• facebook
  • whatsapp
  • telegram

విద్యాహక్కు చట్టం - 2009

మాదిరి ప్ర‌శ్న‌లు


1. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత?
జ: అయిదుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు + ఒక ప్రధాన ఉపాధ్యాయుడు

 

2. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని?
జ: 800

 

3. ఒక ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అదనంగా రూ.1,500 వసూలు చేశారు. అయితే విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ఈ పాఠశాలకు ఎంత జరిమానా విధించాలి?(రూపాయల్లో)
జ: 15,000

 

4. విద్యాహక్కు చట్టంలో సెక్షన్‌ 6 దేన్ని తెలియజేస్తుంది?
జ: ప్రతి ఆవాస ప్రాంతానికి ఒక కి.మీ. దూరంలో ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కి.మీ. దూరంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు చేయాలి.

 

5. విద్యాహక్కు చట్టం 2009లో ఉన్న సెక్షన్లు, అధ్యాయాలు వరుసగా ....
జ: 38, 7

 

6. RTE - 2009 ప్రకారం సెక్షన్‌ 26 దేన్ని తెలియజేస్తుంది?
జ: ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయడం.

 

7. కిందివాటిలో పాఠశాల యాజమాన్య కమిటీ విధి కానిది?
    1) మధ్యాహ్న భోజన అమలును పర్యవేక్షించడం
    2) ఆవాస ప్రాంతంలోని బడి వయసు పిల్లలందరూ బడిలో ఉండేలా చూడటం
    3) బడి అభివృద్ధి ప్రణాళికను తయారుచేయడం
    4) పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయడం
జ: 4 (పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయడం)

 

8. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ‘బాలలు’ అంటే....
జ: 6 - 14 సంవత్సరాల పిల్లలు

Posted Date : 26-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌