• facebook
  • whatsapp
  • telegram

వన్యప్రాణుల సంరక్షణ

ఆసియా సింహాలు అక్కడే భద్రం!

జీవావరణ సమతౌల్యతలో, సహజ ఆహార గొలుసులో వన్యప్రాణులు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే అభివృద్ధి క్రమంలో పర్యావరణ వ్యవస్థలు విధ్వంసమవుతూ, వన్యప్రాణుల సహజ ఆవాసాలు కుచించుకుపోతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత చర్యలు చేపడుతున్నాయి. సహజ పర్యావరణ పరిస్థితులను పునరుద్ధరించి, రక్షించి, మెరుగుపరిచేందుకు, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు నిర్దిష్ట ప్రాంతాలను జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, టైగర్‌ రిజర్వులుగా ప్రకటించాయి. ఇందుకోసం చట్టాలను రూపొందించి రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఉన్న అలాంటి సంరక్షణ ప్రాంతాలు, అభయారణ్యాలు, వాటి విస్తీర్ణం, ప్రత్యేకతల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి.


1. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కును ఏ  సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

1) 2017    2) 2018   3) 2016   4) 2019

జ: 2


 

2. సంజయ్‌ జాతీయ పార్కు, పన్నా జాతీయ పార్కులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

1) మహారాష్ట్ర   2) మధ్యప్రదేశ్‌   3) గుజరాత్‌   4) ఛత్తీస్‌గఢ్‌

జ: 2


 

3. కిందివాటిలో మణిపుర్‌లోని జాతీయ పార్కును గుర్తించండి.

1) క్లౌడెడ్‌ జాతీయ పార్కు  2) ఇటంకి జాతీయ పార్కు 

3) కీభుల్‌ లంజో జాతీయ పార్కు   4) ముర్లెన్‌ జాతీయ పార్కు

జ: 3


 

4. దుద్వా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఉత్తరాఖండ్‌    2) ఉత్తర్‌ప్రదేశ్‌   3) సిక్కిం   4) హిమాచల్‌ ప్రదేశ్‌

జ: 2

5. గురుమర జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?

1) సిక్కిం  2) కేరళ   3) పశ్చిమ బెంగాల్‌  4) హిమాచల్‌ ప్రదేశ్‌

జ: 3

6. సుందర్‌బన్స్‌ జాతీయ పార్కును యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలోకి ఏ సంవత్సరంలో చేర్చింది?

1) 1987   2) 1988  3) 1985  4) 2011

జ: 1



7. భారతదేశంలో 55వ పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

1) కర్ణాటక   2) కేరళ   3) రాజస్థాన్‌   4) మహారాష్ట్ర

జ: 3


8. అగస్త్యమలై బయోస్ఫియర్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) కర్ణాటక 2) మహారాష్ట్ర 3) కేరళ 4) తమిళనాడు

జ​​​​​​​: 3


9. ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఎన్ని బయోస్ఫియర్‌ రిజర్వ్‌లు ఉన్నాయి?

1) 4   2) 5  3) 6   4) 7

జ​​​​​​​: 1

10. ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1947   2) 1948  3) 1959   4) 1960

జ​​​​​​​: 2



11. కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎన్‌డేంజర్డ్‌ స్పీసిస్‌ (CITES)  ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) లండన్‌  2) ప్యారిస్‌   3) జెనీవా  4) టోక్యో

జ​​​​​​​: 3


12. వీరంగ దుర్గావతి టైగô రిజర్వ్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) మహారాష్ట్ర   2) కర్ణాటక   3) కేరళ   4) మధ్యప్రదేశ్‌

జ​​​​​​​: 4

13. దోల్పూర్‌ కరౌలి టైగర్‌ రిజర్వ్‌ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

1) ఉత్తర్‌ప్రదేశ్‌   2) రాజస్థాన్‌    3) కర్ణాటక    4) కేరళ

జ​​​​​​​: 2

14. కిందివాటిలో అస్సాంలోని టైగర్‌ రిజర్వ్‌లను    గుర్తించండి.

ఎ) కజిరంగా   బి) దంఫా    సి) నమేరి  డి) కామ్లాంగ్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, ఎ   4) డి, ఎ

జ​​​​​​​: 3

15. కిందివాటిలో బంగాళాఖాతంతో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లోని బయోస్ఫియర్‌ రిజర్వ్‌లను గుర్తించండి.    

ఎ) సిమ్లీపాల్‌     బి) శేషాచలం  సి) మన్నార్‌     డి) అచనాక్మర్‌

1) ఎ, బి    2) బి, సి    3) సి, ఎ    4) ఎ, బి, సి

జ​​​​​​​: 4



16. కిందివాటిలో అతి చిన్న జాతీయ పార్కు ఏది?

1) రాయ్‌మొన   2) సౌత్‌ బటన్‌    3) వన్సద    4) కాలేసర్‌

జ​​​​​​​: 2



17. మధ్యప్రదేశ్‌లో అధికంగా ఎంత భూభాగంలో జాతీయ పార్కులున్నాయి?

1) 4349.14 చ.కి.మీ.     2) 4479.17 చ.కి.మీ.   

3) 4547.14 చ.కి.మీ.     4) 4957.16 చ.కి.మీ.

జ​​​​​​​: 1


 

​​​​​18. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఎన్ని వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలున్నాయి?

1) 67     2) 97     3) 77     4) 87

జ​​​​​​​: 2


 

19. వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు భారతదేశ మొత్తం భూభాగంలో ఎంత భాగం ఆక్రమించి ఉన్నాయి?

1) 1,23,762.56 చ.కి.మీ.    2) 1,43,762 చ.కి.మీ.   

3) 1,33,762.56 చ.కి.మీ.     4) 1,14,762 చ.కి.మీ. 

జ​​​​​​​: 1


 

20. మహారాష్ట్రలో ఎన్ని వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలున్నాయి?

1) 59     2) 79     3) 49     4) 89

జ​​​​​​​: 3


 

21. కిందివాటిని జతపరచండి.

బయోస్ఫియర్‌ రిజర్వ్‌ రాష్ట్రం
ఎ) కోల్డ్‌ డెసర్ట్‌ 1) అరుణాచల్‌ ప్రదేశ్‌
బి) దిహంగ్‌ - దిబాంగ్‌ 2) హిమాచల్‌ ప్రదేశ్‌
సి) నోక్రేక్‌ 3) మధ్యప్రదేశ్‌
డి) పంచమర్హి 4) మేఘాలయ

1) ఎ-2, బి-1, సి-4, డి-3    2) ఎ-4, బి-3, సి-2, డి-1 

3) ఎ-1, బి-2, సి-3, డి-4   4) ఎ-3, బి-4, సి-2, డి-1

జ​​​​​​​: 1


 

22. కిందివాటిలో తమిళనాడులోని టైగర్‌ రిజర్వ్‌ కానిది?

1) శ్రీవల్లి పుతోర్‌ మేఘామలై    2) అన్నామలై    3) ముదుమలై   4) పరాంబికుళం

జ​​​​​​​: 4



23. కిందివాటిలో ఈశాన్య భారతదేశంలోని బయోస్ఫియర్‌ రిజర్వ్‌లలో భిన్నమైంది?

1) మానస్‌    2) నోక్రేక్‌     3) దిహంగ్‌ - దిబాంగ్‌    4) దిబ్రూ సైకోవా

జ​​​​​​​: 2


 

24. కాళి పులుల సంరక్షణా కేంద్రం ఎక్కడ ఉంది?

1) కర్ణాటక    2) మహారాష్ట్ర    3) కేరళ    4) రాజస్థాన్‌

జ​​​​​​​: 1


 

25. కిందివాటిలో 53వ టైగర్‌ రిజర్వ్‌ ఏది?

1) వీరంగ దుర్గావతి    2) రాణిపుర్‌   3) దోల్పూర్‌ కరౌలి   4) రాంఘర్‌ విష్‌దరి

జ​​​​​​​: 2 

26. అట్టకోయ తంగల్‌ మెరైన్‌ రిజర్వ్‌ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?

1) అండమాన్‌ నికోబార్‌ దీవులు  2) పుదుచ్చేరి   3) కేరళ  4) లక్ష దీవులు

జ​​​​​​​: 4

27. కిందివాటిలో ఉత్తరాఖండ్‌లో లేని జాతీయ పార్కును గుర్తించండి.

1) జిమ్‌ కార్బెట్‌  2) నందాదేవి  3) సైలెంట్‌ వ్యాలీ    4) రాజాజీ

జ​​​​​​​: 3

28. భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్కు హెమిస్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) లద్దాఖ్‌   2) జమ్ము-కశ్మీర్‌    3) హిమాచల్‌ ప్రదేశ్‌   4) ఉత్తర్‌ప్రదేశ్‌

జ​​​​​​​: 1

29. రాణి జాన్సీ మెరైన్‌ జాతీయ పార్కు ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది?

1) లద్దాఖ్‌  2) లక్ష దీవులు  3) అండమాన్‌ నికోబార్‌ దీవులు  4) చండీగఢ్

జ​​​​​​​: 3

30. ప్రస్తుతం భారతదేశంలో కన్జర్వేషన్‌ రిజర్వ్‌లు ఎన్ని?

1) 110    2) 106    3) 101   4) 115

జ​​​​​​​: 4

31. కిందివాటిలో కేరళలో ఉన్న టైగర్‌ రిజర్వ్‌లను గుర్తించండి.    

 ఎ) అనైముడి  బి) ఎరవికుళం  సి) పరాంబికుళం   డి) పెరియార్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ

జ​​​​​​​: 3



32. బల్పక్రం జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?

1) అస్సాం   2) మేఘాలయ  3) మణిపుర్‌    4) కేరళ

జ​​​​​​​: 2

33. కిందివాటిని జతపరచండి.

జాతీయ పార్కులు రాష్ట్రం
ఎ) గిండి 1) మహారాష్ట్ర
బి) కియోలాడియో 2) ఒడిశా
సి) బితర్‌కానిక్‌ 3) రాజస్థాన్‌
డి) చందోలి 4) తమిళనాడు

1) ఎ-1, బి-2, సి-3, డి-4     2) ఎ-4, బి-3, సి-2, డి-1 

3) ఎ-4, బి-3, సి-1, డి-2    4) ఎ-1, బి-4, సి-3, డి-2

జ​​​​​​​: 2



34. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేటివ్‌ అథారిటీని ఏ  సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

1) 2004    2) 2003    3) 2008    4) 2005

జ​​​​​​​: 4



35. గరంపాని వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?

1) అరుణాచల్‌ ప్రదేశ్‌     2) అస్సాం    3) కేరళ   4) మణిపుర్‌

జ​​​​​​​: 2

36. కారకోరం వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఎక్కడ ఉంది?

1) జమ్ము-కశ్మీర్‌   2) హిమాచల్‌ ప్రదేశ్‌   3) లద్దాఖ్‌    4) ఉత్తరాఖండ్‌

జ​​​​​​​: 3

37. పిట్టి పక్షుల సంరక్షణా కేంద్రం ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది?

1) అండమాన్‌ నికోబార్‌ దీవులు    2) లక్ష దీవులు     3) కేరళ    4) తమిళనాడు

జ​​​​​​​: 2

38. కిందివాటిని జతపరచండి.

వన్యప్రాణి సంరక్షణా కేంద్రం రాష్ట్రం
ఎ) సిజు 1) సిక్కిం
బి) పుర్లెంగ్‌ 2) నాగాలాండ్‌
సి) ఫాకిమ్‌ 3) మేఘాలయ
డి) ఫామ్‌ బాంగ్‌ లో 4) మిజోరాం

1) ఎ-3, బి-4, సి-2, డి-1    2) ఎ-4, బి-3, సి-2, డి-1

3) ఎ-3, బి-1, సి-4, డి-2  4) ఎ-1, బి-2, సి-3, డి-4

జ​​​​​​​: 1



39. ప్రస్తుతం ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఎన్ని పులుల సంరక్షణా కేంద్రాలున్నాయి?

1) 9     2) 8     3) 7     4) 10

జ​​​​​​​: 2


 

40. కిందివాటిలో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పులుల సంరక్షణా కేంద్రాలను గుర్తించండి.

ఎ) పాకుయ్‌  బి) నందఫ  సి) మానస్‌  డి) దంఫా

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ

జ​​​​​​​: 1

41. కిందివాటిలో ఆసియా సింహాలను ఏ ప్రాంతంలో సంరక్షిస్తున్నారు?

1) గిర్‌    2) సరిస్క   3) పన్నా   4) కునో

జ​​​​​​​: 1



42. కిందివాటిలో బయోస్ఫియర్‌ రిజర్వ్‌లు  గుర్తించండి.    

ఎ) నందాదేవి   బి) గ్రేట్‌ నికోబార్‌    సి) సరిస్క    డి) దుద్వా

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి  4) డి, ఎ

జ​​​​​​​: 1


 

43. ఝార్ఖండ్‌లోని వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు గుర్తించండి.

ఎ) దాల్మ     బి) లావాలాంగ్‌    సి) హజారీబాగ్‌    డి) రంపారా

1) ఎ, బి, సి   2) బి, సి, డి   3) సి, డి, ఎ  4) డి, ఎ, బి

జ​​​​​​​: 1



44. కర్ణాటకలోని వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు ఏవి?

ఎ) బ్రహ్మగిరి     బి) ఊద్వా    సి) బిలిగిరి రంగహిల్స్‌   డి) అరాలామ్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి  4) ఎ, సి

జ​​​​​​​: 4

45. కిందివాటిలో ఉత్తరాఖండ్‌లోని పులుల సంరక్షణా కేంద్రాలు?

ఎ) రాజాజి బి) కార్బెట్‌     సి) మేల్ఘాట్‌ డి) పలమౌ

1) ఎ, బి  2) బి, సి  3) సి, డి   4) ఎ, డి

జ​​​​​​​: 1



46. అస్సాంలోని జాతీయ పార్కులను గుర్తించండి.

ఎ) రాయ్‌మొన   బి) నందఫ   సి) పక్కే   డి) దిహంగ్‌ పట్కాయ్‌

1) ఎ, బి  2) బి, సి 3) సి, డి  4) ఎ, డి

జ​​​​​​​: 4.

సమాధానాలు

12; 22; 33; 42; 53; 61; 73; 83; 91; 102; 113; 124; 132; 143; 154; 162; 171; 182; 191; 203; 211; 224; 232; 241; 252; 264; 273; 281; 293; 304; 313; 322; 332; 344; 352; 363; 372; 381; 392; 401; 411; 421; 431; 444; 451; 464.

రచయిత: బండ్ల శ్రీధర్‌ 

Posted Date : 28-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌