• facebook
  • whatsapp
  • telegram

సౌరవ్యవస్థలో భూమి ఒక సభ్యుడు - భూమి ఆవిర్భావం  

    సౌరకుటుంబంలోని ఎనిమిది గ్రహాల్లో భూమి ఒక గ్రహం. ఈ గ్రహాల ఆవిర్భావాన్ని తెలుసుకోవడానికి చాలా మంది ఖగోళశాస్త్రవేత్తలు కృషి చేశారు. వీరిలో ఇమాన్యువల్ కాంట్, టి.సి.చాంబర్లీన్, ఎఫ్. ఆర్ మాల్టన్ ముఖ్యమైనవారు.
 

ఇమాన్యువల్ కాంట్ సిద్ధాంతం
    మొదట శీతలంగా, చలనం లేకుండా ఉన్న వాయువులు, దమ్ముకణాలు క్రమేపీ ఒక దానితో మరొకటి ఢీకొని పరస్పరం ఆకర్షించుకోవడం వల్ల ఉష్ణం ఉద్భవించింది. అది తిరగడం మొదలై విశాలమైన వేడి వాయువులతో కూడిన 'నెబ్యులా'గా మారింది.
    నిహారిక అతివేగంగా తిరగడం వల్ల ఏర్పడే అపకేంద్ర బలానికి 'నెబ్యులా'లోని వాయువులు విడిపోయి మిగిలిన కేంద్రభాగం సూర్యడిగా రూపొందింది. విడిపోయిన వలయాలు క్రమేపీ ఘనీభవించి గ్రహాలుగా ఏర్పడ్డాయి అని కాంట్ భావించాడు.

 

గ్రహాకాల పరికల్పన సిద్ధాంతం
     ఈ సిద్ధాంతాన్ని చాంబర్లీన్, మౌల్టన్‌లు రూపొందించారు. దీని ప్రకారం ఖగోళంలో అతి వేగంగా ప్రయాణించే ఒక నక్షత్రం సూర్యుడికి దగ్గరగా వచ్చింది. ఆ రెండింటి పరస్పర ఆకర్షణబలాల వల్ల సూర్యుడిలో రెండు తరంగాలు ఉబ్బెత్తుగా ఏర్పడ్డాయి. ఆ తరంగాల మూలంగా సూర్యుడికి రెండు వైపుల నుంచి కొంత పదార్థం బయటకు వచ్చింది. అది సూర్యుడి చుట్టూ తిరుగుతూ చల్లారి వాయురూపం నుంచి ఘన రూపంలోకి మారి గ్రహాలుగా ఏర్పడింది.

* మనం ఊహించలేనంత పెద్దది సౌరమండలం. దీన్ని విశ్వంతో పోలిస్తే అది ఒక సూక్ష్మ ఆకారం మాత్రమే.
* మన భూమి నుంచి అత్యంత దూరంలో ఉన్న నక్షత్రాల వరకు ఉన్నదంతా విశ్వమే.
* విశ్వంలో మిలియన్ల కొద్ది గెలాక్సీలు ఉన్నాయి. ప్రతీ గెలాక్సీలో మిలియన్ల కొద్ది నక్షత్రాలు ఉన్నాయి.
* మనం ఉన్న గెలాక్సీ పేరు 'పాలపుంత'. పాలపుంతలో ఉన్న మిలియన్ల కొద్ది నక్షత్రాల్లో సూర్యుడు ఒకడు.
* నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని 'పాలపుంత' అంటారు.
* పాలపుంతకు ఉన్న ఇతర పేర్లు పాలవెల్లి, ఆకాశగంగ.
* ఈ పాలవెల్లులు లేదా ఆకాశగంగలు విడివిడిగా లేదా కొన్ని వందల వేలు కలసి ఒక గుంపుగా ఉంటాయి.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌