• facebook
  • whatsapp
  • telegram

ప్రణాళికలు

లక్ష్యాత్మక విద్యా బోధనకు సులువైన మార్గాలు!

ప్రతి విద్యాసంవత్సరంలో విద్యార్థులు కొన్ని సామర్థ్యాలను సాధించాల్సి ఉంటుంది. అందుకోసం ఉపాధ్యాయులు తగిన బోధనా వ్యూహాలను అనుసరించాలి. లక్ష్యాత్మక విద్యను అందించాలి. ఈ ప్రయత్నంలో విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఆ ప్రణాళిక తయారీని, వాటిలో రకాలను, ప్రయోజనాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. విద్యాహక్కు చట్టం, జాతీయ విద్యా విధానం, విషయ ప్రణాళికలు, వార్షిక ప్రణాళికల ప్రాధాన్యాలను అర్థం చేసుకోవాలి. పాఠ్య ప్రణాళికలను తయారు చేయడానికి దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 

నిర్వచనాలు: 

* ‘ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంతో గమ్యాన్ని చేరడానికి సక్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియే ప్రణాళిక’ - వై-డోర్‌


*  ‘తగిన సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలమవడానికి సన్నద్ధత అవుతుంది.’  - బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌


*  ‘భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకుని వచ్చి, దానికోసం పాటుపడటమే ప్రణాళిక.’ - అలాన్‌ లైకెన్‌


* ‘నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయాల్సిన కృత్యాలను ఒక వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక.’ - జాన్‌ అర్జెంటి


* ‘భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది.’ - కన్‌ఫ్యూషియస్‌


ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు:


1) తరగతిలోని విద్యార్థుల స్థాయి

2) ఆ సంవత్సరం విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలు


ప్రణాళికలు - ప్రయోజనాలు


*  బోధన సులువుగా మారుతుంది.


* అభ్యసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం  చేసుకోవచ్చు.


*  లక్ష్యాత్మక విద్యను అందించడం సులువవుతుంది.


* విద్యాహక్కు చట్టం-2009 పిల్లల సర్వతోముఖాభి వృద్ధికి అనుగుణంగా రూపొందించాలని పేర్కొన్న అంశాలు.


*  విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళికలు, పాఠ్య పుస్తకాలు, మూల్యాంకనా విధానాలు.


ప్రణాళికలు - రకాలు


విద్యా ప్రణాళిక (కరికులమ్‌) 


* విద్యా ప్రక్రియకు పునాది


*  విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసే ప్రణాళిక


*  విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే ప్రణాళిక


*  విద్యావ్యవస్థ సాధించాల్సిన గమ్యాలు, ఉద్దేశాలను  నిర్దేశించే ప్రణాళిక


*  విద్యా ప్రణాళికను తయారుచేసేది - ప్రభుత్వం  నియమించిన నిపుణుల కమిటీ


వర్తమాన విద్యాప్రణాళికకు ప్రాతిపదిక - 1986 జాతీయ విద్యావిధానం


జాతీయ విద్యావిధానం - 1986లో సూచించిన 10 మౌలిక అంశాలు


1) మన దేశ స్వాతంత్రోద్యమ చరిత్ర

2) రాజ్యాంగం - బాధ్యతలు

3) జాతీయ సమైక్యత

4) మన వారసత్వం - సంస్కృతి

5) సమసమాజం - లౌకిక చట్టాలు, స్త్రీ సాధికారత

6) ప్రజాస్వామ్య విలువలు

7) శాస్త్రీయ దృక్పథం-ప్రచారం

8) చిన్న కుటుంబ భావన విస్తరణ

9) సామాజిక రుగ్మతల నిర్మూలన

10) వాతావరణం - పర్యావరణ పరిరక్షణ

               
విషయ ప్రణాళిక 


* ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయజ్ఞానాన్ని అందించే ప్రణాళిక - విషయ ప్రణాళిక 


*  పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి, సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరచేదే - విషయ ప్రణాళిక 


* మాతృభాషను మాధ్యమ భాష(Medium of Instruction) ప్రథమ స్థానాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి అమలుచేసేది-విషయ ప్రణాళికా కర్తలు 


*  మన రాష్ట్రంలోని విషయ ప్రణాళికల నిర్మాణానికి ఆధారం - రాష్ట్ర విద్యా ప్రణాళికా చట్రం - 2011


విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు:


1) విద్యా ప్రణాళిక మూలభావనలు 

2) విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు

3) సామాజిక అవసరాలు, దృక్పథాలు 

4) మన దేశంలోని విద్యతాత్విక ఆలోచనలు 

5) అందుబాటులో ఉన్న వనరులు

వార్షిక ప్రణాళిక (ఇయర్‌ ప్లాన్‌)
 

*   ‘ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢంగా మారుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యాసం ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది.’ - మహాత్మా గాంధీ 

*   విషయ ప్రణాళికను అనుసరించి తయారుచేసే చేసే ప్రణాళిక - వార్షిక ప్రణాళిక

*   ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి బోధించడానికి తయారుచేసే ప్రణాళిక - వార్షిక ప్రణాళిక 

*   ఒక ఏడాదిలో బోధించాల్సిన పాఠాలను నెలల వారీగా విభజించుకునే ప్రణాళిక - వార్షిక ప్రణాళిక 

*  మాసాలు, బోధించాల్సిన పాఠాల పేర్లు; పాఠ్య   బోధనకు అవసరమైన పీరియడ్ల సంఖ్య, వనరులు, నిర్వహించాల్సిన కార్యక్రమాలు, సీసీఈలతో  ఉపాధ్యాయులు రూపొందించే ప్రణాళిక. 

*  విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమతమ విషయాలు ప్రతి తరగతికి పాఠ్యాంశ బోధన అమలు చేసే పథకమే - వార్షిక ప్రణాళిక 

*  వార్షిక ప్రణాళికను ఎప్పుడు రూపొందిచుకోవాలి - విద్యా సంవత్సర ఆరంభంలో 

*   వార్షిక ప్రణాళికను రూపొందించేది - జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు 

*   పాఠశాల పనిదినాల సంఖ్య - 220 

*   ప్రథమ భాషగా మాతృభాషకు ఉండే పీరియడ్ల సంఖ్య - 220 పీరియడ్లు 

*  పాఠ్యపుస్తకాన్ని బోధించడానికి అవసరమైన పీరియడ్లు - 160 (ఆంధ్రప్రదేశ్)

*  పాఠ్యపుస్తకానికి కేటాయించుకోవాల్సిన పీరియడ్లు - 168 (తెలంగాణ)

*  తెలంగాణ ఉపవాచకానికి కేటాయించుకోవాల్సిన  పీరియడ్లు  12 

వక్తృత్వం - 10 పీరియడ్లు 

వ్యాసరచన - 10 పీరియడ్లు

పద్యపఠనం - 10 పీరియడ్లు 

నాటకీకరణం - 10 పీరియడ్లు 

భాషాక్రీడలు - 10 పీరియడ్లు

*  వార్షిక ప్రణాళిక ఏ ప్రణాళికకు సంబంధించిన విషయం - అంతర్గత ప్రణాళిక 


యూనిట్‌ ప్రణాళిక: దీన్ని అంశ ప్రణాళిక, ఏకాంశ   ప్రణాళిక, పాఠ్య విభాగ పథకం అంటారు. 


*  ఏక లక్షణం సంపన్నత గలది - 1 యూనిట్‌ 


*   భాషాబోధనలో ఒక్కో పాఠాన్ని 1 యూనిట్‌గా  బోధించాల్సి ఉంటుంది. 


*  ఒక పాఠం మొత్తం బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకుని రాసే ప్రణాళిక - పాఠ్య ప్రణాళిక 


*   ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు బోధించడానికి రోజూ 90 నిమిషాలు కాలక్రమ పట్టికలో   కేటాయించారు. 


*   మొదటి 45 నిమిషాల్లో ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి. 


*   రెండో 45 నిమిషాల్లో ఆరోజు బోధించిన అంశాల ఆధారంగా అభ్యాసం కల్పించాలి. 


పాఠ్య ప్రణాళిక (యూనిట్‌ ప్లాన్‌) రాయడానికి ముందు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు: 


1. ఏ పాఠం బోధించాలి? 


2. ఎలా బోధించాలి? 


3. పాఠం ద్వారా పిల్లల్లో సాధించాల్సిన సామర్థ్యాలేమిటి? 


4. ఈ సామర్థ్యాల సాధనకు ఎలాంటి అభ్యసన కృత్యాలు నిర్వహించాలి? 


5. ఎన్ని పీరియడ్లు బోధించాలి?


*  పదేళ్లు వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి. కానీ వందేళ్లపాటు వ్యవసాయం కొనసాగాలంటే తప్పనిసరిగా విద్య నేర్వాలి - చైనా సామెత 


*  ‘నాకు ఎన్నో సమస్యలున్నాయి. అయితే ఆ విషయం నా పెదవులకు తెలియదు.’ - చార్లీచాప్లిన్‌


*   ఒక పాఠాన్ని బోధించడానికి అవసరమైన పీరియడ్లతో ప్రణాళిక తయారు చేయడమే పాఠ్య ప్రణాళిక.


నమూనా ప్రశ్నలు


1.  పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి, దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరచేది?    

1) వార్షిక ప్రణాళిక     2) విషయ ప్రణాళిక   

3) పాఠ్య ప్రణాళిక    4) సహపాఠ్య ప్రణాళిక 


2.  నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు ఉండే ప్రణాళిక?    

1) యూనిట్‌ ప్రణాళిక   2) పాఠ్య ప్రణాళిక    

3) వార్షిక ప్రణాళిక    4) కాలాంశ ప్రణాళిక 


3. విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు-  

1) సామాజిక అవసరాలు, దృక్పథాలు    

  2) సాంఘిక పద్ధతులు, దృక్పథాలు  

3) రాజకీయ అవసరాలు, దృక్పథాలు    

 4) వ్యక్తిగత అవసరాలు, దృక్పథాలు 


4. నెలవారీగా నిర్వహించే అదనపు లేదా సహపాఠ్య కార్యక్రమాలు, సామర్థ్యాల అభివృద్ధికి నిర్వహించే కార్యక్రమాలు, సి.సి.ఇ. కి సంబంధించిన వివరాలు పొందుపరిచే ప్రణాళిక-   

1) విద్యా ప్రణాళిక     2) విషయ ప్రణాళిక 

3) వార్షిక ప్రణాళిక   4) యూనిట్‌ ప్రణాళిక 


5.  ఒక పాఠాన్ని బోధించడానికి అవసరమైన పీరియడ్లతో ప్రణాళిక తయారు చేయడాన్ని ఏమంటారు?

1) యూనిట్‌ ప్లాన్‌      2) వార్షిక ప్రణాళిక   

3) సంస్థాగత ప్రణాళిక    4) పీరియడ్‌ ప్లాన్‌ 


6. పలకరింపు, ఉన్ముఖీకరణ చిత్రం గురించి మాట్లాడటం, శీర్షికా ప్రకటన, నేపథ్యం, కవి పరిచయం మొదలైన ఉపసోపానాలు ఉండే సోపానం-    

1) బోధానాంశంపై చర్చ, అవగాహన   

2) ఉపోద్ఘాతం 

3) పిల్లల అవగాహన, పరిశీలన  

 4) ఇంటిపని


7.  కాలాంశాల సంఖ్య, బోధనాంశం, బోధనా వ్యూహాలు, బోధనాభ్యసన సామగ్రి అనే అంశాలుండే ప్రణాళిక    

1) పీరియడ్‌ ప్లాన్‌   2) విషయ ప్రణాళిక     

3) వార్షిక ప్రణాళిక  4) యూనిట్‌ ప్లాన్‌ 


8. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక-   

1) విద్యా ప్రణాళిక   2) సంస్థాగత ప్రణాళిక    

3) విషయ ప్రణాళిక     4) వార్షిక ప్రణాళిక 


9.  ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు   అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకుని రాసే  ప్రణాళిక- 

1) విద్యా ప్రణాళిక     2) వార్షిక ప్రణాళిక 

3) యూనిట్‌ పథకం   4) సంస్థాగత ప్రణాళిక


10. తరగతి బోధనను క్రమబద్ధం చేసేది- 

1) వ్యాపకాలు    2) తాత్విక భావనలు 

3) క్రీడా కార్యక్రమాలు   4) ప్రణాళికలు


11. పాఠ్య పథకం అనేది? 

1) ఒక పీరియడ్‌లో బోధించేది 

2) పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక 

3) సంవత్సరంలో పాఠం మొత్తం ప్రణాళిక 

4) ఒక కాలాంశంలో బోధించే అంశాల ప్రణాళిక


12. వార్షిక ప్రణాళికలో వక్తృత్వానికి కేటాయించాల్సిన పీరియడ్లు ఎన్ని?

1) 10      2) 20     3) 30     4) 40


13. తరగతిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చే కృత్యాలున్నది? 

1) ఇంటి పని       2) ప్రవేశం 

3) ఉన్ముఖీకరణం     4) ప్రదర్శన


14. ‘మానవుడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి  యుక్తులు, సామర్థ్యాలను గుర్తించి సమగ్రంగా  బహిర్గతం చేసే సాధనం విద్య’ అని అన్నదెవరు? 

1) రవీంద్రనాథ్‌ ఠాకుర్‌    2) కొమర్రాజు లక్ష్మణరావు   

3) మహాత్మాగాంధీ     4) క్రో అండ్‌ క్రో


సమాధానాలు


1-2; 2-3; 3-1; 4-3; 5-1; 6-2; 7-4; 8-4; 9-3; 10-4; 11-1; 12-1; 13-1; 14-3.


రచయిత: సూరె శ్రీనివాసులు 


 

Posted Date : 13-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌