• facebook
  • whatsapp
  • telegram

CONDITIONAL SENTENCES

Let us speak in English, shall we?

A sentence which is based on a condition is called a conditional sentence.
(ఒక షరతు మీద ఆధారపడ్డ వాక్యాన్ని షరతు వాక్యం అంటారు.)
e.g.: If you work hard you will succeed in your life.
పై వాక్యాన్ని conditional tense
అంటారు. ఎందుకంటే? అందులో నువ్వు బాగా ప్రిపేర్ అయితే అనే condition ఉంది. అంటే నువ్వు చేసే hard work మీద జీవితంలో నీ విజయం ఆధారపడి ఉంటుందని అర్థం.
ప్రతి conditional sentence లో రెండు భాగాలుంటాయి.
అవి

             1. If-clause    
             2. Main-clause

పై వాక్యంలో If you work hard అనే వాక్య భాగాన్ని If-clause అని, you will succeed  అనే వాక్య భాగాన్ని Main-clause అని అంటారు.
ఇంగ్లీష్ లో ప్రదానంగా 3 రకాల conditional sentences ఉన్నాయి. అవి.

1. Open/ possible conditional

2. Improbable/ Imaginary conditional

3. Impossible/ unfulfilled conditional
 

1. OPEN/ POSSIBLE CONDITIONAL

Structure:   If + S + V1 + O + S + will/ shall/ can/ May + V1  + O

ఇక్కడ  will/ shall = Futurity  
                      Can = ability/ Permission
                     May = Possibility ని సూచిస్తాయి.

 

USE: Present లేదా Future లో ఏవైనా రెండు actions జరగడానికి అవకాశం (possibility) ఉన్నప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. అందుకే దీన్ని possible conditional అని అంటారు.  If-clause లో Simple  Present  tense ని, main-clause లో Simple Future Tense ని ఉపయోగిస్తారు.
e.g.: If she invites me I will go to her marriage.

పై వాక్యంలో 'ఆమె నన్ను ఆహ్వానిస్తే, నేను ఆమె పెళ్లికి వెళ్తాను' అంటే ఆమె నన్ను ఆహ్వానించడానికి, నేను ఆమె పెళ్లికి వెళ్లడానికి అవకాశం ఉన్నదని అర్థం. ఇది సాధారణంగా positive meaning తో   ఉంటుంది.
A few more examples:
If you meet him he will help you.
If you try hard you can get that post.
If he studies well he will pass the exam.
If it rains we will stay at home.
If they start now they will catch the train.
If you drive very fast you may meet with an accident.
If Sachin plays well India can win the match.

 

2. IMPROBABLE/ IMAGINARY
Structure: If + S + V2 + O + S + would/ should/ could/ might + V1 + O

A. IMPROBABLE:
USE: Present
లేదా Future లో ఏవైనా రెండు actions జరగడానికి అవకాశం లేనప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ If- clause లో simple past tense ని main clause  లో  conditional tense  ని ఉపయోగిస్తారు.
e.g.: If I won the lottery I would buy a car.
పై వాక్యంలోని రెండు actions జరగడానికి అవకాశాలు తక్కువ. అంటే నేను లాటరీ గెలిచేదీ లేదు, కారు కొనేదీ లేదు అని అర్థం. ఇది సాధారణంగా  Negative  అర్థంతో ఉంటుంది.


A few more examples:
If he studied hard he would pass in the firstclass
If he got a chance he would become the chiefminister.
If they played well they would win the match.
If I became the Prime minister of India I wouldabolish the reservation system.

 

B. IMAGINARY CONDITIONAL:
If-clause, Main-clause
ల లోని రెండు actions ఆచరణ సాధ్యం కానివి, ఊహాజనితమైనవి లేదా కల్పితాలైనప్పుడు దాన్ని Imaginary conditional అంటారు.
e.g. : If I were a bird I would fly in the sky.
పై వాక్యంలో ''నేనే పక్షినైతే గాలిలో ఎగురుతాను'' అంటే నేను పక్షిని కాదు కాబట్టి గాలిలో ఎగురలేను అని అర్థం. మనిషి పక్షికావడం, గాల్లో ఎగరడం కేవలం కల్పితాలు లేదా ఊహాజనితాలు. ఇక్కడ if clause లో్ be రూపం వస్తే అది ఎల్లప్పుడు were మాత్రమే అవుతుంది.

A few more examples:
If I were you I wouldn't leave such a good job.
If he were you he would never behave like this.
If she were you she wouldn't do that.
If I were rich I would buy a car.


3. UNFULFILLED CONDITIONAL
Use:   గతంలో ఫలప్రదం కాని (unfulfilled) రెండు  actions గురించి చెప్పాలనుకున్నప్పుడు, దీన్ని ఉపయోగిస్తారు. If-clause లోని వాక్యం జరగనందువల్ల Main - clause  లోని వాక్యం జరగలేదని చెబుతాం. ఇక్కడ If-clause  లోని Past perfect tense ని Main clause లో conditional perfect tense ని ఉపయోగిస్తారు.
e.g.: If she had invited me I would have gone to her marriage
పై వాక్యంలో 'ఆమె నన్ను పెళ్లికి ఆహ్వానించి ఉండి ఉంటే నేను ఆమె పెళ్లికి వెళ్లి ఉండే వాడిని' అంటే ఆమె నన్ను పెళ్లికి ఆహ్వానించలేదు కాబట్టి నేను ఆమె పెళ్లికి వెళ్లలేదని అర్థం.

A few more examples
If you had asked me I would have helped you.
If they had started early, they would have caught the train.
If I had known your address. I would have come to your house.
If you had given me a chance I could have proved my worth.
If you had been careful. You could have avoided the accident


Conditional tenses in a nutshell


సమాధానం.ఎస్సీలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే పద్ధతి:

మొదటిదశ: మొదట ఇచ్చిన ప్రశ్నను జాగ్రత్తగా చదివి అందులోని verb ను గుర్తించి మూడు  conditional sentences లో దేనికి చెందుతుందో గుర్తించాలి.
రెండోదశ: ఇపుడు పైన ఇచ్చిన పట్టిక ఆధారంగా సమాధానాన్ని గుర్తించాలి.

Illustrative Examples:

1. If you write well, you ........ good marks.
      1) will get 
      2) would get
      3) would have got 
      4) get
Ans: 1. 
వివరణ:
పైన ఇచ్చిన వాక్యంలో  If- clause  లో verb V1 (write) ఉంది. పై Table ప్రకారం If -clause  లో V1 ఉంటే  Main clause లో will + V1 ఉండాలి. కాబట్టి 1 మాత్రమే సరైన సమాదానం.


2. If I were the president I ....... in Rashtrapati Bhavan.

    1) will live                                  2) would live
    3) would have lived                 4) lived
Ans: 2.
వివరణ:
పై వాక్యాన్ని చదివిన వేంటనే type - II (Imaginary conditional) గా గుర్తించవచ్చు. అంతేకాక If - clause లో verb1 V2 (were) లో ఉంది. కాబట్టి main - clause లో verb  would + V1 ఉండాలి.
కాబట్టి 2 మాత్రమే సరైన సమాధానం అవుతుంది.


3. If she had taken a taxi. She ....... the station in time

     1) will reach                                 2) would reach
     3) would have reached              4) could reach
Ans: 3.
వివరణ:
పై ప్రశ్నను చదివిన వేంటనే unfulfilled conditional గా గుర్తించవచ్చు. పై Table ప్రకారం If - clause లో  had + V3 ఉంటే main - clause లో have + V3 ఉండాలి.
 
కాబట్టి 3 మాత్రమే సరైన సమాధానం అవుతుంది.


QUESTION TAGS

మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, మనం చెబుతున్న విషయంతో ఎదుటి వ్యక్తి ఏకీభవిస్తున్నాడా? లేదా? తెలుసుకోవాలన్నా లేదా మనం చెప్పిన విషయాన్ని ధ్రువీకరించుకోవాలన్నా ఆ వాక్యం చివర మనం అవునా? కదూ? అనే చిన్న ప్రశ్నలను జతచేస్తాం. వీటినే ఇంగ్లిష్‌లో Question Tag అంటారు.

ఉదాహరణకు:
మీరు DSC కి ప్రిపేర్ అవుతున్నారు,  కదూ?

             Statement                     Question Tag
ఇదే ఇంగ్లీష్ లో అయితే 
        You are preparing for DSC, aren't You?
ఇంగ్లీష్ లో మనకు 2 రకాల Question Tags  ఉంటాయి.  అవి 1. Positive Tag 
                                                                                   2. Negative Tag,
Positive statement  కు Negative Question Tag,  Negative Statement కు Positive Question Tag ఉంటాయి.

 

 Positive statement                                          Negative Statement
         Negative Tag                                        Positive Tag
      Structure HV+n't+S                                     HV+S


                                HV= helping verb
                      S= Subject (Pronoun)

 

1. You are a student, aren't you? (Negative)
    You aren't a student, are you? (Positive)
2. She is your sister, isn't she? (Neg.)
    She is not sister, is she? (Pos.)
3. He will come here tomorrow, won't he? (Neg.)
    He won't come here tomorrow, will he? (Pos.)
4. They were playing cricket yesterday, weren't they? (Neg.)
    The weren't watching TV, were they? (Pos.)
5. I have already told you, haven't I? (Neg.)
    I haven't seen this movie, have I? (Pos.)

 

పై ఉదాహరణలనుండి మనం గమనించే ముఖ్యమైన అంశాలు :
1. ప్ర
తీ Question Tag Helping Verb, Subject లతో ఉంటాయి.
2. ఇచ్చిన వాక్యంలో not లేకపోతే Question Tag లో not  చేర్చాలి. ఇచ్చిన వాక్యంలో not  ఉంటే Question Tag లో not తొలగించాలి.
Question Tags for the sentences without ahelping verb.(సహాయక క్రియలులేని వాక్యాలకు Question Tags):
ఇచ్చిన వాక్యంలో Helping Verb (సహాయక క్రియ) లేకుంటే ఆ వాక్యంలోని Verb ను గుర్తించి, ఆ verb Present Tense (V1) లో ఉంటే Question Tag  లోdo/ does ని సహాయక క్రియగా ఉపయోగించాలి. ఇచ్చిన వాక్యం Present Tense (V2)  లో ఉంటే Question Tag  లో did ని సహాయక క్రియగా ఉపయోగించాలి.

Some more Examples:
1. She cooks food, doesn't she?
2. You like sweets, don't You?
3. They played well, didn't they?
4. He come here yesterday, didn't he?
5. She knows everything, doesn't she?
6. You applied for DSC, didn't you?

Some Important Notes:(కొన్ని ముఖ్యగమనికలు)

Note 1: ఇచ్చిన వాక్యంలో Subject స్థానంలో Noun ఉంటే Question Tag లో దాన్ని Pronoun గా మార్చుకోవాలి.
e.g.:   Mr. Reddy speaks in English, doesn't he?
          Mrs. Pratibha patil is our President, isn't she?
          Culcutta is now called Kolkata, isn't it?

Note 2: ఏదైనా వాక్యంలో am సహాయక క్రియగా ఉంటే Question Tag లో are గా మార్చుకోవాలి. కాని amn't గా ఉంటే am వస్తుంది.
e.g.: I am teacher, aren't I?
        I am not a doctor, am I?

Note 3 : ఇచ్చిన వాక్యంలో Negative అర్ధాన్నిచ్చే no,none, neither, never, seldom, hardly, little, few లాంటి పదాలు ఉన్నప్పుడు Question Tag ను Positive లో రాయాలి.
e.g.: He seldom goes to movies, does he?
        We have never met earlier, have we?
        Nobody helped, did they?
        Few people always speak truth, do they?

Note 4: ఏదైనా వాక్యం Let us... తో ప్రారంభమైతే దాని Question Tag ఎల్లప్పుడు shall we? గా ఉంటుంది.
e.g.: Let us to to a movie tonight, shall we?
         Let us speak in English, shall we?

 

Note 5: ఇచ్హిన వాక్యంలో have రూపాన్ని (have, has, had) సహాయ క్రియగా కాకుండా ప్రదాన క్రియగా ఉపయేగించినప్పుడు Question Tag లో  do రూపాన్ని (do, does, did) సహాయ క్రియగా ఉపయోగించుకోవాలి. 
e.g.: You have two children, don't you?
        She has a car, doesn't she?
        They had a own house, didn't they?

Note 6: Imperative sentences (ఆజ్ఞలు, అభ్యర్థనలు) కు will, can, would, could లాంటి modal auxiliaries ని question tags లో Helping గా ఉపయోగిస్తారు.  Negative Imperatives కి మాత్రం will you? వస్తుంది.
e.g.:  Please sit here, could you?
         Close the door, won't you?
         Don't disturb me, will you?                             

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌