక భ్రమణకాలం ఉన్న గ్రహం 'శుక్రుడు' (24 రోజులు).
* సౌరకుటుంబంలో 'అత్యల్ప భ్రమణకాలం' ఉన్న గ్రహం గురుడు (9 గంటల 55 నిమిషాలు).
* భూభ్రమణం వల్ల పుట్టే శక్తిని 'కొరియాలిస్ శక్తి' అంటారు.
* భూభ్రమణం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర ప్రవాహాలు, ప్రపంచ పవనాల గమనంలో మార్పులు సంభవిస్తాయి.

 

ముఖ్యాంశాలు:
* భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడం వల్ల మనకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి, పడమరన అస్తమిస్తున్నాయనే భ్రమ కలుగుతుంది.
* భూమి తనచుట్టూ తాను తిరుగుతున్నప్పుడు దాని పైన ఉన్న గాలి, మబ్బులు, పక్షులు అన్నీ భూమితోపాటు తిరుగుతాయి.

 

భూభ్రమణం వల్ల ఉపయోగాలు:
* భూభ్రమణం వల్ల పుట్టే శక్తి కొరియాలసిస్ శక్తి.
* భూభ్రమణం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్రప్రవాహాలు, ప్రపంచ పవనాల గమనంలో మార్పు సంభవిస్తుంది.
* భూభ్రమణం వల్ల పగలు, రాత్రి ఏర్పడతాయి.

 

భూపరిభ్రమణం

* భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడాన్ని 'భూపరిభ్రమణం' అంటారు.
 

కక్ష్య
* సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చే మార్గాన్ని 'కక్ష్య' అంటారు. ఈ కక్ష్య దీర్ఘ వృత్తాకారంగా ఉంటుంది.

* భూమి అక్షం కక్ష్యా మార్గానికి   కోణంలో ఉంటుంది.
* భూమి కక్ష్య పొడవు 965 మి.కి.మీ.
* భూపరిభ్రమణం కాలం '365 రోజుల 6 గంటల 10 సెకన్‌లు'.

భూపరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు:
* లీపు సంవత్సరం ఏర్పడటం.
* రుతువులు ఏర్పడటం.

 

లీపు సంవత్సరం
* భూపరిభ్రమణ సమయం 365 రోజుల
     రోజులు లేదా 365 రోజులు.
* సాధారణ సంవత్సరానికి 365 రోజులు. ప్రతి సంవత్సరం మిగిలే 6 గంటలను 4 సంవత్సరాలకు కలిపి ఫిబ్రవరికి ఒకరోజుగా కలుపుతారు.
* ఈ లీపు సంవత్సరంలో ఫిబ్రవరిలో 29 రోజులు, మిగిలిన సంవత్సరాల్లో 28 రోజులు ఉంటాయి.

 

రుతుపవనాలు ఏర్పడటం
* భూపరిభ్రమణం, భూమి అక్షం వంగి ఉండటం వల్ల రుతువులు ఏర్పడతాయి.
* 'మార్చి 21 నుంచి జూన్ 21' వరకు భూమధ్యరేఖ, కర్కటరేఖల మధ్య ఉండే భాగం సూర్యుడికి ఎదురుగా వస్తుంది.
ఈ నెలల్లో సూర్యుడి కిరణాలు ఇక్కడ లంబంగా ప్రసరించడం వల్ల వేడి అధికంగా ఉంటుంది. వేడి అధికంగా ఉండే ఈ కాలాన్ని వేసవికాలం అంటారు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు దక్షిణార్ధగోళంలో ఏటవాలుగా పడతాయి. అందువల్ల చలి అధికంగా ఉంటుంది. దీన్నే శీతాకాలం అంటారు.
వేసవిలో పగటి సమయం రాత్రి సమయం కంటే అధికంగా, శీతాకాలంలో పగలు కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది.
* భూమధ్యరేఖ, మకరరేఖల మధ్య భాగం సూర్యుడికి ఎదురుగా 'సెప్టెంబరు 23 నుంచి డిసెంబరు 22' మధ్య వస్తుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు ఆ భాగంపై లంబంగా ప్రసరిస్తాయి. అందువల్ల వేడి అధికంగా ఉండి, వేసవి ఏర్పడుతుంది. ఉత్తరార్ధగోళంలో ఈ సమయంలో శీతాకాలం ఉంటుంది.
* సూర్యకిరణాలు నిట్టనిలువుగా కర్కటరేఖ మీద పడే రోజు జూన్ 21.
* సూర్యకిరణాలు నిట్టనిలువుగా మకరరేఖ మీద పడే రోజు డిసెంబరు 22.
* సూర్యకిరణాలు నిట్టనిలువుగా భూమధ్యరేఖ మీద పడే రోజులు మార్చి 21, సెప్టెంబరు 23.
* ప్రపంచంలో సమాన కాలపరిమితి ఉన్న రోజులు మార్చి 21, సెప్టెంబరు 23.
* అంటార్కిటికా ఖండంలో పగటికాలం సెప్టెంబరు 23 నుంచి మార్చి 21 వరకు.

* వేసవికాలంలో క్రిస్మస్ పండగ జరుపుకునే దేశం ఆస్ట్రేలియా.
* భూ పరిభ్రమణం వల్ల పగలు, రాత్రి వేళల్లో భేదాలు ఏర్పడతాయి.
* భూపరిభ్రమణం వల్ల కాలాలు, రుతువులు, విషవత్తులు ఏర్పడతాయి.

 

విషవత్తులు:
రాత్రి, పగలు సమానంగా ఉండే రోజులను విషవత్తులు అంటారు. ఆ రోజులు మార్చి 21, సెప్టెంబరు 23.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌