• facebook
  • whatsapp
  • telegram

అలంకారాలు

భావాలకు వన్నె తెచ్చే భాషా భూషణాలు!
 


భావాన్ని అర్థంతో లేదా శబ్దంతో మనోహరంగా చెప్పడంలో సాయపడేవి అలంకారాలు. అవి కావ్యం లేదా కవితకు మరింత శోభను చేకూరుస్తాయి.  విషయాన్ని చమత్కారంగా, రమణీయంగా, హృదయానికి హత్తుకునేలా వ్యక్తం చేయడానికి దోహదపడతాయి. భాషకు భూషణాలుగా వన్నె తెస్తాయి. కావ్య సౌందర్యాన్ని పెంపొందిస్తాయి. వ్యాకరణంలో భాగంగా పోటీ పరీక్షార్థులు వివిధ అలంకారాల గురించి తెలుసుకోవాలి. కవితల్లో, పద్యాల్లో, వచనంలో ప్రయోగించిన వాటిని ఉదాహరణలతో నేర్చుకోవాలి. 


1.  వస్తువు స్థితి ఉన్నది ఉన్నట్లు మనోహరంగా వర్ణిస్తే అది ఏ అలంకారం?

1) స్వభావోక్తి      2) రూపకాలంకారం 

3) ఉపమాలంకారం     4) శ్లేషాలంకారం


2.  కిందివాటిలో ఉపమాలంకారానికి సరైన ఉదాహరణ గుర్తించండి.

1) మా తోటలో బంగారం పండింది. 

2) సునీత మనసు వెన్నవలె మృదువైంది. 

3) రాజు కువలయానందకరుడు. 

4) యవనకాంత మెరుపు తీగయో అన్నట్లున్నది.


3.  ‘నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నాము’ ఇందులోని అలంకారం?

1) అంత్యానుప్రాసాలంకారం   2) ముక్తపదగ్రస్తాలంకారం 

3) వృత్యనుప్రాసాలంకారం    4) యమకాలంకారం


4.  ఉపమా అంటే? 

1) భేదం  2) ఊహ  3) పోలిక  4) దృష్టాంతం


5. ఉపమాన, ఉపమేయాలకు రమణీయమైన పోలిక చెబితే అది ఏ అలంకారం?

1) ఉపమాలంకారం     2) ఉత్ప్రేక్షాలంకారం 

3) రూపకాలంకారం     4) దృష్టాంతాలంకారం


6. ఊహించి చెప్పే అలంకారం ఏది?

1) శ్లేషాలంకారం      2) రూపకాలంకారం     

3) అతిశయోక్తి అలంకారం  4) ఉత్ప్రేక్షాలంకారం


7.  ఉపమాన, ఉపమేయాలకు అభేదం చెబితే అది ఏ అలంకారం?

1) రూపకాలంకారం    2) ఉత్ప్రేక్షాలంకారం 

3) ఉపమాలంకారం    4) అతిశయోక్తి అలంకారం


8.  ఆ జెఱ్ఱి మఱ్ఱి తొఱ్ఱలో బిఱ్ఱ బిగిసి ఉన్నది.   ఇందులోని అలంకారమేది?

1) వృత్యాను ప్రాసాలంకారం     

2) ఛేకాను ప్రాసాలంకారం

3) లాటాను ప్రాసాలంకారం  

 4) యమకాలంకారం


9. ధర్మాన్ని ఆచరించనివాడు శోకాగ్ని తప్తుడవుతాడు. ఇందులోని అలంకారమేది?

1) రూపకాలంకారం     2) శ్లేషాలంకారం 

3) ఉపమాలంకారం     4) ఉత్ప్రేక్షాలంకారం


10. ‘నీ విమల మేచకరూప సుధారసంబు’ ఇందులోని అలంకారం ఏది?

1) స్వభావోక్తి అలంకారం  2) అతిశయోక్తి అలంకారం 

3) ఉపమాలంకారం    4) రూపకాలంకారం


11. కిందివాటిలో లాటాను ప్రాసాలంకారానికి ఉదాహరణ?    

1) లేమా దనుజుల గెలువగ లేమా! 

2) దీనులకు చేసే సేవ సేవ 

3) దేవాలయ గోపురాలు ఆకాశానికంటుతున్నాయి

4) ఇందువదన, సుందరవదన, మందగమన


12. పాదాంతంలో వదిలిన పదాన్ని మళ్లీ గ్రహించడం అనేది ఏ అలంకార లక్షణం?

1) అంత్యాను ప్రాసాలంకారం  2) ఉపమాలంకారం 

3) అతిశయోక్తి అలంకారం   4) ముక్తపదగ్రస్తాలంకారం


13. మానవా! నీ ప్రయత్నం మానవా! ఇది ఏ    అలంకారం?

1) శ్లేషాలంకారం     

2) యమకాలంకారం 

3) అర్థాంతరన్యాసాలంకారం 

4) వృత్యనుప్రాసాలంకారం


14. తండ్రి హరిజేరుమనియెడి తండ్రి తండ్రి - ఏ అలంకారం

1) వృత్యనుప్రాసాలంకారం  2) శ్లేషాలంకారం 

3) లాటానుప్రాసాలంకారం 4) ఛేకానుప్రాసాలంకారం


15. ప్రతి పాదాంతంలో ప్రాస పదాలు వస్తే అది ఏ అలంకారం?

1) యమకాలంకారం  

2) అంత్యానుప్రాసాలంకారం 

3) స్వభావోక్తి అలంకారం 

4) అతిశయోక్తి అలంకారం


16. గిరి కార్ముక నిర్గతమై

హరిశర మపుడసుర పురవరాభి ముఖంబై

సురగరుడ దురవ లోక

త్వరతో జనె నొక మహారవం బుదయింపన్‌ - 

ఈ పద్యంలోని అలంకారం?

1) యమకాలంకారం   2) వృత్యనుప్రాసాలంకారం 

3) ఛేకానుప్రాసాలంకారం   4) శ్లేషాలంకారం


17. ‘మనసు భద్రమయ్యే మన సుభద్ర కిపుడు’  ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.

1) యమకాలంకారం      

 2) ఛేకానుప్రాసాలంకారం 

3) లాటానుప్రాసాలంకారం   

4) అంత్యానుప్రాసాలంకారం


18. కిందివాటిలో శ్లేషాలంకారానికి ఉదాహరణ?

1) చింతకాయ పుల్లన     

2) అంజలి ముఖం చంద్రబింబం 

3) మా ఊరి మేడలు ఆకాశాన్నంటుతున్నాయి 

4) మానవ జీవనం సుకుమారం


19. ‘మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక’   ఇందులోని అలంకారం?

1) ఉపమాలంకారం    2) లాటానుప్రాసాలంకారం 

3) శ్లేషాలంకారం    4) ముక్తపదగ్రస్తాలంకారం


20. శ్లేషాలంకార లక్షణం?

1) ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి చెప్పడం. 

2) వాక్య ప్రయోగంలో ఒకే శబ్దం వేర్వేరు అర్థాలను ఇవ్వడం. 

3) ఉపమేయానికి, ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెప్పడం. 

4) ఒక వస్తువును ఉన్నదానికంటే అధికంగా వర్ణించి చెప్పడం.


21. సుదతీ నూతన మదనా!

మదనాగ తురంగ పూర్ణమణిమయ సదనా!

సదనామయ గజరదనా!

రద నాగేంద్ర నిభస్పూర్తి రస నరసింహా 

ఇందులోని అలంకారం? 

1) లాటానుప్రాసాలంకారం     

2) యమకాలంకారం  

3) ఛేకానుప్రాసాలంకారం

4) ముక్తపదగ్రస్తాలంకారం


22. లాటానుప్రాసాలంకార లక్షణం?

1) ఉపమేయానికి, ఉపమానానికి భేదాలు ఉన్నా లేనట్లు చెప్పడం. 

2) ఒకే పదం అర్థం ఒకటే అయినా తాత్పర్య భేదంతో ప్రయోగించడం.

3) ఒకవాక్యంలో హల్లుల జంట మళ్లీ మళ్లీ రావడం.

4) పదాల జంట వెంట వెంటనే రావడం.


23. వృత్యనుప్రాసాలంకారంలో ఉండే లక్షణం ఏది?

1) రెండేసి హల్లులు వ్యవధానం లేకుండా రావడం.

2) అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో రావడం.

3) నానార్థాలు ఉండే పదాలను ప్రయోగించడం. 

4) ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తి కావడం.


24. ‘నాటియట్ల ముక్కంటి మాయనే మచ్చెకంటియా వంటకంబు’ ఇందులోని అలంకారం?

1) రూపకాలంకారం     2) స్వభావోక్తి అలంకారం 

3) వృత్యనుప్రాసాలంకారం    4) శ్లేషాలంకారం


25. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.

మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా! 

ఇందులోని అలంకారం?

1) ఉపమాలంకారం   2) ఉత్ప్రేక్షాలంకారం 

3) యమకాలంకారం   4) అర్థాంతరన్యాసాలంకారం


26. అర్థాంతరన్యాసాలంకార లక్షణం?

1) విశేష విషయాన్ని సామాన్య విషయంతో లేదా సామాన్య విషయాన్ని విశేష విషయంతో సమర్థించి చెప్పడం. 

2) ఉన్నది ఉన్నట్లు మనోహరంగా వర్ణించి చెప్పడం.

3) ఒక వస్తువును మరొక వస్తువుతో అందంగా పోల్చి చెప్పడం.

4) ఒక వస్తువును ఉన్నదానికంటే అధికంగా వర్ణించి చెప్పడం.


27. ‘ధోని కీర్తి చంద్రికలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాకినవి’ అనేది ఏ అలంకారం?

1) ఉపమాలంకారం     

2) రూపకాలంకారం

3) అతిశయోక్తి అలంకారం 

4) స్వభావోక్తి అలంకారం


28. ‘ఈ రోజుల్లో పిల్లల బుద్ధి పాదరసంలా పనిచేస్తుంది’ అనేది ఏ అలంకారం?

1) ఉపమాలంకారం   2) ఉత్ప్రేక్షాలంకారం 

3) రూపకాలంకారం  4) స్వభావోక్తి అలంకారం


29. నీవేల వచ్చెదవు. ఇందులోని అలంకారం?

1) యమకాలంకారం     2) శ్లేషాలంకారం 

3) లాటానుప్రాసాలంకారం    4) ముక్తపదగ్రస్తాలంకారం


30. కిందివాటిలో అర్థాంతరన్యాసాలంకారానికి ఉదాహరణ?

1) శివాజీ కల్యాణ దుర్గాన్ని సాధించాడు. వీరులకు సాధ్యం కానిది లేదు కదా!

2) మిమ్ము మాధవుడు రక్షించుగాక.

3) సింహాలు గుహల్లో నివసిస్తున్నాయి.

4) ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది.


31. ఇది ముఖమా? పద్మమా? ఈ వాక్యంలోని  అలంకారం?

1) ప్రతీపాలంకారం  2) అనన్వయాలంకారం 

3) స్మరణాలంకారం   4) సమాసోక్తి అలంకారం


32. ప్రకృతానికి సదృశమైన మరోదానితో మరుగు పుచ్చితే అది?

1) నిదర్శనాలంకారం  2) అపహ్నవ అలంకారం 

3) వినోక్తి అలంకారం   4) కారణమాల అలంకారం


33. ప్రస్తుతాన్ని సమర్థించడానికి ఒకటి చెప్పి అవి చాలదని మరొకటి చెబితే అది?

1) యథాసంఖ్య అలంకారం  2) మీలిత అలంకారం 

3) వికస్వర అలంకారం  4) వక్రోక్తి అలంకారం


34. లోకంలోని రీతిని చెప్పే అలంకారం?

1) లోకోక్తి అలంకారం 2) వక్రోక్తి అలంకారం 

3) ఛేకోక్తి అలంకారం  4) గూఢోక్తి అలంకారం


35. పద్మమని భృంగము, చంద్రుడని చకోరములు, నీ ముఖమును చూచి ఆనందించుచున్నవి  - ఇందులోని అలంకారం?

1) రూపకాలంకారం   2) ఉల్లేఖాలంకారం 

3) ఉత్ప్రేక్షాలంకారం 4) పరిణామాలంకారం


36. ముఖము పద్మమును, చంద్రుడిని జయించినది - ఈ వాక్యంలోని అలంకారం?

1) తుల్య యోగిత అలంకారం 

2) సమాసోక్తి అలంకారం 

3) అతిశయోక్తి అలంకారం 

4) వ్యాజస్తుతి అలంకారం


37. తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు అనేది ఏ అలంకారం?

1) రూపకాలంకారం   2) అతిశయోక్తి అలంకారం 

3) స్వభావోక్తి అలంకారం   4) ఉత్ప్రేక్షాలంకారం


38. తలనుండు విషము ఫణికిని

వెలయంగ తోకనుండు వృశ్చికమునకున్‌

తలతోక యనక యుండును

ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! 

- ఈ పద్యంలోని అలంకారం?

1) ఉపమాలంకారం     2) రూపకాలంకారం 

3) స్వభావోక్తి అలంకారం     4) వృత్యనుప్రాసాలంకారం


39. పండిన దెందిన దొక్కటి ఖండించిన పచ్చి దొక్కటి కాలిన దొకటై 

- ఇందులోని అలంకారం?

1) అంత్యనుప్రాసాలంకారం 2) లాటానుప్రాసాలంకారం 

3) ఛేకానుప్రాసాలంకారం     4) వృత్యనుప్రాసాలంకారం


సమాధానాలు
 

1-1; 2-2; 3-3; 4-3; 5-1; 6-4; 7-1; 8-1; 9-1; 10-4; 11-2; 12-4; 13-2; 14-3; 15-2; 16-2; 17-1; 18-4; 19-3; 20-2; 21-4; 22-2; 23-4; 24-3; 25-4; 26-1; 27-2; 28-1; 29-2; 30-1; 31-3; 32-2; 33-3; 34-1; 35-2; 36-1; 37-2; 38-3; 39-4.

 

రచయిత: సూరె శ్రీనివాసులు 

Posted Date : 21-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌